వారికి లక్ష చొప్పున పరిహారమివ్వండి | NHRC ordered the state government on Sarojini Devi eye hospital issue | Sakshi
Sakshi News home page

వారికి లక్ష చొప్పున పరిహారమివ్వండి

Published Sat, Sep 16 2017 3:09 AM | Last Updated on Tue, Sep 19 2017 4:36 PM

వారికి లక్ష చొప్పున పరిహారమివ్వండి

వారికి లక్ష చొప్పున పరిహారమివ్వండి

- ‘సరోజినీ దేవి’ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ
- గతేడాది ఆపరేషన్‌ అనంతరం చూపు కోల్పోయిన ఆరుగురు బాధితులు
 
సాక్షి, న్యూఢిల్లీ: సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో గతేడాది ఆపరేషన్లు వికటించి చూపు కోల్పోయిన ఆరుగురికి రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాధితులు కంటిచూపు కోల్పోవడానికి చుక్కల మందు తయారీదారుడే బాధ్యుడని, పరిహారం కూడా అతడే చెల్లించాలన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బాధితులకు చూపు పోయిందని స్పష్టంచేసింది.

వారికి పరిహారం అందజేసినట్టుగా ఆరు వారాల్లోగా తమకు ఆధారాలు కూడా అందజేయాలని శుక్రవారం పేర్కొంది. గతేడాది జూలై 4న సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో 13 మందికి ఆపరేషన్‌ చేసిన తర్వాత కాంపౌండ్‌ సోడియం ల్యాక్టేట్‌ ఐపీ 500 ఎం.ఎల్‌ చుక్కల మందు ఇచ్చారు. అయితే మందులోని క్లెబ్సిల్లా బ్యాక్టీరియా కారణంగా వారిలో పలువురి చూపు దెబ్బతినగా ఆరుగురు శాశ్వతంగా చూపు కోల్పోయారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి కమిషన్‌ ఇప్పటికే నోటీసులిచ్చింది. తాజాగా వారికి ప్రభుత్వమే రూ.లక్ష చొప్పున పరిహారమివ్వాలని ఆదేశించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement