
అమ్మాయిల వస్త్రధారణపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే! చిరిగిపోయిన జీన్స్ వేసుకుని ఎక్స్‌పోజింగ్ చేయడం, వాటిని ధరించడం స్టేటస్ సింబల్‌గా భావించడం దురదృష్టకరమని, ఇది సంస్కృతిని దెబ్బ తీయడమేనని పేర్కొన్నారు. అమ్మాయిలు, అబ్బాయిలన్న తేడా లేకుండా పోటీపడి మరి స్కిన్ షో చేయడాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకోవాలో కూడా మీరు చెప్పాలా? అంటూ నెటిజన్లు మండిపడ్డారు.
తాజాగా బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలీ సైతం సీఎం వ్యాఖ్యలపై ఒంటికాలిన దిగ్గున లేచింది. "మా వస్త్రధారణ మార్చే ముందు మీరు మీ ఆలోచనలను మార్చుకోండి. ఎందుకంటే మీరు సమాజానికి ఇస్తున్న సందేశాలు మమ్మల్ని మరింత షాక్‌కు గురి చేస్తున్నాయి" అంటూ సీఎం వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ పెట్టింది. అంతే కాదు తను జీన్స్ ధరించిన ఫొటోను షేర్ చేస్తూ "నేను సగర్వంగా ఈ జీన్స్‌ను ధరిస్తాను" అని చెప్పుకొచ్చింది.
చదవండి: చిరిగిన జీన్స్ ధరించడంపై ఉత్తరాఖండ్ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment