
ఓ కొత్త పెళ్లికూతురు స్టేజీపై డ్యాన్స్ ఇరగదీసింది. పెళ్లికొడుకు పక్కనే హిందీ పాటకు స్టెప్పులేసి అదరగొట్టింది. తన భార్య నృత్యం చూస్తూ ముసి ముసి నవ్వులు నవ్వాడు భర్త. ఆయనను కూడా డ్యాన్స్ చేయమని ఆమె చేయి పట్టుకుని అడిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నవ వధువు డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు.
మొదట వధూవరులు స్టేజీపైకి ఎక్కినప్పుడు ఓ హిందీ పాటకు చిన్నపిల్లలు డ్యాన్స్ చేయసాగారు. వారిని చూసి పెళ్లికూతురుకు కూడా ఊపు వచ్చింది. వెంటనే కాలు కదిపి డ్యాన్స్ చేసింది. అక్కడున్న వారందరినీ అలరించింది.
Comments
Please login to add a commentAdd a comment