సూర్యాస్తమయానికి ఎరుపు రంగెందుకు?
సూర్యుడు ఉదయించేటప్పుడు, సాయంత్రం అస్తమించేటప్పుడు ఎర్రగా బంతిలా ఉంటాడు. ముఖ్యంగా సాయంత్రపు వేళల్లో ఈ దృశ్యాన్ని స్పష్టంగా చూడవచ్చు. మిగతా సమయాల్లో అంటే రోజంతా మాత్రం సూర్యుడు తెల్లగా ఉంటాడు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సూర్యకాంతిని గ్రహించే భూభాగంలో వెలుతురు ఉంటుంది. దీన్నే మనం పగలు అంటాం.
తెల్లని సూర్యకాంతిలో ఏడు రంగులు ఉంటాయి. అది వంకాయరంగు, ఊదా, నీలం, ఆకుపచ్చ, పసుపుపచ్చ, నారింజ, ఎరుపు రంగులు.
సాయంత్రం వేళలో సూర్యుడు భూమికి దూరంగా ఉండటంతో సూర్యరశ్మి భూమి మీదకు చేరడానికి ఎక్కువ సమయం పడుతుంది. మధ్యాహ్నం సూర్యరశ్మి భూమిని చేరడానికి పట్టే సమయం కంటే ఉదయం, సాయంత్రాల్లో భూమిని చేరడానికి పట్టే సమయం యాభై రెట్లు ఎక్కువ.
వాతావరణంలో ఉన్న ధూళి, పొగ, నీటికణాలు సూర్యరశ్మిలోని పసుపు, నారింజ, ఎరుపు... ఈ మూడు రంగులను మినహాయించి, తక్కిన రంగులను చెల్లాచెదురు చేస్తాయి. ఈ మూడు రంగులలో ఎరుపురంగుకు కాంతి ఎక్కువ. కాబట్టి మూడు రంగులు కలిసి ఎక్కువ ఎర్రగా కనబడతాయి. అందువల్ల ఉదయించినప్పుడు, అస్తమించినప్పుడు సూర్యుడు ఎర్రగా కనబడతాడు.