తమ డిమాండ్లని పరిష్కరించాలంటూ సమ్మె చేస్తున్న108 సిబ్బందితో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చర్చలు జరిపారు.
రంగారెడ్డి: తమ డిమాండ్లని పరిష్కరించాలంటూ సమ్మె చేస్తున్న108 సిబ్బందితో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా 108 సిబ్బంది తమ డిమాండ్లని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
'కనీస వేతనంగా రూ.20వేలు అందించాలి. 2014 సమ్మె సందర్భంగా ఉద్యోగాలు కోల్పోయిన వారిని విధుల్లోకి తీసుకోవాలి. 108లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడిపించాలి. రోజు వారీగా 8గంటల పని దినాలు మాత్రమే ఉండాలి' అనే డిమాండ్లను 108 ఉద్యోగులు మంత్రి ముందుంచారు.