అమితాబ్ మనవరాలి డాన్స్ చూశారా?
ముంబై: బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నంద తెరంగ్రేటం చేసేందుకు సిద్ధమవుతున్నట్టు కనబడుతోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఆమె పాపులర్ అయింది. తన స్నేహితులతో కలిసి ఆమె పార్టీలు చేసుకుంటున్న ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆమె షేర్ చేసిన వీడియో అభిమానులను అలరిస్తోంది.
ఉత్సాహంగా డాన్స్ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. నవ్య ఫ్రెండ్ తీసిన ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీనికి 50 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 19 ఏళ్ల నవ్య త్వరలోనే బాలీవుడ్‌లో తెరంగ్రేటం చేయనుందని అంతకుముందు వార్తలు వచ్చాయి. వీటిని అమితాబ్ బచ్చన్ తోసిపుచ్చారు. చదువు పూర్తయ్యే దాకా ఆమె సినిమాల్లోకి రాదని ప్రకటించారు. తాజాగా నవ్య పోస్ట్ చేసిన వీడియోతో మళ్లీ గాసిప్స్ మొదలయ్యాయి.