Amitabh Bachchan Grand Daughter: Navya Naveli Dating With Actor Siddhant Chaturvedi - Sakshi
Sakshi News home page

Amitabh Bachchan: ఆ నటుడితో ప్రేమలో మునిగి తేలుతున్న నవ్య నవేలి!

Published Sat, Nov 20 2021 4:33 PM | Last Updated on Sat, Nov 20 2021 5:50 PM

Amitabh Bachchan Grand Daughter Navya Naveli Dating With Actor Siddhant Chaturvedi - Sakshi

Navya Naveli Nanda Serious Relation With Gully Boy Actor Siddhant Chaturvedi : బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు నవ్య నవేలి నందా ప్రేమ వ్యవహరం మరోసారి వార్తల్లో నిలిచింది. నవ్య సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆమెకు సంబంధించిన విషయాలు తరచూ వార్తల్లోకెక్కుతుంటాయి. ఇప్పటికే ఆమె బాలీవుడ్‌ యువ నటుడు మీజాన్‌ జాఫేరీ ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. ఇక దీనిపై మీజాన్‌ తండ్రి జావేద్‌ స్పందిస్తూ వాళ్లు మంచి స్నేహితులు మాత్రమే అని క్లారిటీ ఇచ్చాడు. 

చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతోన్న మరో బాలీవుడ్‌ ప్రేమ జంట

అలాగే మీజాన్‌ కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నవ్వ, తాను మంచి స్నేహితులమంటూ వారిద్దరి రిలేషన్‌పై వస్తున్న వార్తలను ఖండించాడు. దీంతో ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పడింది. ఈ నేపథ్యంలో నవ్వ మరో నటుడితో ప్రేమలో ఉన్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. ‘గల్లీబాయ్‌’ సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సిద్ధాంత్‌ చతుర్వేది-నవ్యలు పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారని, ఇద్దరు సీరియస్‌ రిలేషన్‌లో ఉన్నట్లు బి-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేగాక వీరిద్దరూ కలిసి సీక్రెట్‌గా ప్రేమ వ్యవహరం నడిపిస్తున్నట్లు సన్నిహితుల నుంచి సమాచారం.

చదవండి: నా కొడుకువైనందుకు గర్వంగా ఉంది: అమితాబ్‌

కాగా నవ్య తాను సినిమాల్లో నటించనని స్పష్టం చేస్తూ ఇటీవల వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తన ఫ్యామిలీ బిజినెస్‌తో పాటు మహిళా ఆరోగ్యానికి సంబంధించిన ఓ ఫౌండేషన్‌లో మెంబర్‌గా వ్యవహరిస్తోంది. ఇక సిద్దాంత్‌ చతుర్వేది ‘గల్లీబాయ్‌’తో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులకు ఆకట్టుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతడు ‘బంటీ అండ్‌ బాబ్లీ 2’ మూవీలో నటిస్తున్నాడు. ఇందులో సైఫ్‌ అలీ ఖాన్‌, రాణి ముఖర్జీలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement