Eye hospital
-
శంకర్ నేత్రాలయ వ్యవస్థాపకుడు ఎస్ఎస్ బద్రీనాథ్ కన్నుమూత
శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు, ప్రముఖ విట్రియోరెటినల్ సర్జన్ ఎస్ఎస్ బద్రీనాథ్ కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బద్రీనాథ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు(నవంబర్ 21) తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ విషయాన్ని తమిళనాడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రామ సుగంథన్ ధృవీకరించారు. కాగా వైద్య రంగంలో ఆయన చేసిన కృషికిగానూ 1996లో భారత ప్రభుత్వం బద్రీనాథ్‌ను పద్మభూషన్ అవార్డుతో సత్కరించింది. దేశంలోనే అత్యుతమ కంటి వైద్యులుగా ఎస్ఎస్ బద్రీనాథ్ గుర్తింపు తెచ్చుకున్నారు. దేశంలోనే అతిపెద్ద స్వచ్ఛంద నేత్ర వైద్యశాలలలో ఒకటైన శంకర్ నేత్రాలయ స్థాపకుడు. విదేశాలలో విద్యనభ్యసించిన బద్రీనాథ్ అనేక అధ్యయనాలు పరిశోధనలను పూర్తి చేసి భారత్‌కు వచ్చిన తర్వాత 1978లో చెన్నైలో ఈ కంటి ఆసుపత్రిని స్థాపించారు. చాలాకాలంపాటు దీనికి ఛైర్మన్‌గా వ్యవహరించారు. My Prayers and condolences to family and friends on demise of Dr Badrinath Founder Sankar nethralaya , a premier eye care hospital in chennai and that has served many poor patients ! 🙏🏽#sankarNethralaya #eyecare pic.twitter.com/ZO6dwIImqI — 𝗥𝗮𝗺𝗮 𝗦𝘂𝗴𝗮𝗻𝘁𝗵𝗮𝗻 (வாழப்பாடி இராம சுகந்தன்) (@vazhapadi) November 21, 2023 బద్రీనాథ్ మృతిపై శంకర నేత్రాలయ సంస్థ స్పందిస్తూ.. ‘మా లెజెండ్, శంకర నేత్రాలయ స్థాపకుడు డాక్టర్ ఎస్ఎస్ బద్రీనాథ్ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. నేడు ఆయన అంత్యక్రియలు బీసెంట్ నగర్ శ్మశాన వాటికలో జరగనున్నాయి. మా నాయకుడి మరణంపై శంకర్ నేత్రాలయ సంస్థ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది’ అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. చెన్నైలో 1940 ఫిబ్రవరి 24న జన్మించిన సెంగమేడు శ్రీనివాస బద్రీనాథ్.. యుక్తవయస్సులో ఉన్నప్పుడే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయాడు. తల్లిదండ్రుల మృతి అనంతరం వచ్చిన భీమా డబ్బుతో వైద్య శాస్త్రంలో తన చదువు పూర్తి చేశారు. అనంతరం న్యూయార్క్‌లో డాక్టర్ వృత్తిని ప్రారంభించి.. అనేక నేత్ర వైద్య కేంద్రాలలో శిక్షణ పొందాడు. తిరిగి భారత్‌కు వచ్చి 1978లో డాక్టర్ బద్రీనాథ్, వైద్యుల బృందం సాయంతో చెన్నైలోని శంకర నేత్రాలయ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గాలకు ఉచిత వైద్య చికిత్సను అందించడానికి కృషి చేశారు. ఆయన స్థాపించిన శంకర నేత్రాలయ సంస్థ ప్రతిరోజూ వందల మంది పేదలకు ఉచిత వైద్య చికిత్స కేంద్రంగా మారింది. కాగా బద్రీనాథ్ సతీమణి వాసంతి పీడియాట్రిషియన్, హెమటాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. -
హైదరాబాద్‌లో కండ్లకలక కలవరం.. మందులకే 2 గంటలా?
సాక్షి, హైదరాబాద్: నగరంలో కండ్లకలక కేసులు కలవరం పుట్టిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం పదుల సంఖ్యలోనే వెలుగుచూసిన కేసులు తాజాగా వేలల్లో నమోదయ్యాయి. అయితే, చికిత్స కోసం వెళ్లిన బాధితులకు ఇబ్బందులు తప్పడం లేదు. హైదరాబాద్‌లోని సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో వసతులు కరువయ్యాయంటూ రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. చికిత్స అందించే డాక్టర్ల కొరతకు తోడు.. మెడిసిన్ తీసుకునేందుకు కూడా పేషంట్లు బారులు తీరారు. ఆస్పత్రి యాజమాన్యం ముందస్తుగా చర్యలు చేపట్టకపోవడంతో బాధితులు ఒకేచోట గుమిగూడాల్సిన పరిస్థితి తలెత్తింది. మందులకు అందించేందుకు ఒకే కౌంటర్ అందుబాటులో ఉండటంతో దాదాపు 2 గంటలు లైన్లో వేచి ఉంటే తప్ప మెడిసిన్ తీసుకునే పరిస్థితి లేదు. కాగా, వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల వచ్చే కండ్లకలక ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా గుంపుగా ఉన్న ప్రదేశాల్లో ఈ వ్యాధి సొందరగా ఇతరులకు సోకుతుంది. కండ్లకలకను పింక్ ఐ లేదా ఐ ఫ్లూ అని అంటారు. (చదవండి: ఆ అలవాటే కరోనా అటాక్‌కి ప్రధాన కారణం! వెలుగులోకి విస్తుపోయే నిజాలు!) ✅గత కొద్ది రోజులుగా కళ్ల కలక 👁️కేసులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ✅మరి ఇలాంటి సమయంలో చేయాల్సినవి, చేయకూడనివి తెలిస్తే త్వరగా నయం అవుతుంది. ✅అవేంటో కింది ఇన్ఫోగ్రాఫ్ ద్వారా తెలుసుకోండి#Conjuctivitis #HealthForAll #SwasthaBharat #EyeFlu #EyeConjuctivitis pic.twitter.com/EZ7TLH6axd — PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) August 2, 2023 కళ్ల కలక లక్షణాలు! 👁🗨కళ్ళలో నొప్పి, మంట, దురద 👁🗨కళ్ళు ఎర్రగా మారడం 👁🗨కళ్ళ నుంచి తరుచుగా నీరు కారడం 👁🗨కళ్ళు వాపు 👁🗨నిద్ర లేచిన తర్వాత కనురెప్ప అతుక్కుపోవడం 👁🗨నిర్లక్ష్యం చేస్తే కండ్ల నుంచి చీము కారడం#Conjuctivitis #HealthForAll #SwasthaBharat #EyeFlu #EyeConjuctivitis pic.twitter.com/rMmPxOdB0g — PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) August 2, 2023 -
మేడిన్ తెలంగాణ అద్దాలు
మణికొండ: రాష్ట్రంలో రెండు విడతలుగా కంటి వెలుగు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు వెల్లడించారు. రెండవ విడత కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే కోటి మందికి పరీక్షలు చేశామని చెప్పారు. కంటి అద్దాలు అవసరమైన వారికి మేడిన్ తెలంగాణ అద్దాలను పంపిణీ చేస్తున్నామని వివరించారు. శుక్రవారం మణికొండలో శ్రీ కంచి కామకోటి మెడికల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన శంకర సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రిని కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని, జిల్లాకో మెడికల్ కళాశాల, పల్లె దవాఖాన, బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ నగరం మెడికల్ హబ్‌గా మారిందన్నారు. ఎక్కడా లేని విధంగా ఇటీవల నీతి అయోగ్ ప్రకటించిన వివరాల ప్రకారం దేశంలోనే వైద్య ప్రమాణాలలో రాష్ట్రం మూడవ స్థానంలో నిలిచిందని చెప్పారు. ప్రపంచ స్థాయి ఆసుపత్రి రావటం శుభపరిణామం హైదరాబాద్‌కు మరో ప్రపంచ స్థాయి కంటి వైద్య సేవలను అందించే శంకర ఆసుపత్రి రావటం శుభ పరిణామని, తమ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. సమాజానికి శంకర కంటి ఆసుపత్రి అందిస్తున్న సేవలు అమోఘమని, ఆర్థికంగా లేని వారికి ఉచితంగా, సంపన్నులకు నామమాత్రపు రుసుములతో సేవలు అందించటం అభినందనీయమన్నారు. కంటివెలుగులో భాగంగా శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి ఈ ఆసుపత్రి తోడ్పాటునివ్వాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కోరిక మేరకు ముందుగా రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచే సేవలను ప్రారంభించాలన్నారు. శంకర ఆసుపత్రి వాహనాలను ఎలాంటి ట్యాక్స్‌లు లేకుండా మినహాయింపులు ఇస్తామని హామీనిచ్చారు. అంధత్వాన్ని తొలగించటమే లక్ష్యంగా.. దేశంలో అంధత్వాన్ని తొలగించటమే లక్ష్యంగా శంకర ఐ ఫౌండేషన్ ప్రారంభించామని, అదే మార్గంలో నిరంతరాయంగా కృషి చేస్తామని ఎస్ఈఎఫ్ యూఎస్ఏ వ్యవస్థాపకుడు మురళీ కృష్ణమూర్తి చెప్పారు. 2030నాటికి 5లక్షల మందికి ఉచిత శస్త్ర చికిత్సలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. హైదరాబాద్ కేంద్రంగా 225 పడకల ఆసుపత్రి నిర్మించేందుకు సహకరించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడి ఆసుపత్రి నిర్మాణానికి శంకర ఐ ఫౌండేషన్, ఫీనిక్స్ ఫౌండేషన్ ఐకేర్‌లు దాతలుగా నిలిచారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్, సంస్థ ప్రతినిధులు ఎస్వీ బాల సుబ్రమణ్యం, డాక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
గొప్ప మనసు చాటుకున్న ప్రశాంత్ నీల్.. గర్వంగా ఉందంటూ మాజీ మంత్రి ట్వీట్
‘కేజీయఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ గొప్ప మనసు చాటుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని నీలకంఠాపురంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి నిర్మాణానికి రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు. తండ్రి 75వ జయంతిని(ఆగస్ట్ 15) పురస్కరించుకొని ప్రశాంత్ నీల్ ఈ భారీ విరాళాన్ని అందించారని మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ విషయాన్ని రఘువీరా రెడ్డి ఎందుకు ప్రకటించాల్సి అవసరమేంటి అనుకుంటున్నారా? ఈ కేజీయఫ్ డైరెక్టర్ ఎవరో కాదు.. రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్ రెడ్డి సొంత కుమారుడే. ప్రశాంత్ నీల్ పుట్టిపెరిగింది బెంగళూరులో అయినా.. అతని స్వంత గ్రామం మాత్రం అనంతపురం జిల్లా నీలకంఠాపురం. కొద్ది రోజుల క్రితమే ప్రశాంత్‌నీల్ తండ్రి మరణించారు. నీలకంఠాపురంలోనే ఆయన అంత్యక్రియలు జరిగాయి. అందుకే ప్రశాంత్ నీత్ తరచు ఈ గ్రామానికి వస్తుంటాడు. (చదవండి: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన నటుడు సామ్రాట్ భార్య) తండ్రి 75వ జయంతి సందర్భంగా సోమవారం తండ్రి సమాధిని దర్శించుకొని నివాళులు అర్పించిన ప్రశాంత్.. అనంతరం గ్రామంలో పర్యటించారు. ప్రశాంత్ పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను మంత్రి రఘువీరారెడ్డి సోషల్ మీడియాలో పంచుకుంటూ.. ‘. నాకు, నీలకంఠాపురం గ్రామం ప్రజలకు ఇది గర్వించే క్షణం. నా సోదరుడి కుమారుడు ప్రశాంత్ నీల్ 50 లక్షల విరాళం ప్రకటించారు. ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ రెడ్డి సరిగ్గా ఇండియాకి స్వాతంత్రం వచ్చిన రోజు 1947 ఆగష్టు 15న జన్మించారు’అని రఘువీరా ట్వీట్ చేశారు. A proud&happy moment for me and to the villagers of Neelakantapuram as my nephew @prashanth_neel for his heart warming contribution of 50lakhs towards the construction of LV Prasad Eye Hospital in our Neelakantapuram on the 75th birth anniversary(15/08/1947)of his father Subhash. pic.twitter.com/UbAVtZWGnu — Dr. N Raghuveera Reddy (@drnraghuveera) August 15, 2022 -
Kotamreddy Sridhar Reddy: మాటిచ్చాడు.. కంటిచూపు తెప్పించాడు..
సాక్షి, నెల్లూరు రూరల్: ఆ యువతికి పేదరికం శాపంగా మారడంతో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఇరవై ఏళ్లుగా కంటి చూపులేక నరకం చూసింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చొరవ తీసుకోవడంతో ఆ యువతి నేడు రంగుల ప్రపంచాన్ని ఆనందంగా చూస్తోంది. వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు రూరల్ మండలం పాత వెల్లంటి గ్రామం అరుంధతీయవాడకు చెందిన బైరపోగు శీనయ్య, రత్నమ్మ కుమార్తె బి.కామక్షమ్మ (20) పుట్టుకతో అంధురాలు. జగనన్న మాట – గడపగడపకు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బాట కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఎమ్మెల్యే పాత వెల్లంటికి వెళ్లారు. అరుంధతీయవాడలో పాదయాత్ర చేస్తుండగా కామాక్షమ్మ కంటిచూపు లేదన్న విషయాన్ని తెలుసుకున్నారు. వెంటనే స్పందించి తన సొంత ఖర్చుతో ఖరీదైన వైద్యం చేయించి కంటిచూపు తెప్పిస్తాని హామీ ఇచ్చారు. ఈక్రమంలో నగరంలోని మోడరన్ ఐ హాస్పిటల్లో వైద్యులు కొద్దిరోజుల క్రితం కామాక్షమ్మ ఒక కంటికి ఆపరేషన్ చేసి కంటి చూపును తెప్పించారు. చదవండి: (రహదారులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష.. కీలక నిర్ణయాలు ఇవే..) తిరిగి రెండో కంటికి బుధవారం ఆపరేషన్ నిర్వహించగా విజయవంతమైంది. తనకు కంటి చూపు వచ్చిన వెంటనే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని చూడాలని కామాక్షమ్మ కోరారు. దీంతో రూరల్ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి ఆస్పత్రికి వెళ్లి కామాక్షమ్మను పరామర్శించారు. తనకు కంటి చూపు వస్తుందనే నమ్మకం పూర్తిగా పోయిందని ఈ నేపథ్యంలో శ్రీధర్‌రెడ్డి ఆదుకున్నారని యువతి తెలిపారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ధన్యవాదాలు తెలిపారు. ఒక్కమాటతో కొత్త జీవితాన్నిచ్చిన ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. -
కడపలో అత్యాధునిక కంటి వైద్యం
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలోని రిమ్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పుష్పగిరి కంటి ఆస్పత్రిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. తద్వారా రాయలసీమ వాసులకు అత్యాధునిక కంటి వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 10.50 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి 11.05 గంటలకు రిమ్స్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు జిల్లా కలెక్టర్‌తోపాటు పుష్పగిరి కంటి ఆస్పత్రి చైర్మన్ గోవిందారి, ప్రతినిధులు డాక్టర్ విశాల్ గోవిందారి, మెడికల్ చైర్మన్ డాక్టర్ విశ్వనాథ్, తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం 11.45 గంటలకు రిమ్స్ ఆవరణలో 2.05 ఎకరాల స్థలంలో రూ.20 కోట్లతో నిర్మించిన పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించిన సీఎం.. ఆస్పత్రిలోని రిసెప్షన్, కన్సల్టేషన్, ఆపరేషన్ థియేటర్లు, 150 పడకల బ్లాక్, తదితర విభాగాలను పరిశీలించారు. ఆయా విభాగాల గురించి కంటి ఆస్పత్రి చైర్మన్ సీఎంకు వివరించారు. ఆస్పత్రి చాలా బాగుందని ముఖ్యమంత్రి అభినందించారు. రాయలసీమ ప్రాంత ప్రజలందరికీ నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఆస్పత్రి ప్రతినిధులకు సూచించారు. 150 పడకలు.. ఏడు ఆపరేషన్ థియేటర్లు వైఎస్ జగన్ ప్రభుత్వం.. ప్రైవేటు రంగంలో సైతం వైద్యాన్ని ప్రోత్సహిస్తూ నిరుపేదలకు ఖరీదైన వైద్యాన్ని అందుబాటులోకి తెస్తోంది. సీఎం ప్రారంభించిన పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్స్టిట్యూట్లో 150 పడకలతో పాటు ఏడు అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ల సౌకర్యం ఉంది. నలుగురు నిపుణులైన కంటి వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటారు. స్థానికంగా నిపుణులైన కంటి వైద్యులు కూడా ఈ ఆస్పత్రిలో సేవలు అందించనున్నారు. రాయలసీమ జిల్లాల్లోని ప్రజల కంటికి సంబంధించిన ప్రాథమిక సమస్యలు మొదలు తీవ్ర స్థాయి సమస్యలకు సైతం ఇక్కడ వైద్య సేవలు అందిస్తారు. -
దీపావళి ఎఫెక్ట్.. బాణాసంచా పేలుస్తూ 31 మందికి గాయాలు
-
అశ్విని నేత్రాలయంతో మ్యాక్సివిజన్ జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంటి వైద్య సేవల సంస్థ మ్యాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్ తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేటకి చెందిన డాక్టర్ ఏఏవీ రామలింగా రెడ్డి సంస్థ అశ్విని నేత్రాలయంతో చేతులు కలిపింది. జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది. ఇది మ్యాక్సివిజన్ డాక్టర్ రామలింగా రెడ్డి ఐ హాస్పిటల్స్ పేరిట కార్యకలాపాలు సాగించనున్నట్లు ఆదివారమిక్కడ విలేకరుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మ్యాక్సివిజన్ చైర్మన్ జీఎస్కే వేలు వెల్లడించారు. ఈ ఏడాది ఆఖరు నాటికి మాచర్ల, గుంటూరులో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని, వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాత ప్రకాశం జిల్లాలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ప్రముఖ నేత్ర వైద్యుడు శరత్ బాబు చిలుకూరితో కలిసి శరత్ మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ పేరిట ఈ తరహాలో తెలంగాణ వ్యాప్తంగా జేవీ కింద ఐ కేర్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వేలు చెప్పారు. ప్రస్తుతం తమకు సుమారు 20 పైచిలుకు సెంటర్స్ ఉన్నాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీటిని 50 దాకా పెంచుకోనున్నామని ఆయన తెలిపారు. మరోవైపు, జేవీ విధానం కారణంగా నిర్వహణ, వ్యాపార విస్తరణను నిపుణులకు అప్పగించి, వైద్యులు ప్రధానంగా వైద్య సేవలపై మరింతగా దృష్టి పెట్టేందుకు వీలవుతుందని మ్యాక్సివిజన్ వ్యవస్థాపక మెంటార్ కాసు ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కూడా తమ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇది తోడ్పడగలదని రామలింగా రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణలో కొత్తగా మరో 6 జిల్లాల్లోకి విస్తరించనున్నట్లు శరత్ బాబు పేర్కొన్నారు. -
శరత్ మ్యాక్సివిజన్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంటి వైద్య రంగంలో ఉన్న మ్యాక్సివిజన్.. వరంగల్ కేంద్రం గా కార్యకలాపాలు సాగిస్తున్న శరత్ లేజర్ ఐ హాస్పిటల్‌ను కొనుగోలు చేసింది. అలాగే ఇరు సంస్థలు కలిసి శరత్ మ్యాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్ పేరుతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశాయి. ఈ జేవీలో మ్యాక్సివిజన్కు 51%, శరత్‌కు 49% వాటా ఉంటుంది. 2021 నాటికి జేవీ కింద 15 ఆసుపత్రులను స్థాపిస్తామని మ్యాక్సివిజన్ చైర్మన్ జీఎస్కే వేలు వెల్లడించారు. శరత్ లేజర్ ఐ హాస్పిటల్ ఫౌండర్ శరత్ బాబు చిలుకూరి, మ్యాక్సివిజన్ ఫౌండర్ మెంటార్ కాసు ప్రసాద్ రెడ్డితో కలిసి బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. బీఎస్సీ ఆప్టోమెట్రీ కోర్సులకు ఆప్టోమెట్రీ కళాశాలలను వరంగల్, హైదరాబాద్‌లో అందుబాటులోకి తెస్తామన్నారు. -
శరత్ ఐ హాస్పిటల్స్ని కొనుగోలు చేసిన మ్యాక్సి విజన్
-
‘ప్రైవేటు’లో ఎస్సై ఫిట్నెస్ సర్టిఫికెట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సై పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల్లో వరంగల్ రీజియన్ పరిధిలోని జిల్లాలకు చెందిన అభ్యర్థులకు వరంగల్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కంటి సామర్థ్య పరీక్షలు నిర్వహించడం వివాదాస్పదమైంది. ఈ పరీక్షలను వరంగల్‌లోని ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి నిర్వహించి ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేయాల్సి ఉండగా తమ వద్ద తగిన వసతులు, పరికరాలు లేవంటూ ఒక ప్రైవేటు ఆసుపత్రికి బాధ్యత అప్పగించింది. దీన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. నిబంధనలు అతిక్రమించిన ప్రాంతీయ కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను మందలించింది. ఆయా ఎస్సై అభ్యర్థులను తక్షణమే హైదరాబాద్‌లోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి పంపాలని వైద్యవిద్య సంచాలకుడు (డీఎంఈ) రమేశ్‌రెడ్డి శనివారం ఆదేశించారు. ఇప్పటివరకు ఎంత మంది ఎస్సై అభ్యర్థులకు ప్రైవేటు ఆసుపత్రిలో కంటి సామర్థ్య పరీక్షలు నిర్వహించారన్న దానిపై ఆయన విచారణ చేపట్టారు. ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో కంటి సామర్థ్యాన్ని గుర్తించే పరికరాలు లేవా? ఒకవేళ లేకుంటే ఆ విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు? నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు కంటి ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించేందుకు ఎందుకు అనుమతించారన్న దానిపై డీఎంఈ విచారణ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయం కూడా వివరాలు తెప్పించుకుంది. మంత్రికి కూడా పలువురు ఫిర్యాదులు చేశారు. దీంతో ఆయన కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఇటీవల దాదాపు 1,200 మంది ఎస్సై పోస్టులకు ఎంపికవగా వారికి ప్రస్తుతం దేహదారుఢ్య, కంటి సామర్థ్య పరీక్షలు జరుగుతున్నాయి. అభ్యర్థుల్లో ఎవరికైనా కేన్సర్, గుండె జబ్బులుంటే వారిని ఎస్సై పోస్టుకు ఎంపిక చేసే అవకాశాలు తక్కువ. అలాగే దృష్టిలోపాలు ఉన్న వారిని ఎస్సై పోస్టుకు ఏమాత్రం ఎంపిక చేయరు. ఈ పరీక్షలను తప్పనిసరిగా నిర్ణీత ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేయాలి. ప్రభుత్వ వైద్యులే ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాలి. ఈ నేపథ్యంలో వరంగల్‌లోని ప్రాంతీయ కంటి ఆసుపత్రి నిర్వాహకులు కావాలనే చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. -
నిర్లక్ష్యపు పొర కమ్మేసింది!
కర్నూలు(హాస్పిటల్): కర్నూలులోని ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రి రాయలసీమలోనే అతి పెద్దది. పెద్ద పెద్ద డాక్టర్లు, వైద్య విద్యార్థులు, అంతే స్థాయిలో నర్సులు ఉన్నా బాధితులకు సరైన వైద్యం అందడం లేదు. ఇక్కడికి వచ్చే వారికి తూతూ మంత్రంగా వైద్యం అందించి ఆపరేషన్లు వాయిదా వేయడంతో ప్రజలు నాటు వైద్యంవైపు చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇలా నాటు వైద్యాన్ని చేయించుకునేందుకు వెళ్లిన వారిలో ఆదివారం రోడ్డు ప్రమాదానికి గురై తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. కర్నూలులో ఉన్న ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి రాయలసీమ ప్రాంతానికే తలమానికం. నాలుగు యూనిట్లలో నలుగురు ప్రొఫెసర్లు, నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 8 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 10 మంది వరకు పీజీ వైద్యులు, 30 మంది వరకు పారా మెడికల్ సిబ్బంది ఈ విభాగం సొంతం. అన్ని రకాల కంటి సమస్యలకు ఇక్కడ అధునాతన వైద్యం లభిస్తుందని ఆశించి దూర ప్రాంతాల నుంచి పేదలు చికిత్స కోసం వస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీలో వైద్యులు చికిత్స చేస్తుండగా, ఆ మరుసటి రోజున అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేస్తారు. ప్రతి ఆపరేషన్ థియేటర్ రోజున ఒక్కో యూనిట్ పాల్పంచుకుంటుంది. దాదాపుగా అన్ని రకాల కంటి జబ్బులకూ ఇక్కడ వైద్యం చేసేందుకు పదేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక వైద్య పరికరాలు కొనుగోలు చేసి పంపించింది. ఇటీవల సైతం డీఎంఈ కార్యాలయం నుంచి వైద్యపరికరాలు వచ్చాయి. ఇలాంటి స్థితిలో అత్యాధునిక పద్ధతిలో వైద్యం చేయాల్సిన బాధ్యత ఇక్కడి వైద్యబృందంపై ఉంది. తూతూ మంత్రంగా ఆపరేషన్లు.. ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి స్థాయిని సాధించిన ఈ ఆసుపత్రిలో అత్యధికంగా కంటి శుక్లాల ఆపరేషన్లు మాత్రమే నిర్వహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇతర కంటి జబ్బులు, కంటి గాయాలకు అత్యాధునిక పద్ధతిలో శస్త్రచికిత్సలు చేసే అవకాశం ఉన్నా ఇక్కడి వైద్యులు పెద్దగా స్పందించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. రోజుకు 5 నుంచి 10లోపు ఆపరేషన్లు మాత్రం చేస్తూ చేతులు దులుపుకుంటున్నారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగా ఆసుపత్రిలోని మంచాలు నిత్యం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. విసిగి వేసారి నాటు వైద్యం వైపు ! ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేస్తారని ఎంతో ఆశగా వస్తున్న రోగులకు ఇక్కడ నిరాశే ఎదురవుతోంది. రోగులను పరీక్షించిన వైద్యులు మందులు ఇచ్చి మళ్లీ రావాలంటూ తిప్పి పంపిస్తున్నారు. ఇలా నాలుగైదు సార్లు తిరిగి వేసారిన రోగులు చివరకు నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు, సి. బెళగల్, కర్నూలు రూరల్ గ్రామాల ప్రజలు ఇటీవల నాటు వైద్యం వైపు చూస్తున్నారు. మహానందిలో దేవాలయం వద్ద ఓ వ్యక్తి కంట్లో పసురు వేస్తే కంట్లో పొర పోతుందన్న ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఆటోలను మాట్లాడుకుని రోగులు మహానందికి వెళ్లి వస్తున్నారు. ఇలా వెళ్లి ఆదివారం ఉదయం సోమయాజులపల్లి గ్రామం వద్ద వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఇందులో 9 మంది చనిపోగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే మెరుగైన వైద్యం అందితే తాము నాటు వైద్యం కోసం ఎందుకు వెళ్తామని క్షతగాత్రులు ప్రశ్నిస్తున్నారు. -
కంటి ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం
-
కంటి ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం
విజయవాడ: సూర్యారావుపేటలో ఉన్న శ్రీదేవి కంటి ఆసుపత్రిలో బుధవారం వేకువజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ప్రమాదం విషయం తెలిసి అగ్నిమాపక సిబ్బంది 3 ఫైరింజన్లతో సంఘటనాస్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. -
కంటి ఆస్పత్రి ఖాళీ
- ‘సరోజినీ’లో చికిత్సకు ముందుకు రాని రోగులు సాక్షి, హైదరాబాద్: ఆపరేషన్లు వికటించిన విషయం వెలుగుచూడడంతో రోగులు సరోజినీదేవి కంటి ఆస్పత్రికి వెళ్లేందుకు జంకుతున్నారు. క్యాటరాక్ట్ శస్త్రచికిత్స వికటించి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఐదుగురు బాధితులు మినహా ఇన్‌పేషెంట్ వార్డుల్లో మరెవరూ కన్పించడం లేదు. ఆస్పత్రి చరిత్రలో ఈ పరిస్థితి ఎన్నడూ తలెత్తలేదు. కంటిచూపు మందగించడంతో గతనెల 30న ఆస్పత్రిలో 21 మంది క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకోగా.. వారిలో ఏడుగురు కంటిచూపును కోల్పోయిన విషయం తెలిసిందే. కళ్లను శుభ్రం చేసే రింగర్ లాక్టిటెట్(ఆర్ఎల్) సెలైన్ బాటిల్లోనే కాకుండా ఆపరేషన్ థియేటర్లోని వైద్య పరికరాల్లో కూడా బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉందని భావించిన అధికారులు ఈ నెల 1న ఎమర్జెన్సీ మినహా మిగిలిన ఏడు ఆపరేషన్ థియేటర్లను కూడా మూసేశారు. గత ఏడు రోజుల నుంచి ఎమర్జెన్సీకి వచ్చిన ఒకట్రెండు కేసులు మినహా.. ఇతర శస్త్రచికిత్స లేవీ జరగడం లేదు. రోగుల్లో సన్నగిల్లిన నమ్మకం సరోజినీదేవి కంటి ఆస్పత్రికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రోగులు వస్తుంటారు. రోజుకు సగటున 800 మంది వస్తుంటారు. 540 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రి ఇన్‌పేషెంట్ వార్డుల్లో నిత్యం 350-400 మంది చికిత్స పొందుతుంటారు. రోజుకు సగటున 70-80 మంది కొత్త పేషెంట్లు అడ్మిట్ అవుతారు. రోజుకు 40-50 శస్త్ర చికిత్సలు జరుగుతుంటాయి. అయితే ఆపరేషన్లు వికటించిన నేపథ్యంలో గురువారం అత్యవసర విభాగం సహా ఓపీ, ఐపీ వార్డులన్నీ రోగుల్లేక ఖాళీగా దర్శనమిచ్చాయి. ఇన్‌పేషెంట్ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులకు కూడా వైద్యులపై నమ్మకం సన్నగిల్లింది. తమను ఇక్కడి నుంచి ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి షిఫ్ట్ చేయాలని బాధితుడు అంజిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అయితే ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న రోగులకు ఇప్పటివరకు చేయాల్సినదంతా చేస్తున్నామని, బయటి నుంచి నిపుణులను పిలిపించాల్సిన అవసరం లేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేందర్గుప్తా పేర్కొన్నారు. నిలోఫర్‌లో ‘ఫంగస్’ సెలైన్ బాటిళ్లు తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్ఎంఎస్ఐడీసీ) సరఫరా చేసిన రింగర్ లాక్టిటెట్(ఆర్ఎల్) సెలైన్ వాటర్ బాటిల్లో ‘క్లెబ్సియల్లా’ బ్యాక్టీరియా ఉన్నట్లు సరోజినీదేవి ఉదంతంతో తేలిన సంగతి తెలిసిందే. అదే కంపెనీకి చెందిన సెలైన్ బాటిల్లో ఫంగస్ ఉన్నట్టు వారం రోజుల కిందటే నిలోఫర్ చిన్నపిల్లల ఆసుపత్రి వైద్యులు గుర్తించారు. దానిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ టీఎస్ఎంఐడీసికి లేఖ రాసినా అధికారులు స్పందించలేదు. తాజాగా సరోజినీదేవి ఆసుపత్రిలో బ్యాక్టీరియా వెలుగుచూడడంతో డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు గురువారం హడావుడిగా నిలోఫర్ ఆసుపత్రికి చేరుకొని 29 వేల సెలైన్ బాటిళ్లను సీజ్ చేశారు. ఈ ఆసుపత్రికి 38 వేల సెలైన్ బాటిళ్లు సరఫరా చేయగా.. వాటిలో ఇప్పటికే 9 వేల బాటిళ్లు ఉపయోగించారు. కంపెనీని వదిలి.. డాక్టర్లపై చర్యలా: టీజీడీఏ సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో చోటు చేసుకున్న ఘటనకు వైద్యులను బాధ్యులుగా చేయడం తగదని తెలంగాణ వైద్యుల సంఘం( టీజీడీఏ) ఉస్మానియా యూనిట్-2 ప్రతినిధులు డాక్టర్ రవీందర్‌గౌడ్, డాక్టర్ నరహరి, డాక్టర్ లాలూ ప్రసాద్, డాక్టర్ వినోద్‌కుమార్ లు స్పష్టంచేశారు. సరఫరా చేసిన కంపెనీని, నాణ్యతను పరిశీలించకుండా కొనుగోలు చేసిన టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులను వదిలి వైద్యులపై చర్యలు తీసుకోవాలని చూడటం సమంజసం కాదన్నారు. మందుల కొనుగోళ్లు, వాటి నాణ్యతపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
ఎవరి నిర్లక్ష్యమిది!
సర్కారీ ఆసుపత్రుల అధ్వాన్న స్థితిగతుల గురించి, అక్కడ పేద రోగులకు ఎదుర వుతున్న సమస్యల గురించి... అవి ప్రాణాపాయానికి దారితీస్తున్న తీరు గురించి తరచుగా వింటూనే ఉన్నాం. కానీ ఉన్నతశ్రేణి ఆసుపత్రిగా పేరున్న సరోజినీదేవి కంటి ఆస్పత్రి సైతం అందుకు భిన్నంగా లేదని మరోసారి రుజువైంది. కంటి శుక్లాలకు చికిత్స చేయించుకుందామని వెళ్లిన 13మందికి ఇన్ఫెక్షన్ సోకగా... వారిలో ఏడుగురికి ఏకంగా చూపే కరువైందని బుధవారం వెల్లడైన వైనం అందరినీ దిగ్భ్రాంతిపరిచింది. సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో ఈ మాదిరి ఘటన చోటు చేసుకోవడం ఇది మొదటిసారేమీ కాదు. ఇదే ఆసుపత్రిలో ఆరేళ్లక్రితం కంటి శుక్లాల ఆపరేషన్లు జరిగిన ఏడుగురు కంటిచూపు కోల్పోయారు. తాజా ఉదంతంలో తమ తప్పేమీ లేదని, శస్త్ర చికిత్స అనంతరం కళ్లను శుభ్రం చేయడానికి ఉపయోగించిన సెలైన్ బాటిళ్లలో క్లెబ్సియల్లా బాక్టీరియా ఉండటమే ఇందుకు కారణమని వైద్యులు సంజాయిషీ ఇస్తున్నారు. అటు వాటిని ఉత్పత్తి చేసిన సంస్థ, ఆ బాటిళ్లను కొనుగోలు చేసి ఆసుపత్రులకు సరఫరా చేసిన తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్ఎంఎస్ఐడీసీ) సైతం ఇలాగే చెబుతున్నాయి. అసలు ఇప్పుడు వెల్లడైన 13 కేసుల్లోనే ఇలా జరిగిందా...లేక అదే ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న ఇతరుల్లో ఎవరికైనా ఇలాంటి సమస్యలు తలెత్తాయా అన్నది స్పష్టంగా తెలియదు. ఎందుకంటే ఈ ఆసుపత్రికి వచ్చేవారిలో సాధారణంగా ఎక్కువమంది మారుమూల గ్రామాలనుంచి వచ్చే నిరుపేదలు, దిగువ మధ్య తరగతివారు. శస్త్ర చికిత్స చేయించుకుని ఇంటికెళ్లాక సమస్యలేమైనా తలెత్తితే మళ్లీ హైదరాబాద్ నగరం రావడమన్నది వారికి కష్టం. లోపం తలెత్తితే తాము మందులు సరిగా వాడనందువల్ల జరిగిందనుకుంటారు. స్థానిక వైద్యులను ఆశ్రయిస్తే సరిపోతుందన్న ధోరణిలో ఉంటారు. ఇటు ఆసుపత్రి రికార్డుల్లో నమోదు చేసే అరకొర వివరాలు ఇలాంటి సందర్భాలు తలెత్తినప్పుడు ఏమేరకు ఉపయోగపడతాయో చెప్పలేం. సరోజినీదేవి కంటి ఆసుపత్రి దేశంలోనే పేరెన్నికగన్నది. రెండు తెలుగు రాష్ట్రా ల్లోనూ కంటి వైద్యంలో అగ్రశ్రేణి సంస్థ. ఆ రంగంలో నిష్ణాతులుగా ఖ్యాతి పొందిన డాక్టర్ శివారెడ్డి వంటివారు దానికి నేతృత్వంవహించారు. అక్కడ ఏటా వేల సంఖ్యలో శస్త్ర చికిత్సలు జరుగుతుంటాయి. అలాంటిచోట ఈ మాదిరి ఉదంతాలు చోటు చేసుకోవడం ఆ సంస్థకు మాత్రమే కాదు... ప్రభుత్వానికి కూడా తలవంపులు తెచ్చేదే. ఇప్పుడు ఇన్ఫెక్షన్కు కారణమైన క్లెబ్సియెల్లా బాక్టీరియా ఆసుపత్రి వైద్యులు చెబుతున్నట్టు సెలైన్ బాటిళ్ల ద్వారానే సోకిందా లేక ఇతరేతర మార్గాల ద్వారా రోగులకు సోకిందా అన్నది స్పష్టంగా చెప్పలేమని నిపుణులంటున్న మాట. దేనికీ లొంగని ‘సూపర్‌బగ్’గా గుర్తించిన ఈ బాక్టీరియా దాదాపు అన్ని ఆసుపత్రులలోనూ ఉంటుందని, దీనివల్ల రోగులకు కంటి ఇన్ఫెక్షన్లే కాక ఊపిరితిత్తులు, మెదడు తదితర భాగాలకు కూడా ప్రాణాంతక వ్యాధులు సోకుతున్నాయని వారంటున్నారు. ఈ బాక్టీరియాపై సాధారణ యాంటీబయా టిక్స్ కూడా పనిచేయవని చెబుతున్నారు. ఇప్పుడు వెల్లడైన ఉదంతంతోపాటే తమ తప్పేమీలేదని వెను వెంటనే ప్రకటించుకున్న ఆసుపత్రి బాధ్యులు ఈ విషయంలో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్నేళ్లక్రితం ఇదే ఆసుపత్రిలో శస్త్రచికిత్సలో ఉపయోగించే ఉపకరణాలను తగిన రీతిలో పరిశుభ్రం చేయకపోవడంవల్ల ముగ్గురికి ఇన్ఫెక్షన్ సోకి చూపు కోల్పోయారని ఒక విచారణలో తేల్చారు. అందుకు కారకుడని తేల్చిన వార్డ్ బాయ్ క్షయరోగి అని కూడా అనంతరకాలంలో బయటపడింది. ఒక ఆసుపత్రిలో ఈ పరిస్థితి తలెత్తడమే ఆశ్చర్యకరంకాగా ఆ తదనంతరమైనా అలాంటివి పునరావృతం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారన్నది ప్రస్తుత ఉదంతం నేపథ్యంలో సమీక్షించు కోవాలి. ఆసుపత్రి ప్రాంగణంతోపాటు శస్త్రచికిత్సలు నిర్వహించే గదుల్లో గోడలు, ఫ్లోరింగ్ మొదలుకొని ట్రాలీలు, మైక్రోస్కోప్ లువంటి ఇతరత్రా ఉపకరణాలు సైతం లోపరహితంగా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒక సీసాలోని ద్రావణాన్ని పలుమార్లు తీయడం, వేర్వేరు రోగులకు ఉపయోగించడం లాంటి అలవాట్లవల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని చెబుతారు. వీటన్నిటి విషయంలో ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అని చూసే నిరంతర నిఘా వ్యవస్థ మన దగ్గర లేదు. ఫిర్యాదు లొచ్చిన సందర్భాల్లోనే తనిఖీలుంటున్నాయి తప్ప ఎప్పటికప్పుడు దాన్ని చూసేవారు ఉండటం లేదు. సరోజినీదేవి ఆసుపత్రి ఉదంతం వెల్లడయ్యాక గురువారం హైదరాబాద్ నగరంలోని నిలోఫర్ ఆసుపత్రిలో జరిపిన తనిఖీలో 29,000 కల్తీ సెలైన్ బాటిళ్లు, కల్తీ ఇంజక్షన్లు బయటపడ్డాయి. ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేసే ఔషధాల్లో నాణ్యత సరిగా ఉండటం లేదన్న ఫిర్యాదులు ఈనాటివి కాదు. అడిగేవారు లేరన్న ధైర్యంతోనే ఇలా జరుగుతున్నదని నిపుణులంటున్నారు. సగటున భారత్‌లో లభించే ఏడు ఔషధాల్లో ఒకటి కల్తీదేనని రెండు అంతర్జాతీయ జర్నల్స్ వెల్లడిం చాయి. మార్కెట్లో చలామణిలో ఉన్న ఔషధాల్లో 4.5 శాతం నాసిరకమైనవని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ) ఆమధ్య తెలియజేసింది. ఇందులో సింహభాగం ప్రభుత్వాసు పత్రులకు చేరుతున్నాయన్న విషయంలో ఎవరికీ అనుమానం అక్కరలేదు. ఎందుకంటే ఆసుపత్రులకు సరఫరా అయ్యే మందులైనా, ఇతర ఉపకరణాలైనా కొనుగోలు చేసే బాధ్యతను చూసే సంస్థల్లో వైద్యులకు లేదా ఆసుపత్రుల సూప రింటెండెంట్లకు చోటుండటం లేదు. ఆ సంస్థల్లో ఇంజనీర్ల పెత్తనం నడుస్తున్నదని చెబుతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణా అంతే. కాంట్రాక్టుకిచ్చి చేతులు దులుపు కుంటున్నారు. ఇలాంటి అపసవ్య, అస్తవ్యస్థ పరిస్థితులే రోగుల ప్రాణాలు తీస్తు న్నాయి. ప్రాణాంతకమైన వ్యాధులు కలగజేస్తున్నాయి. ఎలుకలు కొరికి, చీమలు కుట్టి ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు ఎవరూ మరిచిపోలేదు. సరోజినీ దేవి ఆసుపత్రి ఉదంతంతోనైనా ప్రభుత్వాలు మేల్కొని దీన్నంతటినీ సరిచేయాలి. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి. -
కన్నీటి ఆసుపత్రి
-
తోటి విద్యార్థులే వేటకొడవళ్లతో నరికి చంపారు
-
తోటి విద్యార్థులే వేటకొడవళ్లతో నరికి చంపారు
అనంతపురం జిల్లా: రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుతున్న తోటి విద్యార్థిని చూసి ఓర్వలేక పవన్‌కుమార్(18) అనే వ్యక్తిని తోటి విద్యార్థులే కిరాతకంగా హతమార్చారు. జిల్లాలోని సూర్యానగర్ కంటి ఆసుపత్రి వద్దపవన్‌ను వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. కొన ఊపిరితో ఉన్న పవన్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ మరణించాడు. జిల్లాలోని బోయవీధికి చెందిన తలారి నగేష్‌తో పాటు మరో ఆరుగురు ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అవకాశాల వేదిక.. ఆప్టోమెట్రీ
దేశంలో హెల్త్ కేర్ రంగంలో విస్తృత అవకాశాలు కల్పిస్తున్న మరో రంగం ఆప్టోమెట్రీ. కళ్లలో ఏర్పడే సమస్యలను గుర్తించడం, సంబంధిత పరీక్షలను నిర్వహించడం, తగిన చికిత్సను సూచించడం వంటి అంశాలను అధ్యయనం చేసే శాస్త్రమే ఆప్టోమెట్రీ. కంటి ఆసుపత్రుల్లో నేత్ర వైద్యులకు అనుబంధంగా సేవలు అందించటంలో ఆప్టోమెట్రీషియన్ల పాత్ర ఎంతో కీలకం. అవసరాలకు సరిపడ మానవవనరులు లేకపోవడంతో ఇటీవలి కాలంలో ఈ కోర్సుకు చాలా డిమాండ్ ఏర్పడింది. దాంతో కోర్సు పూర్తయిన వెంటనే జాబ్ గ్యారంటీ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఆప్టోమెట్రీ కెరీర్‌పై ఫోకస్.. ఆప్టోమెట్రీ అనే పదం గ్రీకు భాష నుంచి వచ్చింది. ‘ఆప్టోస్’ అంటే కళ్లు లేదా చూపు, ‘మెటీరియా’ అంటే కొలత అని అర్థం. కంటి ఆసుపత్రుల్లో నేత్ర వైద్యులకు అనుబంధంగా సేవలు అందించే వృత్తి నిపుణులను ఆప్టోమెట్రీస్ట్స్‌గా వ్యవహరిస్తారు. ఒక అంచనా మేరకు దేశంలో ప్రతి రెండులక్షల జనాభాకు ఒక ఆప్టోమెట్రీషియన్ ఉన్నాడు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే ఇది చాలా స్వల్పం. అమెరికా, యూరోపియన్ దేశాల్లో ప్రతి 10 వేల మంది జనాభాకు ఒక ఆప్టోమెట్రీషియన్ ఉన్నాడు. పెరుగుతున్న జనాభా, అవసరాల దృష్ట్యా దేశంలో నేడు రెండు లక్షల మంది క్వాలిఫైడ్ ఆప్టోమెట్రీషియన్ల అవసరం ఉంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఆప్టోమెట్రీ రంగం 20 శాతం మేర విస్తరిస్తోంది. దాంతో ఆమేరకు అవకాశాలు అధికమవుతున్నాయి. ప్రవేశం ఇలా: ఆప్టోమెట్రిక్ రంగానికి సంబంధించి విభిన్న కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిని అభ్యసించడం ద్వారా ఈ రంగంలోకి ప్రవేశించవచ్చు. దేశంలో ఆప్టోమెట్రీకి సంబంధించి అందుబాటులో ఉన్న కోర్సులు.. బీఎస్సీ ఆనర్స్ ఇన్ ఆఫ్తాల్మిక్ టెక్నిక్స్, డిప్లొమా ఇన్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్, బ్యాచిలర్ ఇన్ క్లినికల్ ఆప్టోమెట్రీ, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆప్టోమెట్రీ. వీటికి అర్హత 10వ తరగతి/ఇంటర్మీడియెట్ (సెన్సైస్). ఉన్నత విద్య విషయానికొస్తే..ఆప్టోమెట్రీలో బ్యాచిలర్ కోర్సు తర్వాత పీజీ చేయవచ్చు. ఇందుకు సంబంధించి ఎంఆప్ట్, ఎంఫిల్, ఎంఎస్, పీహెచ్డీ కోర్సులను ఎంచుకోవచ్చు. అమెరికాలో ఓడీ (డాక్టర్ ఆఫ్ ఆప్టోమెట్రీ) కోర్సు చేయవచ్చు. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ: ఇగ్నో... ఫెడరేషన్ ఆఫ్ ఆఫ్తాల్మిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్స్ సహకారంతో బీఎస్సీ (ఆనర్స్) ఇన్ ఆప్టోమెట్రీ అండ్ ఆఫ్తాల్మిక్ టెక్నిక్స్ కోర్సును నిర్వహిస్తుంది. అర్హత: 45 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ). ప్రతి ఏడాది జూన్ నుంచి అకడెమిక్ సెషన్ ప్రారంభమవుతుంది. ఇందుకోసం డిసెంబర్ నుంచి మే 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హత కోర్సులో సాధించిన మార్కులు (90 శాతం వెయిటేజీ), ఇంటర్వ్యూ(10 శాతం వెయిటేజీ) ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. థియరీ క్లాసులను ఇగ్నో నిర్వహిస్తుంది. ప్రాక్టికల్స్ మాత్రం సంబంధిత ఐ హాస్పిటల్స్/ఐ రీసెర్చ్ సెంటర్స్/ ఐ ఇన్స్టిట్యూట్లలో ఉంటాయి. వివరాలకు: www.ignou.ac.in మన రాష్ట్రంలో: మన రాష్ట్రంలో ఆప్టోమెట్రీకి సంబంధించి డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ టెక్నీషియన్ (డీఓఎం), డిప్లొమా ఇన్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ (డీఓఏ), బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆప్టోమెట్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వివరాలు.. డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ టెక్నీషియన్: ఈ కోర్సుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో కలిపి 614 సీట్లు ఉన్నాయి. డిప్లొమా ఇన్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్: ఈ కోర్సుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో కలిపి 1,781 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అర్హత: ఇంటర్మీడియెట్(బైపీసీ). సీట్లకు సరిపడ విద్యార్థులు లేనిపక్షంలో ఎంపీసీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. అడ్మిషన్ నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం సాధారణంగా జూన్/జూలై నెలలో వెలువడుతుంది. ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు కౌన్సెలింగ్ ద్వారా ఈ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తుంది. వివరాలకు: www.appmb.org బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఆప్టోమెట్రీ: మన రాష్ట్రంలో ఈ కోర్సును బిట్స్-పిలానీ సహకారంతో ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్‌కు చెందిన బాస్క్ అండ్ లాంబ్ స్కూల్ అందిస్తోంది. వ్యవధి: నాలుగేళ్లు. అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ (బైపీసీ/ఎంపీసీ). అడ్మిషన్ ప్రక్రియ జూలైలో ఉంటుంది. ఈ ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేస్తున్న ఇతర కోర్సులు.. ఆప్టోమెట్రీ ఇంటర్న్‌షిప్: మూడేళ్ల ఆప్టోమెట్రీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పిస్తుంది. ఆప్టోమెట్రీ ఫెలోషిప్: బీఎస్సీ-ఆప్టోమెట్రీ అర్హత ఉన్న విద్యార్థులకు ఏడాది ఫెలోషిప్, డిప్లొమా ఉన్న విద్యార్థులకు రెండేళ్ల ఫెలోషిప్ అందజేస్తున్నారు. విజన్ టెక్నిషియన్ కోర్సు: అర్హత: 10+2. ఏడాదికి రెండు సార్లు.. ఫిబ్రవరి, ఆగస్ట్‌లలో అడ్మిషన్ ప్రక్రియ ఉంటుంది. వివరాలకు: http://education.lvpei.org భారత్ సేవక్ సమాజ్(బీఎస్ఎస్-కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత సంస్థ) ఒకేషనల్ ఎడ్యుకేషన్ సంస్థ ఆప్టోమెట్రీ, ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ కోర్సులను అందిస్తోంది. ఈ కోర్సులకు 10వ తరగతి ఉత్తీర్ణత చాలు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఆప్టోమెట్రీ, ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ కోర్సులు చేసిన అభ్యర్థులకు మంచి డిమాండ్ ఉంది. చిన్నచిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రాధమిక కంటి ఆసుపత్రులు, ఆప్టికల్స్ షోరూంలను నిర్వహించడం ద్వారా స్వయం ఉపాధి పొందొచ్చు. నెలకు కనీసం రూ.15వేలకు పైగా సంపాదించవచ్చు. ఏపీ పారా మెడికల్ బోర్డు నిర్వహించే ఆప్టోమెట్రీ, ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ కోర్సులకు సాధారణంగా ప్రతి జూన్ రెండో వారంలో నోటిఫికేషన్ వెలువడుతుంది. ఏపీ పారా మెడికల్ బోర్డు ద్వారా కోర్సులు చేసిన వారికి మన రాష్ట్రంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్య కళాశాలలో తప్పనిసరిగా ఆప్టోమెట్రీ, ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ పోస్టులను ఏర్పాటు చేయాలి. ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్లు స్కూల్ ఐ హెల్త్ సర్వే, మొబైల్ ఐ క్యాంపులు, కేటరాక్ట్ స్క్రీనింగ్ చేయడంతోపాటు రిఫ్రాక్స్నిస్టుగా పనిచేయవచ్చు. - డాక్టర్ కోలా విజయ్‌శేఖర్ అసోసియేట్ ప్రొఫెసర్, సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల. అవకాశాలు ఒక్క భారతదేశంలోనే దాదాపు కోటిమందికి అంధత్వమున్నట్లు అంచనా. వీటిలో దాదాపు 80 శాతం అంధత్వ సమస్యలను శిక్షణ పొందిన నిపుణుల సేవలు, ప్రాథమిక వసతులు కల్పించడం ద్వారా ప్రారంభస్థాయిలోనే నివారించవచ్చు. ఈ నేపథ్యంలో ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ సేవలు ఎంతో కీలకమైనవి. కాబట్టి ఆప్టోమెట్రీ రంగంలో కోర్సులు పూర్తి చేసిన వారికి వెంటనే ఉపాధి ఖాయమని చెప్పొచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్‌గా కెరీర్ మొదలు పెట్టొచ్చు. తర్వాత అర్హత, అనుభవం ఆధారంగా సొంతంగా క్లినిక్ ప్రారంభించవచ్చు. ఐ హాస్పిటల్స్, ఐ బ్యాంక్స్, కంటాక్ట్ లెన్స్-ఆఫ్తాల్మిక్ పరిశ్రమలు, ఆప్టికల్ షో రూమ్స్, ఐ-కేర్ సంబంధిత ప్రొడక్ట్స్‌ను తయారు చేసే సంస్థలు వీరికి కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి. ఆసక్తి ఉంటే సంబంధిత కోర్సులను ఆఫర్ చేసే ఇన్స్టిట్యూట్లలో ఫ్యాకల్టీగా కూడా స్థిరపడొచ్చు. ఒకప్పటిలా కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా మండల కేంద్రాల్లోను ఐ హాస్పిటల్స్ విస్తరిస్తున్నాయి. అంతేకాకుండా ఈ రంగంలోకి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు కూడా ప్రవేశించడం.. సదరు అభ్యర్థులకు డిమాండ్‌ను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో సంబంధిత వైద్యులకు సహాయం చేసే ఆప్టోమెట్రీషియన్ల అవసరం కూడా అనివార్యమైంది. ఈ నేపథ్యంలో కూడా విస్తృత అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో కూడా ఆప్టోమెట్రిక్ అభ్యర్థులకు అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేస్తోన్న క్రమంలో కొత్తగా మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులను నెలకొల్పుతుండడం, ఖాళీగా ఉన్న పారా మెడికల్ పోస్టులను భర్తీ చేస్తుండడం కూడా ఆప్టోమెట్రీ అభ్యర్థులకు కలిసొచ్చే అంశం. అంతేకాకుండా ఈఎస్ఐ, ఆర్మ్డ్ ఫోర్సెస్ వంటి ప్రభుత్వ విభాగాలు కూడా వీరిని నియమించుకుంటాయి. వేతనాలు: కెరీర్ ప్రారంభంలో సంబంధిత ఫిజిషియన్స్, ఇన్స్టిట్యూట్, క్లినిక్స్‌లో అసిస్టెంట్‌గా పని చేయాలి. ఈ సమయంలో వీరికి నెలకు రూ. 12 వేల నుంచి రూ. 15 వేల వరకు లభిస్తుంది. తర్వాత ఈ రంగంలోని ఉన్నత విద్య పూర్తి చేయడం ద్వారా డాక్టర్‌కు సమానమైన హోదాకు చేరుకోవచ్చు. ఈ సమయంలో నెలకు రూ. 30 వేల నుంచి రూ. 60 వేల వరకు సంపాదించవచ్చు. కావల్సిన లక్షణాలు సేవా దృక్ఫథం, ఓర్పు, సహనం, అంకిత భావం కళ్లు, లెన్సెస్‌తో పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి కచ్చితత్వం, సున్నితత్వాన్ని కలిగి ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, సమయస్ఫూర్తి సమయంతో నిమిత్తం లేకుండా కష్టపడే తత్వం నిర్ణయాత్మక సామర్థ్యం జట్టుగా, సమన్వయంతో పని చేసే తత్వం శాస్త్రీయ వైఖరి, విశ్లేషణాత్మక సామర్థ్యం అనుకూలతలు: చక్కని హోదా-ఆకర్షణీయమైన వేతనం మాంద్యం సోకని ఎవర్ గ్రీన్ ప్రొఫెషన్ ఉన్నత విద్యనభ్యసిస్తున్న సమయంలో పార్ట్ టైమ్ జాబ్ చేసుకోవచ్చు {పతి ఏటా విస్తరిస్తోన్న రంగం టాప్ మెడికల్ ప్రొఫెషన్లలో ఒకటి ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్లు: ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ -న్యూఢిల్లీ ఆంధ్రా మెడికల్ కాలేజీ-విశాఖపట్నం భారతీ విద్యాపీఠ్ యూనివర్సిటీ-పుణే ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్-హైదరాబాద్ సరోజినీ దేవి ఐ హాస్పిటల్-హైదరాబాద్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్-పిలానీ మణిపాల్ యూనివర్సిటీ-మణిపాల్ -
నేత్రవైద్యుల సదస్సు ప్రారంభం
కేఎంసీ, న్యూస్‌లైన్ : నేత్ర వైద్యుల 37వ రాష్ర్ట స్థాయి సదస్సు శుక్రవారం వరంగల్‌లో ప్రారంభమైంది. వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ సదస్సును ఆఫ్తాల్మిక్ అసోసియేషన్ చైర్మన్, ఐ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పాండురంగజాదవ్ పావురా లు ఎగురవేయడంతో పాటు అసోసియేషన్ పతాకా న్ని ఆవిష్కరించి ప్రారంభించారు. సదస్సులో భాగంగా 750మంది రిజిస్ట్రేషన్ చేయించుకోగా, 550మంది హాజరయ్యారని అసోసియేషన్ బాధ్యులు తెలిపారు. ఇందులో నకిరేకల్, నెల్లూరు, చిత్తూరు, వరంగల్, రంగారెడ్డి, ఆదిలాబాద్, హైదరాబాద్‌తో పాటు చెన్నై, ముంబై, హుగ్లీ నుంచి కూడా నేత్ర వైద్యనిపుణులు హా జరయ్యారని పేర్కొన్నారు. గతంలో రెండుసార్లు వరంగల్‌లో రాష్ర్ట సదస్సు నిర్వహించగా, ఇది మూడో సారి కావడం విశేషం. స్టాళ్ల ఏర్పాటు, సదస్సు రాష్ర్ట స్థాయి నేత్ర వైద్యుల సదస్సులో భాగంగా నేత్రవైద్యంలో అత్యాధునిక విధానాలు, మెళకువలపై పీజీ విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నిపుణులు వివరించారు. రెండు స్క్రీన్లపై ఇటీవల జరిగిన ఆధునిక చికిత్సలను డాక్టర్ శరత్‌బాబు, డాక్టర్ పాండురంగజాదవ్ విద్యార్థులకు తెలిపారు. అంతేకాకుండా చికిత్సలో ఉపయోగించే పరికరాలతో పలు కంపెనీలు ప్రదర్శన ఏర్పాటుచేయగా, వైద్యులు ఆసక్తిగా వాటి వివరాలు తెలుసుకున్నారు. కాగా, సదస్సు రెండో రోజు శనివారం పలు అంశాలపై సెమినార్లు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా నేత్ర వైద్యుల అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్షుడిగా హైదరాబాద్‌కు చెందిన సుబ్రహ్మణ్యం ప్రమాణ స్వీకారం చేస్తారని వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఆఫ్తాల్మిక్ అసోసియేషన్ ప్రతినిధులు పాండురంగ జాదవ్, డాక్టర్ శరత్‌బాబుతో పాటు డాక్టర్ ఎ.రవీంద్ర, డాక్టర్ గిరిధర్, డాక్టర్ ప్రవీణ్‌తో పాటు పెద్ద సంఖ్యలో డెలిగేట్స్ పాల్గొన్నారు. మార్మోగిన తెలం‘గానం’ సదస్సు ప్రాంగణంలో తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంట్లో బిల్లు పెట్టాలనే డిమాండ్‌తో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు ఆకట్టుకున్నాయి. ప్రతి ఒక్కర ఫ్లెక్సీల వద్ద నిల్చుని పరిశీలించడం కనిపించింది. 38వ సదస్సు రాజమండ్రిలో.. నేత్ర వైద్యుల అసోసియేషన్ 38వ రాష్ర్ట స్థాయి సదస్సును వచ్చే ఏడాది రాజమండ్రిలో నిర్వహించనున్నా రు. అదే వేదికపై రాష్ర్ట అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన డాక్టర్ శరత్‌బాబు ప్రమాణ స్వీకారం చేసేలా తీర్మానిం చినట్లు తెలిసింది. -
కంటి ఆస్పత్రిలో అక్రమ నియామకాలు
కేఎంసీ, న్యూస్‌లైన్ : వరంగల్ ప్రాంతీయ కంటి ఆస్పత్రిలో అక్రమ నియామకాలకు రంగం సిద్ధమైంది. నిబంధనలకు విరుద్ధంగా బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్లంబర్, టైలర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం ఒక్కో అభ్యర్థి నుంచి ఆరు నెలల క్రితమే రూ. 4 లక్షల చొప్పున వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ పేరుతో ప్రత్యేకంగా నోట్‌ఫైల్ (681-26.2.2013) తయారు చేసి గుట్టుచప్పుడు కాకుండా కలెక్టర్‌కు పంపించారు. నోట్‌ఫైల్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఈ మేరకు ఐటీఐ ప్రిన్సిపాల్, జిల్లా సోషల్వెల్ఫేర్ ఆఫీసర్, కేఎంసీ ప్రిన్సిపాల్‌తో కూడిన కమిటీని నియమించి నిబంధనల ప్రకారం పోస్టులను భర్తీ చేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. కానీ, కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా మహిళకు టైలర్పోస్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఓ వ్యక్తికి ప్లంబర్ పోస్టు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. టైలర్పోస్టు ఇవ్వనున్న మహిళ భర్త అదే ఆస్పత్రిలో పనిచేస్తుండడం గమనార్హం. నిజానికి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీచేసే జీఓ కాలపరిమితి జూన్‌లోనే పూర్తయింది. రిజర్వేషన్, రోస్టర్ ప్రకారం రెండు పోస్టుల కన్నా ఎక్కువగా ఉంటేనే బ్యాక్లాగ్ కిందికి వస్తాయి. ఒక పోస్టు ఉంటే జనరల్‌గా భర్తీయాలి. పోస్టులు భర్తీచేయాలని గతంలో లంబాడ హక్కుల పోరాటసమితి నాయకులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఆస్పత్రిలో ఎలాంటి బ్యాక్లాగ్ పోస్టులు లేవని 30-12-20011న ఫైల్ నంబర్ ఈ1-681 విడుదల చేసి వివరణ ఇచ్చారు. 12-01-2012 తేదీన తమ ఆస్పత్రిలో టైలర్, ప్లంబర్, రిఫ్రాక్షనిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కలెక్టర్‌కు ఫైల్ పంపించారు. 20 రోజుల్లోనే ఇంటర్వ్యూ సైతం నిర్వహించారు. దీంతో టైలర్ పోస్టు కోసం ఇంటర్వ్యూకు హాజరైన సౌజన్య అనే మహిళ కోర్టుకు వెళ్లింది. ట్రిబ్యునల్ నంబర్ (5874/2012)తో కోర్టు ఆర్డర్ తెచ్చుకుంది. అయితే ఈమెతో పాటు ఇంటర్వ్యూకు హాజరైన స్వరూప, పరంజ్యోతిని కాదని అర్హతలేని వేరే మహిళను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ప్లంబ ర్ పోస్టు కోసం ఇమ్మానియేల్, రాజు, నవీన్ హాజరయ్యారు. కాగా, అదే ఆస్పత్రిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి వద్ద డబ్బులు తీసుకుని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ నియామకం చెల్లదని గతంలోనే కోర్టు సైతం కొట్టివేసింది. నిజానికి ఐ ఆస్పత్రిలో ప్లంబర్, ఓ టైలర్ పోస్టు భర్తీకి 25-1-1990లో జీఓ 73 విడుదలైంది. తమకు అనుకూలమైన వారితో భర్తీచేయాలని అధికారులు 23 సంవత్సరాలుగా వేచిచూశారనే విమర్శలు వస్తున్నాయి. బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయొద్దని నెల రోజుల కిత్రం డీఎంఈ నుంచి ప్రత్యేక జీఓ ఆస్పత్రికి జారీ అయింది. గతంలో పనిచేసిన వారికి అన్యాయం.. నెల రోజుల క్రితం ఎవరికి తెలియకుండా ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఒక ఆంకోను నియమించినట్లు తెలిసింది. గతంలో పనిచేసిన వారిని కాదని డబ్బులు వసూలు చేసి ఈ దందాకు తెరలేపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విధంగా కంటి ఆస్పత్రిలో ప్రతి సంవత్సరం సుమారు 10 అక్రమ పోస్టులు నియామకం చేపడుతున్నారని గతంలో పనిచేసిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్, డీఎంఈ అక్రమ నియామకాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు ఉద్యోగులు, యూని యన్ నాయకులు కోరుతున్నారు. నిబంధనల ప్రకారమే : పాండురంగజాదవ్, ఐ ఆస్పత్రి సూపరింటెండెంట్ నింబంధనల ప్రకారమే నియామకాలు చేస్తున్నాం. కలెక్టర్ కార్యాలయానికి ఫైల్ పంపించాం. ఆయన అనుమతితోనే పోస్టుల భర్తీ ఉంటుంది. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల్లో నిజం లేదు.