Sarojini Devi Eye Hospital
-
దీపావళి వేడుకల్లో గాయాలు.. సరోజినీదేవి ఆసుపత్రికి బాధితులు క్యూ..
సాక్షి, హైదరాబాద్: దీపావళి వేడుకల్లో పలు చోట్ల అపశృతులు చోటుచేసుకున్నాయి. బాణసంచా కాలుస్తూ పలువురు గాయపడ్డారు. దీంతో బాధితులంతా సరోజినీదేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టారు. ఇప్పటివరకు 40 మంది బాధితులు గాయాలతో ఆస్పత్రికి వచ్చారు. కాగా, గాయాలపాలైన వారికి చికిత్స కోసం సరోజినీదేవి కంటి ఆసుపత్రి ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసింది. వంద బెడ్లు వైద్యాధికారులు ఏర్పాటు చేశారు. 9 మందికి తీవ్ర గాయాలయినట్లు వైద్యులు తెలిపారు. ఈసారి ప్రజల్లో అవగాహన పెరిగిందని.. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కేసులు తగ్గుతాయని ఆశిస్తున్నామని ఆసుపత్రి వైద్యులు అన్నారు.తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. టపాసుల దుకాణాలతో మార్కెట్లు, కిటకిటలాడాయి. చిన్నాపెద్దా పెద్ద బాణసంచా పేలుస్తూ ఆనందంగా గడిపారు. కాగా, దీపావళి సందర్భంగా రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా పేల్చడానికి అనుమతినిస్తూ సైబరాబాద్ పోలీసులు ప్రకటన చేశారు.అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పబ్లిక్ రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా పేల్చడం నిషేధమని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ప్రకారం.. నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి హెచ్చరించారు. -
కంటి ఆస్పత్రికి పేషంట్ల క్యూ.... అంతా దీపావళి టపాసుల బాధితులే!
హైదరాబాద్: నగరంలోని సరోజినిదేవి కంటి ఆస్పత్రికి పేషంట్లు క్యూకట్టారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 60 మంది కంటి సమస్యలతో ఆస్పత్రికి వచ్చారు. వీరంతా దీపావళి సందర్భంగా టపాసులు పేలుస్తూ గాయపడిన వారని తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది పెద్దవారే కావడం గమనార్హం. దీపావళి సందర్భంగా టపాసులు పేల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎంత చెబుతున్నా మార్పు రావడం లేదు. ఏటా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్లక్ష్యంగా బాణాసంచా కాలుస్తూ గాయాల బారిన పడుతున్నారు. టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్తలు అవసరమని, ముఖ్యంగా కళ్ల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యంగా ఉంటే చూపు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారుల పట్ల మరింత జాగ్రత్త వహించాలని చెబుతున్నారు. -
హైదరాబాద్‌లో కండ్లకలక కలవరం.. మందులకే 2 గంటలా?
సాక్షి, హైదరాబాద్: నగరంలో కండ్లకలక కేసులు కలవరం పుట్టిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం పదుల సంఖ్యలోనే వెలుగుచూసిన కేసులు తాజాగా వేలల్లో నమోదయ్యాయి. అయితే, చికిత్స కోసం వెళ్లిన బాధితులకు ఇబ్బందులు తప్పడం లేదు. హైదరాబాద్‌లోని సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో వసతులు కరువయ్యాయంటూ రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. చికిత్స అందించే డాక్టర్ల కొరతకు తోడు.. మెడిసిన్ తీసుకునేందుకు కూడా పేషంట్లు బారులు తీరారు. ఆస్పత్రి యాజమాన్యం ముందస్తుగా చర్యలు చేపట్టకపోవడంతో బాధితులు ఒకేచోట గుమిగూడాల్సిన పరిస్థితి తలెత్తింది. మందులకు అందించేందుకు ఒకే కౌంటర్ అందుబాటులో ఉండటంతో దాదాపు 2 గంటలు లైన్లో వేచి ఉంటే తప్ప మెడిసిన్ తీసుకునే పరిస్థితి లేదు. కాగా, వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల వచ్చే కండ్లకలక ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా గుంపుగా ఉన్న ప్రదేశాల్లో ఈ వ్యాధి సొందరగా ఇతరులకు సోకుతుంది. కండ్లకలకను పింక్ ఐ లేదా ఐ ఫ్లూ అని అంటారు. (చదవండి: ఆ అలవాటే కరోనా అటాక్‌కి ప్రధాన కారణం! వెలుగులోకి విస్తుపోయే నిజాలు!) ✅గత కొద్ది రోజులుగా కళ్ల కలక 👁️కేసులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ✅మరి ఇలాంటి సమయంలో చేయాల్సినవి, చేయకూడనివి తెలిస్తే త్వరగా నయం అవుతుంది. ✅అవేంటో కింది ఇన్ఫోగ్రాఫ్ ద్వారా తెలుసుకోండి#Conjuctivitis #HealthForAll #SwasthaBharat #EyeFlu #EyeConjuctivitis pic.twitter.com/EZ7TLH6axd — PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) August 2, 2023 కళ్ల కలక లక్షణాలు! 👁🗨కళ్ళలో నొప్పి, మంట, దురద 👁🗨కళ్ళు ఎర్రగా మారడం 👁🗨కళ్ళ నుంచి తరుచుగా నీరు కారడం 👁🗨కళ్ళు వాపు 👁🗨నిద్ర లేచిన తర్వాత కనురెప్ప అతుక్కుపోవడం 👁🗨నిర్లక్ష్యం చేస్తే కండ్ల నుంచి చీము కారడం#Conjuctivitis #HealthForAll #SwasthaBharat #EyeFlu #EyeConjuctivitis pic.twitter.com/rMmPxOdB0g — PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) August 2, 2023 -
Hyderabad: దీపావళి వేడుకల్లో గాయాలు.. సరోజినీదేవి కంటి ఆస్పత్రికి బాధితుల క్యూ (ఫొటోలు)
-
టపాసుల వేళ అపశ్రుతులు.. మంటలంటుకుని కళ్లకు, ఒంటికి గాయాలు
సాక్షి, హైదరాబాద్: దీపావళి వేళ బాణసంచా కాలుస్తున్న క్రమంలో నగరంలో కొన్నిచోట్ల అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. పలువురికి కళ్లకు, ఒంటికి గాయాలయ్యాయి. నగర వ్యాప్తంగా సుమారు 100 మందికి పైగా బాధితులు పలు ఆస్పత్రుల్లో చేరారు. కంటి గాయాలకు గురైనవారిలో ఎక్కువ మంది చిన్నారులే కావడం గమనార్హం. సరోజినీదేవి ఆస్పత్రికి క్యూ.. మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో దీపావళిని ముందు రోజు ముగ్గురు, పండగ రోజు రాత్రి సమయంలో 45 మంది దాకా కంటి గాయాలతో సంప్రదించారు. ఇందులో 21 మంది అవుట్ పేషెంట్ విభాగంలో చూపించుకుని వెళ్లిపోగా 19 మంది అడ్మిట్ అయ్యారు. పండగ తర్వాత రోజు కూడా మరో 2 కేసులు వచ్చాయని వైద్యులు చెప్పారు. వీరిలో అయిదేళ్ల వయసు నుంచి 67 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. మొత్తం బాధితుల్లో అత్యధికులు చిన్నారులే. బాధితుల్లో మల్లెపల్లికి చెందిన అజయ్ సింగ్ (25), విజయ్ ఆనంద్ (61), సి. మహావీర్ (15)ల ఎడమ కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరితో పాటు కుడికన్నుకు గాయమైన హయత్‌నగర్‌కు చెందిన రాజి (37)లకు శస్త్ర చికిత్సలు నిర్వహించారు. బాధితుల్లో ఒక అబ్బాయి కంటి చూపు కోల్పోయాడని వైద్యులు తెలిపారు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి.. బంజారాహిల్స్‌లోని ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రికి పెద్ద సంఖ్యలోనే బాణసంచా బాధితులు నమోదయ్యారు. పండగ ముందురోజున అయిదుగురు, దీపావళి రోజున 21 మంది, మరుసటి రోజున (సాయంత్రం 4గంటల వరకూ) 11 మంది కంటి గాయాలతో ఆస్పత్రికి వచ్చారని వీరిలో 9 మందికి సర్జరీలు చేశామని వైద్యులు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో బాణసంచా కారణంగా 7 కాలిన గాయాల కేసులు నమోదయ్యాయి. చందానగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తీవ్రగాయాలతో ఒకరు చికిత్స పొందుతున్నారు. పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ బాణసంచా బాధితులు చికిత్స పొందుతున్నట్టు సమాచారం. కాలిన గాయాలతో ఉస్మానియాకు... నగరంలో కంటి గాయాలతో చిన్నారులు ఆస్పత్రుల పాలు కాగా కాలిన గాయాలతో పెద్దలు ఆస్పత్రులకు క్యూ కట్టారు. ఉస్మానియా ఆస్పత్రిలో 18 మందికి కాలిన గాయాల బాధితులు సంప్రదించగా ఇందులో ఒకరు తీవ్ర గాయాలతో అడ్మిట్ అయ్యారు. శరీరం కాలిన ఆ మహిళ (63) పరిస్థితి విషమంగా ఉందని, ఆమె దాదాపు 95 శాతం కాలిన గాయాల బారిన పడడంతో వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టపాసులు కాలుస్తూ గాయాలపాలు.. సరోజినీ దేవి ఆస్పత్రికి జనం క్యూ
సాక్షి, హైదరాబాద్: దీపావళి పండుగ పూట పలు చోట్ల అపశ్రుతి చోటుచేసుకుంది. దీపావళి సందర్భంగా క్రాకర్స్ కాలుస్తుండగా గాయపపడిన వారి సంఖ్య పెరుగుతోంది. గాయపడిన వారంతా హైదరాబాద్‌లోని సరోజనిదేవి కంటి ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. దీపావళి రోజు బాణాసంచా కాలుస్తూ 31 మంది పిల్లలు, పెద్దలు గాయపడ్డారు. స్వల్పంగా గాయపడిన వారికి చికిత్స చేసి ఇంటికి పంపించగా. తీవ్రంగా గాయపడిన నలుగురికి సరోజినిదేవి ఆస్పత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇద్దరికి ఆపరేషన్ అవసరమైంది. చదవండి: భీతావహం.. పేలిన దీపావళి బాంబులు చంద్రాయణగుట్టకు చెందిన రాజ్ తివారి అనేవ్యక్తి ఏకంగా కన్ను కోల్పోయాడు. దీంతో దీపావళి టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని లేదా అవిటివారు కావాలిస వస్తుందని సరోజినీదేవి వైద్యురాలు కవిత హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులే ఎక్కువగా క్షతగాత్రులవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎన్జీవోల ద్వారా ‘కంటి వెలుగు’
సాక్షి, హైదరాబాద్: కంటి వెలుగు కార్యక్రమంలో పెండింగ్‌లో ఉన్న ఆపరేషన్లను పూర్తిచేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు స్వచ్ఛంద సంస్థ లు, ఎల్వీ ప్రసాద్ వంటి ప్రముఖ ఆస్పత్రుల్లో వీలైనంత త్వరగా కంటి ఆపరేషన్లు చేయాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. సరోజినీదేవి కంటి ఆస్పత్రిలోనూ అదనపు వసతులు కల్పించి ఆపరేషన్లు జరిగేలా ఏర్పా ట్లు చేయాలని ఆ శాఖ భావిస్తోంది. దీనికి సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎన్నికల వల్ల నిలిచిన ఆపరేషన్లను సత్వరం పూర్తిచేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఈ పథకం కోసం మంజూరై నిలిచిన రూ. 87.29 కోట్ల నిధులను ప్రభుత్వం 2 రోజుల క్రితం విడుదల చేసింది. గతేడాది ఆగస్టు 15న ‘కంటి వెలుగు’ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఎన్నికల నాటికి 1.55 కోట్ల మందికి కంటి పరీక్షలు చేశారు. పరీక్షలు చేయించుకున్న వారిలో చాలా మంది 18 ఏళ్లకు పైబడిన వారే ఉన్నారు. పరీక్షలు చేయించుకున్న వారిలో దాదాపు 90% మంది బడుగు బలహీనవర్గాలకు చెందిన వారే ఉన్నారు. పరీక్షల సందర్భంగా 35 లక్షల మంది కి రీడింగ్ గ్లాసులు ఇచ్చారు. 20 లక్షల మందికి చత్వారీ గ్లాసులు ఇవ్వాలని ప్రిస్క్రిప్షన్ రాశారు. పరీక్షలు చేయించుకున్న వారిలో 7.04 లక్షల మందికి పలు రకాల ఆపరేషన్లు అవసరమని నిర్ధారించారు. అందులో 6.64 లక్షల మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్లు అవసరమని తేల్చగా 2018–19 ఆర్థిక సంవత్సరంలో 23,629 మందికి ఆపరేషన్లు నిర్వహించారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా... లక్షలాది మందికి కంటి ఆపరేషన్లు చేయడమ నేది కత్తిమీద సాములాంటిది. అందుకే సాధారణ ప్రైవేటు ఆస్పత్రుల్లో కాకుండా సరోజినీ, ఎల్వీ ప్రసాద్ వంటి ప్రముఖ ఆస్పత్రుల్లోనే ఆపరేషన్లు నిర్వహించాలని సర్కారు భావిస్తోంది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆపరేషన్లు చేయడానికి ముందుకు వచ్చినట్లు వైద్య ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల ఆపరేషన్ల సందర్భంగా ఇబ్బందులు తలెత్తాయి. అవి పునరావృతం కాకుండా సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో అదనపు వసతులు కల్పించి ఆపరేషన్లు మొదలుపెట్టాలని ఆ శాఖ యోచిస్తోంది. ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వర్గాలతోనూ సంప్రదించి రోజుకు ఎన్ని ఆపరేషన్లు చేయవచ్చన్న దానిపై స్పష్టతకు రానుంది. మరోవైపు కొన్ని స్వచ్ఛంద సంస్థలను గుర్తించి వాటిల్లోనూ చేయనున్నారు. ఇప్పటికే ఆపరేషన్లు అవసరమైన కొందరు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో చేయించుకున్నారని ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి. ఎందరు ఆపరేషన్లు చేయించుకున్నారనే సమాచారం తమ వద్ద లేద ని చెబుతున్నాయి. కంటి వెలుగు తర్వాత దంత వైద్య పరీక్షలపైనా సర్కారు దృష్టిసారించనుంది. అయితే ఎప్పుడన్నది తర్వాత చెబుతామని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. -
పలుచోట్ల దీపావళి వేడుకల్లో అపశృతి
-
దీపావళి పండుగలో తీవ్ర విషాదం
సాక్షి, విజయనగరం : దీపావళి పండుగ పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. సరదాగా టపాసులు కాల్చి సంబరాలు చేసుకుందామనుకున్న వారికి అవే టపాసులు తీవ్ర నిరుత్సాహానికి గురి చేశాయి. టపాసులు పేలడంతో పలు చోట్ల ఇళ్లు దగ్ధమవ్వగా, మరికొన్ని చోట్ల పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విజయనగరం జిల్లాలోని జొన్న పలసలో దీపావళి సందర్భంగా టపాసులు పడి నిప్పంటుకుని నాలుగు తాటాకు ఇళ్లు మంటలకు ఆహూతి అయ్యాయి. మంటలు తీవ్రంగా వ్యాప్తిచే అవకాశం ఉండడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. ఎగసిపడుతున్న భారీ మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 15మందికి తీవ్ర గాయాలు.. హైదరాబాద్ నగరంలో దీపావళి పండుగ వేడుకలో పలుచోట్ల అపశృతి చోటుచేసుకుంది. టపాసులు కాలుస్తూ ప్రమాదానికి గురైనవారిని సమీపంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నగరంలోని సరోజినిదేవి ఆసుపత్రికి ఇప్పటివరకు 15మంది బాధితులు చేరుకున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి మరింత విషమంగా ఉండగా.. ఇద్దరికి కంటిచూపు పూర్తిగా పోయే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఆటోలో వెళ్తున్న 65 ఏళ్ల మైసమ్మకు రాకెట్ తగలడంతో కంటి వద్ద తీవ్ర గాయమైంది. మరికొన్ని చోట్ల టపాసులు పేలడంతో షాపులు కూడా పూర్తిగా కాలిపోయ్యాయి. -
పడగ్గదిలో ‘సోషల్’ ట్రెండ్!
సాక్షి, హైదరాబాద్: నగరవాసులు తమకు తెలియకుండానే నిద్రకు దూరమవుతున్నారు. ఏకాంతంగా ఉండే పడక గదులను సైతం సైబర్ ‘చాట్ రూం’లుగా మార్చేస్తున్నారు. ఒకప్పుడు నట్టింట్లోకి మాత్రమే పరిమితమైన ల్యాప్‌టాప్.. ట్యాబ్.. స్మార్ట్‌ఫోన్.. ఐపాడ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఇప్పుడు పడక సమయంలోనూ బెడ్‌మీదకు చేరుతున్నాయి. దీంతో సిటీజన్లు నిద్రలేమికి గురవుతున్నట్లు తాజా సర్వేలో తేలింది. ‘సెంచురీ మాట్రిసెస్’ దేశవ్యాప్తంగా పది నగరాల్లోని ప్రజల ‘స్లీపింగ్ ట్రెండ్స్’(నిద్ర అలవాట్లు)పై చేసిన సర్వేలో ఈ అంశం వెల్లడైంది. ఈ విషయంలో గ్రేటర్ హైదరాబాద్ దేశంలో అగ్రభాగాన నిలవడం గమనార్హం. ఈ నగరంలో సుమారు 70 శాతం మంది స్మార్ట్ఫోన్లలో సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌లో గడుపుతున్నట్టు తేలింది. ఎప్పటికప్పుడు తాజా సమచారాన్ని తెలుసుకునేందుకు నిద్రలేని రాత్రులను గడుపుతున్నట్లు ఈ సర్వేలో గుర్తించారు. అంతేకాదు ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల్లో సినిమాలు, తమకు నచ్చిన షోలను వీక్షిస్తున్నట్లు స్పష్టమైంది. ఇక ఈ సర్వేలో రెండో స్థానంలో నిలిచిన విశాఖపట్నంలో 66 శాతం మంది ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు ప్రకటించారు. మూడోస్థానంలో నిలిచిన బెంగళూరులో 65 శాతం మంది, నాలుగో స్థానంలో నిలిచిన ఇండోర్‌లో 58 శాతం మంది, ఐదోస్థానంలో ఉన్న పూణేలో 56 శాతం మంది పడక గదుల్లో ఎలక్ట్రానిక్స్ వస్తువులతో కుస్తీ పడుతూ నిద్రకు దూరమవుతున్నట్లు తేలడం గమనార్హం. పలు నగరాల్లో నిద్ర అలవాట్లు ఇలా.. సెంచురీ మాట్రిసెస్ దేశవ్యాప్తంగా పది నగరాల్లో ప్రజల స్లీపింగ్ ట్రెండ్స్‌పై సర్వే చేసింది. ఇందులో సుమారు పదివేల మంది నుంచి ‘ఆన్లైన్’లో అభిప్రాయాలు సేకరించి ఈ సర్వేకు తుదిరూపం ఇచ్చారు. ప్రధానంగా టీవీ, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, సహా.. స్మార్ట్ఫోన్లలో ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో నిరంతరాయంగా అప్డేట్ అవుతోన్న ఫీడ్‌ను తిలకిస్తూ మెజార్టీ సిటీజన్లు కాలక్షేపం చేస్తున్నట్లు గుర్తించారు. మొత్తంగా పది నగరాల్లో సరాసరి 53 శాతం మంది రాత్రి సమయాల్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలతోనే గడుపుతూ కాలక్షేపం చేస్తూ నిద్రకు దూరం అవుతున్నట్లు తేలింది. ఇక మరో 54 శాతం మంది నిత్యం రాత్రి 11–12 గంటల మధ్య నిద్రకు ఉపక్రమిస్తున్నట్లు చెప్పారు. ఉరుకుల పరుగుల జీవితంలో రాత్రి పొద్దుపోయాక నిద్రపోయినప్పటికీ ఉదయం 5–6 గంటల మధ్య మేల్కొనాల్సి వస్తుందని పలువురు తెలిపినట్లు సర్వేలో పేర్కొన్నారు. ఇక అధిక పని ఒత్తిడి.. ఉద్యోగాలు చేసేందుకు సుదూర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుండడంతో వారంలో మూడురోజుల పాటు పని ప్రదేశాలు.. జర్నీలో కునికిపాట్లు పడుతున్నట్లు 37 శాతం మంది అభిప్రాయపడినట్లు తేలింది. అధికంగా వీక్షిస్తే ప్రమాదమే.. ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అవసరాన్ని బట్టి ఉపయోగించాలి. గంటల తరబడి అదేపనిగా వాటితో కాలక్షేపం చేస్తే రేడియేషన్‌తో కంటిచూపు దెబ్బతింటుంది. కళ్లు, వాటిలోని సూక్ష్మ నరాలు అధిక ఒత్తిడికి గురవుతాయి. దీంతో మెడ, మెదడుపై దుష్ప్రభావం పడుతుంది. కనీసం పడక సమయంలోనైనా ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా ఉంటే మేలు. – డాక్టర్ రవీంద్రగౌడ్, సూపరింటెండెంట్, సరోజినిదేవి కంటి ఆస్పత్రి -
కళ్లు పోగొట్టినోళ్లకు చెల్లింపులు
సాక్షి, హైదరాబాద్: 2016 మే 26.. హైదరాబాద్‌లోని సరోజినీ కంటి ఆసుపత్రిలో ఆపరేషన్ వికటించి 13 మందికి కళ్లు పోయాయి. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. కంటి ఆపరేషన్‌కు కలుషితమైన ‘ఐవీ ఫ్లూయిడ్స్ ఆర్ఎల్ సొల్యూషన్’వాడటం వల్లే ఇంతమందికి కళ్లు పోయినట్లు అంచనా వేశారు. ఈ ఐవీ ఫ్లూయిడ్స్ సరఫరా చేసిన కంపెనీకి రూ.కోట్ల బిల్లులు చెల్లించేందుకు తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ఇప్పుడు రంగం సిద్ధం చేసింది. సంబంధిత కంపెనీపై కేసులు నడుస్తుంటే, ఆ బిల్లుల సొమ్ము చెల్లించాలంటూ సర్కారుకు ప్రతిపాదనలు పంపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్లాక్ లిస్టులో పెట్టి విచారణ జరుపుతున్నా.. నాగపూర్‌కు చెందిన హసీబ్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆ ఐవీ ఫ్లూయిడ్స్‌ను సరఫరా చేసింది. సరోజినీ కంటి ఆసుపత్రిలో బాధితులకు ఆపరేషన్ సమయంలో 16,385, 16,386, 16,387 బ్యాచ్ నంబర్లోని ఐవీ ఫ్లూయిడ్స్‌ను ఉపయోగించారు. తర్వాత అవి కలుషితమైనవిగా అధికారులు గుర్తించారు. ఆ కంపెనీ సరఫరా చేసిన మిగిలిన ఐవీ ఫ్లూయిడ్స్‌ను ప్రభుత్వం తక్షణమే నిలుపుదల చేసింది. కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టింది. ఆ కంపెనీకి చెందిన కొన్ని ఐవీ ఫ్లూయిడ్స్ నమూనాలను పరీక్షలకు పంపింది. దీంతో ఆసుపత్రులు ఆ కంపెనీకి చెందిన ఐవీ ఫ్లూయిడ్స్ నిల్వలను వెనక్కు పంపేశాయి. దాదాపు రూ.1.35 కోట్ల విలువైన ఫ్లూయిడ్స్ జిల్లాల నుంచి తెప్పించారు. కొరత ఏర్పడకుండా టీఎస్ఎంఎస్ఐడీసీ ప్రమాణాలు పాటించే మరో కంపెనీకి చెందిన ఫ్లూయిడ్స్‌ను తక్షణమే తెప్పించి రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రులకు ప్రభుత్వం సరఫరా చేసింది. మరోవైపు తాను సరఫరా చేసిన ఐవీ ఫ్లూయిడ్స్‌కు బిల్లులు సమర్పించాలని ప్రభుత్వాన్ని హసీబ్ కంపెనీ కోరింది. దీటుగా స్పందించిన టీఎస్ఎంఎస్ఐడీసీ.. వెనక్కు పంపిన ఐవీ ఫ్లూయిడ్స్ నిల్వలకు బిల్లులు ఇవ్వబోమని స్పష్టంచేసింది. అయితే మొత్తం రూ.3.62 కోట్ల విలువైన ఐవీ ఫ్లూయిడ్స్ సరఫరా చేశామని, అందులో రూ.1.35 కోట్ల విలువైన సరుకును వెనక్కు తీసుకున్నందున అప్పటికే ఆసుపత్రుల్లో ఉపయోగించిన రూ.2.27 కోట్ల విలువైన సరుకుకు డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కంపెనీ కోరింది. ఈ నేపథ్యంలో టీఎస్ఎంఎస్ఐడీసీ వర్గాలు కంపెనీకి పెండింగ్ బిల్లులను చెల్లించాలని ప్రభుత్వానికి నివేదించాయి. ఇటీవల జరిగిన సంస్థ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో దీన్ని ప్రతిపాదించడం గమనార్హం. ప్రమాణాల్లో తేడా లేనందునే: టీఎస్ఎంఎస్ఐడీసీ హసీబ్ కంపెనీ సరఫరా చేసిన ఐవీ ఫ్లూయిడ్స్ నమూనాలను పరీక్షించగా.. ప్రమాణాల్లో ఎక్కడా తేడా లేదని నిర్ధారణ అయినట్లు టీఎస్ఎంఎస్ఐడీసీ చెబుతోంది. మరి బాధితుల కళ్లు ఎలా పోయాయన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. కలుషితమైనవనే అనుమానం ఉండటం, ఆ ఫ్లూయిడ్స్‌పై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉండటంతో అప్పటివరకు నిల్వ ఉన్న సరుకును అధికారులు వెనక్కు పంపించారు. అప్పటికే వాడిన ఐవీ ఫ్లూయిడ్స్‌కు మాత్రం బిల్లులను చెల్లించాలని ప్రతిపాదించారు. మరోవైపు వాడిన ఫ్లూయిడ్స్ కూడా కలుషితం కాదని ఎలా నిర్ధారణ చేయగలరన్న ప్రశ్నకూ బదులు లేదు. ఈ పరిస్థితుల్లో కంపెనీకి బిల్లులు చెల్లించాలనుకోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాటి ప్రమాణాల్లో తేడా లేనందున బిల్లులు చెల్లించాలని భావిస్తున్నామని, దీనిపై మేనేజ్మెంట్ కమిటీకి ప్రతిపాదనలు పంపిన మాట వాస్తవమేనని టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ వేణుగోపాల్ ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. ఆ ప్రతిపాదనపై కమిటీ ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. -
ఐ బ్యాంక్ ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి
-
‘కళ్ల దానమే అంధత్వ నివారణకు మార్గం’
సాక్షి, హైదరాబాద్ : కళ్ల దానమే అంధత్వ నివారణకు మార్గమని ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. అవయవదానానికి అందరూ ముందుకు రావాలని కోరారు. బుధవారం సరోజనీ కంటి ఆస్పత్రిలో ఐ బ్యాంక్‌ను, నేత్రాల సేకరణకు రూ.కోటి విలువ చేసే అత్యాధునిక పరికరాలతో కూడిన అంబులెన్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఐ బ్యాంక్ ఏర్పాటుతో సేకరించిన కార్నియాను రెండు నెలలవరకు నిల్వ ఉంచవచ్చని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగు పర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ కింద అంతా కలిసి ముందుకు వస్తే సర్కార్ ఆస్పత్రులను అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. -
కుడికన్ను కార్నియా దెబ్బతింది
సాక్షి, హైదరాబాద్: హెడ్‌ఫోన్ బలంగా తగలడంతో శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ కుడికన్ను కార్నియా దెబ్బతిన్నట్టు సరోజినీదేవి ఆస్పత్రి సూపరింటెండెంట్ రవీందర్ గౌడ్ చెప్పారు. అసెంబ్లీలో ఘటన తర్వా త ఆసుపత్రిలో చేరిన చైర్మన్‌కు వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారు. ఇన్‌పేషెం ట్‌గా చేర్చుకొని చికిత్స అందిస్తున్నామని, రెండ్రోజులపాటు అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని సూప రింటెండెంట్ తెలిపారు. కాగా అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు లక్ష్మారెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, తదితర సీనియర్ నాయ కులు ఆసుపత్రికి వెళ్లి స్వామిగౌడ్‌ను పరా మర్శించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, షబ్బీర్ అలీ ఆస్పత్రికి చేరుకోగా.. అప్పటికే అక్కడున్న టీఆర్ఎస్ కార్యకర్తలు వారిని చూసి ఆగ్రహం తో ఊగిపోయారు. ఆస్పత్రిలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. వారే ఆత్మవిమర్శ చేసుకోవాలి కాంగ్రెస్ సభ్యులు విసిరిన హెడ్‌ఫోన్ నేరుగా కంటికి తగిలింది. కుడికన్ను వాచిపోయింది. నొప్పితో విలవిల్లాడి పోయాను. అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల తీరు బాధాకరం. వారు తమ ప్రవర్తనపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రజాస్వామ్యం లో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కానీ నిరసనల పేరుతో ఎదుటి వ్యక్తులపై దాడులకు దిగడం సరికాదు. గవర్నర్‌ను లక్ష్యంగా చేసుకుని హెడ్‌ఫోన్ విసిరితే.. పొరపాటున చైర్మన్‌కు తగిలిందని చెబుతుండటం హాస్యాస్పదం. నా దుర దృష్టమేమో కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసు వద్ద జరిగిన ఘటనలో అప్పటి ప్రభుత్వం నన్ను చంపేందుకు కుట్ర పన్నింది. మళ్లీ ఇప్పుడు ఇలా కాంగ్రెస్ నేతల దాడిలో గాయపడ్డాను. – స్వామిగౌడ్ దాడి బాధాకరం: స్పీకర్ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై దాడి, ఆయన కంటికి గాయమైన నేపథ్యంలో సంబంధించిన వీడియో దృశ్యాలను బీఏసీ సమావేశంలో పరిశీలించారు. స్వామిగౌడ్‌పై దాడికి పాల్పడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు కొందరు కాంగ్రెస్ సభ్యులపై చర్య తీసుకోవాలని అధికారపక్షం డిమాండ్ చేసింది. ఈ అంశంపై స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడారు. ప్రసంగం సందర్భంగా సహకరించాలని గవర్నర్ స్వయం గా అన్ని పార్టీల నేతలకు ఫోన్ చేసి కోరానని.. అయినా ఈ ఘటన జరగడం బాధాకరమన్నారు. దీనిపై జానారెడ్డి వివరణ ఇస్తూ.. కాంగ్రెస్ సభ్యులు ఉద్దేశపూర్వకం గా అలా వ్యవహరించలేదన్నారు. ఈ ఘటనను భౌతిక దాడిగా చూడవద్దని, నిరసన చెప్పే అవకాశమివ్వకపోవడంతో.. ఇబ్బందిని తెలియజేసే క్రమంలో జరిగిన ఘటనగా చూడాలని మల్లు భట్టివిక్రమార్క విజ్ఞప్తి చేశారు. మండలి చైర్మన్‌పై దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. గవర్నర్ లక్ష్యంగా దాడి చేసినట్టు చెప్పడం దారుణమని, కోమటిరెడ్డిపై పోలీసు కేసు పెట్టాలని ఒవైసీ కోరినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో మంగళవారం అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే కోమటిరెడ్డిపై చర్యల కోసం ప్రభుత్వం తీర్మానం పెట్టే అవకాశముంది. -
వారికి లక్ష చొప్పున పరిహారమివ్వండి
- ‘సరోజినీ దేవి’ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన ఎన్హెచ్ఆర్సీ - గతేడాది ఆపరేషన్ అనంతరం చూపు కోల్పోయిన ఆరుగురు బాధితులు సాక్షి, న్యూఢిల్లీ: సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో గతేడాది ఆపరేషన్లు వికటించి చూపు కోల్పోయిన ఆరుగురికి రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాధితులు కంటిచూపు కోల్పోవడానికి చుక్కల మందు తయారీదారుడే బాధ్యుడని, పరిహారం కూడా అతడే చెల్లించాలన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బాధితులకు చూపు పోయిందని స్పష్టంచేసింది. వారికి పరిహారం అందజేసినట్టుగా ఆరు వారాల్లోగా తమకు ఆధారాలు కూడా అందజేయాలని శుక్రవారం పేర్కొంది. గతేడాది జూలై 4న సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో 13 మందికి ఆపరేషన్ చేసిన తర్వాత కాంపౌండ్ సోడియం ల్యాక్టేట్ ఐపీ 500 ఎం.ఎల్ చుక్కల మందు ఇచ్చారు. అయితే మందులోని క్లెబ్సిల్లా బ్యాక్టీరియా కారణంగా వారిలో పలువురి చూపు దెబ్బతినగా ఆరుగురు శాశ్వతంగా చూపు కోల్పోయారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి కమిషన్ ఇప్పటికే నోటీసులిచ్చింది. తాజాగా వారికి ప్రభుత్వమే రూ.లక్ష చొప్పున పరిహారమివ్వాలని ఆదేశించింది. -
పరేషాన్ చేశారు.. పట్టించుకోవడం లేదు
మెహిదీపట్నం: ఆపరేషన్ పేరుతో తమను అంధులుగా మార్చిన అధికారులు ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారని బాధితులు ఆరోపించారు. సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో గత నెల జరిగిన ఆపరేషన్‌లో చూపు కోల్పోయిన బాధితులు సోమవారం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బాధితులు నూకాలతల్లి, మాణిక్యం, అంజిరెడ్డి, పీపీ మండల్, సత్యనారాయణ మాట్లాడుతూ డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా చూపుకోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. సంఘటన జరిగి నాలుగు వారాలు గడిచినా కళ్లు కనపడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు ప్రత్యేక శస్త్ర చికిత్సలు నిర్వహించ లేదని, కనీసం ఆర్థిక సహాయం చేయలేదన్నారు. డాక్టర్ల మాటపై నమ్మకం పోయిందని కనీసం అడుగు కూడా కదలలేక పోతున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయమై ఆసుపత్రి ఇన్చార్జ్ సూపరింటెండెంట్ రాజేందర్‌గుప్తాను వివర ణ కోరగా ప్రత్యేక శస్త్ర చికిత్సల కోసమే ఆసుపత్రికి పిలిపిస్తున్నట్లు తెలిపారు. -
'సరోజినీ'లో మళ్లీ సేవలు ప్రారంభం
హైదరాబాద్ : మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో దాదాపు 15 రోజుల విరామం తర్వాత ఇన్‌పేషంట్ సేవలు శుక్రవారం మళ్లీ ప్రారంభమైనాయి. ఈ రోజు ఉదయం అవుట్ పేషంట్ విభాగానికి వచ్చిన రోగుల్లో 40 మందిని ఇన్‌పేషంట్లుగా ఆసుపత్రలో చేర్చుకున్నారు. వీరికి సోమవారం శస్త్రచికిత్సలు చేయనున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సదరు ఆసుపత్రిలో ఇటీవల క్యాటరాక్ట్ శాస్త్రచికిత్స చేయించుకున్న ఏడుగురు బాధితులకు కంటిచూపు పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్‌గా స్పందించింది. వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకుని... కేసు నమోదు చేసింది. అలాగే ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, డీజీపీలకు కూడా నోటీసులు జారీ చేసింది. -
తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ శుక్రవారం తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో కంటిశుక్లాల తొలగింపు శస్త్రచికిత్సలు వికటించిన ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్‌గా స్పందించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించడంతో పాటు రెండు వారాల్లోగా తుది నివేదిక అందజేయాలని తెలంగాణ సీఎస్ సహా వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, ఆస్పత్రి సూపరింటెండెంట్లతో పాటు డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. కాగా కంటిచూపు మందగించడంతో మెరుగైన చూపుకోసం గత నెల 30న ఆస్పత్రిలో 21 మంది కాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నారు. రింగర్స్ లాక్టేట్ (ఆర్ఎల్)సెలెన్వాటర్తో కళ్లను శుభ్రం చేయడం వల్ల 13 మందికి ఇన్ఫెక్షన్ బారినపడగా, వీరిలో ఏడుగురి కంటి చూపు దెబ్బతింది. ఇప్పటికే ఈ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌తో పాటు, లోకాయుక్తా విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో 'సెలైన్' బంద్
‘సరోజినీ’ ఎఫెక్ట్ * ఆ బాటిళ్లు వాడొద్దని సర్కారు ఉత్తర్వులు * బయట నుంచి తెచ్చుకుంటున్న రోగులు * ఆర్థికంగా నష్టపోతున్న బాధితులు భువనగిరి : సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో ఘటన ప్రభావం జిల్లా ఆస్పత్రులపై పడింది. సోమవారం నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ఆర్ఎస్, సాధారణ సెలైన్ బాటిళ్లను రోగులకు ఎక్కించవద్దని ప్రభుత్వ ఆదేశాలు అందాయి. దీంతో రోగులకు అవసరమైన సెలైన్ బాటిళ్లను బయట తెచ్చుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఆస్పత్రుల్లో నిల్వ ఉన్న సెలైన్ బాటిళ్లను ఎక్కించడం లేదు. హైదరాబాద్ సరోజినీ దేవి ఆస్పత్రి ఘటనలో అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ జిల్లాలోని గ్లూకోజ్ బాటిళ్ల శాంపిల్స్ సేకరించారు. వాటిలో ఫంగస్ లణాలు కన్పించడంతో వెంటనే వాటి వాడకం నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరో పక్క జిల్లాలో కురుస్తున్న ముసురు వర్షాలు, చల్లని గాలులతో జన ం వైరల్ ఫీవర్, అతిసార, టైఫాయిడ్, ఇతర రోగాల బారిన పడుతున్నారు. తీవ్ర అనారోగ్యంతో అస్పత్రుల్లో చేరిన వారికి ముందుగా సె లైన్ బాటిళ్లను ఎక్కిస్తారు. అనంతరం వైద్యం అందిస్తారు. అయితే సరోజినీ కంటి ఆస్పత్రి ఘనతో అస్పత్రుల్లో సైలైన్లు ఎక్కించడానికి బయట మెడికల్ దుకాణాల నుంచి కొనుగోలు చేసుకోవాలని వైద్యులు చీటీలు రాస్తున్నారు. దీంతో రోగులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. జిల్లా అంతటా హసీబ్ కంపెనీ ఫ్లూయిడ్స్... హైదరాబాద్ సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో రోగుల కళ్లు పోవడానికి కారణమని భావిస్తున్న హసీబ్ పార్మాస్యూటికల్ కంపెనీకి చెందిన సెలైన్ బాటిళ్లు జిల్లా అస్పత్రుల్లో ఉన్నాయి. జిల్లాలోని 72 పీహెచ్‌సీలు, జిల్లా కేంద్రంలో 200 పడకలు, నాగార్జున సాగర్‌లో 150 పడకలు, భువనగిరి, సూర్యాపేట, మిర్యాలగూడల్లో 100 పడకలు, దేవరకొండ, రామన్నపేట, హుజూర్‌నగర్‌లో 50 పడకలు, చౌటుప్పల్, ఆలేరు, నకిరెకల్లో 30 పడకల ఆస్పత్రులు ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో హసీబ్ కంపెనీకి చెందిన ఆర్ఎల్, ఎన్ఎస్ గ్లూకోజ్ బాటిళ్లను వాడుతున్నారు. ఆ కంపెనీకి చెందిన గ్లూకోజ్ బాటిళ్లలో ఫంగస్ (బూజు) రావడంతో రోగులకు కళ్లుపోయాయని పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉన్న స్టాక్ ఈ సెలైన్ల వాడకం ఎక్కడికక్కడ నిలిపివేయాలని ఆదేశాలు అందాయి. రోగులపై భారం.. ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పులతో జిల్లాలో వందలాది మంది మంచాన పడుతున్నారు. దగ్గు, జలుబు, చలిజ్వరం, అతిసార, డయేరియా వంటి వ్యాధులు సోకుతున్నాయి. ఈ పరిస్థితిలో రోగులకు అత్యంత అవసరమైన గ్లూకోజ్ బాటిళ్లు ప్రభుత్వ అస్పత్రుల్లో అందుబాటులో లేకుండా పోయాయి. ఒక్కోసారి రోగికి 5 నుంచి 20 బాటిళ్ల వరకు ఎక్కించాల్సిన పరిస్థితి ఉంటుంది. చాలమంది రోగులకు బయట నుంచి కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది. తప్పని సరిపరిస్థితిలో వందలాది రూపాయలు గ్లూకోజ్ బాటిళ్ల కోసం ఖర్చు చేయాల్సివస్తోంది. -
సరోజినీ ఘటనపై దర్యాప్తు ముమ్మరం
-
సరోజినీ ఘటనపై దర్యాప్తు ముమ్మరం
హైదరాబాద్ : సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు వికటించిన ఘటనపై లోకాయుక్తా శనివారం విచారణ ముమ్మరం చేసింది. లోకాయుక్తా పరిశోధనాధికారి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన విచారణకు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ హెల్త్ వైద్యులు హాజరయ్యారు. లోపం ఎక్కడుందన్న దానిపై విచారణ జరిపారు. అయితే తాము ఎలాంటి తప్పు చేయలేదని వైద్యులు స్పష్టం చేస్తూ, తమపై క్రిమినల్ కేసులను నమోదు చేయటాన్ని వైద్యులు బృందం ఖండించింది. కాగా కంటిచూపు మందగించడంతో దానిని మెరుగుపర్చుకోవడం కోసం సరోజినీ ఆస్పత్రిలో గత నెల 30న 21 మంది క్యాటరాక్ట్ శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. అయితే వారిలో 13 మంది ఇన్ఫెక్షన్ బారినపడగా.. ఏడుగురికి కంటిచూపు పోయిన విషయం తెలిసిందే. అయితే సెలైన్‌లో బ్యాక్టీరియా ఉండటం వల్లే ఈ ఘటనకు కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి సెలైన్లు చాలా ప్రభుత్వ ఆస్పత్రులకు పంపిణీ చేశారని, వాటిన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకోవాలన్నారు. సెలైన్ల పంపిణీపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని డాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. నిపుణులైన వైద్యులే శస్త్రచికిత్సలు చేశారని తెలిపారు. ఇక లోకాయుక్త డిప్యూటీ డెరైక్టర్ తాజుద్దీన్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నర్సయ్యలతో కూడిన బృందం నిన్న సాయంత్రం సరోజినీ ఆస్పత్రిలో విచారణ జరిపి, బాధితుల నుంచి వివరాలు సేకరించింది. ఈ బృందం ఇవాళ ఉదయం మరోసారి ఆస్పత్రిలో పర్యటించింది. ఆస్పత్రిలో ప్రతి ఒక్కరి నుంచి విచారణ బృందం వివరాలు సేకరించింది. రోగులతో పాటు డాక్టర్లను, నర్సులను విచారణ చేశారు. ఆపరేషన్ థియేటర్‌ను క్షుణ్ణంగా పరిశీలించింది. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసి కంటి ఆస్పత్రుల రీజనల్ కమిటీ కూడా విచారణ జరిపింది. ఈ ఘటనపై ఆ కమిటీ సాయంత్రం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ సందర్భంగా ఐ ఆస్పత్రి రీజనల్ కమిటీ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సెలైన్‌లో ఫంగస్ ఉందన్నారు. అలాగే ఈ కేసును సుమోటోగా స్వీకరించిన హెచ్చార్సీ... పూర్తి వ్యవహారంపై ఈనెల 21లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, సరోజినీ ఆస్పత్రి సూపరింటెండెంట్లను ఆదేశించింది. -
సరోజినీదేవి ఆస్పత్రిపై హెచ్చార్సీ సీరియస్
సాక్షి, సిటీబ్యూరో: సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో కంటిశుక్లాల తొలగింపు శస్త్రచికిత్సలు వికటించిన ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ సీరియస్‌గా స్పందించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించడంతో పాటు ఈ నెల 21లోగా తుది నివేదిక అందజేయాలని తెలంగాణ సీఎస్ సహా వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, ఆస్పత్రి సూపరింటెండెంట్లను ఆదేశించించింది. నూకాలమ్మకు కార్నియా మార్పిడి చికిత్స: కంటిచూపు మందగించడంతో మెరుగైన చూపుకోసం గత నెల 30న ఆస్పత్రిలో 21 మంది కాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నారు. రింగర్స్ లాక్టేట్ (ఆర్ఎల్)సెలెన్వాటర్తో కళ్లను శుభ్రం చేయడం వల్ల 13 మందికి ఇన్ఫెక్షన్ బారినపడగా, వీరిలో ఏడుగురి కంటి చూపు దెబ్బతింది. వీరిలో ఇద్దరికి చూపు వచ్చే అవకాశం ఉందని వైద్యులు స్పష్టం చేయడం తెలిసిందే. వాసన్ఐ కేర్ నుంచి కార్నియాను సేకరించి కంటిచూపు కోల్పొయిన బాధితురాలు నూకాలమ్మతల్లికి శుక్రవారం ఆస్పత్రి ఎమర్జెన్సీ థియేటర్లో కార్నియా మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఆమెతో పాటు మరో ఇద్దరు బాధితులు కూడా చికిత్సకు రెస్పాండ్ అవుతున్నట్లు ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేందర్గుప్తా స్పష్టం చేశారు. ఉస్మానియా, గాంధీలో చికిత్సలు: ఆర్ఎల్ సెలైన్బాటిల్లో బ్యాక్టీరియా ఉన్నట్లు ప్రాధమికంగా నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తయ్యారు. ఆపరేషన్ థియేటర్లలోని వైద్య పరికరాల్లో కూడా బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తా చర్యల్లో భాగంగా జులై ఒకటో తేదీ న వాటిని మూసివేసిన విషయం తెలిసిందే. చికిత్సలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బంది పడుతుండటంతో ప్రభుత్వం ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. సరోజినీదేవి కంటి ఆస్పత్రికి వచ్చిన రోగులను ఆయ ూ ఆస్పత్రులకు తరలించి అక్కడే వారికి కాటరాక్ట్ సర్జరీలు చేసేందుకు అవసరమైన వైద్య బందాలను కూడా సిద్ధం చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే మైక్రోబయాలజీ నిపుణులు ఆపరేషన్ థియేటర్లలో శాంపిల్స్ సేకరించారు. తుది నివేదిక రావడానికి వారం రోజులు పట్టే అవకాశం ఉంది. థియేటర్లో ఇన్ఫెక్షన్ లేదని నిర్ధారించిన తర్వాతే ఇక్కడ సేవలను పునఃప్రారంభిస్తామని, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేందర్గుప్తా స్పష్టం చేశారు. పీఎస్‌లో ఆమ్ఆద్మీ ఫిర్యాదు: ఆస్పత్రులకు నాసిరకం మందులు సరఫరా కావడానికి, ఏడుగురు బాధితులు కంటి చూపు కోల్పోవడానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి, టీఎస్ఎంఐడీసీ ఎండీల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ ఆమ్ఆద్మీ పార్టీ రాష్ట్ర కో కన్వీనర్ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు హుమాయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సహా సంబంధిత అధికారులపై కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పోలీసులు సెక్షన్ 338 కింద కేసు నమోదు చేశారు. -
సరోజనీ ఆస్పత్రిలో లోకాయుక్త విచారణ
సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో రెండు రోజుల క్రితం జరిగిన ఘటనపై రాష్ట్ర లోకాయుక్త స్పందించింది. లోకాయుక్త ప్రతినిధులు శుక్రవారం సాయంత్రం ఆస్పత్రికి చేరుకుని, బాధితులతో మాట్లాడారు. కలుషిత సెలైన్ కారణంగా కంటి ఆపరేషన్ చేయించుకున్న వారికి చూపు పోవటంతో బాధితుల సంబంధీకుల నుంచి వివరాలు సేకరించారు. -
అమ్మో.. సెలైన్..!
సుల్తాన్‌బజార్ సరోజినీదేవి కంటి ఆస్పత్రి ఘటనతో నగరంలోని సర్కారు దవాఖానల్లోకి వెళ్లేందుకు జనం జంకుతున్నారు. నాసిరకం సెలైన్ బాటిల్స్ వల్ల పలువురికి చూపుపోయిన వార్తతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న సెలైన్ అవసరమున్న రోగులు బెంబేలెత్తుతున్నారు. సెలైన్ కావాల్సి వస్తే తాము బయటి నుండి తెచ్చుకుంటామని పలువురు రోగులు, వారి బంధువులు వైద్యులకు మొరపెట్టుకుంటున్నారు. సరోజినీదేవి కంటి ఆస్పత్రికి సెలైన్ బాటిళ్లు సరఫరా చేసే హసీబ్ ఫార్మా స్యూటికల్స్ కంపెనీయే సుల్తాన్‌బజార్ ఆస్పత్రిలోనూ రింగర్స్ లాక్టెట్(ఆర్ఎల్) సెలైన్ బాటిళ్లను సరఫరా చేస్తోంది. ఏప్రిల్ నెలలో ఈ ఆస్పత్రికి 29వేల సెలైన్ బాటిళ్లు సరఫరా అయ్యాయి. ప్రస్తుతం ఆ కంపెనీకి చెందిన 13, 500 బాటిళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇదే కంపెనీకి చెందిన బాటిళ్లను అధికారులు గురువారం నిలోఫర్ ఆస్పత్రిలో సీజ్ చేసిన విషయం విదితమే. ఆస్పత్రిలో ప్రస్తుతం ఉన్న హసీబ్ కంపెనీకి చెందిన 13, 500 బాటిళ్ల సెలైన్ స్టాక్‌ను డ్రగ్ కంట్రోల్ అధికారుల ఆదేశాలతో బ్లాక్ చేసినట్లు ఆర్ఎంవో డాక్టర్ విద్యావతి తెలిపారు. ప్రస్తుతం ఇన్వేర్ ఫార్మాసిటికల్ కంపెనీకి చెందిన సెలైన్లను రోగులకు అందుబాటులో ఉంచామన్నారు. -
'సరోజనీ' ఘటనపై విచారణకు ఆదేశం
హైదరాబాద్(మెహిదీపట్నం): మంత్రి లక్ష్మారెడ్డి బుధవారం సరోజిని దేవి కంటి ఆస్పత్రిని సందర్శించారు. 15 మంది చూపు కోల్పోయిన ఘటనపై విచారణకు ఆదేశించారు. సెలైన్ ఇన్ఫెక్షన్ కారణంగా 15 మంది చూపుకోల్పోయారు. వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే కంటి చూపు మందగించిందని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే తమ తప్పు లేదని ఆసుపత్రి యాజమాన్యం అంటోంది. ప్రభుత్వం సరఫరా చేసిన మందుల వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందని, దాంతో కంటి చూపు మందగించిందని డాక్టర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో కంటి ఆపరేషన్లు ప్రస్తుతానికి ఆపివేశారు. బాధితులు ఆందోళన కొనసాగుతూనే ఉంది.