red colour
-
అటు విడాకుల పుకార్లు : ఇటు నటి నిమ్రత్ కౌర్ ఫోటోషూట్ వైరల్
బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ ఎర్ర గులాబీ రంగు డ్రెస్ ఫోటోషూట్‌తో ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపర్చింది. బోల్డ్ అండ్ బాడీ-హగ్గింగ్ రెడ్ ఎంసెట్‌లో డేరింగ్ స్టైల్‌తో చేసిన ఫోటో షూట్, వీడియో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.ఇటీవల సిటాడెల్: హనీ బన్నీ ప్రీమియర్‌లో కనిపించి ఫ్యాషన్ ప్రపంచాన్ని అలరించింది. తాజాగా "సవాల్: మిషన్ కా క్యా నామ్ హై? జవాబ్: కోడ్ లాల్ గులాబ్" అనే క్యాప్షన్‌తో గ్లామరస్ రెడ్ గౌనులో క్లాసిక్ లుక్‌లో దర్శనిమిచ్చింది. ఏకవర్ణ థీమ్‌తో,మ్యాచింగ్ రెడ్ హీల్స్‌ను జోడించింది. దీంతో అభిమానులు లోలెడన్ని లైక్‌లు , కామెంట్లతో స్పందించారు. కాగా నిమ్రత్‌తో ప్రేమాయణం కారణంగానే బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ విడిపోవడం ఖాయమన్న పుకార్లు జోరుగా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Nimrat Kaur (@nimratofficial) ఇదీ చదవండి: ఫ్యాషన్ ప్రపంచాన్నే ఊపేస్తున్న పేదింటి అమ్మాయిలు -
రెడ్ ఔట్ఫిట్లో అందంగా మెరిసిన ‘స్త్రీ-2’ భామలు
-
మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్
Rashmika Mandanna Uncomfortable In Red Hot Dress: అతికొద్ది సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది రష్మిక మందన్నా. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ నేషనల్ క్రష్. తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆమె సిద్ధార్థ్ మల్హోత్రా తో కలిసిన నటించిన‘మిషన్ మజ్ను’ విడుదలకు సిద్దంగా ఉంది. త్వరలోనే మరో చిత్రం ‘గుడ్‌బై’ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే రష్మికకు అభిమానులు ఎక్కువే. అలాగే ఎప్పటికప్పుడు ట్రెండీగా దుస్తులు ధరిస్తూ ఔరా అనిపిస్తుంది ఈ నేషనల్ క్రష్. అయితే ఇదివరకు పొట్టి దుస్తులు ధరించి ఇబ్బందిపడిన ఈ భామ తాజాగా మరోసారి షార్ట్ వేర్లో పాట్లు పడింది. శుక్రవారం (జులై 15) రాత్రి ముంబైలో జరిగిన ఓ అవార్డ్ ప్రోగ్రామ్‌కు హాజరైంది రష్మికా. ఈ ఫంక్షన్లో రష్మిక రెడ్ కలర్ షార్ట్ డ్రెస్‌లో సందడి చేసింది. సాధారణంగా సెలబ్రిటీలను క్లిక్‌మనిపించే ఫొటోగ్రాఫర్లు ఆ వేడుకలో రష్మికతో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. రష్మికను ఒక సోఫాలో కూర్చొబెట్టి ఫొటోలు దిగారు. అయితే రష్మిక పైకి నవ్వుతున్నప్పటికీ.. కొంచెం ఇబ్బందిపడినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆ డ్రెస్ ఆమె మోకాలి పై వరకు ఉంది. దీంతో తన కాళ్లు కవర్ చేసుకునేందుకు రష్మికా ప్రయత్నించడం చూడొచ్చు. చదవండి: చోర్ బజార్లో రూ.100 పెట్టి జాకెట్ కొన్నా: స్టార్ హీరో అలియా భట్‌కు కవలలు ? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. అన్నదమ్ములతో డేటింగ్ చేసిన హీరోయిన్లు.. ఫొటోలు వైరల్ View this post on Instagram A post shared by Filmi United (@filmi_united) ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇది వరకు బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ బర్త్‌డే పార్టీలో రష్మిక బ్లాక్ షార్ట్ డ్రెస్ ధరించి దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. ఆ డ్రెస్‌లో నడవడానికి ఇబ్బంది పడిన రష్మికను నెటిజన్లు ట్రోల్ చేశారు. తాజాగా ఈ రెడ్ షార్ట్ డ్రెస్‌తో మరోసారి రష్మిక నెటిజన్లకు టార్గెట్ అయ్యేలా ఉంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by rasmika 😎😋🌹 (@jaydeep_.creation) -
రక్తం రంగులోకి మారిన నది
ట్యుమెన్, సైబీరియా, రష్యా : రష్యాలోని ట్యుమెన్ నగరానికి దగ్గరలో ప్రవహిస్తున్న నదిలోని నీరు రక్తం రంగుకు మారింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. మోల్చంక నది నీటితోనే ట్యుమెన్ వాసుల దాహార్తి తీరుతోంది. దీంతో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. నది నీటిని పరిశోధించేందుకు వెళ్లిన నిపుణులు సైతం నీరు ఎందుకు రంగు మారిందో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. నీటి శాంపిల్స్‌పై నిర్వహించిన టెస్టుల ఫలితాలను ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. రకరకాల రసాయన పదార్థాలు నీటిలో కలవడం వల్లే నది నీరు ఎరుపు రంగులోకి మారిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. -
సూర్యాస్తమయానికి ఎరుపు రంగెందుకు?
సూర్యుడు ఉదయించేటప్పుడు, సాయంత్రం అస్తమించేటప్పుడు ఎర్రగా బంతిలా ఉంటాడు. ముఖ్యంగా సాయంత్రపు వేళల్లో ఈ దృశ్యాన్ని స్పష్టంగా చూడవచ్చు. మిగతా సమయాల్లో అంటే రోజంతా మాత్రం సూర్యుడు తెల్లగా ఉంటాడు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సూర్యకాంతిని గ్రహించే భూభాగంలో వెలుతురు ఉంటుంది. దీన్నే మనం పగలు అంటాం. తెల్లని సూర్యకాంతిలో ఏడు రంగులు ఉంటాయి. అది వంకాయరంగు, ఊదా, నీలం, ఆకుపచ్చ, పసుపుపచ్చ, నారింజ, ఎరుపు రంగులు. సాయంత్రం వేళలో సూర్యుడు భూమికి దూరంగా ఉండటంతో సూర్యరశ్మి భూమి మీదకు చేరడానికి ఎక్కువ సమయం పడుతుంది. మధ్యాహ్నం సూర్యరశ్మి భూమిని చేరడానికి పట్టే సమయం కంటే ఉదయం, సాయంత్రాల్లో భూమిని చేరడానికి పట్టే సమయం యాభై రెట్లు ఎక్కువ. వాతావరణంలో ఉన్న ధూళి, పొగ, నీటికణాలు సూర్యరశ్మిలోని పసుపు, నారింజ, ఎరుపు... ఈ మూడు రంగులను మినహాయించి, తక్కిన రంగులను చెల్లాచెదురు చేస్తాయి. ఈ మూడు రంగులలో ఎరుపురంగుకు కాంతి ఎక్కువ. కాబట్టి మూడు రంగులు కలిసి ఎక్కువ ఎర్రగా కనబడతాయి. అందువల్ల ఉదయించినప్పుడు, అస్తమించినప్పుడు సూర్యుడు ఎర్రగా కనబడతాడు.