నడుమే నయగారం | meher malik in banjara school of dance | Sakshi
Sakshi News home page

నడుమే నయగారం

Published Thu, Aug 28 2014 3:24 AM | Last Updated on Wed, Apr 3 2019 7:03 PM

నడుమే నయగారం - Sakshi

నడుమే నయగారం

నడుము చూడు... నడుమందం చూడు... అంటూ యువతరంగాలను ఉక్కిరిబిక్కిరి చేసింది మెహర్ మాలిక్. బాలీవుడ్ షకీరాగా పేరు పొందిన ఆమె ఇటీవల నగరంలో తళుక్కుమంది. బాలీవుడ్ నటీమణులకూ ఈమె కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తోంది. హైదరాబాద్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఇక్కడి బంజారా స్కూల్ ఆఫ్ డ్యాన్స్ ద్వారా బెల్లీ డ్యాన్స్ శిక్షణ ఇస్తున్నానని ‘సిటీప్లస్’తో చెప్పిన ఈ బెల్లీబ్యూటీ ముచ్చట్లు ఆమె మాటల్లోనే...

చిన్నప్పటి నుంచే నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. పదిహేడేళ్ల పాటు మస్కట్‌లో ఉన్నాను. బెల్లీ డ్యాన్సర్‌ను అవుతానని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. పద్నాలుగేళ్ల వయసులో ఒకసారి స్కూల్ తరఫున యూరప్ పర్యటనకు వెళ్లాను. అక్కడ నైట్ క్రూయిజ్‌లో ఒక బెల్లీ డ్యాన్సర్ నన్ను పిలిచి డ్యాన్స్ చేయమంది. ఆ సంఘటన నా జీవితాన్నే మలుపు తిప్పుతుందని ఆనాడు ఊహించలేదు. బెల్లీడ్యాన్స్‌పై ఆసక్తి కలగడంతో శ్రద్ధగా నేర్చుకున్నాను. ఒకసారి బెల్లీడ్యాన్స్ ఫెస్టివల్ కోసం లండన్ వెళ్లాను. అక్కడి ప్రొఫెషనల్స్‌తో మాట్లాడాను. వారి సలహా సూచనలు నా కెరీర్‌కు ఎంతో ఉపయోగపడ్డాయి. తర్వాత బుల్లితెరపై ఓ రియాలలిటీ షోలో చాన్స్ వచ్చింది. సెమీఫైనల్స్ వరకు చేరుకున్నాను. నా డ్యాన్స్ చూసిన హీరో హృతిక్ రోషన్, డెరైక్టర్ ఫరా ఎంతగానో అభినందించడం ఎన్నటికీ మరువలేను.
 
డ్యాన్సర్‌గానే ఉంటాను
బాలీవుడ్ నుంచి ఆరేడుసార్లు ఆఫర్లు వచ్చాయి. టాలీవుడ్ నుంచి కూడా ఐటెమ్ సాంగ్స్ చేయాలని కొందరు అడిగారు. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. డ్యాన్స్ గొప్ప కళ. నేను డ్యాన్సర్‌గానే కొనసాగుతాను. బాలీవుడ్ తారల్లో రాణీముఖర్జీతో కలసి పనిచేయడం గొప్ప అనుభూతి. భారత్ తరఫున అంతర్జాతీయ వేదికపై బెల్లీడ్యాన్స్ చేయాలనేది నా ఆశయం.    
 -సిద్ధాంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement