Rashmika Mandanna Talks In Telangana Slang, Video Viral - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: 'శ్రీవల్లి.. నీ టాలెంట్ మామూలుగా లేదుగా.. వైరలవుతున్న వీడియో..!

Published Tue, Jul 11 2023 7:24 PM | Last Updated on Tue, Jul 11 2023 7:51 PM

Rashmika Mandanna Telugu Talking Video Goes Viral In Social Media - Sakshi

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి పరిచయం అక్కర్లేదు. పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియాస్థాయిలో ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉన్న కన్నడ భామ.. పుష్ప-2లోనూ నటిస్తోంది. శ్రీవల్లిగా అభిమానుల గుండెల్లో చోటు దక్కించుకున్న భామకు టాలీవుడ్‌లో ఫ్యాన్స్‌ భారీగానే ఉన్నారు. అంతే కాకుండా రష్మికలో ఓ అధ్భుతమైన టాలెంట్‌ కూడా ఉంది. ఏకంగా ఆరుభాషల్లో మాట్లాడతానంటూ చెబుతోంది శ్రీవల్లి. 

(ఇది చదవండి: ఆ విషయంలో నా కుమార్తెకు ధన్యవాదాలు: ఎస్ఎస్ రాజమౌళి )

అయితే తాజాగా రష్మిక తెలుగులో మాట్లాడిన ఓ వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటోన్న భామ.. తెలుగులో కొన్ని పదాలు చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ వీడియోలో రష్మిక మాట్లాడుతూ.. 'నమస్తే.. ఎట్లా ఉన్నారు?, వచ్చేసేయ్, మస్తుంది, నీ-మ్మా, ఏందే, కొడదాం'. అంటూ అసలు అసలైన తెలంగాణ యాసలో అదరగొట్టింది. 

ఇది చూసిన నెటిజన్స్ తెలుగు భాష బాగానే నేర్చుకుందంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరేమో అన్న విజయ్ దేవరకొండ నేర్పించాడా? అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అంతే కాకుండా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీలో మాట్లాడతానని చెబుతోంది. కాగా.. ప్రస్తుతం పుష్ప-2తో పాటు రణ్‌బీర్‌ కపూర్ సరసన యానిమల్ చిత్రంలో నటిస్తోంది. సందీప్‌ వంగా రూపొందిస్తోన్న ఈ పాన్‌ ఇండియా మూవీ డిసెంబర్ 1న విడుదల కానుంది. 

(ఇది చదవండి: అలాంటి సీన్స్ చేయాలంటే నా డ్రెస్ మాత్రం తీయను: హీరోయిన్ )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement