shwetha nanda
-
స్టార్ హీరో మనవరాలు డేటింగ్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!
అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా గురించి బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. నవేలి గతేడాది 'వాట్ ది హెల్' అనే పాడ్‌కాస్ట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఆమె లింగ సమానత్వం కోసం పోరాడుతున్నారు. కొత్తగా ఆమె పేరుతోనే నవేలి అనే ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ షోలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తున్నారు. అయితే తాజాగా నవేలి నందాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. (: ఇది చదవండి: ఆ క్షణాలు అద్భుతం.. ఉపాసన ట్వీట్ వైరల్!) బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేదితో నవ్య నవేలి నందాతో డేటింగ్లో ఉందంటూ బీటౌన్‌లో గాసిప్స్ గుప్పమంటున్నారు. ఈ జంట బుధవారం రాత్రి ముంబయిలోని ఓ థియేటర్ వద్ద జంటగా వెళ్తూ కెమెరాల కంటికి చిక్కారు. దీంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా.. నవేలి నందా అమితాబ్ -జయా బచ్చన్ కూతురు శ్వేతా బచ్చన్ కుమార్తె. సిద్ధాంత్ చతుర్వేది.. గల్లీ బాయ్ చిత్రంలో బాలీవుడ్లో అరంగేట్రం చేశారు. సిద్ధాంత్ చతుర్వేది చివరిసారిగా కత్రినా కైఫ్, ఇషాన్ ఖట్టర్‌లతో హారర్-కామెడీ చిత్రం ఫోన్ భూత్‌లో కనిపించారు. మరోవైపు ఆదర్శ్ గౌరవ్, అనన్య పాండేతో పాటు ఖో గయే హమ్ కహాన్, మాళవిక మోహనన్‌తో కలిసి యాక్షన్-థ్రిల్లర్ యుధ్రాతో సిద్ధాంత్ నటిస్తున్నారు. ( ఇది చదవండి: స్టార్ హీరోయిన్ కూతురు ఆడుకుంటున్న బ్యాగు ధరెంతో తెలుసా?) View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
మా వియ్యపురాలు ఇకలేరు: అమితాబ్
బాలీవుడ్ అలనాటి హీరో రాజ్ కపూర్ కుమార్తె, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వియ్యపురాలు రీతూ నంద(71) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న రీతూ.. ఢిల్లీలో మంగళవారం మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు బిగ్ బీ... ‘ మా వియ్యపురాలు, శ్వేత అత్తమ్మ రీతూ నంద హఠాన్మరణం చెందారు. ఉదయం 1.15 నిమిషాలకు కన్నుమూశారు. ప్రస్తుతం నేను ప్రయాణంలో ఉన్నాను’ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. కాగా రాజ్ కపూర్ పెద్ద కుమార్తె రీతూ వివాహం వ్యాపారవేత్త రాజన్ నందాతో జరిగిన విషయం తెలిసిందే. వీరి కుమారుడు నిఖిల్ నందా.. అమితాబ్ బచ్చన్ తనయ శ్వేతాను పెళ్లిచేసుకున్నారు. ఇక కపూర్ కుటుంబంలో పెద్దక్క(రిషీ, రణ్‌ధీర్, రాజీవ్, రీమా కపూర్ల సోదరి)గా పేరొందిన రీతూ మరణంపై ఆమె మరదలు, రిషీ కపూర్ భార్య నీతూ కపూర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నా ప్రియమైన రీతూ... నీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ఇన్‌స్టాలో ఓ ఫొటోను షేర్ చేశారు. రీతూ మేనకోడలు, రిషీ కుమార్తె రిధిమా సైతం..‘ మీ అంత దయకలిగిన వ్యక్తిని నా జీవితకాలంలో ఎన్నడూ చూడలేదు. మీకు ఎవరూ సాటిరారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి అత్తా’ అని సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టారు. కాగా రీతూ నంద భర్త రాజన్ నందా 2018లో మరణించిన విషయం విదితమే. View this post on Instagram To the kindest most gentle person I‘ve ever met - They don’t make them like you anymore - RIP bua #missyoualways❤️🙏🏻 A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) on Jan 13, 2020 at 8:06pm PST -
పెద్ద మనసు చాటుకున్న మెగాస్టార్
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. రైతు సమస్యలపై స్పందిస్తూ.. వారికి అండగా ఉండే ఈ మెగాస్టార్ పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా బిహార్‌లో ఏకంగా 2100 మంది రైతుల రుణాలు తీర్చి రైతు బాంధవుడిగా నిలిచారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకన్నా అంటూ ఈ విషయం గురించి అమితాబ్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు...‘ బిహార్‌లోని 2100 మంది రైతుల రుణాలు కట్టాను. ఒకే దఫాలో బ్యాంకుకు పడ్డ బాకీని తీర్చేసాం. శ్వేత, అభిషేక్ కొంతమంది రైతులకు నేరుగా చెక్కులు అందించారు. మిగతా వాళ్లకు రైతు నాయకుల ద్వారా అందజేసాం. మాట ఇచ్చాను. ఈరోజు దానిని నిలబెట్టుకున్నా అని బ్లాగులో రాసుకొచ్చారు. కాగా అమితాబ్ గతంలో కూడా వందలాది మంది రైతులకు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ రైతుల బాకీలు తీర్చిన 76 ఏళ్ల ఈ మెగాస్టార్ వారి హృదయాల్లో స్థానం సంపాదించాడు. -
‘నువ్వు ఎప్పుడూ మామకు ప్రియమైన దానివే’
‘ప్రపంచంలోనే కూలెస్ట్ కిడ్.. నా నవ్యకు 21వ పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఇప్పుడు నుంచి నువ్వు అధికారికంగా మహిళవి! చిన్నతనంలో నా చేయి పట్టుకుని నడిచిన ఆ చిన్నారి నాకు మంచి నేస్తం అయింది. నువ్వు ఎప్పుడూ మామకు అత్యంత ప్రియమైన దానివే. అందులో ఎటువంటి మార్పు ఉండదు. లవ్ యూ’ అంటూ బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ తన ముద్దుల మేనకోడలు నవ్య నవేలి నందాకు బర్త్‌డే విషెస్ చెప్పాడు. దీంతో ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కూలెస్ట్ కిడ్ నవ్య అయితే ప్రపంచంలోనే గొప్ప మావయ్య అభిషేక్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram To the coolest kid in the world... Happy 21st Birthday my Navya. You are now "officially" a little lady, and a very gracious, loving and caring one at that too. From a baby who used to fit in the palm of my hand to becoming one of my dearest friends, you've always been mamu's pet. Never change! Love you! A post shared by Abhishek Bachchan (@bachchan) on Dec 5, 2018 at 9:19pm PST ఇక తన గారాల పట్టి.. పుట్టిన రోజు సందర్భంగా శ్వేత నందా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటో నెటిజన్లను ఆకర్షిస్తోంది. నవ్య చిన్ననాటి ఫొటోతో పాటుగా... ‘ వసంతాలు గడిచిపోలేదు.. వాటి పని అవి చేశాయి అంతే... నువ్వు అందులోని ప్రతీ క్షణాన్ని ఆస్వాదించావు. మనమిద్దరం కలిసే పెరిగాం. ఇప్పుడు ఇద్దరికీ 21 ఏళ్లు. హ్యాపీ బర్త్ డే నవ్. లవ్ యూ’ అంటూ ఆమె క్యాప్షన్ జతచేశారు. కాగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌కు కూతురు శ్వేతా నందా, కుమారుడు అభిషేక్ బచ్చన్ ఉన్న సంగతి తెలిసిందే. బిజినెస్‌మేన్ నిఖిల్ నందా- శ్వేత దంపతులకు నవ్య, అగస్త్య సంతానం. View this post on Instagram The years didn’t fly by, they took their time, and you earned every single one of them! We grew up together, you and I, figuring it out as we went along ... here we are at 21 a far cry from this 6 month old, that I really didn’t know what to make of! HAPPY BIRTHDAY NOUV, you make it look easy, even when it isn’t. I ♥️ U A post shared by S (@shwetabachchan) on Dec 5, 2018 at 8:17pm PST -
వాళ్లను చూస్తే గర్వంగా ఉంది!
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు.. తన కూతురు శ్వేతా నందా అంటే వల్లమాలిన ప్రేమ. ఎన్నో కార్యక్రమాల్లో ఆయనే స్వయంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు కూడా. ఆ మధ్య శ్వేతతో కలిసి ఓ ప్రకటనలో నటించిన సమయంలోనూ... ‘కుమార్తెలు ఉండటం మంచి విషయం. కూతుళ్లే బెస్ట్’ అంటూ ట్వీట్ చేశారు. కాగా శ్వేతా నందా.. తన స్నేహితురాలు మోనీషా జైసింగ్‌తో కలిసి ఫ్యాషన్ బ్రాండ్‌ను ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కూతురితో కలిసి.. ప్రచార కార్యక్రమాల కోసం ఫొటోషూట్ చేస్తున్నారు. కూతురిని ప్రోత్సహించేందుకు బిగ్ బీ.. కూతురు శ్వేతా నందా, మనవరాలు నవ్య నవేలీలను ప్రశంసిస్తూ కవిత రాశారు. వారిని చూస్తే గర్వంగా ఉంది.. ‘నా కూతుళ్లను చూస్తే గర్వంగా ఉంది. వారు ఎంచుకున్న మార్గాల్లో విజయం సాధించేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. హారంలో పొదగబడిన ముత్యాల్లాంటి వారు. అటువంటి విలువైన వ్యక్తులను సురక్షితంగా చూసుకోవాలి’ అంటూ అమితాబ్ బచ్చన్ ట్విటర్లో తన కవితను పోస్ట్ చేశారు. బిగ్ బీ కవితకు ఫిదా అయిన నెటిజన్లు వహ్వా అమితాబ్ జీ అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. T 2118 - https://t.co/F8r8t68hzf ये गर्व है मेरा , बेटी बेटियाँ जब उभर कर आती हैं , अपने दम पर कुछ करके हमें दिखाती हैं , मोतियों से पिरोयी हुई ये माला ; ऐसे करना गहना अनमोल है , इसे सुरक्षित रखना ~ab — Amitabh Bachchan (@SrBachchan) August 31, 2018 -
ఆస్తి పంపకాలపై అమితాబ్ నిర్ణయం
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి తన పెద్దరికాన్ని చాటుకున్నారు. ఇప్పటికే మహిళల సమానత్వం విషయంలో పలు ప్రకటనలు చేసిన బిగ్ బి, మహిళాదినోత్సవం దగ్గరికి వస్తున్న తరుణంలో జెండర్ ఈక్వాలిటీపై తన గళం వినిపించారు. సోషల్ మీడియలో యాక్టివ్ గా ఉండే అమితాబ్ ఈ సందర్భంగా ఆసక్తికరమైన పోస్టింగ్ చేశారు. ' నా మరణం తరువాత నేను వదివెళ్లే ఆస్తులు నా కూతురు, కుమారిడికి సమానంగా చెందుతాయి' అని రాసున్న పేపర్ పట్టుకొని దిగిన ఫోటోను ట్విట్టర్ పోస్ట్ చేశారు. ఈ ఫోటోకు జెండర్ ఈక్వాలిటీ, వియార్ ఈక్వల్ అనే టాగ్ లను జత చేశారు. గతంలోనూ తన మనవరాలి దుస్తులు విషయంలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో అమితాబ్ స్పందన ఆకట్టుకుంది. మహిళలపై ఆంక్షలు విదించటాన్ని నిరసిస్తూ తన మనవారాళ్లకు లేఖరాసిన బిగ్ బీ మీపై ఎలాంటి ఆంక్షలు లేవు.. మా స్టార్ డమ్ మీ స్వేచ్ఛకు అడ్డురాదు. మీకు నచ్చినట్టుగా ఉండండి అంటూ సలహా ఇచ్చారు. అమితాబ్ స్పందన పై పలువురు ప్రముఖుల హర్షం వ్యక్తం చేశారు. T 2449 - #WeAreEqual .. and #genderequality ... the picture says it all !! pic.twitter.com/QSAsmVx0Jt — Amitabh Bachchan (@SrBachchan) 1 March 2017