
వెండితెరపై హీరో, హీరోయిన్లుగా నటించి నిజ జీవితంలో పెళ్లిబంధంతో ఒక్కటైన జంటల్లో మహేశ్‌బాబు-నమ్రత కూడా ఒకరు. టాలీవుడ్ బెస్ట్ కపుల్స్‌గా వీరికి పేరుంది. వీరి ప్రేమకు మజిలీగా నిలిచింది వంశీ సినిమానే. షూటింగ్ సమయంలోనే నమ్రత-మహేశ్ ప్రేమలో పడ్డారు. ఓసారి ఈ సినిమా అవుట్‌డోర్ షూటింగ్‌లో భాగంగా చిత్ర యూనిట్ న్యూజిలాండ్ వెళ్లారు. దాదాపు 25రోజుల పాటు అక్కడే షూట్ చేశారు. ఆ సమయంలోనే వీరి స్నేహం మరింత బలపడింది.
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ముందే ఆమె మిస్ యూనివర్స్ పోటీల్లో ఇండియా తరఫున పాల్గొంది. తాజాగా 1993లో నమ్రతా శిరోద్కర్ మిస్ యూనివర్స్ పోటీల్లో నడుస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. దీనికి స్పందిస్తూ 'మేము గర్వపడేలా చేశావ్' అంటూ నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ కామెంట్ చేసింది. ఆ వీడియో చూసిన అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆమె అభిమానులు'అద్భుతమైన, అందమైన జ్ఞాపకం' అంటూ పోస్టులు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment