Navya Naveli Nanda Dating Rumours With Siddhant Chaturvedi, Spotted On A Movie Date - Sakshi
Sakshi News home page

Navya Naveli Nanda: బాయ్‌ఫ్రెండ్‌తో అమితాబ్ మనవరాలు.. వీడియో వైరల్!

Published Thu, Jun 15 2023 9:04 AM | Last Updated on Thu, Jun 15 2023 10:17 AM

Navya Naveli Nanda Dating Rumours With Siddhant Chaturvedi - Sakshi

అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా గురించి బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. నవేలి గతేడాది 'వాట్ ది హెల్' అనే పాడ్‌కాస్ట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఆమె లింగ సమానత్వం కోసం పోరాడుతున్నారు. కొత్తగా ఆమె పేరుతోనే నవేలి అనే ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ షోలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తున్నారు. అయితే తాజాగా నవేలి నందాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది.

(: ఇది చదవండి: ఆ క్షణాలు అద్భుతం.. ఉపాసన ట్వీట్ వైరల్!)

బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేదితో నవ్య నవేలి నందాతో డేటింగ్‌లో ఉందంటూ బీటౌన్‌లో గాసిప్స్ గుప్పమంటున్నారు. ఈ జంట బుధవారం రాత్రి ముంబయిలోని ఓ థియేటర్‌ వద్ద జంటగా వెళ్తూ కెమెరాల కంటికి చిక్కారు. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా.. నవేలి నందా అమితాబ్ -జయా బచ్చన్ కూతురు శ్వేతా బచ్చన్ కుమార్తె. 

సిద్ధాంత్ చతుర్వేది.. గల్లీ బాయ్‌ చిత్రంలో బాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు. సిద్ధాంత్ చతుర్వేది చివరిసారిగా కత్రినా కైఫ్, ఇషాన్ ఖట్టర్‌లతో హారర్-కామెడీ చిత్రం ఫోన్ భూత్‌లో కనిపించారు. మరోవైపు ఆదర్శ్ గౌరవ్, అనన్య పాండేతో పాటు ఖో గయే హమ్ కహాన్, మాళవిక మోహనన్‌తో కలిసి యాక్షన్-థ్రిల్లర్ యుధ్రాతో సిద్ధాంత్ నటిస్తున్నారు. 

( ఇది చదవండి: స్టార్‌ హీరోయిన్‌ కూతురు ఆడుకుంటున్న బ్యాగు ధరెంతో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement