దీపావళి వేడుకల్లో అపశ్రుతి
హైదరాబాద్: దీపావళి సందర్భంగా పలుచోట్ల అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. టపాసులు కాల్చుతున్న సమయంలో పలువురికి గాయాలయ్యాయి. కళ్లకు గాయాలైన పలువురు హైదరాబాద్‌లోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ దిపావళి సందర్భంగా అయిన కంటి గాయాలతో 15 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయని వైద్యులు తెలిపారు.
వరంగల్‌కు చెందిన రాజేష్, సందీప్(మెదక్), శివ(హైదరాబాద్), సాయిగౌడ్ తీవ్రంగా గాయపడిన వారిలో ఉన్నారు. ఇంకా గాయపడిన మరికొంతమంది నగరంలోని వేరువేరు ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు.