అసిస్టెంట్‌ పెళ్లిలో శ్రీవల్లి సందడి.. వైరలవుతున్న ఫోటో! | Rashmika Mandanna Attended Her Assistant Wedding, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: అసిస్టెంట్‌ పెళ్లిలో పుష్ప భామ.. లుక్ అదిరిపోయిందిగా!

Published Mon, Sep 4 2023 12:04 PM | Last Updated on Mon, Sep 4 2023 12:30 PM

Rashmika Mandanna Attended Her Assistant wedding Video Goes Viral - Sakshi

పుష్ప సినిమాతో ఏకంగా నేషనల్ క్రష్‌గా గుర్తింపు దక్కించుకున్న భామ రష్మిక. ప్రస్తుతం పుష్ప-2తో పాటు బాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉంది. సందీప్ వంగా డైరెక్షన్‌లో రణ్‌బీర్‌ కపూర్ సరసన యానిమల్ చిత్రంలో నటిస్తోంది. ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీ రెయిన్‌బోలోనూ కనిపించనుంది. అయితే తాజాగా ఆమె తన అసిస్టెంట్‌ సాయి పెళ్లికి హాజరై సందడి చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ పెళ్లికి ఎల్లో శారీ ధరించి సంప్రదాయ లుక్‌లో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ రష్మిక వివాహానికి హాజరైన నూతన వధువరులను ఆశీర్వదించారు.

(ఇది చదవండి: ఆ విషయంలో మమ్మల్ని క్షమించండి.. నవీన్ పోలిశెట్టి ఆసక్తికర కామెంట్స్! )

అయితే ఈ పెళ్లిలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వేడుకలో పాల్గొన్న పుష్ప భామ నూతన దంపతులను ఆశీర్వదించింది. ఈ క్రమంలోనే రష్మిక కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు నూతన వధువరులు. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది ముద్దుగమ్మ.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే రష్మిక బిజీ షెడ్యూల్‌లోనూ అసిస్టెంట్‌ పెళ్లికి హాజరు కావడంపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. 

కాగా.. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో రష్మిక తన పెళ్లిపై గురించి స్పందించింది. తన పెళ్లికి ఇంకా చాలా సమయముందని వెల్లడించింది. కొన్నేళ్లపాటు కెరీర్‌పైనే దృష్టిపెట్టనున్నట్లు తెలిపింది. సుకుమార్‌ దర్శకత్వంలో  తెరకెక్కుతోన్న పుష్ప-2 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

(ఇది చదవండి: గర్ల్‌ ఫ్రెండ్‌ కోసం ఓ ఫ్రీ టికెట్‌.. గట్టిగానే ఇచ్చిపడేసిన షారుక్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement