దివ్య దీపావళి : ఓ వైరల్‌ వీడియో | Go local and make this Diwali a brighter one for at least one street vendor | Sakshi
Sakshi News home page

దివ్య దీపావళి : ఓ వైరల్‌ వీడియో

Published Wed, Nov 7 2018 8:03 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

Go local and make this Diwali a brighter one for at least one street vendor - Sakshi

దేశమంతా దీపావళి సంబరాల్లో మునిగి తేలుతోంది.  జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా,  జగతిని జాగృతం చేసేలా జరుపుకునే  వెలుగు దివ్వెల పండుగ  దీపావళి. చెడుపై సాధించిన మంచి విజయానికి గుర్తుగావెలుగుల దివ్య దిపావళి. అయితే ఈ దీపావళి రోజు చిన్నా పెద్దా అందరినీ  ఆలోచింప చేసే వీడియో ఒకటి నెట్‌లో చక్కర్లు కొడుతోంది. మంచికీ, మానవతకు ప్రతీకగా నిలిచిన ఓ చిన్నోడు నెటిజనులను విపరీతంగా ఆకర్షిస్తున్నాడు. తన పరిధిలో, బుజ్జి మెదడుకు పదును పెట్టి మరీ సాయం చేసిన వైనం ఆలోచింప చేస్తోంది.  తన మంచి మనసుకు ఆధునిక టెక్నాలజీని జోడించిస్మార్ట్‌గా బిజినెస్‌ మంత్రను ప్రయోగించి సందేశంతోపాటు, సక్సెస్‌ సాధించడమే ఇందులోని రహస్యం. ఈ  వివరాలు చెప్పేకన్నా.స్వయంగా వీడియోను  చూసి ఆనందిస్తేనే బావుంటుంది.


 
చిరుదీపమే  అఖండ కాంతులకు  నాంది, చిన్న అడుగే  మార్పునకు పునాది అని స్ఫురించేలా  హెచ్‌పీ ఇండియా ఈ  డిజిటల్ వీడియోను  రూపొందించింది.  మూడు నిమిషాల నిడివి వున్న ఈ వీడియో స్థానిక కళాకారులు,  వీధి  వ్యాపారుల  ఉత్పత్తులకు, చేతివృత్తులకు లభించాల్సిన  ఆదరణ అవసరాన్ని నొక్కి  చెబుతుంది.  ఓ మంచి సందేశంతోపాటు వ్యాపారం జమిలిగా ఇమిడి వున్న వీడియో ఆలోచింప చేసేదిగా ఉంది.

ఉ‍మ్మీద్‌ కా దియా (ఆశల దీపం) వీడియో  పై స్పందిస్తూ హెచ్‌పీ ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ నీలిమా బుర్రా : సమాజానికి మంచి సందేశాన్నివ్వడానికి  దీపావళి పండుగ సరియైన సమయంగా భావించాం. చిన్న ప్రయత్నం ఇతరుల జీవితాల్లో ఎంతటి సానుకూల ప్రభావాన్ని చూపుతుందో టెక్నాలజీ ద్వారా చెప్పాలనుకున్నాం.  ఈ దీపావళికి కనీసం ఒక వీధి వ్యాపారి జీవితమైనా ప్రకాశవంతంగా ఉండేలా  మాతోపాటు,  ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement