రక్తం రంగులోకి మారిన నది నీరు
ట్యుమెన్, సైబీరియా, రష్యా : రష్యాలోని ట్యుమెన్ నగరానికి దగ్గరలో ప్రవహిస్తున్న నదిలోని నీరు రక్తం రంగుకు మారింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. మోల్‌చంక నది నీటితోనే ట్యుమెన్ వాసుల దాహార్తి తీరుతోంది.
దీంతో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. నది నీటిని పరిశోధించేందుకు వెళ్లిన నిపుణులు సైతం నీరు ఎందుకు రంగు మారిందో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. నీటి శాంపిల్స్‌పై నిర్వహించిన టెస్టుల ఫలితాలను ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు.
రకరకాల రసాయన పదార్థాలు నీటిలో కలవడం వల్లే నది నీరు ఎరుపు రంగులోకి మారిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment