బెల్లీడాన్స్ నేర్చుకుంటున్న స్టార్‌ తనయ! | Suhana Khan Taking Online Belly Dancing Lessons in Lockdown | Sakshi
Sakshi News home page

తల్లికి మేకప్‌ క్లాసులు చెబుతోన్న సుహానా!

Published Mon, Apr 6 2020 1:36 PM | Last Updated on Mon, Apr 6 2020 2:05 PM

Suhana Khan Taking Online Belly Dancing Lessons in Lockdown - Sakshi

కరోనా కోరల్లో చిక్కుకొని ప్రపంచం విలవిలాడిపోతుంది. ఈ నేపథ్యంలో భారత్‌లో కరోనా కట్టడి కోసం ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ కాలంలో కొత్త కొత్త  విద్యలు నేర్చుకోవడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక బాలీవుడ్‌ సెలబ్రెటీల విషయానికి వస్తే వంట నేర్చుకోవడం దగ్గర నుంచి, పెయింటింగ్స్‌, క్రియేటివ్‌ రైటింగ్‌ ఇలా కొత్త హాబీలపై దృష్టిపెట్టారు. ప్రస్తుతం బాలీవుడ్‌ కింగ్‌ఖాన్‌ షారుక్‌ ఖాన్‌ ముద్దుల తనయ సుహానా ఖాన్‌ ఆన్‌లైన్‌లో బెల్లీ డాన్స్‌ నేర్చుకుంటూ తన లాక్‌డౌన్‌ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను బెల్లీ డాన్స్‌ ట్రైనర్‌ సంజనా ముత్రేజా తన ఇన్‌స్టాలో షేర్‌చేశారు. న్యూయార్క్‌లో ఉంటున్న సుహానా కరోనా కారణంగా ఇండియాకు వచ్చింది. 

బెల్లీ డాన్స్‌ నేర్చుకోవడంతో పాటు సుహానా మేకప్‌ ట్యూటర్‌గా కూడా మారిపోయింది. తల్లి గౌరి ఖాన్‌కి ఈ ఖాళీ సమయంలో మేకప్‌ క్లాసులు చెబుతోంది. దీనికి సంబంధించి ఈ మధ్య గౌరీ ఖాన్‌ సుహానా ఫోటోని షేర్‌ చేస్తూ మేకప్‌ క్లాస్‌లు తీసుకుంటున్నాను అని రాశారు. ఇక ఆదివారం నాడు ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేర​కు షారుక్‌, గౌరీల చిన్నకుమారుడు అబ్‌రామ్‌ క్యాండిల్‌ పట్టుకున్న వీడియోని కూడా గౌరీ షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో షారుక్‌ అభిమానుల్ని అలరిస్తోంది.  (కరోనా కట్టడికి వినూత్న ప్రయత్నం)

9 pm .. Lego Dia @Cogsnitisheth..

A post shared by Gauri Khan (@gaurikhan) on

చదవండి: లడ్డు తయారుచేస్తున్న బాలీవుడ్‌ భామ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement