ఇంతకుముందు పెళ్లి ఊరెగింపులో మాత్రమే డ్యాన్స్ చేసేవారు మరి ఇప్పుడో...మెహందీ, సంగీత్ ఇలా పెళ్లికి ముందుకు జరిగే ప్రతి వేడుకలో నృత్యం చేయడం పరిపాటి అయ్యింది. ఈ వేడుకల్లో బంధువులు, స్నేహితులతోపాటు వధూవరూలు కూడా కాలు కదుపుతారు. కానీ ఈ పంజాబీ పెళ్లికూతురు మాత్రం తన వస్త్రధారణ, డ్యాన్స్‌తో అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే సాధరణంగా పెళ్లికూతురంటేనే చక్కగా అలంకరించుకుని కుందనపు బొమ్మలా ముస్తాబవుతుంది. కానీ పంజాబ్‌కు చెందిన రషికా యాదవ్ మాత్రం చేతులకు చక్కగా గోరింటాకు పెట్టుకుంది. గాజులు ధరించింది, పెళ్లి నగలను అలంకరించుకుంది. పెళ్లికి ధరించేందుకు రూపొందించిన చోళితో పాటు జీన్స్ వేసుకుంది. దానికి నప్పే స్నీకర్స్(షూస్) ధరించింది. తర్వాత పంజాబీ గాయకుడు మంక్రీత్ ఔలఖ్ పాట ‘కదార్’కు డ్యాన్స్ చేసింది. దీన్నంతా పక్కనే ఉన్న ఫోటోగ్రాఫర్ ప్రియాంక కాంబోజ్ చోప్రా వీడియో తీసి ఇంటర్నెట్‌లో పోస్టు చేసింది. పోస్టు చేసిన 20 గంటల్లోనే ఈ వీడియో 7వేల లైకులు, 4.3లక్షల వ్యూస్‌తో హల్‌చల్ చేస్తుంది. ఈ వీడియోలో రషిక బంగ్రా స్టెప్పులతో పాటు, బెల్లీ డాన్స్, బాలీవుడ్ స్టెప్పులతో అదరగొట్టింది. రషిక గత 16ఏళ్లుగా కథక్ నృత్యాన్ని నేర్చుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment