
ముంబై: అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌కు సంబంధించిన ఓ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ‘దఢక్’ మూవీతో బాలీవుడ్ వెండితెరపై మెరిసిన ఈ బ్యూటీ వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. అయితే జాన్వీకి డ్యాన్స్ అంటే పిచ్చి అన్న విషయం తెలిసిందే. క్లాసికల్‌తో పాటు వెస్టర్న్ డ్యాన్స్‌తో ఆకట్టుకునే జాన్వీ తాజాగా బెల్లి డ్యాన్స్‌తో కూడా మైమరపించారు. కరీనా కపూర్ నటించిన ‘అశోకా’ చిత్రంలోని పాపులర్ పాటకు బెల్లి డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.
(చదవండి: ఆ నటి ఇంటి ఖరీదు రూ.39 కోట్లు)
ఒకరకంగా చెప్పాలంటే నటి గాబ్రియేలాను తలపించేలా ఉన్న జాన్వీ బెల్లి నృత్యానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇప్పటివరకూ సరదా ఫొటోలు, క్లాసికల్ డ్యాన్స్ వీడియోలు షేర్ చేసిన ఆమె చాలా రోజుల తర్వాత సడెన్‌గా బెల్లి డ్యాన్స్‌తో అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. కాగా ప్రస్తుతం ఆమె ‘గుడ్ లక్ జెర్రీ’ అనే సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. దీంతో పాటు యువ హీరో కార్తీక్ ఆర్యన్‌కు జోడిగా ‘దోస్తానా 2’లో కూడా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment