ఆ అవకాశం ఇవ్వకుంటే చచ్చిపోతా: హీరో కూతురు | Shanaya Kapoor Continues To Practicing Belly Dance In Lockdown | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌లో బెల్లి డ్యాన్స్‌తో బిజీగా హీరో కూతురు

Published Thu, Apr 16 2020 12:30 PM | Last Updated on Thu, Apr 16 2020 1:32 PM

Shanaya Kapoor Continues To Practicing Belly Dance In Lockdown - Sakshi

బాలీవుడ్‌ హీరో సంజయ్‌ కపూర్‌ ముద్దుల తనయ షనయా కపూర్‌ తన బెల్లి డ్యాన్స్‌తో ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిన విషయం తెలిసిందే. ప్రముఖ బెల్లి డ్యాన్సర్‌ సంజన ముత్రేజ్‌ ఆమె గురువు. ఇక సంజన, షనయాతో పాటు మిగతా స్టార్‌ కిడ్స్‌కు కూడా బెల్లి డ్యాన్స్‌ నేర్పిస్తుంటారు. ఈ క్రమంలో షనయాకు ఆన్‌లైన్‌లో డ్యాన్స్‌ పాఠాలు చెబుతున్న ఫొటోను గురువారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘లాక్‌డౌన్‌కు ముందు, లాక్‌డౌన్‌ సమయంలో.. ఫేస్‌ టైమ్‌ డ్యాన్స్‌ లెస్సన్‌’ అంటూ షనయా కపూర్‌ను ట్యాగ్‌ చేశారు. అది చూసిన షనయా అభిమానులు ఆమె పట్టుదలపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మరికొందరు హార్ట్‌ ఎమోజీలతో తమ స్పందనను తెలుపుతున్నారు. (బెల్లీడాన్స్ నేర్చుకుంటున్న స్టార్‌ తనయ!)

కాగా షనయా గతేడాది షేర్‌ చేసిన తన బెల్లీ డ్యాన్స్‌ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె డ్యాన్స్‌కు నెటిజన్ల ఫిదా అవుతూ కామెంట్లు పెట్టారు. ఇక పారిస్‌లో ‘లే బాల్‌’ ఫ్యాషన్‌ షోలో పాల్గొన్న షనయా, బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌కు తాను పెద్ద అభిమాని అని చెప్పారు. అంతేగాక ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ‘కరణ్‌ జోహార్‌ అద్భుతమైన దర్శకుడు, నిర్మాత. ఆయన దర్శకత్వంలో నటించాడానికి ఏ నటుడు కూడా నో చెప్పరని నేను భావిస్తున్నాను. ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం నాకు ఇవ్వకుంటే నేను ఏడుస్తాను. చెప్పాలంటే భావోద్వేగానికి లోనై చచ్చిపోతాను కూడా’ అంటూ చెప్పుకొచ్చారు. (బాలీవుడ్‌ నటుడు మృతి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement