belly dance
-
కృతిశెట్టి బెల్లీ డ్యాన్స్
-
ఫిఫ్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బెల్లీ డ్యాన్స్
ఎన్నిరకాల నృత్య ప్రక్రియలు ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా బెల్లీడ్యాన్స్కు ఉన్న ఆదరణే వేరు! ఈ ఫొటోలో కనిపిస్తున్న బామ్మ పేరు టీనా హోబిన్. వయసు 82 ఏళ్లు. బెల్లీడ్యాన్స్లో యాభయ్యేళ్ల అనుభవం ఈమె సొంతం. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన బెల్లీడ్యాన్సర్గా రికార్డు సృష్టించింది. బ్రిటన్‌కు చెందిన టీనా మొదట్లో సరదాగా బెల్లీ డ్యాన్స్ చేస్తూ వచ్చేది. బెల్లీ డ్యాన్స్ చరిత్రను పూర్తిగా తెలుసుకున్నాక, ఇదొక పవిత్రమైన కళగా గుర్తించి సాధనలో శ్రద్ధ పెంచి, 1973 నుంచి ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించింది. ఆ మరుసటి సంవత్సరంలోనే బ్రిటన్‌లోనే తొలి బెల్లీడ్యాన్స్ శిక్షకురాలిగా మారి, ఔత్సాహికులకు ఇందులో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. టీనా ఇప్పటికీ ప్రదర్శనలు ఇస్తుండటమే కాకుండా, పదుల సంఖ్యలో విద్యార్థులకు శిక్షణనిస్తోంది. బెల్లీ డ్యాన్స్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుందని టీనా చెబుతోంది. ఈ వయసులోనూ తాను ఇంత అందంగా, చురుకుగా ఉండటానికి కారణం బెల్లీ డ్యాన్స్ సాధనేనని, బెల్లీ డ్యాన్స్ వల్ల వార్ధక్యం తొందరగా మీదపడకుండా ఉంటుందని చెబుతుండటం విశేషం. -
ఓర్నీ ఇదేందయ్యా ఇది.. నివాళి సభలో ‘పోకిరీ’ పాటకు బెల్లి డ్యాన్స్‌లు
Belly Dance.. పుర్రెకో బుద్ది.. జిహ్వకో రుచి అంటారు కదా.. ఈ సామెతను న్యాయం చేశారు. ఒకరి చావు మరొకరికి ఆనందం అంటే ఇదేనేమో.. ఎవరైనా ఆనందంలో పెళ్లిలోనో లేక ఏదైనా పార్టీలోనే జోష్‌తో డ్యాన్స్ స్టెప్పులు వేస్తారు. కానీ, ఇక్కడ మాత్రం చనిపోయిన వ్యక్తికి నివాళులు అర్పించిన తర్వాత సంతాప సభలో బెల్లి డ్యాన్స్‌లు చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. వివరాల ప్రకారం.. చనిపోయిన ఓ వ్యక్తికి నివాళి సభ జరుగుతోంది. మరణించిన వ్యక్తిని గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులు సభను ఏర్పాటు చేశారు. ఈ నివాళి సభకు కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు విచ్చేశారు. ఇంతలో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యేలా సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన పోకిరీ(హిందీ రీమేక్) సినిమాలోని ఐటెమ్ సాంగ్‌ను ప్లే చేశారు. ఇంతవరకు బాగానే.. పాట ప్లే అయిన వెంటనే కొందరు యువతులు స్టేజ్ మీదకు వచ్చి బెల్లీ డ్యాన్స్ స్టెప్పులు వేశారు. దీంతో సభలో ఉన్న వారంతా నోరెళ్లబెట్టారు. సంతాప సభలో ఇదేం పని రా నాయనా అనుకుంటూ ముక్కున వేలేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి కోరిక మేరకు ఇలా వైరటీగా ప్లాన్ చేశారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Meemlogy (@meemlogy) ఇది కూడా చదవండి: వైరల్ చాయ్వాలీ ప్రియాంక.. దుకాణం బంద్! కారణం ఉందండోయ్.. -
వైరల్: బెల్లీ స్టైల్లో ‘మనికే మాగే హితే’ డ్యాన్స్.. వావ్ అనాల్సిందే!
Woman Performs Belly Dance On Manike Mage Hithe: ‘మనికే మాగే హితే’ ఈ పదాలు ఎవరు విన్న పాటను ఇట్టే గుర్తుపట్టేస్తారు. శ్రీలంక గాయని యొహాని డి సిల్వా కొన్ని నెలల క్రితం యూట్యూబ్‌లో సింహళ పాట మానికే మాగే హితేను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇంటర్నెంట్లో ఎక్కడ చూసిన ఈ పాటే హల్చల్ చేస్తోంది. బిగ్ బీ మొదలు మాధురి దీక్షిత్, టైగర్ ష్రాఫ్, మరెందరో సెలెబ్రిటీలు ఈ పాటపై ప్రశంసలు కురింపించారు. ఇక సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇన్‌స్టాలో రీల్స్‌తో ఈ పాటకు స్టెప్పులు వేస్తున్నారు. చదవండి: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘మాణికే మాగే హితే’, ఎవరీ అమ్మాయి ఈ పాటపై బోలెడు మంది డ్యాన్స్ చేస్తున్న వీడియోలు చాలానే చూశాం. అలాంటి వీడియోల్లో ఒక వీడియా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. తాజాగా ఓ యువతి మనికే మాగే హితే పాటకు వినూత్నంగా బెల్లి డ్యాన్స్ చేసింది. అచ్చమైన బెల్లి స్టెప్పులతో అద్భుతంగా వయ్యారాలు పోతూ చేసిన డ్యాన్స్ నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. యువతి బెల్లీ డ్యాన్స్‌కు ఫిధా అయిన నెటిజనులు అద్భుతం, వావ్ సూపర్ అంటూ కామెంట్స్చేస్తున్నారు. అయితే వీడియోలో కనిపించిన యువతి రక్షా పన్సనాని. ఆమె ప్రొఫెషనల్ బెల్లీ డ్యాన్సర్. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అనేక బెల్లీ డ్యాన్స్‌కు చెందిన వీడియోలు ఉన్నాయి. చదవండి: వైరల్: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ బొక్కబోర్లా పడ్డ వధూవరులు.. చదవండి: హ్యాపీ ఫ్రేమ్స్: వెడ్డింగ్ హాల్‌కు వెళుతూ వెరీ క్యూట్ డ్యాన్స్! View this post on Instagram A post shared by Raksha Parsnani (@raksha.parsnani) View this post on Instagram A post shared by Raksha Parsnani (@raksha.parsnani) View this post on Instagram A post shared by Raksha Parsnani (@raksha.parsnani) -
Karnataka: అర్ధరాత్రి.. అడవిలో రేవ్ పార్టీలు
సాక్షి,బనశంకరి(కర్ణాటక): నగర శివారులోని బన్నేరుఘట్ట అటవీప్రాంతంలో గుట్టుగా నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై శనివారం అర్ధరాత్రి బెంగళూరు రూరల్ పోలీసులు దాడిచేసి ఇద్దరిని అరెస్ట్ చేసి, 30 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. బన్నేరుఘట్ట, తమిళనాడు సరిహద్దు గల తమ్మనాయకనహళ్లి అటవీప్రాంతం సమీపంలో గల ముత్యాలమడుగు కాలువ వద్దనున్న రిసార్టు ఆధ్వర్యంలో రేవ్ పార్టీ జరిపారు. పెద్దసంఖ్యలో యువతీ యువకులు మత్తు పదార్థాలను సేవించి అశ్లీల నృత్యాలు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడి చేసి పార్టీని నిలిపేశారు. అదుపులోకి తీసుకున్న వారిలో చాలామంది కేరళకు చెందినవారు. వారిలో విద్యార్థులు, ప్రైవేటు ఉద్యోగులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పార్టీలో 60 మందికి పైగా పాల్గొనగా పోలీసులను చూడగానే కొందరు పరారయ్యారు. అదుపులోకి తీసుకున్న 30 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి, డ్రగ్స్ వాడారా లేదా అనేది నిర్ధారణకు రక్త నమూనా, వెంట్రుకల పరీక్షలు చేస్తున్నారు. మోడల్స్, డీజే హంగామా నగరానికి చెందిన అభిలాష్ అనే వ్యక్తి రేవ్‌పార్టీ నిర్వాహకుడు. ఒక యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్నారు. మోడల్స్‌ను, డీజేలను పిలిపించారు. శనివారం రాత్రి 8 గంటలకు పార్టీ ప్రారంభం కాగా నిర్వాహకులు అర్ధరాత్రి డీజేతో హోరు పెంచారు. చుట్టూ అడవి ఉండడంతో పార్టీ సంగతి ఎవరికీ తెలియదు. ఘటనాస్థలంలో మద్యం బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడి రిసార్టుకు ఎలాంటి అనుమతులు లేవని తెలిసింది. యువతీ యువకుల వాహనాల్ని, డీజే సామగ్రిని సీజ్ చేశారు. అడవిలో 30 మందికి పైగా ఉడాయించగా ఆనేకల్ పోలీసులు ఆదివారం గాలింపు చేపట్టారు. చదవండి: అమృత్ సర్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత -
‘నీ డ్యాన్స్ చూస్తే నాకు కడుపునొప్పి వస్తుంది’
టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్.. ఇలా ఏ వుడ్ అయినా సరే హీరోయిన్గా రాణించాలంటే అందంతో పాటు ప్రతిభ కూడా చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా డ్యాన్స్ కచ్చితంగా వచ్చి ఉండాలి. తమలోని డ్యాన్స్ స్కిల్స్‌కు పదును పెట్టుకోవడానికి.. మరింత మెరుగ్గా రాణించడానికి హీరోయిన్లు, అప్‌కమింగ్ యాక్టర్స్ ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటారు. ప్రస్తుతం చాలా మంది ఎక్కువగా బెల్లీ డ్యాన్స్‌కే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు తమ బెల్లీ డ్యాన్స్ కోచింగ్ సెషన్లు, ప్రదర్శనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రశంసలు పొందుతుండగా.. తాజాగా ఈ జాబితాలోకి సంజయ్ కపూర్ కుమార్తె, అప్ కమింగ్ హీరోయిన్ షనయా కపూర్ చేరారు. ప్రస్తుతం ఈమె చేసిన బెల్లీ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పలువురు షనయా డ్యాన్స్ స్కిల్స్‌ని ప్రశంసించగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలీ నందా చేసిన కామెంట్ మాత్రం తెగ నవ్విస్తోంది. ఆ వివరాలు.. షనయా కపూర్ బెల్లీ డ్యాన్స్ నేర్చుకుంటున్న వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘‘మేం డ్యాన్స్ ఎలా నేర్చుకుంటామంటే ప్రాక్టీస్ సెషన్స్ విత్ బెస్ట్ సంజన ముత్రేజా అనే క్యాప్షన్‌తో వీడియోని షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజనులు షనయా కపూర్ డ్యాన్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనిపై బిగ్ బీ మనవరాలు నవ్య నవేలీ నందా కాస్త వెరైటీగా కామెంట్ చేశారు. ‘‘నీ డ్యాన్స్ చూస్తే.. నాకు కడుపునొప్పి వస్తుంది’’ అంటూ ఫన్నీ కామెంట్ చేశారు నవ్య నవేలీ. షనయా కపూర్ త్వరలో ధర్మ ప్రొడక్షన్స్ ప్రాజెక్టుతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఆమె కరణ్ జోహార్ ధర్మ కార్నర్‌స్టోన్ ఏజెన్సీ (డీసీఏ) లో చేరారు. ఈ క్రమంలో మార్చిలో తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తన కొత్త చిత్రాన్ని ప్రకటించిన ఆమె ఇలా రాసుకొచ్చారు: "ఈ రోజు చాలా కృతజ్ఞతతో హృదయపూర్వకంగా మేల్కొన్నాను! ఇక్కడ ధర్మ కార్నర్‌స్టోన్ ఏజెన్సీ కుటుంబంతో ఒక గొప్ప ప్రయాణం ప్రారంభం కాబోతుంది. ఈ జూలై నాటికి నా మొదటి సినిమాను ప్రారంభిచబోతున్నాను’’ అని ప్రకటించారు. -
వైరల్: దుమ్మురేపుతోన్న జాన్వీ బెల్లి డ్యాన్స్
ముంబై: అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌కు సంబంధించిన ఓ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ‘దఢక్’ మూవీతో బాలీవుడ్ వెండితెరపై మెరిసిన ఈ బ్యూటీ వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. అయితే జాన్వీకి డ్యాన్స్ అంటే పిచ్చి అన్న విషయం తెలిసిందే. క్లాసికల్‌తో పాటు వెస్టర్న్ డ్యాన్స్‌తో ఆకట్టుకునే జాన్వీ తాజాగా బెల్లి డ్యాన్స్‌తో కూడా మైమరపించారు. కరీనా కపూర్ నటించిన ‘అశోకా’ చిత్రంలోని పాపులర్ పాటకు బెల్లి డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. (చదవండి: ఆ నటి ఇంటి ఖరీదు రూ.39 కోట్లు) ఒకరకంగా చెప్పాలంటే నటి గాబ్రియేలాను తలపించేలా ఉన్న జాన్వీ బెల్లి నృత్యానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇప్పటివరకూ సరదా ఫొటోలు, క్లాసికల్ డ్యాన్స్ వీడియోలు షేర్ చేసిన ఆమె చాలా రోజుల తర్వాత సడెన్‌గా బెల్లి డ్యాన్స్‌తో అభిమానులను సర్ప్రైజ్ చేశారు. కాగా ప్రస్తుతం ఆమె ‘గుడ్ లక్ జెర్రీ’ అనే సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. దీంతో పాటు యువ హీరో కార్తీక్ ఆర్యన్‌కు జోడిగా ‘దోస్తానా 2’లో కూడా నటిస్తున్నారు. -
ఆ అవకాశం ఇవ్వకుంటే చచ్చిపోతా
-
ఆ అవకాశం ఇవ్వకుంటే చచ్చిపోతా: హీరో కూతురు
బాలీవుడ్ హీరో సంజయ్ కపూర్ ముద్దుల తనయ షనయా కపూర్ తన బెల్లి డ్యాన్స్‌తో ఓవర్ నైట్ స్టార్ అయిన విషయం తెలిసిందే. ప్రముఖ బెల్లి డ్యాన్సర్ సంజన ముత్రేజ్ ఆమె గురువు. ఇక సంజన, షనయాతో పాటు మిగతా స్టార్ కిడ్స్‌కు కూడా బెల్లి డ్యాన్స్ నేర్పిస్తుంటారు. ఈ క్రమంలో షనయాకు ఆన్లైన్లో డ్యాన్స్ పాఠాలు చెబుతున్న ఫొటోను గురువారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘లాక్‌డౌన్‌కు ముందు, లాక్డౌన్ సమయంలో.. ఫేస్ టైమ్ డ్యాన్స్ లెస్సన్’ అంటూ షనయా కపూర్‌ను ట్యాగ్ చేశారు. అది చూసిన షనయా అభిమానులు ఆమె పట్టుదలపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మరికొందరు హార్ట్ ఎమోజీలతో తమ స్పందనను తెలుపుతున్నారు. (బెల్లీడాన్స్ నేర్చుకుంటున్న స్టార్ తనయ!) View this post on Instagram Before lockdown and during lockdown FaceTime dance lessons with @shanayakapoor02 #onlinebellydanceclasses #bellydance #dance #danceteacher #artofbellydancewithsanjana #shanayakapoor A post shared by Sanjana Muthreja (@sanjanamuthreja) on Apr 15, 2020 at 12:17am PDT కాగా షనయా గతేడాది షేర్ చేసిన తన బెల్లీ డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె డ్యాన్స్‌కు నెటిజన్ల ఫిదా అవుతూ కామెంట్లు పెట్టారు. ఇక పారిస్‌లో ‘లే బాల్’ ఫ్యాషన్ షోలో పాల్గొన్న షనయా, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌కు తాను పెద్ద అభిమాని అని చెప్పారు. అంతేగాక ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ‘కరణ్ జోహార్ అద్భుతమైన దర్శకుడు, నిర్మాత. ఆయన దర్శకత్వంలో నటించాడానికి ఏ నటుడు కూడా నో చెప్పరని నేను భావిస్తున్నాను. ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం నాకు ఇవ్వకుంటే నేను ఏడుస్తాను. చెప్పాలంటే భావోద్వేగానికి లోనై చచ్చిపోతాను కూడా’ అంటూ చెప్పుకొచ్చారు. (బాలీవుడ్ నటుడు మృతి) -
బెల్లీడాన్స్ నేర్చుకుంటున్న స్టార్ తనయ!
కరోనా కోరల్లో చిక్కుకొని ప్రపంచం విలవిలాడిపోతుంది. ఈ నేపథ్యంలో భారత్‌లో కరోనా కట్టడి కోసం ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే లాక్డౌన్ కాలంలో కొత్త కొత్త విద్యలు నేర్చుకోవడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక బాలీవుడ్ సెలబ్రెటీల విషయానికి వస్తే వంట నేర్చుకోవడం దగ్గర నుంచి, పెయింటింగ్స్, క్రియేటివ్ రైటింగ్ ఇలా కొత్త హాబీలపై దృష్టిపెట్టారు. ప్రస్తుతం బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారుక్ ఖాన్ ముద్దుల తనయ సుహానా ఖాన్ ఆన్లైన్లో బెల్లీ డాన్స్ నేర్చుకుంటూ తన లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను బెల్లీ డాన్స్ ట్రైనర్ సంజనా ముత్రేజా తన ఇన్‌స్టాలో షేర్చేశారు. న్యూయార్క్‌లో ఉంటున్న సుహానా కరోనా కారణంగా ఇండియాకు వచ్చింది. View this post on Instagram Challenging ourselves with rolls !! Belly dance online classes with @suhanakhan2 #bellydanceclass #bellydanceathome #onlinebellydance #stayhome #skypelessons #artofbellydancewithsanjana #suhanakhan A post shared by Sanjana Muthreja (@sanjanamuthreja) on Apr 2, 2020 at 5:52am PDT బెల్లీ డాన్స్ నేర్చుకోవడంతో పాటు సుహానా మేకప్ ట్యూటర్‌గా కూడా మారిపోయింది. తల్లి గౌరి ఖాన్‌కి ఈ ఖాళీ సమయంలో మేకప్ క్లాసులు చెబుతోంది. దీనికి సంబంధించి ఈ మధ్య గౌరీ ఖాన్ సుహానా ఫోటోని షేర్ చేస్తూ మేకప్ క్లాస్‌లు తీసుకుంటున్నాను అని రాశారు. ఇక ఆదివారం నాడు ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు షారుక్, గౌరీల చిన్నకుమారుడు అబ్రామ్ క్యాండిల్ పట్టుకున్న వీడియోని కూడా గౌరీ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో షారుక్ అభిమానుల్ని అలరిస్తోంది. (కరోనా కట్టడికి వినూత్న ప్రయత్నం) View this post on Instagram 9 pm .. Lego Dia @Cogsnitisheth.. A post shared by Gauri Khan (@gaurikhan) on Apr 5, 2020 at 9:16am PDT చదవండి: లడ్డు తయారుచేస్తున్న బాలీవుడ్ భామ -
పెట్టుబడుల కోసం పాక్ ‘బెల్లీ డ్యాన్స్’
-
పెళ్లి వేడుకలో రష్యన్ యువతులతో..
హైదరాబాద్,చాంద్రాయణగుట్ట: పాతబస్తీలో కొందరు పాశ్చాత్య సంస్కృతికి శ్రీకారం చుట్టారు. పెళ్లి వేడుకలకు ఏకంగా రష్యన్ యువతులను రప్పించి బెల్లి డ్యాన్స్‌లు చేయించారు. ఆట పాటలతో హోరెత్తిస్తుండడంతో అసౌకర్యానికి గురైన స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో నిర్వాహకులపై కేసులు నమోదయ్యాయి. యువతులను మాత్రం చాకచక్యంగా అక్కడినుంచి తప్పించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బండ్లగూడలోని నూరీ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో శనివారం రాత్రి బార్కాస్ ప్రాంతానికి చెందిన బహమాద్ వంశస్తుల వివాహం జరిగింది. ఈ సందర్భంగా వారు ఎనిమిది మంది రష్యన్ యువతులను రప్పించి బెల్లి డ్యాన్స్‌లు చేయించారు. వారిపై నోట్లు విసురుతూ నానా రభసా చేయడంతో అసౌకర్యానికి గురైన స్థానికులు డయల్–100కు సమాచారం అందించారు. చాంద్రాయణగుట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోగా నిర్వాహకులు సదరు యువతులను అక్కడి నుంచి తప్పించారు. పోలీసులు పెళ్లి కుమారుడు యాహ్యా బా అహ్మద్, అతని సోదరుడు అబ్దుల్ బా అహ్మద్, ఫంక్షన్‌హాల్ యజమాని ఈసా మిశ్రీ, మేనేజర్ తాహెర్ షా, ఆర్కెస్ట్రా నిర్వాహకుడు మహ్మద్ వసీం, అబ్దుల్లా అనే వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్స్పెక్టర్ నవీన్ ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించి నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. -
ఈ పెళ్లికూతురి డాన్స్ చూస్తే షాకవుతారు
ఇంతకుముందు పెళ్లి ఊరెగింపులో మాత్రమే డ్యాన్స్ చేసేవారు మరి ఇప్పుడో...మెహందీ, సంగీత్ ఇలా పెళ్లికి ముందుకు జరిగే ప్రతి వేడుకలో నృత్యం చేయడం పరిపాటి అయ్యింది. ఈ వేడుకల్లో బంధువులు, స్నేహితులతోపాటు వధూవరూలు కూడా కాలు కదుపుతారు. కానీ ఈ పంజాబీ పెళ్లికూతురు మాత్రం తన వస్త్రధారణ, డ్యాన్స్‌తో అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే సాధరణంగా పెళ్లికూతురంటేనే చక్కగా అలంకరించుకుని కుందనపు బొమ్మలా ముస్తాబవుతుంది. కానీ పంజాబ్‌కు చెందిన రషికా యాదవ్ మాత్రం చేతులకు చక్కగా గోరింటాకు పెట్టుకుంది. గాజులు ధరించింది, పెళ్లి నగలను అలంకరించుకుంది. పెళ్లికి ధరించేందుకు రూపొందించిన చోళితో పాటు జీన్స్ వేసుకుంది. దానికి నప్పే స్నీకర్స్(షూస్) ధరించింది. తర్వాత పంజాబీ గాయకుడు మంక్రీత్ ఔలఖ్ పాట ‘కదార్’కు డ్యాన్స్ చేసింది. దీన్నంతా పక్కనే ఉన్న ఫోటోగ్రాఫర్ ప్రియాంక కాంబోజ్ చోప్రా వీడియో తీసి ఇంటర్నెట్లో పోస్టు చేసింది. పోస్టు చేసిన 20 గంటల్లోనే ఈ వీడియో 7వేల లైకులు, 4.3లక్షల వ్యూస్‌తో హల్చల్ చేస్తుంది. ఈ వీడియోలో రషిక బంగ్రా స్టెప్పులతో పాటు, బెల్లీ డాన్స్, బాలీవుడ్ స్టెప్పులతో అదరగొట్టింది. రషిక గత 16ఏళ్లుగా కథక్ నృత్యాన్ని నేర్చుకుంటుంది. -
స్టెప్పులతో అదరగొట్టిన పెళ్లికూతురు
-
నటన మాత్రం అస్సలు నేర్చుకోలేదు
సాక్షి, సినిమా : సీనియర్ నటుడు రాజశేఖర్ పెద్ద కూతురు శివాని త్వరలో టాలీవుడ్ అరంగ్రేటం చేయబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హిట్ మూవీ టూ కంట్రీస్ రీమేక్‌లో అడివి శేష్ సరసన ఆమె నటించబోతోంది. అయితే నటనలో ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే ఆమె సిద్ధమైపోతుండటం విశేషం. సాధారణంగా సెలబ్రిటీలు తమ తమ వారసులను నటనతోపాటు మిగతా వాటిల్లో కూడా శిక్షణ ఇప్పిస్తుంటారు. కానీ, శివానీ మాత్రం కేవలం డాన్సుల్లో మాత్రమే శిక్షణ తీసుకుందంట. బెల్లీ డాన్సులు, కథక్‌లో ఆమె ప్రావీణ్యం సంపాదించేసుకుంది. మరి నటనలో ఎందుకు శిక్షణ తీసుకోలేదని ఆమె ప్రశ్నిస్తే ఆమె ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? తన పేరెంట్స్ ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే నటనలో రాణించి స్టార్లు అయ్యారని.. చిన్నప్పటి నుంచి వారినే చూస్తూ పెరిగా కాబట్టి తనకు ఆ అవసరం లేదు అని ఆమె చెబుతోంది. మరి జీవితా-రాజశేఖర్ లాగే ఆమె కూడా సహజంగా నటించి మంచి పేరు తెచ్చుకుంటుందేమో! చూద్దాం. -
నడుమే నయగారం
నడుము చూడు... నడుమందం చూడు... అంటూ యువతరంగాలను ఉక్కిరిబిక్కిరి చేసింది మెహర్ మాలిక్. బాలీవుడ్ షకీరాగా పేరు పొందిన ఆమె ఇటీవల నగరంలో తళుక్కుమంది. బాలీవుడ్ నటీమణులకూ ఈమె కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తోంది. హైదరాబాద్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఇక్కడి బంజారా స్కూల్ ఆఫ్ డ్యాన్స్ ద్వారా బెల్లీ డ్యాన్స్ శిక్షణ ఇస్తున్నానని ‘సిటీప్లస్’తో చెప్పిన ఈ బెల్లీబ్యూటీ ముచ్చట్లు ఆమె మాటల్లోనే... చిన్నప్పటి నుంచే నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. పదిహేడేళ్ల పాటు మస్కట్‌లో ఉన్నాను. బెల్లీ డ్యాన్సర్‌ను అవుతానని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. పద్నాలుగేళ్ల వయసులో ఒకసారి స్కూల్ తరఫున యూరప్ పర్యటనకు వెళ్లాను. అక్కడ నైట్ క్రూయిజ్‌లో ఒక బెల్లీ డ్యాన్సర్ నన్ను పిలిచి డ్యాన్స్ చేయమంది. ఆ సంఘటన నా జీవితాన్నే మలుపు తిప్పుతుందని ఆనాడు ఊహించలేదు. బెల్లీడ్యాన్స్పై ఆసక్తి కలగడంతో శ్రద్ధగా నేర్చుకున్నాను. ఒకసారి బెల్లీడ్యాన్స్ ఫెస్టివల్ కోసం లండన్ వెళ్లాను. అక్కడి ప్రొఫెషనల్స్‌తో మాట్లాడాను. వారి సలహా సూచనలు నా కెరీర్‌కు ఎంతో ఉపయోగపడ్డాయి. తర్వాత బుల్లితెరపై ఓ రియాలలిటీ షోలో చాన్స్ వచ్చింది. సెమీఫైనల్స్ వరకు చేరుకున్నాను. నా డ్యాన్స్ చూసిన హీరో హృతిక్ రోషన్, డెరైక్టర్ ఫరా ఎంతగానో అభినందించడం ఎన్నటికీ మరువలేను. డ్యాన్సర్‌గానే ఉంటాను బాలీవుడ్ నుంచి ఆరేడుసార్లు ఆఫర్లు వచ్చాయి. టాలీవుడ్ నుంచి కూడా ఐటెమ్ సాంగ్స్ చేయాలని కొందరు అడిగారు. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. డ్యాన్స్ గొప్ప కళ. నేను డ్యాన్సర్‌గానే కొనసాగుతాను. బాలీవుడ్ తారల్లో రాణీముఖర్జీతో కలసి పనిచేయడం గొప్ప అనుభూతి. భారత్ తరఫున అంతర్జాతీయ వేదికపై బెల్లీడ్యాన్స్ చేయాలనేది నా ఆశయం. -సిద్ధాంతి -
డాన్స్ రాజా డాన్స్
వివరం డిసెంబర్ 31 రాత్రి మీ చేతుల్లో ఏముంటుందో చెప్పలేం. కానీ కాళ్లల్లో మాత్రం డాన్స్ ఉంటుంది. ఆ రోజు తేగలిగే ఉత్సాహం అలాంటిది మరి! పాతదాన్ని వదిలి, కొత్తదాన్ని ముద్దాడబోయే క్షణం ఎవరినైనా నృత్యం చేయిస్తుంది. అది మీరు బయటకు ప్రదర్శిస్తారా, మీ ఒంట్లోనే ఎవరికీ కనబడకుండా చేస్తారా అనేది మీ స్థాయి, సౌలభ్యం, మానసిక స్థితి మీద ఆధారపడివుంటుంది. డాన్స్ లేనిదే (హ్యాపీ) న్యూ ఇయర్ లేదు. కాబట్టి, 2014ను స్వాగతిస్తున్న సందర్భంలో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన కొన్ని పార్టీడాన్స్ ముచ్చట్లు చెప్పుకుందాం. ఎప్పుడూ దేవుణ్ని నమ్మని తత్వవేత్త నీషే కూడా ఒక మాట అంటాడు: (దేవుడినంటూ నమ్మాల్సివస్తే) ‘‘డాన్స్ చేయడం తెలిసిన దేవుణ్ని మాత్రమే నేను విశ్వసిస్తాను’’.ఆ మాత్రం ఆనందం పంచడం తెలియని, ఆ మాత్రం ఆనందించడం తెలియని దేవుడు ఇంకేం దేవుడు!కల్యాణం వచ్చినా, అటుపైన రాయలేని ఇంకేదో వచ్చినా ఆగదంటారుగానీ ఒక మనిషిలోకి డాన్స్ ప్రవేశిస్తే ఆపుకోవడం కష్టం. చెంపలతో నవ్వుతూ, చతుర్లు రువ్వుతూ, కాళ్లు కదిలిస్తూ, నరాల్లో రక్తం ఉరకలెత్తగా... సంతోషాన్ని మనిషి తట్టుకోవడం కష్టం. సంతోషాన్ని మనిషి దాచుకోవడమూ కష్టమే. దాన్ని వెల్లడించి తీరాలి. ఆ ఊపు, ఆ తీపు ప్రాథమికంగా నృత్యానికి రూపునిచ్చివుంటాయి. ఆ ఉద్వేగం సంతోషమే కానక్కర్లేదు, తీవ్రమైన దుఃఖం కూడా ఒంటిని కంపింపజేస్తుంది. దాన్ని బయటికి పారదోలి, శరీరాన్ని సాధారణ స్థితికి తేగలిగే ‘స్ట్రెస్ బస్టర్’ కూడా డాన్సే! అందుకే నృత్యం మనిషి రూపొందించుకున్న అతిప్రాచీన కళారూపం. వేల ఏళ్ల పాతది శరీరాన్నీ, కాళ్లు చేతుల్నీ కదిలిస్తూ, అమూర్తభావాల్ని వ్యక్తీకరించే డాన్స్ దానికదే ఒక కళారూపంగా ఎలా, ఎప్పుడు అవతరించిందో చెప్పడం కష్టం. ప్రతిదీ జానపదంగా మొదలయ్యి, నెమ్మదిగా మరొక మెట్టుకు చేరుకోవడమో, లేదా ఆ జానపదాన్ని కలుపుకుంటూనే మరింత క్రమాన్ని సంతరించుకోవడమో జరిగింది. పరమశివుణ్ని నటరాజుగా కొలిచే ఈ భారతనేలమీదే నృత్యానికి సంబంధించిన ప్రాచీన రుజువులు దొరకడంలో ఆశ్చర్యమేమీ లేకపోవచ్చు. మధ్యప్రదేశ్‌లోని భీమ్భేట్కా రాతిగుహల్లో మనుషులు నృత్యం చేస్తున్నట్టుగా గీసిన పెయింటింగ్స్ కనబడ్డాయి. ఇవి సుమారు 9000 ఏళ్ల నాటివి. అంటే, దాదాపుగా వ్యవసాయం మనిషికి తెలిసినప్పటి కాలం. సంచారజీవితం క్రమంగా స్థిరీకరణ జరుగుతున్న దశ. ఆ లెక్కన భరతముని ‘నాట్యశాస్త్రం’ కూడా ఇక్కడే వెలువడటంలో కూడా అందుకే ఆశ్చర్యం లేదు. క్రీ.పూ. 3300 కాలంలో ఈజిప్షియన్ నృత్యాన్ని చెక్కివున్న ప్రతిమలు బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి. ప్రతీ ప్రాంతంలోనూ మనుషులు తమవైన ఆనందపు ప్రకటనల్ని నృత్యంగా వెల్లడించుకునివుంటారు. అయితే, ప్రాచీన నృత్యాలన్నీ తమ దేవుళ్లను మచ్చికచేసుకోవడానికో, మెప్పించడానికో చేసినవే. అందుకే చాలా నృత్యరీతులు మతంలో అంతర్భాగంగా ఉంటూవచ్చాయి. అలాగే డాన్స్ కూడా విడి అస్తిత్వం ఉన్నది కాదు. నృత్యం, సంగీతం, కవిత్వం మూడూ కవల సోదరులు. ఇవన్నీ కలిస్తేనే ఆనందం పరిపూర్ణమవుతుంది. ప్రతీ తెగకూ, ప్రాంతానికీ తమవైన నాట్యరీతులు, ఆచారాలున్నాయి. వాళ్ల వేటజీవితం, సంచార సంగతులు, పోరాటాలు కథలుగా మలిచారు. అమెరికన్ తెగల్లో కరువు కాటకాల సమయంలో ఇసుకలో పశ్చిమంవైపు ముఖం పెట్టివున్న తాబేలును కట్టెకు కట్టి నృత్యం చేసేవాళ్లు. ఇప్పుడు రైన్ డాన్స్ అని చెబుతున్నదానికి మూలం అది. తాబేలు ఆచారంలాగే మన దగ్గర కప్పతల్లిని ఊరేగించడం తెలిసిందే. అంటే మనుషుల మౌలిక స్వభావం, ఆలోచనారీతి ఒకేలా ఉంటుందని చెప్పడానికే ఈ ఉదాహరణ. ప్రసిద్ధ నృత్యరీతులు రూపంలేని అంతర్గత భావనకు బాహ్యరూపు కల్పించడమే డాన్స్. అది ఏడుపు, సంతోషం, ఇంకేదైనా సరే! చేసే మనిషిని బట్టి, శరీర విన్యాసాన్ని బట్టి, హావభావాల్ని బట్టి, గుంపుగా అయితే ఏకలయగా వాళ్లు కలిసిపోవడం బట్టి, ఆనందం కలుగుతుంది. సాధారణంగా అబ్బాయిల్లో ఎవరు బాగా డాన్స్ చేస్తారో చెప్పడం కష్టం; అమ్మాయిల్లో ఎవరు బాగా డాన్స్ చేయరో చెప్పడం కష్టం. అమ్మాయిల్లో ఉండే గ్రేస్, ఆ కదిలే తీరుతో సహజంగానే నాట్యాన్ని మరింత ఆనందమయం చేస్తారు. అందుకే తొలి ప్రాధాన్యత వారికే ఉంటుంది. అయితే, జీన్ కెల్లీ (డాన్స్ ఇన్ ద రెయిన్) లాంటి హీరో చేసినప్పుడు చూస్తే డాన్స్ అనేది ఎంత ఆనందాన్ని తోడిపెట్టగలదో అర్థమవుతుంది. మన ప్రభుదేవాను చూసినా కూడా! ప్రతి మనిషీ తన శరీరాన్ని కదిల్చే తీరులో ఒక మెరుపును, విరుపును ఇచ్చినట్టే, ప్రతి నృత్యం విడిగా ఇవ్వగలిగే సంతోషం ఉంటుంది. ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన కొన్ని డాన్సుల్తో ఓసారి కాలు కలిపి, కదిపి చూద్దాం! ‘పద్ధతి’గా ఉండే భరతనాట్యం, కూచిపూడిలాంటివాటిని ఇక్కడ ఉటంకించబోవడంలేదు. ప్రతి నృత్యరీతీ ఒక పద్ధతే అయినప్పుడు, ఇక్కడ పద్ధతి అనేమాటను భిన్నార్థంలో వాడుతున్నామని గ్రహించాలి. బ్యాలె ఆకర్షణీయమైన కాస్ట్యూమ్స్, విశాలమైన స్టేజీ... చప్పున స్ఫురించే బ్యాలే 15వ శతాబ్దంలో ఇటలీలో అవతరించింది. ఫ్రాన్స్, రష్యాల్లో మరింత వృద్ధి చెందింది. ఇది బృందనృత్యం. రాజాస్థానాల్లో బాగా ఆదరణ పొందింది. ‘బ్యాలె’ అన్న మాటకు అర్థం డాన్స్ చేయడమనే! 3500 ఏళ్లనాటి ఈజిప్షియన్ నృత్యానికీ, నేటి ఆధునిక బ్యాలేలకూ మధ్య భంగిమల్లో పోలిక ఉండటం... నృత్యం ఎంత పాతదో చెబుతుంది; అదే సమయంలో ఎప్పటికప్పుడు ఎంత నవీనమో వెల్లడిస్తుంది. బాల్రూమ్ డాన్స్ ప్రధానంగా స్త్రీ, పురుష నృత్యరీతి. విశాలమైన గదుల్లో ప్రదర్శనను కోరుకుంటుంది. 16వ శతాబ్దంలో ఇంగ్లండ్‌లో అభివృద్ధి చెందిన ఈ నృత్యరీతి సంపన్న వర్గాల ఆదరణ పొందింది. పాశ్చాత్య సినిమావాళ్లకు కూడా ఇది ఇష్టమైన ప్రక్రియ. ‘బాల్’ అనే లాటిన్ మాట డాన్స్ చేయడమని అర్థం. బెల్లీ డాన్స్ నిజానికి దీన్ని బెల్లీ డాన్స్ అనడం సగం నిజమే. శరీరంలోని ప్రతి అవయవమూ కదిలించాల్సిందే! అందునా పిరుదుల కదలిక ఎక్కువ. ఈ పశ్చిమాసియా నృత్యం 18, 19 శతాబ్దాల్లో పాశ్చాత్యులకు బాగా చేరువై, మరింత పేరొందింది. బృందంగా నర్తించినప్పటికీ, సోలోలు మరింత బాగుంటాయి. దీన్ని ప్రాచ్య నృత్యమనీ, అరబిక్ నృత్యమనీ, ఈజిప్షియన్ నృత్యమనీ కూడా పిలుస్తారు. ట్యాప్ డాన్స్ నేలమీద బూట్లతో లయబద్ధంగా ధ్వనిని పుట్టిస్తూ చేసే డాన్స్ ఇది. ఆ శబ్దం దానికదే ఒక సంగీతం. దీనికోసం ప్రత్యేకమైన షూలు ఉంటాయి. వాటిమీద వాడే లోహపు అతుకును బట్టి ధ్వని మారుతూవుంటుంది. 1850ల ప్రాంతంలో ఇది ఆవిర్భవించింది. ఆఫ్రికన్ అమెరికన్ మూలాలున్న జూబా నృత్యం, ఇంగ్లీష్ లాంక్షైర్ క్లాగ్ నృత్యం, ఐరిష్ స్టెప్డాన్సింగ్ లాంటి కలయికతో దీని సృష్టి జరిగింది. ఇది కూడా సినిమా నాట్యాల్లో విశేష ఆదరణ పొందింది. ట్యాంగో ఇది చేయడానికి భాగస్వామి తప్పనిసరి. పంతొమ్మిదవ శతాబ్దపు చివర్లో ఆవిర్భవించింది. అర్జెంటీనా, ఉరుగ్వే సరిహద్దు ప్రాంతాలు జన్మస్థానాలు. సినిమాల ద్వారా విశేష ఆదరణ పొందింది. ఎన్నో రీతులు వచ్చినప్పటికీ అసలైనదిగా అర్జెంటీనా, ఉరుగ్వే, చిలీల్లో చేసిన తొలి రూపమే గుర్తింపుపొందింది. యునెస్కో వారసత్వ సంపద ఘనతను పొందిన కళారూపం ఇది. సల్సా టమోటా, ఉల్లిగడ్డలు, మిరియాలపొడి వేసిన ఒక హాట్ మెక్సికన్ సాస్‌ను సల్సా అంటారు. ఇది కూడా అలాంటి వేడిపుట్టించే డాన్సే! దీనిలో కూడా భాగస్వామి ఉండాలి. నైట్‌క్లబ్బులు, బార్లలో బాగా చేస్తారు. 1970ల్లో వృద్ధి చెందింది. లాటిన్ అమెరికా నుంచి, ఇంకా ముఖ్యంగా క్యూబా నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది. లైన్ డాన్స్ స్వింగ్, డిస్కో, జాజ్, రాక్ ఎన్ రోల్ లాంటి సంగీతాలన్నింటితోనూ ఈ రీతికి అనుబంధం ఉంది. అల్బేనియా, బోస్నియా, క్రొయేషియా, గ్రీస్, కొసావో, మెసిడోనియా లాంటి దేశాలుండే బాల్కన్ ప్రాంతంలో పుట్టింది. డాన్స్ చేసేవాళ్లందరూ కొన్ని వరుసల్లో- అది వృత్తం కూడా కావొచ్చు- ఉండి చేయడం దీని ప్రత్యేకత. ఇందులో పాల్గొనడానికి స్త్రీ-పురుష నియమం లేదు. బృందం సరిపోతుంది. బ్రేక్‌డాన్స్ ఇరుకు గల్లీల్లో పుట్టింది. మైకేల్ జాక్సన్‌లాంటి వారివల్ల ఇది బాగా వ్యాప్తిలోకి వచ్చింది. జిమ్నాస్టిక్స్ను తలపించే శరీర విన్యాసాలు ఎక్కువ. ఆశ్చర్యం పుట్టించేలా శరీరాన్ని సమన్వయం చేసుకోవడం కనబడుతుంది. మనదగ్గర చిరంజీవి దీనికి ‘బ్రేక్’ ఇచ్చాడని చెప్పాలి. గంగ్నమ్ స్టైల్ అతికొత్తదీ, తక్కువ కాలంలో ఆదరణ పొందిన డాన్స్ ఇది. పోయిన డిసెంబర్లో విడుదలైంది. యూట్యూబ్‌లో ‘బిలియన్ వ్యూవర్స్ మార్క్’(వంద కోట్లు) దాటిన తొలి వీడియో. రెండు వందల కోట్లకు పరుగెడుతోంది. స్టేజ్నేమ్ ‘సై’తో ప్రసిద్ధుడైన కొరియన్ మ్యూజీషియన్ పార్క్ జే-సంగ్ దీనికి ఆద్యుడు. ‘ఒప్పన్ గంగ్నమ్ స్టైల్’ అని వీడియోలో వినిపించే ఆ మాటకు అర్థం: ‘పెద్దన్నది గంగ్నమ్ స్టైల్’. దక్షిణకొరియా రాజధాని సియోల్‌లో ఒక చిన్న పరిపాలనా విభాగం ఈ గంగ్నమ్ ప్రాంతం. మొన్నటి ‘కొలవెరి’ మేనియాలా దీన్ని భావించవచ్చేమో! చివరగా... సాషెల్ పైజ్ అన్నట్టుగా- ‘డబ్బులు అసలు అక్కర్లేనట్టుగా పనిచేయండి. ఎప్పుడూ గాయపడలేనట్టుగా ప్రేమించండి. ఎవరూ గమనించడం లేదన్నట్టుగా డాన్స్ చేయండి’. అలాగే ‘మనం చదువుదాం, మనం నృత్యం చేద్దాం- ఈ రెండు వినోదసాధనాలు ఏనాడూ ప్రపంచానికి ఏ చెడూ చేయవు’ అన్న వోల్తేయిర్ మాటలు ఈ సందర్భంలో గుర్తుకు తెచ్చుకుందాం. సంగీతలయకు అనుగుణంగా శరీరాన్ని ఊయల్లాగా తిప్పే చైనా సంప్రదాయ జానపద రీతి ‘యాంకో డాన్స్’, విచిత్రవేషధారణతో దారిపొడుగునా అలుపు లేకుండా చేస్తూవెళ్లే బ్రెజిల్ ‘సాంబా డాన్స్’, పంటచేతికొచ్చిన ఉత్సాహంలో చేసే భల్లేభల్లే పంజాబ్ డాన్స్ ‘భాంగ్డా’.... ఇంకా ఎన్నో! డాన్స్ అనేది ఒత్తిడి నుంచి విముక్తి కలిగిస్తుంది, క్రియేటివ్ ఔట్‌లెట్‌గా పనిచేస్తుంది, సమస్యను మరిచిపోయేట్టు చేస్తుంది, వ్యాయామానికి కారణమవుతుంది. అన్నింటికీ మించి అది ఒక స్వేచ్ఛను ప్రకటించుకునే తీరు. కాబట్టి ఏదోలా డాన్స్ చేయండి. ఇవన్నీ వద్దనుకుంటే మన ‘మాయదారి మైసమ్మ’ ఉండనే ఉంది. లేదంటే, ‘ఎయ్‌ర మామ’ తీన్మార్! 8 వివేకం నూతన సంవత్సరం గొప్ప వరం జీవితంలో నూతన ఆకాంక్షలకు తెర తీయడానికి ఈ నూతన సంవత్సరం గొప్ప వరం. మన చుట్టూ ప్రపంచాన్ని పరికిస్తే అది అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. మనకు అందుబాటులోకి వచ్చిన ఎన్నో సౌకర్యాలతో ఆనందించాల్సింది పోయి, తనకూ ఇంకా ఇతరులకూ మనిషి కలిగించే కష్టనష్టాలకు అంతే లేదని చెప్పాలి. ఈనాటి వాస్తవం ఇదే. ఎక్కడా స్పష్టత అనేదే లేదు. నిజానికి తమకు ఏమి కావాలో కూడా తెలియకుండానే, ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండానే, ఈ ప్రపంచంలోని చాలామంది జీవితాలు గడిపేస్తున్నారు. ఎప్పుడైనా మన అనుభవాల ఆధారంగానే మనం ముందుకు వెళితే, అది కేవలం సాధారణ విషయాలకే పరిమితమౌతుంది. అలా చేస్తే మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగానే జీవితాల్ని మలచుకొంటూ ఉంటాం. కాని రేపు మనం పోదామనుకుంటున్న దానికీ, ప్రస్తుతం మనం ఉన్నదానికీ సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. జీవితంలో ఏది ఉత్కృష్టమైనదిగా మనం కోరుకుంటున్నామో దానికీ, మన ప్రస్తుత పరిస్థితికీ సంబంధం ఉండనక్కరలేదు. మన దృక్కోణాన్ని ప్రస్తుత పరిస్థితులకు పరిమితం చేసివేసినట్టయితే, సాధించడానికి వీలైన, సులభమైనదానితోనే మళ్లీ మనం రాజీపడిపోతున్నామని అర్థం.తనకూ, చుట్టూ ఉన్న ప్రపంచానికి కూడా అత్యున్నతమైనదాన్ని సాధించాలని ఎవరైనా దృష్టి కేంద్రీకరిస్తే, అది సృష్టించడం మనిషి సామర్ధ్యానికి అతీతమైనదేమీ కాదు. ఎవరి దృక్కోణం చాలా స్పష్టంగా ఉంటుందో, దాన్ని సాకారం చేసుకోవడం కోసం తన జీవితంలోని ప్రతిక్షణమూ ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో, అటువంటి వారి పాదాల చెంతకు ఆ అత్యున్నతమైనది వచ్చి వాలుతుంది. మనకంటూ ఓ స్పష్టమైన యోచన ఉంటే, చేసే పని ఫలితం గురించిన ఆందోళన మనకు లేదని అర్థం. ఇంకోలా చెప్పాలంటే... మనకు ఓ ఆలోచన ఉంది. మన జీవితాన్ని దానికి అంకితం చేసేశాం. అంతే. నిజానికి అత్యున్నతమైనదాన్ని సాధించడానికి గల అతి సులభమైన మార్గాల్లో ఇది కూడా ఒకటి. ఇదే ఓ ఆధ్యాత్మిక ప్రక్రియ. భగవద్గీత యావత్తూ దీని గురించే చెబుతోంది. ‘అది జరుగుతుందా? లేదా?’ అనేదానిని పట్టించుకోకుండా నీవేమి కావాలనుకొంటున్నావో దానికి అంకితమైపో!’ అని. మన ఆలోచనలో ‘అత్యున్నతమైనది’ అనుకున్న దానికోసం, ఏకాగ్ర చిత్తంతో దాని సాధనకు పూనుకోవలసిన సమయమిది. ఈ జీవితానికీ, దీనికి అతీతమైనదానికీ గల జీవన జ్ఞానాన్ని పొందడానికి ఇదో అతి సులభమైన మార్గం. ఇటువంటి సుస్పష్టమైన దృష్టి గలవాడే నిజంగా ధన్యుడు. అతీతాన్ని కూడా అవలోకనం చేయగల శక్తిని ఈ నూతన సంవత్సరం మీకందరకూ అందించుగాక! సమస్య - పరిష్కారం ఈ నూతన సంవత్సరంలో ఆలోచనా విధానాన్ని నేనెలా మార్చుకోగలను? నేను కోరుకున్న రీతిగా ఆలోచనలను ఎలా తెచ్చుకోగలను? - పి.ప్రసాద్‌బాబు, విజయవాడ సద్గురు: అంతా మీ దృక్కోణం మీదే ఆధారపడి ఉంది. ఎలాంటి ఆలోచనలు మనకు వస్తున్నవి అని ఆలోచించడం కన్నా, విశాలమైన జీవిత దృక్కోణంతో ఆలోచించడం మంచిది. అసలు మనని మనం ఒక అత్యల్పమైన ధూళి కణంగా భావించి, గమనించాల్సి ఉంటుంది. ఈ విశ్వంతో పోలిస్తే, మనం ఎంతో విశాలమైనదిగా భావిస్తున్న మన పాలపుంత అత్యంత అల్పమైనది. అది చాలా చాలా చిన్నది. ఇక మన పాలపుంతలో మన సౌరకుటుంబం కూడా చాలా చిన్నది. ఈ సౌరకుటుంబంలో మన భూగోళం ఇంకా చాలా చిన్నది. ఇందులో మన ఊరు ఒక చిన్న భాగం. ఈ అతి చిన్నభాగంలో మనమో... చాలా పేద్ద మనుషులం... అనుకుంటున్నాం కదా! అసలు తామెవరు? ఏమిటి? అనే విషయాన్ని మనుషులు మరచి ప్రవర్తిస్తున్నారు. కనీసపు తెలివితోనైనా ఈ ఉనికిలో మన స్థానమేమిటో తెలుసుకోగలగాలి. ఇదే అతి ముఖ్యమైన విషయం. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది అర్థమైతే మరో సరికొత్త లోకం ఆవిష్కారమవుతుంది. అంటే అప్పటినుంచి మన నడక మారిపోతుంది. ఆలోచించడం, కూర్చోడం, నుంచోవడం, తినడం... సర్వం మారిపోతాయి. అంటే మనం జీవితాన్ని అనుభవించే తీరే పూర్తిగా మారిపోతుంది.