ఇక 'ఫేస్బుక్' భయం లేదు! | Facebook says it won't commercialise personal content | Sakshi
Sakshi News home page

ఇక 'ఫేస్బుక్' భయం లేదు!

Published Wed, Dec 3 2014 11:08 PM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

ఇక 'ఫేస్బుక్' భయం లేదు! - Sakshi

ఇక 'ఫేస్బుక్' భయం లేదు!

న్యూయార్క్: సామాజిక సంబంధాల వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో ఖాతాదారులు  పోస్ట్ చేసే సమాచారం,  ఫొటోలు వారికే సొంతమని, వాటిని తాము అమ్మబోమని ఆ వెబ్‌సైట్ వర్గాలు స్పష్టం చేశాయి. ఫేస్‌బుక్‌లో ఖాతా ప్రారంభించేటప్పుడు తమ సమాచారాన్ని ఉచితంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఉపయోగించుకునేందుకు ఖాతాదారులు అంగీకరించాల్సి ఉంటుంది. అయితే ఈ అంగీకారంతో తమ ఫొటోలను ఫేస్‌బుక్ అమ్ముకుంటుందేమోనని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఫొటోగ్రాఫర్ల నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఈ నేపథ్యంలో యూజర్లు పోస్ట్ చేసే ఫొటోలు, సమాచారాన్ని ఇతర ఫ్లాట్‌ఫామ్‌లపై చూపేందుకే తాము ఈ లెసైన్సును వాడుకుంటామని, ఖాతాదారుల అనుమతి తీసుకోకుండా ఆ సమాచారాన్ని విక్రయించబోమని ఫేస్‌బుక్ అధికారి మాట్ స్టీన్‌ఫీల్డ్ వివరణ ఇచ్చారు. ఒక పోస్టును ఖాతాదారులు తొలగించిన వెంటనే దానిపై ఈ లెసైన్సు కూడా ముగిసిపోతుందని, అందువల్ల తొలగించిన పోస్టులను ఏ రకంగానూ వాడుకోబోమని పేర్కొన్నారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement