టాలీవుడ్ మోస్ట్ పాపులర్ కపుల్స్ రామ్‌చరణ్–ఉపాసన. ప్రస్తుతం ఈ జంట దుబాయ్ వేకేషన్‌లో ఉన్నారు. త్వరలోనే వీరిద్దరూ తల్లి దండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు పెళ్లైన 11 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ జంట పేరేంట్స్ కాబోతున్నారు. దీంతో మెగా ఫ్యామిలీ సహా అభిమానులు పుట్టబోయే బిడ్డ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
తాజాగా దుబాయ్‌లోని నమ్మోస్ బీచ్ క్లబ్‌లో ఉపాసన బేబీ షవర్ వేడుకను ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను ఉపాసన తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఉపాసన తన ఇన్‌స్టా రాస్తూ.. 'మీ అందరి ప్రేమకు చాలా కృతజ్ఞతలు. నా జీవితంలో బెస్ట్ బేబీ షవర్ ఇచ్చిన నా డార్లింగ్ సిస్టర్స్‌కి ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేసింది. ఈ వేడుకలో రామ్‌చరణ్, ఉపాసనల స్నేహితులు, కజిన్స్ పాల్గొన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన ఉపాసన తాజాగా వీడియోను అభిమానులతో పంచుకున్నారు.
ఈ వీడియో చూసిన అభిమానులు ఉపాసన-రామ్ చరమ్ జంటపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. కొన్నాళ్లు దుబాయ్‌లో వెకేషన్‌ని ఎంజాయ్ చేసిన తర్వాత చరణ్–ఉపాసన ఇండియా చేరుకోనున్నారు. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్‌లో చరణ్ పాల్గొనే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment