నిషేధించే నిబంధన ఎవరు పెట్టారు?:సల్మాన్ ఖాన్ | No provision to ban anyone,says Salman Khan | Sakshi
Sakshi News home page

నిషేధించే నిబంధన ఎవరు పెట్టారు?:సల్మాన్ ఖాన్

Published Fri, Jul 18 2014 4:05 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

నిషేధించే నిబంధన ఎవరు పెట్టారు?:సల్మాన్ ఖాన్ - Sakshi

నిషేధించే నిబంధన ఎవరు పెట్టారు?:సల్మాన్ ఖాన్

ముంబై: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరోసారి మీడియాపై చిందులు తొక్కాడు.  తనకు ఫోటోగ్రాఫర్ల పట్ల గౌరవం ఉందంటూనే..  నిషేధించే నిబంధన ఎవరు పెట్టారంటూ ప్రశ్నించాడు. తెలుగులో రవితేజ హీరోగా నటించిన కిక్ సినిమా ఆధారంగా హిందీలో రూపొందుతున్న 'కిక్'  ప్రమోషన్ కార్యక్రమంలో చోటు చేసుకున్న వివాదం కాస్తా  తారాస్థాయికి చేరింది.  ఆ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ బౌన్సర్లు.. ఫోటోగ్రాఫర్లపై దాడికి దిగడమే అగ్నికి ఆజ్యం పోసింది. ఈ ఘటన మీడియా ప్రతినిధులకు ఆగ్రహం రప్పించడంతో సల్మాన్ సినిమా ప్రమోషన్ ను బహిష్కరించాలని నిర్ణయించారు.

 

దీనిపై అగ్గి మీద గుగ్గిలం అవుతున్న సల్మాన్.. అసలు నిషేధించి నిబంధన ఎవరు పెట్టారంటూ ఫోటోగ్రాఫర్లపై తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.  'నా ఫోటోలను చిత్రీకరించనని ఫోటోగ్రాఫర్లు చెప్పగలరా? అంటూ ప్రశ్నించాడు. అసలు నిషేధించే నియమమే ఏ న్యాయసూత్రాల్లో లేనప్పుడు అటువంటి చర్యలకు పాల్పడటం సమంజసమా?అని సల్మాన్ నిలదీశాడు.  'నేను రోడ్డుపై అటుగా వెళుతున్న సమయంలో ఫోటోగ్రాఫర్లు చేతికి పని చెప్పకుండా  నిషేధానికే కట్టుబడి ఉండాలి. నా ఫోటోలను ఏ ఫోటో గ్రాఫర్ క్లిక్ మనిపించకూడదు. నేను గర్ల్ ఫ్రెండ్స్ తో  వెళుతున్నా కూడా' అంటూ సల్మాన్ ఖాన్ ఫోటో గ్రాఫర్లుకు సవాల్ విసిరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement