మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటిని పరిశీలిస్తున్న శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి తదితరులు ∙ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వామిగౌడ్
సాక్షి, హైదరాబాద్: హెడ్‌ఫోన్ బలంగా తగలడంతో శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ కుడికన్ను కార్నియా దెబ్బతిన్నట్టు సరోజినీదేవి ఆస్పత్రి సూపరింటెండెంట్ రవీందర్ గౌడ్ చెప్పారు. అసెంబ్లీలో ఘటన తర్వా త ఆసుపత్రిలో చేరిన చైర్మన్‌కు వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారు. ఇన్‌పేషెం ట్‌గా చేర్చుకొని చికిత్స అందిస్తున్నామని, రెండ్రోజులపాటు అబ్జర్వేషన్‌లో ఉంచిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని సూప రింటెండెంట్ తెలిపారు. కాగా అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు లక్ష్మారెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, తదితర సీనియర్ నాయ కులు ఆసుపత్రికి వెళ్లి స్వామిగౌడ్‌ను పరా మర్శించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, షబ్బీర్ అలీ ఆస్పత్రికి చేరుకోగా.. అప్పటికే అక్కడున్న టీఆర్‌ఎస్ కార్యకర్తలు వారిని చూసి ఆగ్రహం తో ఊగిపోయారు. ఆస్పత్రిలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.
వారే ఆత్మవిమర్శ చేసుకోవాలి
కాంగ్రెస్ సభ్యులు విసిరిన హెడ్‌ఫోన్ నేరుగా కంటికి తగిలింది. కుడికన్ను వాచిపోయింది. నొప్పితో విలవిల్లాడి పోయాను. అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల తీరు బాధాకరం. వారు తమ ప్రవర్తనపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రజాస్వామ్యం లో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కానీ నిరసనల పేరుతో ఎదుటి వ్యక్తులపై దాడులకు దిగడం సరికాదు. గవర్నర్‌ను లక్ష్యంగా చేసుకుని హెడ్‌ఫోన్ విసిరితే.. పొరపాటున చైర్మన్‌కు తగిలిందని చెబుతుండటం హాస్యాస్పదం. నా దుర దృష్టమేమో కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసు వద్ద జరిగిన ఘటనలో అప్పటి ప్రభుత్వం నన్ను చంపేందుకు కుట్ర పన్నింది. మళ్లీ ఇప్పుడు ఇలా కాంగ్రెస్ నేతల దాడిలో గాయపడ్డాను.
– స్వామిగౌడ్
దాడి బాధాకరం: స్పీకర్
శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై దాడి, ఆయన కంటికి గాయమైన నేపథ్యంలో సంబంధించిన వీడియో దృశ్యాలను బీఏసీ సమావేశంలో పరిశీలించారు. స్వామిగౌడ్‌పై దాడికి పాల్పడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు కొందరు కాంగ్రెస్ సభ్యులపై చర్య తీసుకోవాలని అధికారపక్షం డిమాండ్ చేసింది. ఈ అంశంపై స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడారు. ప్రసంగం సందర్భంగా సహకరించాలని గవర్నర్ స్వయం గా అన్ని పార్టీల నేతలకు ఫోన్ చేసి కోరానని.. అయినా ఈ ఘటన జరగడం బాధాకరమన్నారు. దీనిపై జానారెడ్డి వివరణ ఇస్తూ.. కాంగ్రెస్ సభ్యులు ఉద్దేశపూర్వకం గా అలా వ్యవహరించలేదన్నారు. ఈ ఘటనను భౌతిక దాడిగా చూడవద్దని, నిరసన చెప్పే అవకాశమివ్వకపోవడంతో.. ఇబ్బందిని తెలియజేసే క్రమంలో జరిగిన ఘటనగా చూడాలని మల్లు భట్టివిక్రమార్క విజ్ఞప్తి చేశారు. మండలి చైర్మన్‌పై దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. గవర్నర్ లక్ష్యంగా దాడి చేసినట్టు చెప్పడం దారుణమని, కోమటిరెడ్డిపై పోలీసు కేసు పెట్టాలని ఒవైసీ కోరినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో మంగళవారం అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే కోమటిరెడ్డిపై చర్యల కోసం ప్రభుత్వం తీర్మానం పెట్టే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment