హైదరాబాద్ : దీపావళి సందర్భంగా తగిన జాగ్రత్తలు పాటించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పిల్లలు గాయపడ్డారు. హైదరాబాద్‌లోని ఒక్క సరోజినీ కంటి ఆసుపత్రికే 18 మంది చిన్నారులు గాయాలతో వచ్చారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. శాశ్వతంగా కంటి చూపు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
చిచ్చుబుడ్డి పేలకపోవడంతో దగ్గరకి చూసేందుకు చిన్నారి ప్రయత్నించాడు. అనుకోకుండా చిచ్చుబుడ్డి ఒక్కసారిగా పేలడంతో కళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒక్క సరోజినీ కంటి ఆసుపత్రికే ఇంత మంది పిల్లలు చికిత్స కోసం రావడంతో ........రాష్ట్రవ్యాప్తంగా గాయపడ్డ చిన్నారుల సంఖ్య వందల్లో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.