HP India
-
డబ్బుకు డబ్బు.. అవకాశాలు, గేమింగ్ ఇండస్ట్రీపై తల్లిదండ్రుల ధోరణి ఇలా
న్యూఢిల్లీ: దేశంలో ఈ స్పోర్ట్స్ పరిశ్రమ వృద్ధి బాట నడుస్తుండడం, గేమర్లకు విస్తృతమైన కెరీర్ అవకాశాలతోపాటు, ఆదాయాలను పెంచుతున్నట్టు హెచ్‌పీ ఇండియా నిర్వహించిన గేమర్స్ ల్యాండ్‌స్కేప్ స్టడీ, 2023 పేర్కొంది. దేశవ్యాప్తంగా 15 పట్టణాల నుంచి 3,000 గేమర్ల (గేమ్‌లు ఆడేవారు) అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా తెలుసుకున్నారు. విశ్రాంతి కోసమే కాకుండా, ఆర్జనకు, గుర్తింపునకు గేమింగ్‌ను సాధనంగా చూస్తున్నారు. గేమింగ్ పట్ల తల్లిదండ్రుల్లోనూ సానుకూల ధోరణి నెలకొంటున్నట్టు ఈ సర్వే గుర్తించింది. సర్వేలో 500 మంది తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా తెలుసుకుంది. ►గేమ్‌లను సీరియస్‌గా ఆడేవారు ఏటా కనీసం రూ.6 లక్షలు సంపాదిస్తున్నారు. ►2022తో పోలిస్తే 2023లో గేమింగ్‌పై ఆదాయం పెరిగింది. సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది సీరియస్ గేమర్లు (గేమింగ్‌ను ఉపాధిగా తీసుకున్న వారు) రూ.6–12 లక్షల మధ్య ఆదాయం సంపాదిస్తున్నామని చెప్పారు. ►67 శాతం మంది మొబైల్ ఫోన్ కంటే కంప్యూటర్లోనే గేమ్ ఆడేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ►స్పాన్సర్షిప్, ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్లు గణనీయమైన ఆదాయ వనరులుగా మారాయి. గేమింగ్‌కు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఇవి తెలియజేస్తున్నాయి. ►గేమింగ్‌ను ఒక అలవాటుగా 42 శాతం మంది తల్లిదండ్రులు అంగీకరిస్తున్నారు. ఈ పరిశ్రమకు ఉన్న వృద్ధి అవకాశాలతో గేమింగ్ పట్ల తమ దృక్పథంలో మార్పు వచ్చిందని 40 శాతం మంది చెప్పారు. ►అదే సమయంలో గేమింగ్ అవకాశాల పట్ల తల్లిదండ్రులకు సరైన సమాచారం కూడా లేదని తెలిసింది. దీనికి సంబంధించిన సమాచారం కోసం 49 శాతం మంది స్నేహితులు, కుటుంబ సభ్యులపై ఆధారపడుతున్నారు. ►గేమింగ్ కెరీర్లో స్థిరత్వం, సామాజికంగా ఒంటరి కావడంపై ఆందోళన వ్యక్తమైంది. ‘‘భారత్ ప్రపంచంలో టాప్–3 పీసీ (కంప్యూటర్) గేమింగ్ కేంద్రాల్లో ఒకటిగా మారింది. ఎప్పటికప్పుడు ఆవిష్కరణలు, అధునాతన ఉపకరణాల ద్వారా గేమర్ల సాధికారతకు మేము కట్టుబడి ఉన్నాం. గేమింగ్ పరిశ్రమను, గేమర్ల ఆకాంక్షలను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు ఈ అధ్యయనం వీలు కల్పించింది’’అని హెచ్‌పీ ఇండియా మార్కెట్ ఎండీ ఇప్సితాదాస్ గుప్తా తెలిపారు. ‘‘ఈస్పోర్ట్స్ రంగం వేగంగా వృద్ధి చెందుతూ, విభిన్న ఉపాధి అవకాశాలను గేమర్లకు కల్పిస్తుండడం ప్రోత్సాహకరంగా ఉంది. భారతీయ యువత అంతర్జాతీయ ఈస్పోర్ట్స్ విభాగంలో తమ స్థానాన్ని మరింత పెంచుకోవడమే కాకుండా, పరిశ్రమలో వ్యాపార అవకాశాలను కూడా సొంతం చేసుకుంటారని భావిస్తున్నాం’’అని హెచ్‌పీ ఇండియా మార్కెట్ పర్సనల్ సిస్టమ్స్ సీనియర్ డైరెక్టర్ విక్రమ్ బేడి పేర్కొన్నారు. -
లగ్జరీ ఫ్లాట్ కొన్నహెచ్‌పీ ఇండియా ఎండీ ఇప్సితా దాస్‌గుప్తా
హెచ్‌పీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, యాపిల్ మాజీ ఎగ్జిక్యూటివ్ ఇప్సితా దాస్‌గుప్తా, ముంబైలోని వర్లీ ప్రాంతంలో లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. అక్టోబర్ 2023లో హెచ్‌పీ ఇండియాకు ఎండీ నియమితులయ్యారు ఇప్సితా. ముంబైలోని వర్లీ ప్రాంతంలో 22.52 కోట్ల రూపాయలకు 2,964 చదరపు అడుగుల ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు ఇప్సితా. తాజా నివేదికల ప్రకారం అరేబియా సముద్రం, బాంద్రా-వర్లీ సీ లింక్ వ్యూతో , సూపర్-ప్రీమియం ప్రాజెక్ట్ రహేజా ఆర్టీసియాలోని 4వ అంతస్తులోని అపార్ట్‌మెంట్‌ను ఆమె సొంతం చేసుకున్నారు. ఈ ఫ్లాట్‌లో 100 చదరపు అడుగుల బాల్కనీ, మూడు కార్ పార్కింగ్ స్లాట్లు ప్రత్యేక ఆకర్షణ. ప్రాపర్టీ టెక్ సంస్థ Zapkey సమాచారం ప్రకారం ఈ డీల్ అక్టోబర్ 26న రిజిస్టర్ అయింది. అయితే ఈ డీల్‌పై ఇటు కె రహేజా కార్ప్, ఇటు హెచ్‌పీ ఇండియా గాని ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా 2023 ఏడాదిలో 10 నెలల కాలంలో 1.04 లక్షలకు పైగా ఆస్తి రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ముఖ్యంగా 2023 ఆగస్టులో, Paytm పేమెంట్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సురీందర్ చావ్లా, సెంట్రల్ ముంబైలోని లోయర్ పరేల్‌లోని ఇండియాబుల్స్ స్కై ఫారెస్ట్‌లో 2,516 కార్పెట్ ఏరియాతో 20 కోట్ల రూపాయలకు డ్యూప్లెక్స్ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. 2022లో ముంబైలోని టాప్ 100 హౌసింగ్ ప్రాజెక్ట్‌లలో రూ. 43,000 కోట్ల విలువైన ఇళ్లు అమ్ముడయ్యాయి, అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 2.5 శాతం క్షీణించిందని జాప్కీ డాట్ కామ్ విశ్లేషణలో తేలింది. -
మార్కెట్లోకి హెచ్‌పీ స్మార్ట్ట్యాంక్ ప్రింటర్స్
సాక్షి, హైదరాబాద్: హ్యూలెట్ప్యాకర్డ్ (హెచ్‌పీ) సంస్థ..‘హెచ్‌పీ స్మార్ట్ట్యాంక్’ పేరుతో బుధవారం సరికొత్త ప్రింటర్లను విడుదల చేసింది. సులువుగా వా డు కోగలగడం, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం, సురక్షితం వంటి మూడు అంశాల ప్రాతిపదికగా తయారైన ఈ కొత్త ప్రింటర్లు ప్రస్తుతం మూడు మోడళ్లలో లభిస్తున్నట్లు హెచ్‌పీ ప్రింటింగ్ విభాగం ప్రెసిడెంట్ సునీశ్ రాఘవన్ తెలిపారు. హెచ్‌పీ స్మా ర్ట్ ట్యాంక్ 521 కేవలం ప్రింటింగ్‌కు ఉపయోగపడుతుందని, హెచ్‌పీ 510, హెచ్‌పీ 580లు ప్రింట్, స్కానింగ్, కాపీ పనులు చేయగలవ ని చె ప్పారు. ఈ మూడు మోడళ్ల ధరలు రూ. 13,000 –19,000 మధ్యలో ఉంటాయని ఆయన తెలిపారు. చదవండి: ఉద్యోగుల ఆశలన్నీ ఆవిరి: కేంద్రం షాకింగ్ న్యూస్ -
ఇండియా గేమింగ్ స్టడీ 2022.. లేడీ ‘గేమ్స్’బాండ్స్
వేగంగా విస్తరిస్తున్న ఆన్లైన్ గేమింగ్‌ను ఉపాధి మార్గంగా ఎంచుకుంటోంది యువత. ఆన్లైన్ గేమింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, యానిమేషన్‌ను వృత్తిగా మార్చుకుని డబ్బులు సంపాదించుకుంటున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ విషయంలో పురుషుల కంటే మహిళలే అధికంగా ఉంటున్నారు. ప్రముఖ కంప్యూటర్ సంస్థ ‘హెచ్‌పీ ఇండియా’ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. సాక్షి, అమరావతి: కేవలం మానసిక ఉల్లాసానికి.. ఆలోచన శక్తి పెంచుకోవడానికి మాత్రమే ఆన్లైన్ గేమింగ్‌ను పరిమితం చేయకుండా.. దీనిని ఓ వృత్తిగా మలుచుకుంటోంది నేటి యువత. కొందరు గేమింగ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్‌గా మారుతుండగా.. మరి కొందరు గేమింగ్ యానిమేటర్స్‌గా మారుతున్నారు. ఈ రంగంలో పురుషుల కంటే.. మహిళల శాతమే అధికంగా ఉంటోంది. ఈ రంగంలో 56 శాతం మంది మహిళలు ఉండగా.. 44 శాతం మంది మాత్రమే పురుషులు. ఆన్లైన్ గేమింగ్‌ను పూర్తిస్థాయిలో కొందరు, పాక్షికంగా మరికొందరు.. గిగ్ వర్కర్‌గా ఇంకొందరు సంపాదన మార్గంగా ఎంచుకుంటున్నట్టు హెచ్‌పీ ఇండియా ‘ఇండియా గేమింగ్ స్టడీ 2022’ పేరిట విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మరో విషయం ఏమిటంటే.. మిగిలిన ఐటీ జాబ్స్‌తో పోలిస్తే గేమింగ్ రంగంలోని ఉద్యోగులకు 25 శాతానికి పైగా అధికంగా జీతాలు లభిస్తున్నాయి. ఎందుకంటే.. గేమింగ్ రంగంలో ఆలోచనశక్తి అధికంగా ఉన్నవారు మాత్రమే నిలబడగలుగుతారని, అందుకే వారికి జీతాలు అధికంగా ఇస్తున్నారని ఐటీ రంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో రూ.68,800 కోట్లకు చేరనున్న మార్కెట్ భారత్‌లో ఆన్లైన్ గేమింగ్ వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం 50.70 కోట్ల మంది ఆన్లైన్ గేమింగ్ ఆడుతున్నట్టు ఋఇంటరాక్టివ్ మీడియా వెంచర్ క్యాపిటల్ ఫండ్ లుమికియా’ వెల్లడించింది. ప్రస్తుతం దేశీయ ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ విలువ రూ.20,800 కోట్లు ఉండగా.. వచ్చే ఐదేళ్లలో మూడు రెట్లు పెరిగి రూ.68,800 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇందులో ఉపాధి అవకాశాలపై యువత ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. సాఫ్ట్వేర్ రంగంలోనే 18 శాతం మంది గేమింగ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్‌గా మారుతుండగా.. మరో 2 శాతం మంది గేమింగ్ యానిమేటర్స్‌గా ఉపాధి పొందుతున్నారు. కాగా, ఆన్లైన్ గేమింగ్ ఆడుతున్న వారిలో అత్యధికంగా 92 శాతం మంది వినోదం, మానసిక ఉల్లాసం కోసం ఆడుతున్నట్టు సర్వేలో తేలింది. మొబైల్ ఫోన్లో కంటే కంప్యూటర్లోనే గేమింగ్ ఆడేవారి సంఖ్య క్రమేపీ పెరుగుతోందంట. మొబైల్ కంటే పర్సనల్ కంప్యూటర్లోనే ఆటలు ఆడటానికి 68 శాతం మంది మొగ్గు చూపుతున్నారు. మొబైల్ కంటే కంప్యూటర్లో ఆడితే అనుభూతి అధికంగా ఉంటోందని, అందుకనే ఈ మధ్య కాలంలో 39 శాతం మంది మొబైల్ నుంచి కంప్యూటర్లోకి ఆటలు ఆడటానికి మారినట్టు సర్వేలో వెల్లడైంది. పీసీ గేమింగ్‌పై దృష్టి మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ పీసీ గేమింగ్‌లో మరిన్ని ఆవిష్కరణలు తీసుకువచ్చే దిశగా కృషి చేస్తున్నట్టు హెచ్‌పీ ఇండియా సీనియర్ డైరెక్టర్ విక్రమ్బేడి తెలిపారు. రాష్ట్రంలో కూడా ఆన్లైన్ గేమింగ్ అవకాశాలను అందిపుచ్చుకుంటూ పలు ఐటీ సంస్థలు ఏర్పాటవుతున్నాయని, విజయవాడ, రాజమండ్రి, విశాఖ కేంద్రంగా 8కి పైగా ఐటీ సంస్థలు ఆన్లైన్ గేమింగ్‌లకు వివిధ సేవలను అందిస్తున్నాయని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్) ప్రెసిడెంట్ శ్రీధర్ కోసరాజు ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పుడు లెర్నింగ్ ఆధారిత గేమ్స్‌కు బాగా డిమాండ్ ఉండటంతో ఈ రంగంలో అవకాశాలను యువత అందిపుచ్చుకుంటోందన్నారు. వీఎఫ్ఎక్స్ యానిమేటర్స్, మెటావర్క్స్లో ఏఆర్, వీఆర్, ఎక్స్ఆర్ వంటి టెక్నాలజీలకు డిమాండ్ అధికంగా ఉందన్నారు. ఆన్లైన్ గేమ్స్‌తోనే పిల్లల్లో చురుకు ఈ కాలంలో పిల్లలు బయటకు వెళ్లి ఆడుకోలేని పరిస్థితి ఉండటంతో వారి మెదడు చురుకుగా పనిచేయడానికి కనీసం రోజుకు గంట లేదా గంటన్నర ఆన్లైన్ గేమ్స్ ఆడుకోనివ్వాలి. ఇందుకోసం నీతిఆయోగ్ ఏర్పాటు చేసిన అటల్ థింకరింగ్ ల్యాబ్స్ (ఏటీఎల్) చక్కటి ఫలితాలను అందిస్తున్నాయి. విశాఖలోని శ్రీశారద విద్యాలయంలో గల ఏటీఎల్‌లో పిల్లలను 3, 4 వారాలపాటు ఆన్లైన్ గేమ్స్ ఆడుకోవడానికి వదిలేసి పరిశీలిస్తున్నారు. ఎవరైతే ముందుకు వెళ్లలేకపోతున్నారో గుర్తించి వాళ్లకు అనుగుణంగా గేమింగ్‌లో కోడింగ్ మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్ వంటి సబ్జెక్టులను గేమింగ్ రూపంలో చెప్పడం వల్ల పిల్లలకు సులభంగా అర్థమవుతోంది. – రాజశేఖర్ వాసా, ఫౌండర్, స్కెచ్ ఈఏ ఐటీ, వైజాగ్ -
దివ్య దీపావళి : ఓ వైరల్ వీడియో
దేశమంతా దీపావళి సంబరాల్లో మునిగి తేలుతోంది. జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా, జగతిని జాగృతం చేసేలా జరుపుకునే వెలుగు దివ్వెల పండుగ దీపావళి. చెడుపై సాధించిన మంచి విజయానికి గుర్తుగావెలుగుల దివ్య దిపావళి. అయితే ఈ దీపావళి రోజు చిన్నా పెద్దా అందరినీ ఆలోచింప చేసే వీడియో ఒకటి నెట్లో చక్కర్లు కొడుతోంది. మంచికీ, మానవతకు ప్రతీకగా నిలిచిన ఓ చిన్నోడు నెటిజనులను విపరీతంగా ఆకర్షిస్తున్నాడు. తన పరిధిలో, బుజ్జి మెదడుకు పదును పెట్టి మరీ సాయం చేసిన వైనం ఆలోచింప చేస్తోంది. తన మంచి మనసుకు ఆధునిక టెక్నాలజీని జోడించిస్మార్ట్గా బిజినెస్ మంత్రను ప్రయోగించి సందేశంతోపాటు, సక్సెస్ సాధించడమే ఇందులోని రహస్యం. ఈ వివరాలు చెప్పేకన్నా.స్వయంగా వీడియోను చూసి ఆనందిస్తేనే బావుంటుంది. చిరుదీపమే అఖండ కాంతులకు నాంది, చిన్న అడుగే మార్పునకు పునాది అని స్ఫురించేలా హెచ్‌పీ ఇండియా ఈ డిజిటల్ వీడియోను రూపొందించింది. మూడు నిమిషాల నిడివి వున్న ఈ వీడియో స్థానిక కళాకారులు, వీధి వ్యాపారుల ఉత్పత్తులకు, చేతివృత్తులకు లభించాల్సిన ఆదరణ అవసరాన్ని నొక్కి చెబుతుంది. ఓ మంచి సందేశంతోపాటు వ్యాపారం జమిలిగా ఇమిడి వున్న వీడియో ఆలోచింప చేసేదిగా ఉంది. ఉమ్మీద్ కా దియా (ఆశల దీపం) వీడియో పై స్పందిస్తూ హెచ్‌పీ ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ నీలిమా బుర్రా : సమాజానికి మంచి సందేశాన్నివ్వడానికి దీపావళి పండుగ సరియైన సమయంగా భావించాం. చిన్న ప్రయత్నం ఇతరుల జీవితాల్లో ఎంతటి సానుకూల ప్రభావాన్ని చూపుతుందో టెక్నాలజీ ద్వారా చెప్పాలనుకున్నాం. ఈ దీపావళికి కనీసం ఒక వీధి వ్యాపారి జీవితమైనా ప్రకాశవంతంగా ఉండేలా మాతోపాటు, ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలి. -
‘ఈ దివాళి వారి జీవితాల్లోనూ వెలుగులు నింపాలి’
మాల్స్ వచ్చిన దగ్గర నుంచి వీధి చివర దుకాణాలకు.. రోడ్ల వెంబడి వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారస్తులకు తీవ్ర నష్టం వాటిల్లిందనే చెప్పవచ్చు. విదేశీ సంస్కృతి మీద మోజుతో స్వదేశీయులకు తీవ్ర నష్టం కల్గిస్తున్నాము. మాల్స్‌లో వేలకు వేలు ఖర్చు చేసే జనాలు.. చిరు వ్యాపారస్తుల దగ్గర కొనేటప్పుడు మాత్రం గీసిగీసి బెరమాడతారు. రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవులకిచ్చే పది, ఇరవై రూపాయల దగ్గర వంద సార్లు ఆలోచిస్తుంటాం. ఈ సంస్కృతి మారి.. చిరువ్యాపారులకు సాయం చేసినప్పుడే.. వారి వ్యాపారాలు కలకలలాడినప్పుడే నిజమైన దీపావళి అనే ఉద్దేశంతో చేసిన ఓ యాడ్ ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ప్రముఖ కంప్యూటర్లు, ప్రింటర్ల మేకింగ్ కంపెనీ హెచ్‌పీ ఇండియా ‘వీధి వ్యాపారస్తులకు మద్దతు తెలపండి.. మన ఇళ్లలోని దీపాలు వారి ఇళ్లలో కూడా కాంతులు నింపుతాయి’ అనే ఉద్దేశంతో ఓ యాడ్‌ను రూపొందించింది. తొమ్మిదేళ్ల బాలుడు వీధుల్లో ప్రమిదలు అమ్ముకునే ఓ మహిళ ముఖంలో దివాళి ఆనందం ఎలా తీసుకు వచ్చాడనే ఇతివృత్తంతో రూపొందించిన ఈ వీడియోను హెచ్‌పీ ఇండియా తన ట్విట్టర్ అకౌంట్లో 'ఉమ్మీద్ కా దియా' పేరిట పోస్ట్ చేసింది. ఇలా షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడయోను దాదాపు 2.3 మిలియన్ల మంది చూశారు. -
కంప్యూటర్ కొనుగోలుకు వడ్డీ లేని రుణం..
♦ రూ.11,998 వరకు ప్రయోజనాలు ♦ విద్యార్థుల కోసం హెచ్‌పీ పథకం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : టెక్నాలజీ దిగ్గజం హెచ్‌పీ ఇండియా విద్యార్థుల కోసం ‘బ్యాక్ టు కాలేజ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ల్యాప్‌టాప్, డెస్క్టాప్ను ఎటువంటి వడ్డీ లేకుండా సులభ వాయిదాల్లో కొనుక్కోవచ్చు. ముందస్తుగా ఎటువంటి చెల్లింపులూ చేయాల్సిన అవసరం లేదు. 6, 9, 12 నెలల వాయిదాల్లో రుణాన్ని తిరిగి చెల్లించొచ్చు. సిబిల్ స్కోర్ ఆధారంగా బజాజ్ ఫైనాన్స్ ఈ రుణాన్ని సమకూరుస్తుంది. ఎంపిక చేసిన మోడళ్లపై రూ.11,998 వరకు ప్రయోజనాలనూ అందుకోవచ్చు. ప్రయోజనాల కింద మూడేళ్ల వరకు వారంటీ, బీమా, బ్లూటూత్ స్పీకర్, హెడ్సెట్, హార్డ్ డిస్క్ వంటివి అందుకోవచ్చు. కంప్యూటర్ కొనుక్కోవాలని ఉన్నా డబ్బులు లేక ఎంతో మంది తమ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇటువంటి వారికి రుణ సౌకర్యం పెద్ద ఊరటనిస్తుందని హెచ్‌పీ ఇండియా కంజ్యూమర్ పర్సనల్ సిస్టమ్స్ కేటగిరీ హెడ్ అనురాగ్ అరోరా తెలిపారు. కమ్యూనికేషన్స్ ప్రతినిధి దినేష్ జోషితో కలసి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. లక్ష మందికిపైగా ఈ కార్యక్రమం ద్వారా లబ్ది పొందారని వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 500ల పైచిలుకు హెచ్‌పీ విక్రయశాలలు ఉన్నాయని గుర్తు చేశారు. హెచ్‌పీ పీసీల ధర రూ.23 వేల నుంచి ప్రార ంభమవుతుంది.