ఫోటోగ్రాఫర్ల వేటలో హృతిక్ రోషన్! | Hrithik Roshan to hire a team of photographers | Sakshi
Sakshi News home page

ఫోటోగ్రాఫర్ల వేటలో హృతిక్ రోషన్!

Published Tue, Jun 28 2016 6:01 PM | Last Updated on Wed, Aug 21 2019 10:13 AM

ఫోటోగ్రాఫర్ల వేటలో హృతిక్ రోషన్! - Sakshi

ఫోటోగ్రాఫర్ల వేటలో హృతిక్ రోషన్!

వృత్తి పరంగా ఎప్పుడూ కెమెరా ముందే ఉండే నటీ నటులు... మిగిలిన జీవితంలో దానికి దూరంగా ఉండాలని చూస్తారు. కానీ ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించడం ఇప్పడు సినీరంగంలోని వారికే కాక, అభిమానులకూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. తన నిత్య జీవితంలో ఎప్పుడూ తన వెన్నంటి ఉండేలా కొంతమంది ఫొటోగ్రాఫర్లను ఆయన హైర్ చేసుకోవాలనుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకూ హృతిక్ అలాంటి భిన్నమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఓసారి చూద్దాం.

హాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని శరీరాకృతితో... బాలీవుడ్ లో యాక్షన్ సినిమాలకు మారుపేరుగా నిలిచిన హృతిక్ రోషన్.. ఇప్పుడు కొందరు ఫొటోగ్రాఫర్లను తనకోసం నియమించుకుంటున్నారట. ఇకపై తనజీవితంలోని ప్రతి అడుగునూ కెమెరాలో వీడియోలు, ఫొటోల రూపంలో పదిలపరచాలనుకుంటున్నాడట.అందుకోసం ప్రత్యేకంగా కొంతమంది ఫొటో గ్రాఫర్లను నియమించుకొని, షూటింగ్ లతోపాటు, ఇతర సందర్భాల్లోనూ తనతోపాటే ఉండేలా ఏర్పాటు చేసుకుంటున్నాడు.

అయితే ఇలా తన డైలీ లైఫ్ కు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కేవలం భద్రపరచుకోడానికే తీయించుకోబోతున్నాడా? లేదంటే ఏదైనా ఓ డాక్యుమెంటరీ తీయాలనుకుంటున్నాడా అన్నది ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు అశుతోష్ గోవార్కిర్ కాంబినేషన్ లో క్రీస్తు పూర్వం నాటి కథా నేపథ్యం కలిగిన చిత్రం.. మొహెంజోదారో  విడుదల కోసం వేచి చూస్తున్న హృతిక్... ఇప్పుడు ఈ ఫుటేజ్ సేకరించే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నాడన్నది మాత్రం అందరికీ ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement