
సాక్షి, సినిమా : సీనియర్ నటుడు రాజశేఖర్ పెద్ద కూతురు శివాని త్వరలో టాలీవుడ్ అరంగ్రేటం చేయబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హిట్ మూవీ టూ కంట్రీస్ రీమేక్‌లో అడివి శేష్ సరసన ఆమె నటించబోతోంది. అయితే నటనలో ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే ఆమె సిద్ధమైపోతుండటం విశేషం.
సాధారణంగా సెలబ్రిటీలు తమ తమ వారసులను నటనతోపాటు మిగతా వాటిల్లో కూడా శిక్షణ ఇప్పిస్తుంటారు. కానీ, శివానీ మాత్రం కేవలం డాన్సుల్లో మాత్రమే శిక్షణ తీసుకుందంట. బెల్లీ డాన్సులు, కథక్‌లో ఆమె ప్రావీణ్యం సంపాదించేసుకుంది. మరి నటనలో ఎందుకు శిక్షణ తీసుకోలేదని ఆమె ప్రశ్నిస్తే ఆమె ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా?
తన పేరెంట్స్ ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే నటనలో రాణించి స్టార్లు అయ్యారని.. చిన్నప్పటి నుంచి వారినే చూస్తూ పెరిగా కాబట్టి తనకు ఆ అవసరం లేదు అని ఆమె చెబుతోంది. మరి జీవితా-రాజశేఖర్ లాగే ఆమె కూడా సహజంగా నటించి మంచి పేరు తెచ్చుకుంటుందేమో! చూద్దాం.
Comments
Please login to add a commentAdd a comment