దీపావళి మతాబులు కాలుస్తూ హైదరాబాద్ నగర వాసులు పెద్ద సంఖ్యలో ప్రమాదాలకు గురయ్యారు. ముందు జాగ్రత్తలు తీసుకోకుండా బాణసంచా కాల్చుతూ వివిధ ప్రమాదాబారిన పడ్డారు. కళ్లకు సంబంధించిన ప్రమాదాలతో బుధవారం సాయంత్రం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు దాదాపు 35 మంది మెహిదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి వచ్చారు. వీరికి ఆస్పత్రి వర్గాలు చికిత్స అందించాయి. దీపావళి సందర్భంగా ఆరుగురు ఆస్పత్రిలో చేరగా ముగ్గురికి వైద్యులు కంటి శస్త్రచికిత్సలు నిర్వహించారు.