ఇరు సంస్థల ప్రతినిధులు గణేశన్, అన్నపూర్ణ, వేలు, శరత్, ప్రసాద్ రెడ్డి (ఎడమ నుంచి కుడికి)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంటి వైద్య రంగంలో ఉన్న మ్యాక్సివిజన్.. వరంగల్ కేంద్రం గా కార్యకలాపాలు సాగిస్తున్న శరత్ లేజర్ ఐ హాస్పిటల్‌ను కొనుగోలు చేసింది. అలాగే ఇరు సంస్థలు కలిసి శరత్ మ్యాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్ పేరుతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశాయి. ఈ జేవీలో మ్యాక్సివిజన్‌కు 51%, శరత్‌కు 49% వాటా ఉంటుంది. 2021 నాటికి జేవీ కింద 15 ఆసుపత్రులను స్థాపిస్తామని మ్యాక్సివిజన్ చైర్మన్ జీఎస్‌కే వేలు వెల్లడించారు. శరత్ లేజర్ ఐ హాస్పిటల్ ఫౌండర్ శరత్ బాబు చిలుకూరి, మ్యాక్సివిజన్ ఫౌండర్ మెంటార్ కాసు ప్రసాద్ రెడ్డితో కలిసి బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. బీఎస్సీ ఆప్టోమెట్రీ కోర్సులకు ఆప్టోమెట్రీ కళాశాలలను వరంగల్, హైదరాబాద్‌లో అందుబాటులోకి తెస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment