eye injuries
-
కలవరం రేపుతోన్న కళ్లకలక.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. దీంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే డెంగీ, మలేరియా జ్వరాలు సోకుతుండగా తాజాగా కళ్ల కలక.. కలవరం రేపుతోంది. దీనిని పింక్ ‘ఐ’ అని కూడా అంటున్నారు. సాధారణ బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ వ్యాధి సోకుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. జలుబు కారకమైన వైరస్‌తో కూడా కలక వస్తుందని వారు తెలుపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో చాలా మందే ఈ వ్యాధి బారిన పడుతున్నారని తెలుస్తోంది. వర్షాకాలం కావడంతో వాతావరణ పరిస్థితుల కారణంగా ఇన్ఫెక్షన్ సోకి కలక వస్తోందని, గాలిలో ఎక్కువగా ఉండే తేమ బ్యాక్టీరియాకు కారణమవుతోందని, ఇది కళ్లను ప్రభావితం చేస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఎలా వస్తుంది? బ్యాక్టీరియా, కెమికల్స్, వైరస్ ద్వారా వస్తుంది. ఒకరిద్వారా ఒకరికి విస్తరిస్తుంది. లక్షణాలు.. ♦ కన్ను ఎర్రగా మారుతుంది ♦ కంటి నుంచి నీరు కారుతుంది ♦ కంటి రెప్పలు వాపు, ఉబ్బుతాయి. ♦ నిద్రించినప్పుడు కంటి రెప్పలు అంటుకుంటాయి. ♦ కంటి నుంచి పూసి రావడం ♦ కంటి నొప్పి దురద, మంట వస్తుంది. చికిత్స... యాంటీ బయోటిక్ ‘ఐ’ డ్రాప్స్, లుబ్రికాటింగ్ ‘ఐ’ డ్రాప్స్ వేసుకోవాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మన పరిసరాలలో (ఆఫీస్‌లు, స్కూళ్లు, కళాశాలలు, ఆస్పత్రులు, ఇంటిలో) ఎవరికైనా కండ్ల కలక ఉండే వారికి దూరంగా ఉండాలి. వాళ్లు వాడిన వస్తువులు (టవల్స్, సబ్బులు ఇతర వస్తువులు) తాకడం, వాడడం చేయొద్దు. తప్పని పరిస్థితుల్లో తాకితే తరచూ చేతులను నీటితో శుభ్రం చేసుకోవాలి. కళ్ల కలక వస్తే తప్పని సరిగా కళ్లద్దాలు ఉపయోగించాలి. ♦ కండ్ల కలక చాలా సాధారణ కంటి జబ్బు. అయినా మొదట్లోనే దీనిని నివారించుకోవాలి. పెద్దగా ఆందోళన చెందాలి్సన అవసరం లేదు. అయినా జాగ్రత్తలు పాటించాలి. ♦ కళ్లను మంచి నీటితో శుభ్రం చేస్తే అరికట్టొచ్చు. పరిస్థితి తీవ్రతను బట్టి కంటి వైద్యులను సంప్రదించాలి. జాగ్రత్తలు తీసుకోవడంతో తగ్గింది.. వారం క్రితం చాలా మంది విద్యార్థినులకు కండ్ల కలక వచ్చింది. కంటి వైద్యుల సలహా మేరకు ‘ఐ‘ డ్రాప్స్ వేశాం. పిల్లలను దూరంగా ఉంచాం. దాదాపుగా అందరికీ తగ్గుతోంది. జ్యోతి, స్పెషల్ ఆఫీసర్, కసూ్తర్బా ఆందోళన చెందొద్దు కంటి కలక వచ్చిన వారు ఆందోళన చెందొద్దు. పరిశుభ్రత పాటించాలి. సొంత వైద్యం చేయకుండా కంటి వైద్యులను సంప్రదించాలి. కంటి విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ప్రతాపగిరి ప్రసాద్, ఆఫ్తాల్మిక్ ఆఫీసర్ జాగ్రత్తలు పాటించాలి గాలి ద్వారా సోకే ఈ బ్యాక్టీరియా వర్షాకాలంలో వాతావరణంలో మురుగు, కాలుష్య కారకాలు పెరిగిపోవడం వల్ల వస్తుంది. ప్రస్తుతం అనేక జిల్లాలలో ప్రజలు కండ్ల కలకతో బాధపడుతున్నారు. కండ్లకలక సమస్యకు మందులు వాడకపోయినా కొందరికి తగ్గుతుంది. అయితే ఇది ఇతరులకు వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. – డాక్టర్ చీర్ల శ్రీకాంత్, పీహెచ్సీ వెంకటాపురం 100 మందికి పైగా ప్రజలకు కండ్ల కలక .. వెంకటాపురం(ఎం) మండలంలోని 9 సబ్‌సెంటర్ల పరిధిలో సుమారు 100 మందికి పైగా ప్రజలు కండ్ల కలక లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిసింది. వైద్య సిబ్బంది కూడా ఎప్పటికపుడు గ్రామాల్లో పర్యటిస్తూ కండ్ల కలక వచ్చిన ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. -
టపాసుల వేళ అపశ్రుతులు.. మంటలంటుకుని కళ్లకు, ఒంటికి గాయాలు
సాక్షి, హైదరాబాద్: దీపావళి వేళ బాణసంచా కాలుస్తున్న క్రమంలో నగరంలో కొన్నిచోట్ల అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. పలువురికి కళ్లకు, ఒంటికి గాయాలయ్యాయి. నగర వ్యాప్తంగా సుమారు 100 మందికి పైగా బాధితులు పలు ఆస్పత్రుల్లో చేరారు. కంటి గాయాలకు గురైనవారిలో ఎక్కువ మంది చిన్నారులే కావడం గమనార్హం. సరోజినీదేవి ఆస్పత్రికి క్యూ.. మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో దీపావళిని ముందు రోజు ముగ్గురు, పండగ రోజు రాత్రి సమయంలో 45 మంది దాకా కంటి గాయాలతో సంప్రదించారు. ఇందులో 21 మంది అవుట్ పేషెంట్ విభాగంలో చూపించుకుని వెళ్లిపోగా 19 మంది అడ్మిట్ అయ్యారు. పండగ తర్వాత రోజు కూడా మరో 2 కేసులు వచ్చాయని వైద్యులు చెప్పారు. వీరిలో అయిదేళ్ల వయసు నుంచి 67 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. మొత్తం బాధితుల్లో అత్యధికులు చిన్నారులే. బాధితుల్లో మల్లెపల్లికి చెందిన అజయ్ సింగ్ (25), విజయ్ ఆనంద్ (61), సి. మహావీర్ (15)ల ఎడమ కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరితో పాటు కుడికన్నుకు గాయమైన హయత్‌నగర్‌కు చెందిన రాజి (37)లకు శస్త్ర చికిత్సలు నిర్వహించారు. బాధితుల్లో ఒక అబ్బాయి కంటి చూపు కోల్పోయాడని వైద్యులు తెలిపారు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి.. బంజారాహిల్స్‌లోని ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రికి పెద్ద సంఖ్యలోనే బాణసంచా బాధితులు నమోదయ్యారు. పండగ ముందురోజున అయిదుగురు, దీపావళి రోజున 21 మంది, మరుసటి రోజున (సాయంత్రం 4గంటల వరకూ) 11 మంది కంటి గాయాలతో ఆస్పత్రికి వచ్చారని వీరిలో 9 మందికి సర్జరీలు చేశామని వైద్యులు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో బాణసంచా కారణంగా 7 కాలిన గాయాల కేసులు నమోదయ్యాయి. చందానగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తీవ్రగాయాలతో ఒకరు చికిత్స పొందుతున్నారు. పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ బాణసంచా బాధితులు చికిత్స పొందుతున్నట్టు సమాచారం. కాలిన గాయాలతో ఉస్మానియాకు... నగరంలో కంటి గాయాలతో చిన్నారులు ఆస్పత్రుల పాలు కాగా కాలిన గాయాలతో పెద్దలు ఆస్పత్రులకు క్యూ కట్టారు. ఉస్మానియా ఆస్పత్రిలో 18 మందికి కాలిన గాయాల బాధితులు సంప్రదించగా ఇందులో ఒకరు తీవ్ర గాయాలతో అడ్మిట్ అయ్యారు. శరీరం కాలిన ఆ మహిళ (63) పరిస్థితి విషమంగా ఉందని, ఆమె దాదాపు 95 శాతం కాలిన గాయాల బారిన పడడంతో వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కంటిగాయాలు.. ఓ లుక్ వేయండి
వ్యవసాయ పనుల్లో ఉండేవారికీ, పల్లెల్లో కూలీ పనులు చేసేవారికి పెద్దగా కంటికి గాయాల వంటివి ఉండవని చాలామంది అపోహపడుతుంటారు. పట్టణాల్లో, నగరాల్లో జరిగే ప్రమాదాల్లోనే అవి ఎక్కువని భావిస్తుంటారు. నిజానికి వ్యవసాయ, కూలి పనుల్లోనే కంటికి గాయాలయ్యే అవకాశాలెక్కువ. ఉదాహరణకు ఓ వ్యవసాయదారు పొలంలో కంపకొడుతుంటాడు. అకస్మాత్తుగా ఏ కంపముల్లో కంట్లో తగిలే అవకాశాలెక్కువ. ఎడ్లబండి తోలుతూ రైతు డొంకదారిన వస్తుంటాడు. దార్లోకి ఒంగిన తుమ్మముల్లు తగిలే అవకాశాలెక్కువ. ఇలాంటి గాయాలతో ప్రతిరోజూ ఎందరో పల్లెవాసులు, అలాగే మిగతా పట్టణ, నగరవాసులూ చూపు కోల్పోతున్నారు. గాయం తగిలిన వెంటనే చికిత్స అందితే ఈ అంధత్వాలను చాలావరకు నివారించవచ్చు. కంటికి అయ్యే గాయాలెటువంటివీ, ముందుగా ఎలాంటి ప్రథమచికిత్సలు, ఆ తర్వాత ఏ ప్రధాన చికిత్సలు అవసరం లాంటి అనేక విషయాలను తెలిపేదే ఈ కథనం. కంటి గాయాలూ... వాటి రకాలు కంటికి ప్రధానంగా రెండు రకాలుగా గాయాలయ్యే అవకాశాలుంటాయి. 1) భౌతికంగా అయ్యే గాయాలు. 2) రసాయనిక ప్రమాదాలు భౌతికంగా అయ్యే గాయాలు : వ్యవసాయ, ఇతరత్రా పనుల్లో : పొలాల్లో, డొంకదారుల్లో ఉండే ముళ్లచెట్లతో వ్యవసాయదారులకు గాయాలయ్యే అవకాశాలు ఎక్కువని చెప్పుకున్నాం. అలాగే కట్టెలు కొట్టే సమయాల్లో చెక్కపేడు వంటివి ఎగిరివచ్చి కంట్లో గుచ్చుకోవచ్చు. రాళ్లు కొట్టేవారు సుత్తిని ఉపయోగిస్తున్నప్పుడు, ఇటుక, ఇతరత్రా బట్టీలో పెళ్లలు ఎగిరొచ్చి కంట్లో పడవచ్చు. ఇక పట్టణాల్లో వెల్డింగ్ వంటి వర్క్‌షాపుల్లో కంటికి గాయాలు తగిలే అవకాశాలెక్కువ. రోడ్డు / ఇతరత్రా ప్రమాదాల్లో : రోడ్డు మీద హెల్మెట్ లేకుండా వాహనం మెల్లగానే నడుపుతున్నప్పటికీ రోడ్డు మీదికి ఓరగా ఒంగిన చెట్ల కొమ్మలు కంట్లో కొట్టుకుని గాయాలయ్యే ప్రమాదాలెక్కువ. రాత్రివేళల్లో వాహనంపై ప్రయాణం చేసేవారికి పురుగుల వంటివి ఎగిరి వచ్చి కంట్లో పడవచ్చు. యాక్సిడెంట్లలో కంటికి లేదా కనుగుడ్డు అమరి ఉండే గూడు (ఆర్బిట్)కు గానీ లేదా తలకు అయ్యే గాయాల వల్ల కంటిచూపు ప్రభావితమయ్యే ప్రమాదాలుంటాయి. ఆటల్లో : కంట్లో బంతి తగలడం, షటిల్‌కాక్ వంటివి బలంగా తగలడం వల్ల; అలాగే పిల్లలు పదునైన ఉపకరణాలతో లేదా బాణాల వంటి పదునైన వస్తువులతో ఆడుకుంటున్నప్పుడు; బాణాసంచా వంటివి ఒకరిపై ఒకరు విసురుకుంటున్నప్పుడు. పండుగలూ, వేడుకల్లో : దీపావళి, హోలీ వంటి పండగల్లో, వేడుకల్లో. ఎగిరి వచ్చే పదార్థాల వల్ల (ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్స్) : చిన్న చిన్న రాతిముక్కలు, గాజు ముక్కలు, లోహపు పదార్థాలు, కలప వంటి వాటితోపాటు, పురుగులు కంట్లో బలంగా కంటిని తాకడం వల్ల. సర్రున ఎగిరివచ్చి తాకే ఎలాంటి వస్తువుల వల్లనైనా. రసాయనిక ప్రమాదాలు రసాయన ప్రమాదాల గురించి తెలుసుకుందాం. ముందు చెప్పుకున్నట్లుగా వ్యవసాయ పనుల్లో పెద్దగా కంటి ప్రమాదాలు జరగవనే అపోహ లాంటిదే... ఈ రసాయనిక ప్రమాదాలూ జరగవనే భావన కూడా. కానీ పొలంలో ఆర్గానోఫాస్ఫరస్ (అంటే ఎండ్రిన్ వంటి) మందుల పిచికారీలూ, ఎరువులు వేస్తున్నప్పుడు రసాయనాలు కంట్లోకి వెళ్లే ప్రమాదాలు చాలా ఎక్కువ. దాంతోపాటు పొలానికి మందు కొట్టిన సందర్భాల్లో చేతులు కడుక్కోకుండా వాటితోనే కళ్లునులుముకోవడం వంటి చర్యలతోనూ కళ్లలోకి రసాయనాలు చేరుతాయి. ఇక పట్టణాలూ, నగరాల్లోని రకరకాల పారిశ్రామిక కేంద్రాలూ, ఫౌండ్రీలలో కొన్ని రకాల ఆమ్లాలు / క్షారాల వంటి రసాయన కంట్లో పడి ప్రమాదాలు జరుగుతాయి. ఇలాంటప్పుడు వీలైనంత త్వరగా చికిత్స జరిగితే శాశ్వత అంధత్వాన్ని చాలావరకు నివారించవచ్చు. అంతేకాదు... మన ఇళ్లలో ఉండే సుగంధద్రవ్యాలను స్ప్రే రూపంలో చిమ్ముకుంటున్నప్పుడు కూడా ఈ తరహా రసాయన ప్రమాదాలు జరగవచ్చు. అందుకే చిన్నపిల్లలను పర్ఫ్యూమ్స్కు దూరంగా ఉంచాలి. ఇక ఇళ్లలో జరిగే గాయాల్లో.... సిమెంట్ పని చేస్తున్నప్పుడు, ఇంటికి సున్నాలు/కలర్స్ వేయిస్తున్నప్పుడు, పాన్‌లో వాడే సున్నాన్ని పిల్లలు కళ్లల్లో పెట్టుకున్నప్పుడు, బాత్రూమ్ల వంటి చోట్ల యాసిడ్ వంటి రసాయనాలతో పనిచేస్తున్నప్పడు కంట్లోకి సున్నం లేదా యాసిడ్ వంటి రసాయనాలు వెళ్లే అవకాశాలెక్కువ. రసాయనాల కారణంగా జరిగే ప్రమాదాలతో కెమికల్స్‌కు సహజంగానే తినేసే గుణం (కాస్టిక్ ఎఫెక్ట్) ఉంటుంది. పైగా అందులోని రసాయనాలు కంటిలోని కణాలూ, ఎంజైముల, ప్రోటీన్ల పనితీరును ప్రభావితం చేస్తాయి. సాధారణంగా ఆ రసాయనాలు... కార్నియా, కంజెంక్టివా వంటి కంటి పొరలను దెబ్బతీస్తాయి. ఫలితంగా చూపుకోల్పోయే ప్రమాదాలెక్కువ. రసాయన ప్రమాదాల్లో తక్షణం అందించాల్సిన చికిత్స : కంటిలో పడే రసాయన గాఢతను వీలైనంతగా తగ్గించాలి (డైల్యూట్ చేయాలి). అందుకోసం రసాయనాలకు ఎక్స్పోజ్ అయిన కంటిని దాదాపు 30 నిమిషాల పాటు పరిశుభ్రమైన నీటితో కడగాలి. రోగి అయోమయంలో ఉంటే ప్రమాదస్థలంలోని ఎవరైనా ఈ పని చేయవచ్చు. పేలుళ్లు : ఈ తరహా ప్రమాదాలలో రెండు రకాలుగా కన్ను గాయపడుతుంది. ఒకటి నిప్పురవ్వలు. రెండోది... పేలుడు ధాటికి చిన్న చిన్న రాతి/ఇతరత్రా రవ్వలు కంటిని బలంగా తాకడం వల్ల. గాయాలు నివారించే జాగ్రత్తలివి... సాధారణంగా కంటికి అయ్యే గాయాల్లో దాదాపు 90 శాతం నివారింపదగినవే. అందునా 80 శాతం గాయాల్లో డాక్టర్‌ను సరైన సమయంలో సంప్రదిస్తే, చూపు పోకుండా కాపాడుకోవచ్చు. ∙కర్షకులూ, కార్మికులూ, నిర్మాణరంగంలోని పనివారూ ఎండ వేడిమి నుంచి కంటిని రక్షించుకోవాలి. ఎందుకంటే సూర్యరశ్మిలో యూవీఏ, యూవీబీ కిరణాలుంటాయి. అవి టెరిజియమ్, క్యాటరాక్ట్, మాక్యులార్ డీజనరేషన్ వంటి కంటి సమస్యలకు కారణమవుతాయి. పరిశ్రమల్లో పనిచేసే వారికి యూవీఏ, యూవీబీ కిరణాలతో ముప్పు మరింత ఎక్కువ. పొలాల్లో పనిచేసేవారికి కళ్లజోడేమిటి అనే సందేహాలూ, నామోషీలు లేకుండా ప్లెయిన్ గ్లాసెస్ వాడాలి. దాంతో వ్యవసాయం, రాతికొట్టుడు వంటి పనుల్లో కన్ను గాయపడకుండా ఉంటుంది. వ్యవసాయదారులే కాదు.. హాబీగా గార్డెనింగ్ చేసేవారు కూడా ఎప్పుడూ ప్రొటెక్టివ్ గాగుల్స్ తప్పక ధరించాలి. ►స్పోర్ట్స్ ఇంజ్యూరీ : ఆటల్లో కన్ను గాయపడకుండా ఉండేందుకు పాలీకార్బనేట్ కళ్లజోళ్లు వాడాలి. (ఇది ప్లాస్టిక్ వంటిది. పగలదు). హెల్మెట్స్, కంటి షీల్డ్‌లతో స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ నివారించవచ్చు. ►ఇంట్లో : ఇంట్లో అనేక రకాల పదునైన వస్తువులతో కంటిగాయాలయ్యే అవకాశాలుంటాయి. ఉదాహరణకు పదునైన మూలలు ఉండే మంచాలు, చిలక్కొయ్యలూ, హ్యాంగర్స్‌గా వాడుకునే ఇనుపకొక్కేల వంటి వాటితో కూడా కంటి గాయాలయ్యే అవకాశాలున్నాయి. ఇంటివస్తువులు పదునుగా ఉండకుండా చూసుకోవాలి. ఇళ్లలో కూల్‌డ్రింక్ ఓపెన్ చేసేటప్పుడు ఆ సీసామూతను బయటికి వైపునకు 45 డిగ్రీల ఏటవాలుగా ఉంచి తెరవాలి. అప్పుడు కన్ను గాయపడే అవకాశం ఉండదు. ►పంటపొలాల్లో ఆర్గానోఫాస్ఫరస్ (ఎండ్రిన్ వంటివి) చల్లేటప్పుడు నోరు, ముక్కులకు మాస్క్‌తో పాటు కళ్లకు ప్రొటక్టివ్ గాగుల్స్ తప్పకుండా పెట్టుకువాలి. ►కార్ఖానాల్లో రసాయనాలను అంటుకునే ముందు, అంటుకున్న తర్వాత చేతులు కడుక్కోకుండానే కళ్లునులుముకోవడం సరికాదు. ►పిల్లల ఆటల్లో విల్లుబాణాలూ అస్సలు వద్దు. బాణాసంచా కాల్చేటప్పుడు పెద్దవాళ్లు చిన్నారుల పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి. ►టూవీలర్స్ నడిపేవారు ఐ వేర్, ఐ షీల్డ్, హెల్మెట్ ధరించి తీరాలి. నిజానికి వ్యవసాయం, నిర్మాణ పనివాళ్లు, రాతి పనివాళ్లు, స్టోన్ కట్టర్స్, ట్రాక్టర్ డ్రైవర్లు... వీళ్లంతా పనివేళ్లల్లో కంటికి అద్దాలు, ఐ షీల్డ్ ధరించాలి. హెల్మెట్ తరహాలోనే ఈ మేరకు ఓ చట్టం రావడమూ చాలావరకు మేలు చేసే అంశమే. ►కంటిగాయాల ప్రథమ చికిత్సపై అవగాహన పెంచుకోవాలి. ►ఆసుపత్రికి తీసుకెళ్లడంలో ఆలస్యం జరగకూడదు. గాయమైన వెంటనే... కంటికి గాయం తగలగానే తక్షణం ఓ శుభ్రమైన మెత్తటి గుడ్డ సహాయంతో రెండు కళ్లనూ మూసి ఉంచాలి. వీలైనంతగా కనుగుడ్లు కదలకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత త్వరగా డాక్టర్‌కు చూపించాలి. కంటికి గాయాలను స్వయంగా పరిశీలించుకోవడం, సొంత చికిత్స చేసుకోవడం చాలా ప్రమాదం. అలా ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదు. కెమికల్స్ పడ్డాయని తెలియగానే... చేతులను సబ్బు, మంచినీళ్లతో శుభ్రంగా కడగాలి. దొరికితే ప్రిజర్వేటివ్ ఫ్రీ యాంటీబయాటిక్ డ్రాప్స్, ల్యూబ్రికెంట్స్ వేసుకోవాలి. కళ్లునలపకూడదు. కంటి మీద ఒత్తిడి పడనివ్వకూడదు. కళ్లలో పడ్డ నలకలను (ఫారిన్బాడీని) మనంతట మనమే తీయకూడదు. వీలైనంత త్వరగా కంటి డాక్టర్‌తో చికిత్స తీసుకోవాలి. అవసరమైతే వారి సలహా మేరకు పెద్ద ఆసుపత్రుల్లో కంటి వైద్యనిపుణులకు చూపించుకోవాలి. డాక్టర్‌ను కలవాల్సింది ఎప్పుడు? ►కన్ను నొప్పి, నీళ్లు కారడం, వెలుగు చూడలేకపోవడం, చూపు తగ్గడం, ఎర్రబారడం, తలనొప్పి, కళ్లు (కనుగుడ్లు) కదిలిస్తున్నప్పడు నొప్పి ఉంటే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి. చికిత్స ►ఫస్ట్ ఎయిడ్ చికిత్స ఇంట్లో, పనిచేసే ప్రదేశంలో అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. అంటే ఉదాహరణకు... సున్నం, సిమెంట్, బాత్రూమ్ యాసిడ్ వంటివి పడ్డప్పుడు వెంటనే కన్ను శుభ్రంగా కడుక్కుని, ఆ వెంటనే కంట్లో చుక్కల మందులు అయిన ప్రిజర్వేటివ్–ఫ్రీ యాంటిబయాటిక్ ఐ డ్రాప్స్ అందుబాటులో ఉంచుకోవాలి. ఇక కన్ను కడుక్కోడానికి పరిశుభ్రమైన నీరు (ప్లేన్ వాటర్) వాడాలి. అదంత శుభ్రంగా ఉండదనుకుంటే ప్యాకేజ్డ్ వాటర్‌బాటిల్ నీళ్లు వాడుకోవచ్చు. ఇక గాయాన్ని బట్టి చేయాల్సిన చికిత్స ఆధారపడి ఉంటుంది. అయితే ఎంత త్వరగా చికిత్స అందిస్తే చూపు దక్కే అవకాశం అంత ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. -
దీపావళి టపాసులు మిస్‌ఫైర్.. కళ్లకు గాయాలు
-
చోదకా.. కనుపాప జాగ్రత్త !
కళ్లు పొడిబారి దురదలు, మంటలు రావడం.. కంటిలో ఏదో గుచ్చుకున్నట్లు అనిపించడం వాహనచోదకుల్లో సహజంగా కనిపించే సమస్యలు. కలర్ బ్లైండ్నెస్, దృష్టి లోపాలకు చికిత్స పొందక పోవడం వలన రెటీనా దెబ్బతినడం డ్రైవర్లలో ఎక్కువగా కనిపిస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. డ్రైవర్లు నేత్ర సంరక్షణపై అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని నేత్రవైద్యులు హెచ్చరిస్తున్నారు. సెప్టెంబరు 17 డ్రైవర్స్‌డే సందర్భంగా ప్రత్యేక కథనం... లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రతి ఒక్కరికీ నేత్ర సంరక్షణ ఎంతో అవసరం. ముఖ్యంగా ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చే వాహనచోదకులు నేత్ర సమస్యలపై మరింత జాగురూకతతో ఉండాల్సిన అవసరం ఉంది. చిన్న సమస్యే కదా అని అశ్రద్ధ చేస్తే దీర్ఘకాలిక కంటి వ్యాధులుగా మిగిలిపోయే ప్రమాదం ఉందని నేత్రవైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో డ్రైవింగ్ చేస్తున్న వారిలో ఎక్కువగా కంటి సమస్యలు వస్తున్నట్లు నిపుణులు చెపుతున్నారు. నేత్ర సమస్యల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా కామన్‌గా వాడే ఐ డ్రాప్స్ వేసుకోవడం ద్వారా తొలిదశలోనే పరిష్కారం పొందవచ్చని సూచిస్తున్నారు. డ్రైవర్లలో ఎక్కువగా వచ్చే నేత్ర సమస్యలు ఇవి.. కళ్ల మంటలు, దురదలు.. సహజంగా ప్రతి ఒక్కరూ నిమిషానికి 10 నుంచి 15 సార్లు కను రెప్పలను మూస్తుంటాం. కానీ డ్రైవింగ్ చేసే వాళ్లు కళ్లు రెప్పార్పకుండా అలాగే డ్రైవింగ్ చేస్తుంటారు. దీంతో నిమిషానికి మూడు నుంచి నాలుగు సార్లు మాత్రమే రెప్పలు మూస్తుంటారు. దీంతో కంటిపై ఉండే నీటిపొర ఆవిరై పోతుంది. దీంతో కంటిలో దురద రావడం, మంటలు, ఎరుపు రంగులోకి మారడం జరుగుతుంది. కంట్లో ఏదో గుచ్చుకున్నట్లు అనిపించడం జరుగుతుంది. ఈ సమస్యతో డ్రైవర్లు అధిక సంఖ్యలో బాధపడుతున్నారు. తొలిదశలో ఐ డ్రాప్స్ వాడటం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు.దీనిని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక వ్యాధిగా మారి జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దృష్టిలోపాన్ని నిర్లక్ష్యం చేయడం.. డ్రైవర్లలో సైతం వయస్సు రీత్యా దృష్టిలోపం(సైట్) వస్తుంటుంది. అలాంటి వారు ఎంతలోపం ఉన్నప్పటికీ కళ్లజోడు తప్పనిసరిగా వాడాలి. వాడకుంటే ఈ సమస్య మరింత పెరిగి కంటి రెటీనాపై ప్రభావం చూపి అది దెబ్బతినే అవకాశం ఉంది. రెటీనా దెబ్బతినడం ద్వారా భవిష్యత్‌లో పూర్తిగా చూపు కోల్పోవాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యలతో సైతం డ్రైవర్లు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. దృష్టిలోపం విషయంలో తొలిదశలోనే కళ్లజోడు వాడాల్సిన అవసరం ఉంది. నిద్రలేమి సమస్య.. డ్రైవర్లు పగలుతో పాటు రాత్రిళ్లు సైతం డ్రైవింగ్ చేయడం వలన కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో కళ్లు మంటలు, తీవ్రమైన తలనొప్పిరావడం జరుగుతుంది. కళ్లు ఎర్రగా మారడం కూడా చూస్తుంటారు. కళ్లు ఎర్రగా మారడం కూడా ఒక సమస్యగానే గుర్తిసాం. ఇలాంటి వారిలో దృష్టిలోపాలు వచ్చే అవకాశం ఉంది. కలర్ బ్లైండ్నెస్.. డ్రైవర్లు రాత్రిళ్లు కాంతి వంతమైన లైటింగ్‌ను చూడటం వలన కలర్ బ్లైండ్నెస్కు గురయ్యే ప్రమాదం ఉంది. ఎదురుగా వచ్చిన వాహనం దాటిపోయిన తర్వాత నిమిషాల పాటు రంగులు కనిపించవు. ఈ దశలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు ఇటీవల అధ్యయనాల్లో తేలింది. కలర్ బ్లైండ్నెస్ విషయంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అప్రమత్తత అవసరం నేత్ర సమస్యలను అశ్రద్ధ చేయకూడదు. ముఖ్యంగా డ్రైవింగ్ చేసే వారు చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. డ్రైవర్లు ప్రతి ఆరునెలలకు ఓసారి కంటి పరీక్షలు చేయించుకోవడం మేలు. మావద్దకు కళ్లు మంటలు, దురదలు, కంట్లో ఏదో గుచ్చుకున్నట్లు ఉండటం వంటి సమస్యలతో ఎక్కువ మంది వస్తున్నారు. అందుకు కంటిలోని నీటిపొర ఆవిరై కళ్లు పొడారిపోవడమే కారణం. దృష్టిలోపాలను సైతం అశ్రద్ధ చేయకుండా కళ్లజోడు వాడటం ద్వారా రెటీనా(కంటినరం) దెబ్బతినకుండా చూడవచ్చు. అశ్రద్ధ చేయడం వలన అంధత్వంతో పాటు, దీర్ఘకాలిక కంటి వ్యాధులు ఉన్న వారిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.– డాక్టర్ నాదెళ్ల విష్ణువర్ధన్,చైర్మన్, శంకర నేత్ర చికిత్సాలయం -
దీపావళి వేడుకల్లో అపశ్రుతి
హైదరాబాద్: దీపావళి సందర్భంగా పలుచోట్ల అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. టపాసులు కాల్చుతున్న సమయంలో పలువురికి గాయాలయ్యాయి. కళ్లకు గాయాలైన పలువురు హైదరాబాద్‌లోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ దిపావళి సందర్భంగా అయిన కంటి గాయాలతో 15 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. వరంగల్‌కు చెందిన రాజేష్, సందీప్(మెదక్), శివ(హైదరాబాద్), సాయిగౌడ్ తీవ్రంగా గాయపడిన వారిలో ఉన్నారు. ఇంకా గాయపడిన మరికొంతమంది నగరంలోని వేరువేరు ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు. -
టపాసులు: 65 మంది చిన్నారులకు గాయాలు
హైదరాబాద్: దీపావళి పండగ నేపథ్యంలో నగరంలో టపాసులు కాలుస్తూ పలువురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఎక్కువ మందికి కంటికి గాయాలయ్యాయి. దీంతో 22 మంది చిన్నారులు సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి, 33 మంది ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి, మరో 10 మంది ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. చిన్నారులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. -
పేలిన టపాసులు
-
విషాదం నింపిన బాణసంచా.. చిన్నారులకు గాయాలు
హైదరాబాద్ : దీపావళి సందర్భంగా తగిన జాగ్రత్తలు పాటించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పిల్లలు గాయపడ్డారు. హైదరాబాద్‌లోని ఒక్క సరోజినీ కంటి ఆసుపత్రికే 18 మంది చిన్నారులు గాయాలతో వచ్చారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. శాశ్వతంగా కంటి చూపు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. చిచ్చుబుడ్డి పేలకపోవడంతో దగ్గరకి చూసేందుకు చిన్నారి ప్రయత్నించాడు. అనుకోకుండా చిచ్చుబుడ్డి ఒక్కసారిగా పేలడంతో కళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒక్క సరోజినీ కంటి ఆసుపత్రికే ఇంత మంది పిల్లలు చికిత్స కోసం రావడంతో ........రాష్ట్రవ్యాప్తంగా గాయపడ్డ చిన్నారుల సంఖ్య వందల్లో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.