Pink Eye Cases Rise In Hyderabad, No Proper Facilities In Sarojini Devi Eye Hospital - Sakshi
Sakshi News home page

Pink Eye Cases In Hyderabad: హైదరాబాద్‌లో కండ్లకలక కలవరం.. మందులు తీసుకోవడానికే 2 గంటలా?

Published Fri, Aug 4 2023 1:15 PM | Last Updated on Fri, Aug 4 2023 2:04 PM

Pink Eye Cases Rise Hyderabad Sarojini Devi Eye Hospital No Facilities - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో కండ్లకలక కేసులు కలవరం పుట్టిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం పదుల సంఖ్యలోనే వెలుగుచూసిన కేసులు తాజాగా వేలల్లో నమోదయ్యాయి. అయితే, చికిత్స కోసం వెళ్లిన బాధితులకు ఇబ్బందులు తప్పడం లేదు. హైదరాబాద్‌లోని సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో వసతులు కరువయ్యాయంటూ రోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

చికిత్స అందించే డాక్టర్ల కొరతకు తోడు.. మెడిసిన్‌ తీసుకునేందుకు కూడా పేషంట్లు బారులు తీరారు. ఆస్పత్రి యాజమాన్యం ముందస్తుగా చర్యలు చేపట్టకపోవడంతో బాధితులు ఒకేచోట గుమిగూడాల్సిన పరిస్థితి తలెత్తింది. మందులకు అందించేందుకు ఒకే కౌంటర్‌ అందుబాటులో ఉండటంతో దాదాపు 2 గంటలు లైన్‌లో వేచి ఉంటే తప్ప మెడిసిన్‌ తీసుకునే పరిస్థితి లేదు.

కాగా, వైరస్‌ లేదా బ్యాక్టీరియా వల్ల వచ్చే కండ్లకలక ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా గుంపుగా ఉన్న ప్రదేశాల్లో ఈ వ్యాధి సొందరగా ఇతరులకు సోకుతుంది. కండ్లకలకను పింక్‌ ఐ లేదా ఐ ఫ్లూ అని అంటారు. 
(చదవండి: ఆ అలవాటే కరోనా అటాక్‌కి ప్రధాన కారణం! వెలుగులోకి విస్తుపోయే నిజాలు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement