హైదరాబాద్: దీపావళి పండగ నేపథ్యంలో నగరంలో టపాసులు కాలుస్తూ పలువురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఎక్కువ మందికి కంటికి గాయాలయ్యాయి. దీంతో 22 మంది చిన్నారులు సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి, 33 మంది ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి, మరో 10 మంది ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. చిన్నారులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.