Sharath
-
టీడీపీనేత పత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్ట్
సాక్షి, విజయవాడ: టీడీపీనేత పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మాచవరం పోలీసుస్టేషన్లో శరత్‌పై కేసు నమోదు అయింది. ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. నిధులు మళ్లించి పన్ను ఎగవేసారనే ఆరోపణలపై శరత్‌తో సహా మొత్తం ఏడుగురుపై పోలీలు కేసు నమోదుచేశారు. ఐపీసీ 420, 409, 467,471, 477(A),120 B రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద శరత్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పుల్లారావు భార్య, బావమరిదితో పాటు మరో ఐదుగురుపై కేసు చేశారు. అవెక్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పన్ను ఎగవేసారని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. శరత్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. ఈనెల 26న ఏపీ ఎస్డీఆర్ఐ డిప్యూటీ డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు చేయటంతో పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. అవెక్స్ కంపెనీలో 2019 డిసెంబరు నుంచి 2020 ఫిబ్రవరి వరకు అడిషనల్ డైరక్టరు హోదాలో శరత్ ఉన్నారు. సుమారు రూ. 16కోట్లు మేర పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాసేపట్లో న్యాయమూర్తి ఎదుట శరత్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్దకు పత్తిపాటి పుల్లారావు, టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇతర నాయకులు చేరుకున్నారు. సీపీ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. -
టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అరెస్ట్
-
ఆ అమ్మను ఉపాసన చేస్తూ నిర్వహించే కార్యక్రమాలే దసరా!
ఆశ్వీయుజమాసం శరదృతువులో వస్తుంది. ఈ కాలంలో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టి ప్రకృతి కొత్త శోభను సంతరించుకుంటుంది. ఈ మాసంలో వెన్నెల అత్యధికంగా కాస్తుంది. శరత్కాలంలోని తొలి తొమ్మిదిరాత్రులు జరుపుకొనే దేవీనవరాత్రులు అనేక రుగ్మతలను నివారించడంతోపాటు తలపెట్టిన పనులలో విజయాన్ని చేకూరుస్తాయని పురాణాలు చెబుతున్నాయి. సృష్టి, స్థితి, లయకారిణి అమ్మే! త్రిమూర్తులకు, దశావతారాలకు అన్నింటికీ మూలం అమ్మే! ఆ పరాశక్తిని ఉపాసన చేస్తూ నిర్వహించే కార్యక్రమాలే దసరా ఉత్సవాలనీ, దేవీ శరన్నవరాత్రోత్సవాలనీ ప్రసిద్ధి చెందాయి. శరన్నవరాత్రుల విశేషాలు హస్తా నక్షత్రంతో కూడిన ఆశ్వీయుజ దశమికి ‘దశహరా’ అనే పేరు ఉంది. పది జన్మల పాపాలను, పది రకాలైన పాపాలను పోగొట్టేది అనే అర్థం కూడా ఉంది. రాత్రి అంటే తిథి అనే అర్థం కూడా. దీనిప్రకారం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరిగే ఉత్సవాలే నవరాత్రి ఉత్సవాలు. తొమ్మిది రోజుల పాటు నియమాల ప్రకారం అర్చనలు చేయలేని వారు చివరి మూడు రోజులు అంటే అష్టమి, నవమి, దశమి రోజుల్లో అయినా దుర్గాదేవిని అర్చిస్తే, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రవచనం. మూలా నక్షత్రంతో కూడిన షష్ఠి లేదా సప్తమి రోజున సరస్వతీదేవిని పూజిస్తారు. ఈవేళ పుస్తకదానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దుర్గాష్టమి దుర్గాదేవి ‘లోహుడు’ అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని, అందువల్ల లోహపరికరాలను పూజించే ఆనవాయితీ వచ్చిందని చెబుతారు. ఇక దుర్గ అంటే దుర్గమమైనది, దుర్గతులను తొలగించేది అని అర్థం. ఈమె దుర్గేయురాలు కనుక దుర్గ అయింది. ‘దుర్గలోని ‘దుర్’ అంటే దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం, దారిద్య్రం మొదలైనవి. ‘గ’ అంటే నశింపచేసేది‘, అని దైవజ్ఞులు వివరిస్తారు. ఈమె ఆరాధన వల్ల దుష్టశక్తులు, భూత, ప్రేత, పిశాచ, రక్కసుల బాధలు దరిచేరవు. అందువల్లనే మొదటి మూడు రోజులు దుర్గా రూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలపై అదుపును, తదుపరి మూడురోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడురోజులు సరస్వతీదేవి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని, ఆ క్రమంలో ఈ నవరాత్రులలో ఆ తల్లిని ఆరాధించి ఫలితాలు పొందవచ్చునని పెద్దలు చెప్తుంటారు. ఈరోజు దుర్గసహస్రనామ పారాయణం,‘దుం’ అనే బీజాక్షరంతో కలిపి దుర్గాదేవిని పూజిస్తారు. మహర్నవమి మానవ కోటిని పునీతులను చేయడం కోసం భగీరథుడు ఎంతో తపస్సు చేసి మరెన్నో ప్రయాసలకోర్చి గంగను దివి నుంచి భువికి తెచ్చినది ఈరోజే! ఇక ఈ నవరాత్రి దీక్షలో అతి ముఖ్యమైనదిగా ఈ నవమి తిథిని గూర్చి చెప్పడంలోని ఆంతర్యం ఈ తొమ్మిదవ రోజు మంత్రసిద్ధి కలుగుతుంది. కాబట్టి ‘సిద్ధిదా’ అని నవమికి పేరు. దేవి ఉపాసకులు అంతవరకు వారు చేసిన జపసంఖ్య ఆధారంగా హోమాలు చేస్తూ ఉంటారు. అలా వ్రతసమాప్తి గావించిన వారికి సర్వాభీష్ట సిద్ధి కలుగుతుందని ప్రతీతి. సామూహిక లలితా సహస్ర నామార్చనలు, కుంకుమ పూజలు ఈ పండుగ ఆచారాలలో ఇంకొన్ని. దసరా పండుగకు ఒకరోజు ముందు ఆయుధ పూజ. దేవీ నవరాత్రుల సమయంలో ఈ ఆయుధ పూజకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ఆచారాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. ఈ పర్వదినాన రైతులు కొడవలి, నాగలి, వాహనం ఉన్న వారు తమ వాహనాలకు, కుట్టుపని వారు తమ కుట్టు యంత్రాలకు, చేనేత కార్మికులు తమ మగ్గాలకు, కర్మాగారాలలో పని చేసే కార్మికులు తమ యంత్ర పరికరాలకు, ఇతర పనిముట్లకు పసుపు, కుంకుమతో పూజలు చేస్తారు. వాటిని అమ్మవారి ప్రతిరూపాలుగా ఆరాధిస్తారు. అయితే ఈ ఆయుధ పూజను ఎందుకు జరుపుకుంటారు.. ఎందుకని దీనికంత ప్రాముఖ్యత ఇస్తారనే విషయాలపై కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం... పురాణాల ప్రకారం పాండవులు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్లడానికి ముందు జమ్మి చెట్టు మీద తమ ఆయుధాలను భద్రపరిచారు. అందువల్ల ఆయుధాలు తుప్పు పట్టకుండా చెడకుండా సురక్షితంగా ఉన్నాయి. యుద్ధానికి వెళ్లడానికి ముందు అర్జునుడు తన గాండీవానికి, భీమసేనుడు తన గదాయుధానికి ప్రత్యేకంగా పూజలు జరిపించారని ప్రతీతి. శక్తి స్వరూపిణిని.. అలా పాండవులు శక్తి స్వరూపిణిని ప్రసన్నం చేసుకుని, యుద్ధానికి సన్నద్ధం అయ్యారని చెబుతుంటారు. మరోవైపు దుర్గతులను నివారించే మహా స్వరూపిణి అమ్మవారైన దుర్గాదేవి దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించిన రోజు అని చెబుతారు. ఆయుధ పూజ రోజున ‘ఓం దుం దుర్గాయైనమః’ అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలొస్తాయి. అలాగే లలితా అష్టోత్తరాలు పఠించాలి. ఆ తర్వాత ఆయుధ పూజ లేదా అస్త్రపూజలు చేయాలి. బొమ్మల కొలువు.. ఆయుధ పూజనే కొన్ని ప్రాంతాల్లో అస్త్ర పూజ అంటారు. కేరళ వంటి ప్రాంతాలలో ఆయుధ పూజ సందర్భంగా ప్రత్యేకంగా కొన్ని పోటీలను నిర్వహిస్తుంటారు. తమిళనాడులో ఆయుధ పూజ సందర్భంగా సరస్వతీ పూజను చేస్తారు. తమిళ సంప్రదాయంలో ఇదే పూజను ‘గోలు’ అంటారు. ఈరోజున ఆ ప్రాంతంలో బొమ్మల కొలువు నిర్వహిస్తారు. ఆంధ్ర ప్రాంతంలో కూడా బొమ్మల కొలువును నిర్వహించడం పరిపాటి. విజయదశమి దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్తదినం ఈ విజయదశమి రోజే అని పురాణాలు చెబుతున్నాయి.‘శ్రవణా’ నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి ‘విజయా’ అనే సంకేతమున్నది. అందుకనే దీనికి ‘విజయదశమి’ అను పేరు వచ్చింది. ఏ పనైనా తిథి, వారం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం లాంటివి చూడకుండా విజయదశమి నాడు చేపడితే ఆ కార్యంలో విజయం తథ్యం అని పెద్దలు చెబుతారు. ‘శమీపూజ’ చేసుకునే ఈరోజు మరింత ముఖ్యమైనది. శమీవృక్షమంటే ’జమ్మిచెట్టు’. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు వారివారి ఆయుధాలను, వస్త్రాలను శమీవృక్షంపై దాచి ఉంచారు. అజ్ఞాతవాసం పూర్తి అవగానే ఆ వృక్ష రూపాన్ని పూజించి ప్రార్థించి, తిరిగి ఆయుధాలను, వస్త్రాలను పొంది, శమీవృక్ష రూపాన ఉన్న‘అపరాజితా’ దేవి ఆశీస్సులు పొంది, కౌరవులపై విజయం సాధించారు. శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ ‘అపరాజితాదేవి’ని పూజించి, రావణుని సంహరించడం ద్వారా యుద్ధంలో విజయం సాధించాడు. తెలంగాణ ప్రాంతంలో శమీపూజ తర్వాత శుభానికి సూచిక అయిన‘పాలపిట్ట’ను చూసే ఆచారం ఉంది. ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని, విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి, ఈ దిగువ ఇచ్చిన శ్లోకాన్ని పఠిస్తూ చెట్టుకు ప్రదక్షణలు చేస్తారు. ‘శమీ శమయతే పాపం శమీశత్రు వినాశినీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ! అనే శ్లోకం రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయడం వల్ల అమ్మవారి కృపతో పాటు, శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి. మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒకరే! అమ్మవారి అలంకారాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి. శ్రీశైల భ్రమరాంబికకు ఒకవిధంగా అలంకారం చేస్తే, విజయవాడ కనకదుర్గమ్మకు మరోవిధంగా అలంకారాలు చేస్తారు. అలంకారాలు వేరైనా అమ్మదయ అందరిపట్ల ఒకటే! అందరికీ అమ్మ కరుణాకటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ఈ విజయ దశమి అందరికీ సకల శుభాలూ, తలపెట్టిన కార్యక్రమాలన్నింటిలోనూ జయాలను చేకూర్చాలని ఆకాంక్షిద్దాం. కనక దుర్గాదేవి (పాడ్యమి) శ్రీ బాలాత్రిపురసుందరి ( విదియ ) శ్రీ అన్నపూర్ణాదేవి (తదియ ) శ్రీ గాయత్రీదేవి ( చవితి ) శ్రీ లలితాత్రిపుర సుందరి ( పంచమి ) శ్రీ మహాలక్ష్మీదేవి ( షష్ఠి) శ్రీ సరస్వతీదేవి (సప్తమి ) శ్రీ దుర్గాదేవి (అష్టమి) శ్రీ మహిషాసురమర్దిని దేవి (నవమి ) శ్రీ రాజరాజేశ్వరీ దేవి (దశమి) దేవీ అలంకారాలు ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకూ తొమ్మిది రోజులను నవరాత్రులు అంటారు. నవరాత్రులంటే మహిళలు దేవిని స్మరిస్తూ పండగ చేసుకుంటారు. మహాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఈ తొమ్మిదిరోజుల పాటు తొమ్మిది రూపాలలో అలంకరించి పూజించడం జరుగుతుంటుంది. భక్తులు ఈ తొమ్మిదిరోజుల పాటు దీక్ష చేపట్టి, ఏకభుక్త వ్రతాన్ని ఆచరిస్తూ అమ్మవారిని పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని. శరన్నవరాత్రులలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఎవరైతే తనని పూజిస్తారో, వాళ్లు తనకి అత్యంత ప్రీతిపాత్రులని అమ్మవారే స్వయంగా చెప్పినట్టుగా పురాణాలు వెల్లడిస్తున్నాయి. దేవీ నవరాత్రులు ఎంతో విశిష్టమైనవి, మహా పవిత్రమైనవి. ఈ తొమ్మిది రోజుల పాటు ఒక్కోరోజు ఒక్కో రూపంలో అగుపించే అమ్మవారిని దర్శించుకోవడం వలన అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయి. నవదుర్గలను ఆరాధించడం వలన ధనధాన్యాలు, సంతాన సౌభాగ్యాలు, సుఖశాంతులు చేకూరుతాయని, శత్రుజయం కలుగుతుందనీ భక్తుల విశ్వాసం. చల్లని చూపు ఆ అమ్మ కంటిలో నవరసాలను శంకరాచార్యులు వర్ణిస్తారు. చేప స్తన్యం ఇచ్చి తన పిల్లలను పోషించదు. చేప తన పిల్లను పోషించినప్పుడు కేవలం అలా కన్నులతో తల్లిచేప చూసేసరికి పిల్ల చేపకు ఆకలి తీరిపోతుంది. మీన నేత్రాలతో ఉంటుందని అమ్మవారికి మీనాక్షి అనిపేరు. అమ్మ కళ్ళ వైభవాన్ని అనుభవించి, అమ్మకంటి వంక ఒకసారి చూసినట్లయితే మనలో ఇప్పటివరకు ఉన్న ఆందోళనలు ఉపశమించి శాంతి, సంతోషం కలుగుతాయి. ∙డి.వి.ఆర్. భాస్కర్ (చదవండి: అమ్మవారి నామాలే ఆ మహా నగరాలు! వాటి ప్రాశస్యం ఏంటంటే..) -
కథ చెప్పే విధానం ముఖ్యం
‘‘ఏ సినిమాకైనా కథ కంటే ఆ కథని ప్రేక్షకులకు నచ్చేలా చెప్పే విధానం చాలా ముఖ్యం. ఈ విషయంలో రాజమౌళిగారు బెస్ట్. మా ‘మేమ్ ఫేమస్’ కథని సుమంత్ ప్రభాస్ చక్కగా చెప్పారు. యూత్‌తో పాటు తల్లితండ్రులు చూడాల్సిన సినిమా ఇది’’ అని నిర్మాతలు అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ అన్నారు. సుమంత్ ప్రభాస్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రనిర్మాతలు అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మేమ్ ఫేమస్’లో లీడ్ రోల్ కోసం ఆడిషన్స్ చేశాం. అయితే ఆ పాత్రకి ఎవరూ సరిపోకపోవడంతో చివరికి సుమంత్ ప్రభాసే నటించాడు. తన ప్రతిభ, ఎనర్జీ చూస్తే భవిష్యత్‌లో తప్పకుండా పెద్ద స్టార్ అవుతాడనిపిస్తోంది. ‘పెళ్ళి చూపులు’ సినిమాలోని సెన్సిబిలిటీస్, ‘జాతిరత్నాలు’ మూవీలోని వినోదం కలిస్తే మా ‘మేమ్ ఫేమస్’. ప్రస్తుతం వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో ఓ సినిమా నిర్మిస్తున్నాం. అలాగే ఓ యంగ్ స్టార్ హీరోతో ఓ సినిమాకి చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
మేజర్ తీసినందుకు గర్వంగా ఉంది: నిర్మాతలు అనురాగ్, శరత్
‘‘మేజర్’లాంటి గౌరవప్రదమైన సినిమా తీశాం. దేశమంతా మంచి పేరు వచి్చంది. ఈ సినిమాకు టైటిల్స్ చివర్లో పడతాయి. అప్పటివరకు ప్రేక్షకులు కూర్చొని ఉన్నారంటేనే సినిమా సక్సెస్ అయినట్లు లెక్క’’ అన్నారు నిర్మాతలు అనురాగ్, శరత్. అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన చిత్రం ‘మేజర్’. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్‌గా రూపొందిన ఈ సినిమా ఈ నెల 3న విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రనిర్మాతలు అనురాగ్, శరత్ మాట్లాడుతూ– ‘‘మాకు ఛాయ్ బిస్కట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ అనే నిర్మాణ సంస్థలు ఉన్నాయి. ఫస్ట్ షో మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా 200 సినిమాలు మార్కెటింగ్ చేశాం. ‘మేజర్’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని అడివి శేష్ చెప్పాడు. నమ్రతగారికి కూడా ఈ కథ నచ్చడంతో మాతో భాగమయ్యారు. ‘మేజర్’ని తెలుగు, హిందీలోనే తీద్దామనుకున్నాం. కేరళలో ఉండే సందీప్ తల్లిదండ్రులను కలిశాక మలయాళంలోనూ డబ్ చేశాం. సందీప్ తల్లిదండ్రులకు రాయల్టీ ఇవ్వడానికి మేం రెడీగా ఉన్నా వారు తిరస్కరించారు. ఆర్మీలో చేరాలనుకున్నవారికి తగిన సపోర్ట్‌గా నిలిచేలా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఫౌండేషన్ అనే సోషల్ మీడియా వేదిక నెలకొల్పాలనుకున్నాం. అదే మేం వారి తల్లిదండ్రులకు ఇచ్చే రాయలీ్ట. ‘రైటర్ పద్మభూషణ్, మేం ఫేమస్’ సినిమాలు నిర్మించాం. తొట్టెంపూడి వేణు లీడ్ రోల్లో ఓ సినిమా, సూర్య అనే కొత్త కుర్రాడితో ఓ సినిమా చేస్తున్నాం’’ అన్నారు. -
టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
ప్రముఖ సీనియర్ దర్శకుడు శరత్ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. రేపు(శనివారం)మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 'డియర్' అనే నవల ఆధారంగా ‘చాదస్తపు మొగుడు’ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆయన తెలుగులో సుమారు 20 సినిమాలకు దర్శకత్వం వహించారు. బాలకృష్ణ, సుమన్ తో భారీ విజయాలు అందుకున్న శరత్.. బాలకృష్ణతో `వంశాని కొక్కడు, పెద్దన్నయ్య, సుల్తాన్, వంశోద్ధారకుడు` సినిమాలు తీశాడు. సుమన్ తో `చాదస్తపు మొగుడు, పెద్దింటి అల్లుడు, బావ-బావమరిది, చిన్నల్లుడు` సినిమాలు తెరకెక్కించారు. కాగా శరత్ మరణంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన మరణవార్త తెలిసి పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. -
నిధుల విడుదలపై నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పట్టణ ప్రజాప్రతినిధుల జీతాల పెంపుపై ఇప్పటికే తీవ్రంగా మందలించిన ఈసీ.. జిల్లా, మండల పరిషత్‌లకు రూ.250 కోట్ల నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధి కల్పన (పీఆర్‌అండ్‌ఆర్‌ఈ) శాఖ కమిషనర్ ఎ.శరత్ ఉత్తర్వులు జారీ చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. దీనిపై తక్షణమే విచారణ నివేదిక సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) శశాంక్ గోయల్‌ను ఆదేశించింది. దీంతో ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాను తాజాగా సీఈఓ ఆదేశించారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసేవరకు పకడ్బందీగా ఎన్నికల కోడ్‌ను అమలు చేయాలని అన్ని ప్రభుత్వ శాఖలను కోరారు. ఏదైనా మినహాయింపులు అవసరమైతే స్పష్టమైన కారణాలు సూచిస్తూ ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. ఈ నేపథ్యంలో జిల్లా, మండల పరిషత్‌లకు నిధులు విడుదల చేస్తూ ఈ నెల 3న పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని తప్పుబడుతూ టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ సీఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ నెల 12న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయాల్సి ఉన్న జడ్పీటీసీలు, ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేయడానికే ఈ నిధులు విడుదల చేసినట్టు ఆయన ఆరోపించారు. వారికి వార్నింగ్ ఇచ్చి రికార్డు చేయండి ఎన్నికల కోడ్ ఉల్లంఘన వ్యవహారంలో రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్, కార్యదర్శి సి.సుదర్శన్‌రెడ్డిపై సీఈసీ తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. వారికి హెచ్చరికలు జారీ చేసి వాటిని ‘రికార్డు’ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఉద్యోగుల సర్వీసు బుక్స్‌లో ఇలాంటి రిమార్క్‌లను నమోదు చేస్తే కెరీర్లో మచ్చగా మిగిలిపోవడంతో పాటు కొన్ని రకాల ప్రయోజనాలకు అడ్డంకిగా మారతాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. పట్టణ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్ పర్సన్లు, డిప్యూటీ చైర్ పర్సన్లు, వార్డు సభ్యులు, కో–ఆప్షన్ సభ్యుల గౌరవ వేతనాలు, రవాణా భత్యాన్ని 30 శాతం పెంచుతూ గత నెల 19న పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ మరుసటి రోజే ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. దీనిపై విపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. -
‘అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ!’ శరత్‌పై దాడి
‘అయ్యయ్యో వద్దమ్మ.. సుఖీభవ సుఖీభవ..’ అనే వీడియో ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వీడియోతో పాపులర్ అయిన నల్లగుట్ట శరత్‌పై తాజాగా దాడి జరిగింది. కొంతమంది యువకులు శరత్‌పై కర్రలు, రాడ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. దుండగుల దాడిలో శరత్ కన్ను వాచిపోయింది. శరత్ ముక్కు, నోట్లో నుంచి రక్తం కారుతున్న ఫోటోలు కొన్ని నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే మేనల్లుడు కాగా సుఖీభవ యాడ్‌ను అనుకరిస్తూ హిజ్రాలను కించపరిచేలా మాట్లాడాడని, అందుకే హిజ్రాలు శరత్‌పై దాడి చేశారని తొలుత ప్రచారం జరిగింది. కానీ తనపై హిజ్రాలు దాడి చేశారని వస్తున్న వార్తలు అవాస్తవం అని శరత్ పేర్కొన్నాడు. ఈ మేరకు శరత్ స్పందిస్తూ.. తనపై దాడి చేసింది ప్రత్యర్థులేనని, గతంలో వాళ్లను ఎదిరించి జైలు శిక్షను కూడా అనుభవించానని వెల్లడించాడు. గతంలో తన చెల్లిని వేధిస్తున్నారని సాయి, హరి అనే రెండు గ్రూపులపై దాడి చేశానని, ఈ కేసులో తాను జైలుకు కూడా వెళ్లిన్నట్లు పేర్కొన్నాడు. ఇటీవల జైలు నుంచి శరత్ బయటకు వచ్చిన అనంతరం సుఖీభవ.. సుఖీభవ వీడియో ద్వారా శరత్ సోషల్ మీడియాలో సెన్సెషన్‌గా మారాడు. తర్వాత సినిమా, ఒక యాడ్ ఆఫర్లు కూడా వచ్చింది. దీంతో తన సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యానని, సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని తెలిసి తనపై కక్షకట్టి ఓ వర్గం వారు దాడి చేశారని వెల్లడించాడు. చదవండి: వైరల్: భర్త మరో మహిళతో జిమ్‌లో.. చెప్పులతో చితకబాదిన భార్య ఇదిలా ఉండగా టీ పౌడర్ యాడ్‌ను కొద్దిగా రీ క్రియేట్ చేసి.. తనదైన స్టైల్ లో తీన్మార్ స్టెప్పులు వేయడంతో ఈ సుఖీభవ.. సుఖీభవ.. అనే వీడియో తె గట్రెండ్ అవుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ వీడియోనే దర్శనమిస్తోంది. E video monnatnunchi chusthunna ..navvu agatla 😂#Sukhibhava pic.twitter.com/cJljiuHrhY — 𝘼 𝙁𝙍𝙀𝘼𝙆 (@bhuvi_0509) September 20, 2021 -
శరత్కాల వెన్నెల
‘విత్ ఫ్రీడమ్, బుక్స్ అండ్ ది మూన్ హూ కుడ్ నాట్ బి హ్యాపీ’ అన్నాడు ఆస్కార్ వైల్డ్. కోరుకున్న స్వేచ్ఛ, చదువుకోదగ్గ పుస్తకాలు, వెన్నెల కురిపించే జాబిల్లి... ఆనందానికి మరేం కావాలి. అందుకే ‘పగలే వెన్నెల.. జగమే ఊయల’ అని మన కవి సినారె రసాస్వాదన చేశాడు. మానవజాతి సూర్యుణ్ణి చూసి నమస్కారం పెట్టుకుంది. గౌరవించింది. పూజించింది. అష్షో బుష్షో అనీ అంది. చంద్రుడు? వారికి నేస్తం. బెడ్‌లైటు. మామ. ఊసులు చెప్పుకునే చెలికాడు. తక్కిన రుతువులు ఎవరివైనా కావచ్చు. శరత్కాలం చంద్రుడిది. ఈ కాలంలో చంద్రుడు చల్లటి నీటితో ఫేస్‌వాష్ చేసుకున్నట్టు ఉంటాడు. ఇది శరత్కాలం. ‘పిండారబోసినట్టుంది వెన్నెల’ అని పుస్తకాల్లో కనిపిస్తుంది. ‘కొబ్బరి ఆకుల సందుల్లో నుంచి వెన్నెల కురుస్తోంది’ అని రచయితలు రాస్తే వయసులో ఉన్న యువతీ యువకుల రొమాంటిక్ భావాలతో మైమరుస్తారు. ఏ అడ్డంకీ లేని నిర్మల ఆకాశంలో, పలుచటి గాలులు వీచే రాత్రి సమయాన, దాపున చుక్కల సింగారంతో, శరత్కాలంలో పూర్ణచంద్రుడు ఉదయిస్తే, దానిని చూడలేకపోతే మన దగ్గర మణులుంటే ఏంటి... మాణిక్యాలుంటే ఏంటి... ఫోన్‌పేలో ఎంత ఉంటే ఏంటి... సాహిత్యంలో వసంత రుతువుది ఏకఛత్రాధిపత్యమే. కాని శరదృతువు తక్కువ తిన్లేదు. ఆ మాటకొస్తే వేదకాలం గుర్తించింది మూడు రుతువులనే. గ్రీష్మం, వసంతం, శరత్తు. ‘సమస్త సృష్టి అనే యజ్ఞంలో వసంతం ఆజ్యం అయితే గ్రీష్మం ఇంధనం, శరత్తు హవి’ అనే అర్థం వచ్చే శ్లోకం ఋగ్వేదంలో ఉంది. ప్రకృతి వర్ణనలో పరాక్రమశాలి అయిన కాళిదాసు శరత్కాలపు వెన్నెలను ఏల వదులుతాడు. ‘ఈ వెన్నెల ఎలా ఉందంటే గడ్డ కట్టిన చిక్కటి తెల్లటి పెరుగులా ఉంది’ అని వెన్నెల రుచి చూపించాడు. వెన్నెలలో రెల్లుగడ్డికి గ్లామర్ తీసుకు వచ్చింది కూడా ఆ మహాకవే. శరత్కాలంలో రెల్లుగడ్డి వెన్నెలను తాగి మత్తుగా ఊగుతున్నట్టు ఉందని రాశాడాయన. ‘వెన్నెల కాస్తుంటే కొందరు కిటికీలు మూసుకుంటారు’ అని గుడిపాటి వెంకటాచలం విసుక్కున్నాడు కాని తిలక్ వెన్నెల కాసిందంటే చాలు కవిత్వం రాశాడు. ‘దవుదవ్వుల పడుచు పిల్లలు పకపక నవ్వినట్టుంది వెన్నెల... దాపరికం లేని నాతి వలపులాగుంది వెన్నెల’ అని రాశాడు. అంతేనా? ‘నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అన్నాడు. తన పుస్తకాన్ని ‘అమృతం కురిసిన రాత్రి’ అన్నాడు. ఇక్కడ అమృతం వెన్నెలామృతమే. అయినా సరే ‘ఎన్నెలంతా మేసి ఏరు నెమరేసింది’ అని రాసిన నండూరి సుబ్బారావూ మొనగాడే. ఎంకిని ఆచ్ఛాదన లేని చంద్రుని కింద నాయుడు బావ చూశాడో లేదో కాని తెలుగు పాఠకులు కన్నులు ఇంతింత చేసుకుని చూశారు. శరత్కాలంలో వచ్చే ఆశ్వయుజ పున్నమి వాల్మీకి మహర్షి జన్మదినం. రామాయణం ఈ భరతభూమి మీద అనాదిగా ఆధ్యాత్మిక వెన్నెలను కురిపిస్తూ ఉంది. రాముడు రామచంద్రుడు. చంద్రుణ్ణి నేలకు దించమని కోరి గోరుముద్దలు తిన్నవాడు. సీతమ్మ మోము చంద్రబింబం కంటే ఏం తక్కువ. మహా భారతాన్ని తెలుగు అనువాదం చేస్తున్న నన్నయ్య ‘అరణ్య పర్వం’లో శరత్కాలాన్ని వర్ణిస్తూ ఒక పద్యం రాసి అక్కడితో రచన చాలించాడు. 200 ఏళ్ల తర్వాత ఎఱాప్రగడ కొనసాగింపుగా శరత్కాల వర్ణన చేసే మరో పద్యం రాసి ఆ అనువాదాన్ని కొనసాగించాడు. తెలుగు మహాభారతం ఆ విధంగా ఒక శరత్కాలానికి మరో శరత్కాలానికి మధ్య సుదీర్ఘ విరామం తీసుకుంది. రుతువులు ఏం చేస్తాయి? ఏవో సంకేతాలు ఇస్తాయి. ఆ ప్రకారం నడుచుకోమని మనుషులకు చెబుతాయి. శరత్కాలం స్త్రీ, పురుషుల సన్నిహిత కాలం అని శృంగార శాస్త్రాలు చెబుతాయి. భర్తృహరి ‘శృంగార శతకం’ ఆ సమయంలో ఆలుమగలు ఎలా వ్యవహరించాలో చెబుతుంది. ‘శరత్కాలంలో ఆలుమగలు ఏకాంతంగా మేడ మీదకు చేరాలి. అర్ధరాత్రి వరకు కాలక్షేపం చేయాలి. చంద్రుడు నడిమింటికి వస్తాడు... వెన్నెల ధార కురుస్తూ ఉంటుంది... ఆ సమయంలో ఒకరి స్పర్శను ఒకరు ఆస్వాదించాలి’ అని చెప్పింది. చలం కూడా ‘ఆరోగ్యవంతమైన స్త్రీ పురుషులు వెన్నెల రాత్రుళ్లలో సముద్రపు ఒడ్డున భూమే శయ్యగా కలిసేది ఎప్పుడో’ అని రాశాడు. రుతువు అంటే స్పందన. వెన్నెల అంటే స్పందన. స్పందనాగుణం కోల్పోవడమే ఇప్పుడు మనిషిని బాధిస్తున్న సంగతి. విషాదం ఏమంటే తాను స్పందనాలేమితో బాధ పడుతున్న సంగతి కూడా మనిషికి తెలియదు. పూవు పూస్తే, హరివిల్లు విరిస్తే, చినుకు చూరు నుంచి చిటుకూ పుటుకూ మంటే, గాలికి ఒక తీవ ఝల్లుమని కదిలితే ఆగి చూసి ఆస్వాదించి స్పందించే సమయం మనిషికి ఎక్కడిది? అది ఉంది. కాని లేదు అని పరుగు పెట్టడమే మనిషి నేడు చేస్తున్నది. ఈ స్పందన కరువైన కొద్దీ జీవితంలో ఆస్వాదన కరువవుతుంది. స్త్రీ, పురుషుల మధ్య శుష్కమైన కోరిక మిగిలి రససిద్ధి అడుగంటుతుంది. నేడు భారతీయ సమాజంలో భార్యాభర్తల మధ్య నిజమైన రసస్పందన కరువవుతున్నదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫేక్– కపట మోహ ప్రదర్శనే మిగులుతున్నది. సంవత్సరానికి ఒకసారి శరత్ రుతువు వస్తుంది. సోముడు తేజోవంతమై అందాక పేరుకు పోయిన భావాల నిరాసక్తతను వదలగొడతాడు. వెన్నెల గుమ్మరిస్తాడు. గుండెలకు లాలిత్యం ఇస్తాడు. హాయి పడాల్సిన కాలం ఇది. పున్నములను చూడాల్సిన కాలం. దాంపత్య అనుబంధాన్ని వెలిగించుకోవాల్సిన కాలం. వెలగడం మీ వంతు. -
30 ఏళ్లు పట్టించుకోలేదు: ప్రముఖ నటుడు
ప్రతి ఒక్కరికి ఓ రోజు వస్తుందంటారు. మధ్యప్రదేశ్‌లోని పేద కుటుంబం నుంచి వచ్చిన శరత్ సక్సేనాకు కూడా సినిమాల్లోకి వెళ్లే ఓ రోజు వచ్చింది. కానీ గుర్తింపు రావడానికే 30 ఏళ్లు పట్టింది. నటనలో ఓనమాలు నేర్చుకోవడానికి ఇంత కాలం పట్టలేదు. కేవలం దర్శకనిర్మాతలు ఆయనను పట్టించుకోవడానికి ఇంత గడువు పట్టింది. తాను ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను శరత్ సక్సేనా.. సీఐఎన్‌టీఏఏ(సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా బయటపెట్టారు. అందరి మనసులను మెలివేస్తున్న 2018నాటి ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఆయన ఇంటర్వ్యూలో ఏమన్నారో చదివేయండి.. సారీ బాస్, ఎస్ బాస్.. ఇవే డైలాగులు "నా భారీకాయం చూసి దర్శకులెవ్వరూ నన్ను నటుడిగా లెక్కలోకి తీసుకోలేదు. ఎప్పుడూ ఫైటర్, జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలే ఇచ్చేవారు. అంతదాకా ఎందుకు.. ఎవరికైనా కండలు తిరిగి బాడీ బిల్డర్‌లా కనిపిస్తే వారిని ఈ దేశంలో లేబర్ క్లాస్ కింద పరిగణించేవాళ్లు. వాళ్లు దేనికీ పనికి రారన్నట్లుగా చూసేవాళ్లు. విలన్ అని ముద్ర వేస్తారు. అయితే మా నాన్న అథ్లెట్ కావడం వల్ల మేము కూడా ఆయన నుంచి స్ఫూర్తి పొంది శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకున్నాం. కానీ నన్ను అలా చూసిన దర్శకనిర్మాతలకు నాలో నటుడు కనిపించలేదు. కేవలం జూనియర్ ఆర్టిస్ట్ కనిపించాడు. అలా ముప్పై ఏళ్లు కేవలం ఫైట్ సీన్లలోనే నటించాను. ఎస్ బాస్, నో బాస్, వెరీ సారీ బాస్, నన్ను క్షమించండి బాస్.. ఈ డైలాగులు మాత్రమే వల్లించేవాడిని. ఆ తర్వాత కొన్నేళ్లకు డైరెక్టర్ షాద్ అలీ నన్ను గుర్తించి "సాథియా"లో హీరోయిన్ తండ్రి పాత్ర ఇచ్చారు. అది చిన్న పాత్రే అయినప్పటికీ జనాలు నన్ను ఇష్టపడ్డారు. ఈ సినిమా నుంచి నేను ఫైటర్‌గా కాకుండా నటుడిగా మారాను. కానీ ఈ మార్పుకు ముప్పై ఏళ్లు పట్టింది" అని కెరీర్ తొలినాళ్లనాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. (చదవండి: చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపిన 2020) జీరో నుంచి ప్రముఖుడిగా మారారు.. ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న శరత్‌కు నటుడవ్వాలనేది కల. అలా ముంబైలో అడుగు పెట్టిన ఆయనను డైరెక్టర్లు నెగెటివ్ పాత్రలో ఊహించుకున్నారు. ఫలితంగా ఏళ్ల తరబడి విలన్‌కు సలాం చేసే గ్యాంగ్ సభ్యుడిగా స్థిరపడిపోయారు. దశాబ్ధాల కాలం తర్వాత సాథియా, బాఘ్బాన్ వంటి పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించారు. తెలుగులోనూ పలు సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి మెప్పిస్తూ ప్రముఖ నటుడిగా మారిపోయారు. ఇక ఆయనకు అవకాశాలు ఇవ్వకుండా చిన్నచూపు చూడటాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. శరత్ అద్భుతమైన నటుడని, అతడికి ప్రతిభకు తగ్గ పాత్ర ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు. అతడికి వివక్ష జరగడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: భర్తను ఎత్తుకున్న నటి.. ఫోటో వైరల్) -
కామారెడ్డికి అరుదైన గౌరవం
సాక్షి, కామారెడ్డి : జాతీయస్థాయిలో కామారెడ్డి జిల్లాకు అత్యుత్తమ పురస్కారం లభించింది. డిజిటల్ గవర్నెన్స్‌లో వెబ్‌రత్న –2020 అవార్డుకు ఎంపికైంది. ఈ విషయాన్ని కలెక్టర్ శరత్ శనివారం తెలిపారు. అవార్డుకు ఎంపికవడానికి కారణాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో జిల్లా గురించి సంక్షిప్తంగా మ్యాప్, చరిత్ర, పరిపాలన విభాగం, జనాభా తదితర అంశాలను వివరణాత్మకంగా రూపొందించి వెబ్సైట్లో సమాచారాన్ని నమోదు చేశామన్నారు. జిల్లా, డివిజన్, మండలస్థాయి అధికారుల వివరాలు, ఫోన్‌నెంబర్లు, ఇతర అన్ని రకాల సమాచారాన్ని పొందుపరిచామని తెలిపారు. వెబ్సైట్లో జిల్లా పరిపాలన, చారిత్రక, భౌగోళిక నేపథ్యం గురించి చిత్రాలతో వివరించామన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జీఐజీడబ్ల్యూ నిబంధనల ప్రకారం నవీకరించిన సమాచారం అందుబాటులో ఉందన్నారు. కలెక్టర్ శరత్ పర్యాటక సమాచారం, ప్రదేశాలు, వసతి, సంస్కృతి, పండుగలు, ఉత్పత్తులు, ముఖ్యమైన దేవాలయాల సమాచారాన్ని ఇంగ్లిష్, తెలుగు భాషల్లో జిల్లా వెబ్సైట్లో నమోదు చేశామని వివరించారు. ఆసక్తికర సంఘటనలు, మతపరమైన ప్రదేశాల ఫొటో గ్యాలరీలు, పథకాలు, ప్రాజెక్టులు లాంటి వివరాలతో వెబ్సైట్ సమగ్ర సమాచారాన్ని కలిగి ఉందన్నారు. హోంపేజీలో తాజా రోజువారి సంఘటనలు, ప్రెస్నోట్లు, కోవిడ్–19 సమాచారం ఉంచుతున్నామని తెలిపారు. జిల్లా వెబ్‌సైట్‌ను బలమైన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించామని, ఎప్పటికప్పుడు నవీకరిస్తున్నామని వివరించారు. కామారెడ్డి జిల్లా https://kamareddy.telangana.gov.in వెబ్సైట్ సేవలను ప్రజలందరూ వినియోగించుకుని అభిప్రాయాలను తెలపాలని కోరారు. ఈనెల 30 వతేదీన ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డు అందుకోనున్నట్లు తెలిపారు. -
‘నాయనమ్మ’కు చేయూత
సాక్షి, కామారెడ్డి: తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు పిల్లలను పెంచేందుకు ఆ నాయనమ్మ పడుతున్న కష్టాలపై కలెక్టర్ శరత్ స్పందించారు. కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈనెల 15న ‘సాక్షి’ ఫ్యామిలీ పేజీలో ‘ముగ్గురు పిల్లలు.. నాయనమ్మ’ కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఇది చదివిన కలెక్టర్.. భిక్షాటన చేస్తూ పిల్లలను పెంచుతున్న నాయనమ్మ గంగవ్వ కష్టాలను తెలుసుకుని చలించిపోయారు. అధికారులతో వివరాలు సేకరించారు. బు ధవారం సాయంత్రం కామారెడ్డి జిల్లా కుప్రియాల్ నుంచి గంగవ్వతో పాటు ఆమె మనవరాళ్లు చామంతి, వసంత, మనవడు శ్రీకాంత్‌ను తన చాంబర్‌కు పిలిపించుకుని మాట్లాడారు. (గంగవ్వను కదిలిస్తే కన్నీళ్లే..) కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇకపై భిక్షాటన చేయవద్దని గంగవ్వకు సూచించారు. తక్షణ సహాయంగా రూ. 50 వేలు ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. పెద్దమ్మా యి చామంతికి ఔట్సోర్సింగ్ కింద ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించారు. 9వ తర గతి చదువుతున్న వసంతను కేజీబీవీలో చేర్పించాలని, టెన్త్ చదువుతున్న శ్రీకాంత్‌ను వచ్చే సంవత్సరం గురుకుల కళాశాలలో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పూరిగుడిసెలో నివసిస్తున్న గంగవ్వకు డబు ల్ బెడ్రూం ఇల్లు కేటాయిస్తామన్నారు. కలెక్టర్ భరోసా ఇవ్వడంతో గంగవ్వ ఆ మె మనువడు, మనువరాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆదుకున్న కలెక్టర్‌కు, తమ కష్టాలను వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’కి రుణపడి ఉంటామని అన్నారు. -
సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైంది: జగిత్యాల కలెక్టర్
సాక్షి, జగిత్యాల(కరీంనగర్): జిల్లా పార్లమెంట్ ఎన్నికలకు జాతీయ స్థాయిలో ఉత్తమ ఎన్నికల నిర్వహణ అవార్డు రావడంతో కలెక్టర్ శరత్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తక్కువ సమయంలోనే ఎన్నికలను చక్కడా నిర్వహించామని, ఎన్నికల అధికారులు, పోటీ చేసిన అభ్యర్థుల సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. జిల్లా ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యత కూడా ఇందుకు కారణమని తెలిపారు. సమిష్టి కృషితో పని చేస్తూ ప్రజలకు మెరుగైనా సేవలను అందిస్తున్నామన్నారు. దేశస్థాయిలో తెలంగాణ నెంబర్ వన్‌గా నిలవడం సంతోషకరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. -
శరత్ మ్యాక్సివిజన్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంటి వైద్య రంగంలో ఉన్న మ్యాక్సివిజన్.. వరంగల్ కేంద్రం గా కార్యకలాపాలు సాగిస్తున్న శరత్ లేజర్ ఐ హాస్పిటల్‌ను కొనుగోలు చేసింది. అలాగే ఇరు సంస్థలు కలిసి శరత్ మ్యాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్ పేరుతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశాయి. ఈ జేవీలో మ్యాక్సివిజన్కు 51%, శరత్‌కు 49% వాటా ఉంటుంది. 2021 నాటికి జేవీ కింద 15 ఆసుపత్రులను స్థాపిస్తామని మ్యాక్సివిజన్ చైర్మన్ జీఎస్కే వేలు వెల్లడించారు. శరత్ లేజర్ ఐ హాస్పిటల్ ఫౌండర్ శరత్ బాబు చిలుకూరి, మ్యాక్సివిజన్ ఫౌండర్ మెంటార్ కాసు ప్రసాద్ రెడ్డితో కలిసి బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. బీఎస్సీ ఆప్టోమెట్రీ కోర్సులకు ఆప్టోమెట్రీ కళాశాలలను వరంగల్, హైదరాబాద్‌లో అందుబాటులోకి తెస్తామన్నారు. -
శరత్ తప్పుదోవ పట్టించాడు
నెన్నెల (బెల్లంపల్లి): మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లికి చెందిన యువ రైతు కొండపల్లి శరత్ సీఎం కేసీఆర్‌కు అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించాడని కొండపల్లి శంకరమ్మ కూతురు జ్యోతి ఆరోపిం చారు. మాభూమిని వీఆర్వో కరుణాకర్ తమకు తెలియకుండా కొండపల్లి శంకరమ్మ పేరిట పట్టా చేశారని శరత్ ఫేస్బుక్ పేజీలో లైవ్ వీడియో ఉంచడం, సీఎం స్పందించి రైతుతో మాట్లాడి సమస్య పరిష్కరించిన విషయం తెలిసిందే. ఈ విషయమై జ్యోతి మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో విలేకరులతో మాట్లా డారు. భూవివాదంపై ఇరువర్గాలతో చర్చించి సమన్యాయం చేయాల్సి ఉండగా సీఎం ఏకపక్ష ఆదేశాలతో అధికారులు తమకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. తాము హైదరాబాద్‌లో ఉండడం లేదని, రైతుబంధు డబ్బులు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఉద్యోగ రీత్యా శ్రీరాంపూర్‌లో నివసిస్తున్నామని తెలిపారు. ఫోన్లో భూమి ఎవరి పేరు మీద పట్టా మార్పిడి అయిందన్న కేసీఆర్.. పట్టా అయిన వారు మీకు ఏమవుతారని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. కొండపల్లి శంకరయ్య సాగు చేస్తున్న 7.01 ఎకరాల భూమి, తామం తా సాగు చేస్తున్న 2.25 ఎకరాల భూమి ఉమ్మడి ఆస్తి అని, అందరికీ సమానంగా పంచి తమకు న్యాయం చేయాలని జ్యోతి కోరింది. ఈ విషయమై శరత్ స్పందిస్తూ.. 30 ఏళ్ల నుంచి సర్వే నం.271/1ఏ లో ఉన్న భూమిని తామే సాగు చేసుకుంటున్నామని, తమకు సొంత పట్టా ఉందని పేర్కొన్నాడు. అసలు జరిగింది ఇదీ సేత్వార్ రికార్డు ప్రకారం సర్వే నం.270 విస్తీర్ణం 2.25 ఎకరాల భూమికి కొండపల్లి రాజలింగు పట్టాదారు కాగా సర్వే నం.271 విస్తీర్ణం 8.1 ఎకరాల భూమికి కొండపల్లి మల్లయ్య తండ్రి చంద్రయ్య పట్టాదారుగా ఉన్నాడు. మల్లయ్య మరణానంతరం అతని కుమారుడైన కొండపల్లి శంకరయ్యకు వారసత్వంగా 8.01 ఎకరాల భూమి పట్టా అయింది. అనంతరం శంకరయ్య ఎకరం భూమిని ఇతరులకు విక్ర యించగా 7.01 ఎకరాల భూమి అతడి పేరుపై పట్టా, యాజమాన్య హక్కులు కొనసాగుతూ వచ్చాయి. భూప్రక్షాళనలో ఇట్టి భూమి అదే గ్రామానికి చెందిన కొండపల్లి శంకరమ్మ ఖాతాలోకి మార్చబడింది. ఇరువురి మధ్య తరచూ పంచాయితీలు నడుస్తూ వచ్చాయి. పట్టా మార్చిన తహసీల్దార్ సస్పెన్షన్ బెల్లంపల్లి: సంచలనం సృష్టించిన భూపట్టా మార్పిడి కేసులో తహసీల్దార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నెన్నెల మండల తహసీల్దార్‌గా పనిచేసి బదిలీపై వెళ్లిన రాజలింగును సస్పెండ్ చేస్తూ గురువారం చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాజలింగు 2018 జనవరి 26న ఉద్యోగ బాధ్యతలు స్వీకరించా రు. భూ రికార్డుల ప్రక్షాళనలో నందులపల్లికి చెందిన కొండపల్లి శంకరయ్య పేరు మీద ఉన్న సర్వే నంబర్ 271/1ఎలోని 7.01 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన కొండపల్లి శం కరమ్మ పేరుమీద పట్టా మార్పిడి జరిగింది. వీఆర్వో కరుణాకర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పెద్దిరాజు కుమ్మక్కై పట్టా బదిలీ చేశారు. కలెక్టర్ విచారణ చేపట్టి తక్షణమే ఆర్ఐ, వీఆర్వోను సస్పెండ్ చేయగా తాజాగా తహసీల్దార్‌పై వేటు వేశారు. ప్రస్తుతం రాజలింగు కరీంనగర్ జిల్లా శంకరపట్నం తహసీల్దార్‌గా పని చేస్తున్నారు. కోర్టులో తేల్చుకోండి: కలెక్టర్ 2015 సంవత్సరం వరకు కొండపల్లి శంకరయ్య పేరు మీద భూమి ఉందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి అన్నారు. వీఆర్వో చేసిన తప్పిదం వల్ల కొండపల్లి శంకరమ్మ పేరు మీద మారిందని చెప్పారు. దీనిని ఈ నెల 25న సవరించేందుకు ఏర్పాట్లు చేశారని. కానీ ధరణి వెబ్సైట్ ఇబ్బందుల కారణంగా కాలేదన్నారు. సీఎం ఆదేశాలతో మరోసారి 27న మార్చినట్లు తెలిపారు. గతంలో భూమి పేరు మీద ఉంటే కోర్టులో అప్పీల్ చేసుకోవాలి. కోర్టు ఆదేశాల ప్రకారం ఎవరి పేరు మీద వస్తే వారి పేరు మీద మార్చుతామని చెప్పారు. లేదా కుటుంబ సభ్యులంతా కలసి వారసత్వం, వీరాసత్ చేసుకోండని సలహా ఇచ్చారు. గతంలో రైతుబంధు చెక్కు ఎవరికీ ఇవ్వలేదని, రైతుబంధు చెక్కు, పాసుపుస్తకం కొండపల్లి శంకరమ్మకు ఇచ్చినట్లు శరత్ తప్పుడు సమచారం ఇచ్చాడని కలెక్టర్ పేర్కొన్నారు. -
టీటీ మిక్స్డ్ డబుల్స్‌లో కాంస్యమే
టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ సెమీ ఫైనల్స్‌లో భారత జోడీ ఆచంట శరత్ కమల్–మనికా బాత్రా పరాజయం పాలై కాంస్యంతో సరిపెట్టుకుంది. బుధవారం సెమీస్‌లో చైనాకు చెందిన ఇంగ్షా సన్– వాంగ్ సన్ జంట 11–9, 11–5, 11–13, 11–4, 11–8 తేడాతో భారత జోడీని ఓడించింది. అంతకుముందు క్వార్టర్స్‌లో భారత్ 4–11, 12–10, 6–11, 11–6, 11–8తో ఉత్తర కొరియాపై, ప్రికార్వర్ట్స్లో 11–7, 7–11, 11–8, 10–12, 11–4 స్కోరుతో దక్షిణ కొరియాపై గెలుపొందింది. -
శరత్ హంతకుడ్ని కాల్చిచంపారు
భారత విద్యార్థి శరత్ హత్య కేసులో నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు మట్టుబెట్టారు. ఆదివారం కాన్సస్ సిటీ శివారులో జరిగిన ఎన్కౌంటర్లో అతన్ని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాన్సస్ నగర పోలీసులు ట్విటర్లో విషయాన్ని ధృవీకరించారు. మిస్సోరి: ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన శరత్ కొప్పు(తెలంగాణ.. వరంగల్ చెందిన వ్యక్తి)ని.. ఈనెల 4వ తేదీన ఓ స్టోర్ లో నిందితుడు కాల్చి చంపాడు. ఘటన తర్వాత నిందితుడు పారిపోగా.. అప్పటి నుంచి పోలీసుల వేట కొనసాగుతోంది. చివరకు కాన్సస్ సిటీ శివార్లలో నిందితుడు ఉన్నాడన్న సమాచారం అందుకుని.. పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే, లొంగిపోవాలని పోలీసులు కోరటంతో.. ఆ హంతకుడు పోలీసులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులకు గాయాలు అయ్యాయి. పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించడంతో అతను మరణించాడు. (అలా చేయకపోయి ఉంటే బతికేవాడేమో!) నిందితుడు తన వద్ద ఉన్న రైఫిల్ తో కాల్పులు జరిపాడని, దాంతో పోలీసులు ఎదురు కాల్పులకు దిగడంతో అతను మరణించాడు అని కాన్సస్ సిటీ పోలీస్ చీఫ్ రిక్ స్మిత్ వెల్లడించారు. ఈ ఎన్ కౌంటర్ లో గాయపడిన అధికారులను ఆసుపత్రికి తరలించామని, వారికి ప్రాణాపాయం తప్పిందని ఆయన తెలియజేశారు. శరత్ హత్య కేసు.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
అశ్రునయనాల మధ్య శరత్ అంత్యక్రియలు
కరీమాబాద్: అమెరికాలోని కెన్సాస్‌లో జూలై 7న దుండగుల కాల్పుల్లో మృతి చెందిన కొప్పు శరత్(26) అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య గురువారం ముగిశాయి. గురువారం ఉదయం శరత్ మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో వరంగల్ కరీమాబాద్‌లోని స్వగృహానికి తీసుకొచ్చారు. భవిష్యత్‌పై ఎన్నో ఆశలతో పొరుగు దేశానికి వెళ్లిన కుమారుడు ఊహించని రీతిలో విగతజీవిగా తిరిగిరావడంతో తల్లిదండ్రులు రామ్మోహన్, మాలతి, సోదరి అక్షర గుండెలవిసేలా రోదించారు. మధ్యాహ్నం కాశికుంటలోని హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేశారు. శరత్ కుటుంబానికి అండగా ఉంటాం: కడియం శరత్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. శరత్ మృతదేహానికి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖతో కలిసి ఆయన నివాళులు అర్పించారు. శరత్ తల్లిదండ్రులను ఓదార్చారు. శరత్ హత్య ఘటనపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. కొడుకు మృతి చెందిన వార్త విన్న తల్లి మాలతి ఐదు రోజులుగా అన్నం తినకుండా విలపిస్తోందని, ఆమె ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక వైద్యులు, అంబులెన్స్ ఏర్పాటు చేసి ఐవీ ప్లూయిడ్స్ ఇస్తున్నట్లు కడియం చెప్పారు. పర్వతగిరి మండలంలో ఈవోపీఆర్డీ గా పనిచేస్తున్న మాలతికి హైదరాబాద్ జీడబ్ల్యూఎంసీలో ఉద్యోగం కల్పిస్తామని, భార్యాభర్తలు హైదరాబాద్‌లోనే ఉద్యోగాలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. -
వరంగల్ చేరిన శరత్ మృతదేహం
సాక్షి, వరంగల్ : అమెరికాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన తెలుగు విద్యార్థి కొప్పు శరత్ మృతదేహం స్వస్థలం వరంగల్ లోని కరీమాబాద్ కు చేరింది. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్ళిన శరత్ శవమై తిరిగి రావడంతో కన్నవారు కన్నీరుమున్నీరు గా విలపిస్తున్నారు. కడసారి చూపు కోసం బంధువులు, మిత్రులు పెద్ద సంఖ్యలో శరత్ ఇంటికి చేరి అశృనివాళులు అర్పించారు. ప్రముఖుల నివాళులు : ఉన్నత విద్య కోసం వెళ్లి మృత్యువాత పడిన శరత్ కుటుంబాన్ని డిప్యూటీ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వరంగల్ రూరల్ కలెక్టర్ హరితలు పరామర్శించారు. అనంతరం శరత్ పార్థివ దేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. అంతకు ముందు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ శరత్ మృతదేహానికి నివాళులు అర్పించారు. హైదరాబాద్ వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన శరత్.. ఆ తర్వాత ఓ సాప్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. ముస్సోరి యూనివర్సిటీలో ఎంఎస్ సీటు రావటంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఆరు నెలల క్రితమే అమెరికా వెళ్లాడు. -
వరంగల్‌కు చేరిన శరత్ మృతదేహం
-
నేడు స్వగ్రామంలో శరత్ అంత్యక్రియలు
-
శరత్ కుటుంబానికి నేతల భరోసా
-
శరత్ కుటుంబానికి మంత్రులు, నేతల భరోసా
హైదరాబాద్: అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన విద్యార్థి శరత్ కొప్పు కుటుంబానికి అండగా ఉంటామని మంత్రులు, నేతలు భరోసా ఇచ్చారు. ఆదివారం అమీర్‌పేట జాగృతి ఎన్‌క్లేవ్‌లోని శరత్ నివాసానికి వెళ్లిన మంత్రులు కేటీఆర్, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాసయాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ బాల్క సుమన్, బండారు దత్తాత్రేయ.. శోకసంద్రంలో ఉన్న విద్యార్థి తల్లిదండ్రులు రామ్మోహన్, మాలతిలను ఓదార్చారు. శరత్ మృతికి సంతాపం ప్రకటించి అతని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. శరత్ మరణం బాధాకరం: కేటీఆర్ దుండగుడి కాల్పుల్లో శరత్ దుర్మరణం చెందడం బాధాకరమని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దారుణమైన ఈ ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి, బాధను వ్యక్తం చేశారని.. కుటుంబానికి అండగా నిలవాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఘటనపై అమెరికా దౌత్య కార్యాలయ రీజినల్ పాస్‌పోర్టు అధికారితోపాటు షికాగో కాన్సులేట్ అధికారులతో ఫోన్లో మాట్లాడామన్నారు. భారత దౌత్య అధికారుల వివరాల ప్రకారం.. హత్యకు పాల్పడిన నిందితుడు ఎవరన్నది తెలియరాలేదన్నారు. హత్యకు గల కారణాలు తెలియడానికి మరికొంత సమయం పట్టొచ్చని చెప్పారు. అమెరికాలో శని, ఆదివారాలు సెలవు అయినందున భౌతిక కాయాన్ని హైదరాబాద్ తరలించేందుకు 4, 5 రోజులు పట్టే అవకాశం ఉందన్నారు. ‘కుటుంబ సభ్యులు, బంధువులు అమెరికా వెళ్లాలనుకుంటే ప్రభుత్వపరంగా అత్యవసర వీసాలు, ప్రయాణ ఖర్చులు, ఏర్పాట్లు చేస్తామని చెప్పాం. వారు ఆలోచించుకుని చెబుతామన్నారు’అని కేటీఆర్ తెలిపారు. కాన్సస్‌లో చాలామంది తెలుగువారున్నారని.. అక్కడి వారితో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడారని చెప్పారు. మరోవైపు శరత్ కొప్పు మృతిపై అమెరికా కాన్సులెట్ జనరల్ కథెరిన్ బి హడ్డా తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శరత్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో శరత్ తల్లిదండ్రులు: కడియం దుండగుడిని పట్టుకోడానికి అమెరికా పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని మంత్రి కడియం చెప్పారు. దుండగుడిని గుర్తించిన వారికి నగదు పారితోషికం కూడా ప్రకటించారన్నారు. తీవ్ర దుఃఖంలో ఏం మాట్లాడలేని పరిస్థితిలో శరత్ తల్లిదండ్రులు ఉన్నారని, తల్లి మాలతి మంచినీరు కూడా తీసుకోవడం లేదన్నారు. వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని వైద్యులను సీఎం ఆదేశించారని చెప్పారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో మాట్లాడి త్వరగా మృతదేహన్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ తెలిపారు. శరత్ మృతదేహాన్ని రీజినల్ హబ్ సర్చ్ ఆస్పత్రిలో భద్రపరిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బిల్లు చెల్లింపులో గొడవ! ఎంఎస్ చేస్తూనే అక్కడి ఓ రెస్టారెంట్లో శరత్ పని చేస్తున్నట్లు తెలిసింది. దుండగుడు కాల్పులు జరిపింది కూడా ఆ రెస్టారెంట్లోనేనని శరత్ సోదరికి అతని స్నేహితులు ఫోన్లో చెప్పినట్లు సమాచారం. బిల్లు చెల్లించే విషయంలో దుండగుడికి శరత్‌కు గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో దుండగుడు తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడని, పారిపోయేందుకు శరత్ ప్రయత్నించినా అప్పటికే 5 బుల్లెట్లు శరీరంలోకి దూసుకెళ్లడంతో ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందినట్లు తెలిసింది. గొడవకు గల కారణాలు తెలుసుకోడానికి విచారణ చేస్తున్నామని భారత దౌత్య కార్యాలయ అధికారులకు అక్కడి పోలీసులు తెలిపినట్లు సమాచారం. అన్ని విధాలా సాయం చేస్తాం: సుష్మ శరత్ మృతిపై విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన వివరాలను పోలీసుల ద్వారా> తెలుసుకుంటున్నామని, విద్యార్థి కుటుంబానికి అన్ని విధాలా సాయం చేస్తామని ట్వీట్ చేశారు. శరత్ తండ్రితో మట్లాడానని, కుటుంబ సభ్యులు కాన్సస్ వెళ్లాలనుకుంటే వీసా ఏర్పాటు చేస్తామన్నామని పేర్కొన్నారు. భౌతిక కాయాన్ని త్వరగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. -
శరత్ కొప్పు : 3 గంటల్లో 25 వేల డాలర్లు
కన్సాస్ : గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో మరణించిన శరత్ కొప్పు(26) మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడం కోసం చేపట్టిన క్రౌడ్ ఫండింగ్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. కేవలం మూడు గంటల్లో 25 వేల డాలర్ల విరాళాలు అందాయి. అమెరికాలో శరత్‌తో పాటు ఉంటున్న అతని కజిన్ రఘు ‘గో ఫండ్ మీ’ అనే అకౌంట్ ద్వారా నిధులను సేకరిస్తున్నారు. హైద్రాబాద్ వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన శరత్.. ఆ తర్వాత ఓ సాప్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. ముస్సోరి యూనివర్సిటీలో ఎంఎస్ సీటు రావటంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఆరు నెలల క్రితం అక్కడికి వెళ్లాడు. అయితే శరత్ క్యాంపస్‌లోనే పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నాడని మాత్రమే తమకు తెలుసని, రెస్టారెంట్లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలీదని తండ్రి రామ్మోహన్ చెబుతున్నారు. త్వరలో శరత్ సోదరి వివాహం ఉంది. ఆ వేడుకకు వచ్చేందుకు శరత్ సిద్ధమయ్యాడు. ఇంతలోనే ఆ ఇంట విషాదం నెలకొంది. -
పరిగెత్తడంతోనే శరత్ ప్రాణాలు గాల్లోకి...
గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో భారతీయ విద్యార్థి కొప్పు శరత్(26) ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీ దృశ్యాలను స్థానిక మీడియా ఛానెళ్లకు విడుదల చేసిన కాన్సస్ నగరం పోలీసులు.. నిందితుడిని పట్టించిన వారికి నజరానా ఇస్తామని ప్రకటించారు. అయితే పరిగెత్తటంతోనే శరత్ ప్రాణాలు గాల్లో కలిసిపోయానని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. మిస్సోరి: కాన్సస్ నగరంలోని ఓ రెస్టారెంట్లో వరంగల్‌కు చెందిన శరత్ పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం డ్యూటీలో ఉండగా ఓ వ్యక్తి రెస్టారెంట్లోకి వచ్చి గన్‌తో బెదిరింపులకు పాల్పడ్డాడు. భయంతో రెస్టారెంట్ సిబ్బందితోపాటు ముగ్గురు కస్టమర్లు టేబుళ్ల కింద నక్కారు. కానీ, శరత్ మాత్రం భయంతో పరుగులు తీయటంతో.. నిందితుడు శరత్‌పై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఘటన తర్వాత నిందితుడు పారిపోగా.. బయటకు వచ్చిన సిబ్బంది ఎమర్జెన్సీ నంబర్ 911కు కాల్ చేసి సమాచారం అందించారు. శరత్‌ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించిన అధికారులు.. నిందితుడి చిత్రాలను విడుదల చేసి పట్టించిన వారికి 10,000 డాలర్ల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. సాక్షి, హైదరాబాద్/వరంగల్: శరత్ మృతితో అతని స్వస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హైద్రాబాద్ వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన శరత్.. ఆ తర్వాత ఓ సాప్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. ముస్సోరి యూనివర్సిటీలో ఎంఎస్ సీటు రావటంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఆరు నెలల క్రితం అక్కడికి వెళ్లాడు. అయితే శరత్ క్యాంపస్‌లోనే పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నాడని మాత్రమే తమకు తెలుసని, రెస్టారెంట్లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలీదని తండ్రి రామ్మోహన్ చెబుతున్నారు. త్వరలో శరత్ సోదరి వివాహం ఉంది. ఆ వేడుకకు వచ్చేందుకు శరత్ సిద్ధమయ్యాడు. ఇంతలోనే ఆ ఇంట విషాదం నెలకొంది. పరామర్శించిన కేటీఆర్.. కాగా, శరత్ కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘దౌత్య సిబ్బందితో మాట్లాడాం. కుటుంబ సభ్యులు వెళ్లాలనుకుంటే అమెరికాకు పంపించే ఏర్పాట్లు చేస్తాం. వీలైనంత త్వరగా మృత దేహం ఇక్కడికి వచ్చేలా చూస్తాం’ అని కేటీఆర్ అన్నారు. ‘ప్రస్తుతం శరత్ మృత దేహాం ఇంకా ఆస్పత్రిలోనే ఉంది. ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత ఇండియన్ ఎంబసీకి పంపిస్తారు. అక్కడ క్లియరెన్స్ లభించాక ఇండియాకు తరలిస్తారు. ఈ ప్రక్రియకు రెండు రోజులు పట్టొచ్చు అని అధికారులు పేర్కొన్నట్లు’ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. -
మరణం తర్వాత కూడా ప్రేమ కోసం...
శరత్, కారుణ్య జంటగా నటించిన చిత్రం ‘సీత... రాముని కోసం’. తస్మయ్ చిన్మయ ప్రొడక్షన్, రోల్ కెమెరా యాక్షన్ పతాకాలపై ఇబాక్స్ తెలుగు టీవీ సమర్పణలో అనిల్ గోపిరెడ్డి దర్శకత్వంలో శిల్పా శ్రీరంగం, సరితా గోపిరెడ్డి, డా నంద నిర్మించారు. ఈ చిత్రం టీజర్, మేకింగ్ వీడియోను ఒకేసారి ఇటు హైదరాబాద్‌లోను అటు అమెరికాలోను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ మేకింగ్‌ని హీరో తల్లి జ్యోతి రిలీజ్ చేయగా, టీజర్‌ని స్వామి చిదాత్మానంద రిలీజ్ చేశారు. స్వామి చిదాత్మానంద మాట్లాడుతూ – ‘‘టీజర్ చాలా బాగుంది. చిన్నప్పట్నుంచి హీరో కావాలన్నది శరత్ కల. ఈ చిత్రంతో అది నెరవేరింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని ఆశీర్వదిస్తున్నాను’’ అన్నారు. అనిల్ గోపిరెడ్డి మాట్లాడుతూ– ‘‘వైకుంఠ పాళి’, ‘బిస్కెట్’ చిత్రాల తర్వాత రెండేళ్ల పాటు ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేశాను. ఫస్ట్ ఐ ఫోన్ లో టెస్ట్ షూట్ చేసిన తర్వాత రెడ్ కెమెరాతో ఈ చిత్రాన్ని షూట్ చేశాం. డెఫినెట్‌గా ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. శరతకి ఇది ఫస్ట్ సినిమా అయినా ఎంతో ఎక్స్పీరియస వున్న హీన్లా నటించాడు. ఓ అబ్బాయిని ఒక అమ్మాయి ఎంతలా ప్రేమించింది? తాను చనిపోయాక కూడా ఆ ప్రేమను పొందడానికి ఎలా పరితపించింది? అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ చిత్రానికి మ్యూజిక్ నేనే చేశాను. మొత్తం 5 పాటలున్నాయి. సెకండాఫ్ అంతా ఒళ్ళు గగుర్పొడిచే విధంగా వుంటుంది’’ అన్నారు. ‘‘టీజర్ అద్భుతంగా వుంది. సినిమా దానికంటే రెండింతలు వుంటుంది’’ అన్నారు హీరో శరత్. అద్భుతమైన పాత్ర చేశానని హీరోయిన్ కారుణ్య చెప్పారు. పాటల రచయిత వెంగి, మాటల రచయిత వేణు రాచరల తదితరలు పాల్గొన్నారు. -
ఎవరికీ వ్యతిరేకం కాదు
భాను, శరత్, కారుణ్య, హరిణి, అనుషా, జై ముఖ్య తారలుగా సాయిరామ్ దాసరి దర్శకత్వంలో హరీష్ కుమార్ గజ్జల నిర్మించిన సినిమా ‘ద్యావుడా’. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ప్రజల్ క్రిష్ స్వరపరచిన ఈ సినిమా పాటలను షకీలా విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ–‘‘ ట్రైలర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. మంచి కంటెంట్‌తో వస్తున్నా చిన్న సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుతున్నా’’ అన్నారు. ‘‘ఈ నెల 13న విడుదల సినిమాను విడుదల చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులకూ సినిమా నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం. మా సినిమా ఎవరికీ వ్యతిరేకం కాదు’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: తరుణ్. -
'మా అక్కను కూడా ఫాలో అవుతున్నారు'
బెంగళూరు : 'వాళ్లు మా అక్కను కూడా ఫాలో అవుతున్నారు. ఆమె చేస్తున్న పనులన్నీ చెబుతున్నారు. వారు చెప్పే వివరాలు అన్నీ కూడా సరైనవే' అని హత్యకు గురికావడానికి ముందు శరత్ అనే విద్యార్థి తన తండ్రికి వాట్సాప్ ద్వారా పంపించిన వీడియోలో వివరించాడు. బెంగళూరులో ఆదాయపు పన్ను శాఖలో సీనియర్ అధికారిగా పనిచేస్తున్న నిరంజన్ కుమార్ అనే వ్యక్తి కుమారుడైన శరత్ ను కిడ్నాప్ చేసిన దుండగులు దారుణంగా హత్య చేశారు. కెంగెరీలోని తన ఇంటికి సమీపంలో శరత్ ఈ నెల (సెప్టెంబర్) 12న కిడ్నాప్‌కు గురయ్యాడు. ఈ కిడ్నాప్ కేసు విచారణ చేపట్టిన పోలీసులు, శుక్రవారం రోజు శరత్ మృతి చెందినట్టు గుర్తించారు. నగర శివార్లలో రామోహల్లి సరస్సులో శరత్ మృతదేహం లభ్యమైంది. ఇప్పటికే ఈ హత్య కేసుకు సంబంధించి శరత్ స్నేహితుడు విశాల్‌తో పాటు మరో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొత్తగా తాను తీసుకున్న బైక్‌ను స్నేహితులకు చూపించేందుకని బయటకు వెళ్లిన శరత్‌ను దుండగులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అతడి ఫోన్ నుంచే తండ్రికి రెండు వీడియోలు వాట్పాప్ ద్వారా పంపించారు. -
ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని..
యువతి బలవన్మరణం ⇒మృతదేహంతో నిందితుడి ఇంటి ఎదుట బంధువుల ఆందోళన ⇒పర్వతగిరి గ్రామ శివారు సోమ్లాతండాలో విషాదం ⇒పోలీసుల చొరవతో సద్దుమణిగిన వివాదం ⇒ప్రియుడితో పాటు తల్లిదండ్రులపై కేసు నమోదు మహబూబాబాద్ రూరల్ : ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్థాపానికి గురైన ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబాబాద్ మండలంలోని పర్వతగిరి గ్రామశివారు సోమ్లాతండాలో మంగళవారం జరిగింది. స్థానికులు, రూరల్ ఎస్సై పత్తిపాక జితేందర్ కథనం ప్రకారం... సోమ్లాతండాకు చెందిన బానోత్ లాలు, పద్మ దంపతుల కుమార్తె లలిత(19) ఇంటర్ వరకు చదువుకుని ఇంటి వద్దే ఉంటోంది. ఇదేతండాకు చెందిన బాదావత్ మంగ్యా, లక్ష్మీ దంపతుల కుమారుడు శరత్ 10వ తరగతి వరకు చదువుకుని ఖాళీగా ఉంటున్నాడు. లలిత, శరత్ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. లలిత తనను పెళ్లి చేసుకోమని ఎన్నిసార్లు కోరినా అతడు వాయిదా వేస్తూ వచ్చాడు. దీంతో లలిత తల్లిదండ్రులు తండా పెద్దమనుషులను ఆశ్రయించి లలితకు న్యాయం చేయాలని కోరారు. పెద్దమనుషులు బాదావత్ శరత్ ఇంటికి వెళ్లి అతడి తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పించే విధంగా చూశారు. అయినా వారు పెళ్లికి నిరాకరించారు. తన తండ్రి పెళ్లికి ఒప్పుకోవడం లేదు. ఈ క్రమంలో లలిత సోమవారం శరత్‌ను మహబూబాబాద్‌లో కలిసింది. తనను పెళ్లి చేసుకోమని వేడుకుంది. అయినా అతడు వినలేదు. దీంతో లలిత రైలుపట్టాలపైకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. ఆమె బంధువులు లలితను వారించి ఇంటికి తీసుకెళ్లారు. నాలుగేళ్లపాటు ఎంతో నమ్మకంతో ప్రేమించిన శరత్ పెళ్లికి నిరాకరించడంతో మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో ఇంట్లోని ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన మృతురాలి కుటుంబ సభ్యులు లలిత మృతదేహాన్ని తీసుకువెళ్లి ప్రియుడు బాదావత్ శరత్ ఇంటి ఎదుట ఉంచి ఆందోళనకు దిగారు. లలిత మృతి చెందిన విషయం తెలుసుకున్న బాదావత్ శరత్, అతడి తల్లిద్రండులు మంగ్యా, లక్ష్మీ ఇంటికి తాళం వేసి పరారయ్యారు. జెడ్పీటీసీ సభ్యుడు మూలగుండ్ల వెంకన్న, టీడీపీ జిల్లా కార్యదర్శి భూక్య సునీత, పర్వతగిరి సర్పంచ్ గుగులోత్ వీరన్న, ఎంపీటీసీ సభ్యురాలు బాణోత్ కళ్యాణిహరిబాబు సంఘటన స్థలానికి చేరుకొని మృతురాలి కుటుంబ çసభ్యులను ఓదార్చారు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ రూరల్ ఎస్సై పత్తిపాక జితేందర్ అక్కడికి చేరుకుని మృతురాలి బంధువులతో మాట్లాడి శాంతింపజేశారు. లలిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రియుడు బాదావత్ శరత్, తల్లిదండ్రులు మంగ్యా, లక్ష్మీపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు రూరల్ ఎస్సై తెలిపారు. -
మార్కెటింగ్ కమిషనర్‌ది కోర్టు ధిక్కారమే
► తేల్చిన హైకోర్టు.. రూ. ఐదు వేల జరిమానా ► నాలుగు వారాల్లో న్యాయ సేవాధికార సంస్థకు జమ చేయాలి ► లేకపోతే వారం రోజులు జైలుశిక్ష అనుభవించాలి ► తేల్చి చెప్పిన న్యాయస్థానం సాక్షి, హైదరాబాద్: మార్కెటింగ్ శాఖ కమిషనర్ శరత్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని ఉమ్మడి హైకోర్టు తేల్చి చెప్పింది. ఇందుకు ఆయనకు రూ. ఐదు వేల జరిమానా విధించింది. నాలుగు వారాల్లో ఈ మొత్తాన్ని తెలంగాణ న్యాయసేవాధికార సంస్థకు జమ చేయాలని శరత్‌ను ఆదేశించింది. లేదంటే 7 రోజుల సాధారణ జైలుశిక్షను అనుభవించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు సోమవారం తీర్పు వెలువరించారు. వెజిటబుల్ కమీషన్ ఏజెంట్ల సంక్షేమ సంఘం సభ్యులు మొదట కార్వాన్‌లోని మార్కెట్లో వ్యాపారం చేసేవారు. తరువాత ప్రభుత్వం ఆ మార్కెట్‌ను గుడిమల్కాపూర్‌కు మార్చి అక్కడ వారికి షాపులు కేటాయించింది. తరువాత ప్రత్యేకంగా గదుల రూపంలో షాపుల నిర్మాణానికి ఒక్కో వ్యాపారి నుంచి రూ. 25వేలు వసూలు చేసింది. నిర్మాణాలు పూర్తయిన తరువాత వారి నుంచి ఒక్కో షాపుకు రూ. 1,875 అద్దె డిమాండ్ చేసింది. దీనిపై వెజిటబుల్ కమీషన్ ఏజెంట్ల సంక్షేమ సంఘం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇతర మార్కెట్ యార్డుల్లో చేసిన విధంగా షాపులను తమకు 99 ఏళ్ల లీజుకు గానీ, శాశ్వత ప్రాతిపదికన అమ్మడం గానీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ 2000 సంవత్సరంలో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించాలని, దీనిపై మూడు నెలల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని మార్కెటింగ్ శాఖను ఆదేశించింది. దీని ప్రకారం సంక్షేమ సంఘం సభ్యులు ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించారు. అయితే ఇప్పటి వరకు మార్కెటింగ్ శాఖ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిని సవాలు చేస్తూ సంఘం సభ్యులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి పిటిషనర్ల వినతిపత్రంపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని మరోసారి మార్కెటింగ్ శాఖను ఆదేశించారు. అయినప్పటికీ స్పందించక పోవడంతో వారు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పి. గంగయ్య నాయుడు వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ రామలింగేశ్వరరావు మార్కెటింగ్ శాఖ అధికారులు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని తేల్చారు. ఇందుకు మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఎ.శరత్‌ను బాధ్యుడిగా చేస్తూ అతనికి రూ. 5 వేల జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించారు. -
ర్యాపిడ్ యాక్షన్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో కరెంటు నిరసన సెగలు భగ్గుమన్న నేపథ్యంలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ యుద్ధ ప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఉరుకులు పరుగుల మీద జిల్లా యంత్రాంగాన్ని రంగంలోకి దించారు. విస్తృతమైన తనిఖీలు, పరిశీలనలు, సమీక్షలు, సమావేశాలతో ఇటు విద్యుత్, అటు రెవిన్యూ అధికారులను హడలెత్తించారు. మొత్తానికి కరెంటు కోతలు ఉన్నప్పటికీ అందుబాటులో కరెంటుతోనే బోరు మోటార్లలోని నీళ్లను నారు మళ్లలోకి పారించి, నిరసన సెగలను చల్లార్చారు. సోమవారం చేగుంట మండలం నార్సింగి వద్ద 44 నంబర్ జాతీయ రహదారిపై విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతులు ఆందోళన చేపట్టగా, వారిపై పోలీసులు లాఠీచార్జి చేసిన నేపథ్యంలో ఇన్చార్జి కలెక్టర్ శరత్ విద్యుత్ , రెవిన్యూ అధికారులను పరుగులు పెట్టించారు. తీవ్రమైన కరెంటు కోతల నేపథ్యంలో రైతు ఉద్యమం ఇంకా తీవ్రతరం అవుతుందేమోనని భయపడిన ప్రభుత్వానికి శరత్ ‘ర్యాపిడ్ యాక్షన్’ తారకమంత్రంగా పని చేసింది. మంగళవారం రైతులకు కొంతవరకు కరెంటు అందుబాటులో ఉండటంతో వారు కొద్దిగా శాంతించారు. సోమవారం రాత్రికి రాత్రే జిల్లాలో విద్యుత్ సరఫరా, వినియోగం వివరాలను శరత్ తెప్పించుకున్నారు. జిల్లాకు విద్యుత్ కేటాయింపులు, అందులో పరిశ్రమల వినియోగమెంత? వ్యవసాయానికి ఏ మేరకు వాడుకుంటున్నారు, గృహ అవసరాలకు ఎంత ఖర్చు చేస్తున్నారు..? తదితర వివరాలు తెప్పించుకున్న ఆయన పక్కా ప్రణాళికతో మంగళవారం జిల్లా విద్యుత్ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో డిమాండ్ తగినంత విద్యుత్ సర ఫరా లేకపోయినప్పటీ ఉన్న కరెంటునే ఎలా వాడుకోవాలో అధికారులకు వివరించారు. 24 గంటలు అందుబాటులో... జిల్లాలో మొత్తం 613 ఫీడర్లు ఉన్నాయి. ప్రతి సబ్ స్టేషన్ వద్ద విద్యుత్ శాఖ ఏఈ, ఏడీఈ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఇంజనీర్లు రైతులకు అందుబాటులో ఉండటం లేదని, ఫీడర్లను వదిలేసి వెళ్లిపోవడంతోనే సమస్యలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మీదట విద్యుత్ ఇంజనీర్లు 24 గంటలు రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. ఏఈ, ఏడీఈ ఫోన్ నంబర్లు ప్రతి పంచాయతీ, మండల వ్యవసాయ శాఖ, తహశీల్దార్ కార్యాలయాల నోటీసు బోర్డులో ఉంచాలన్నారు. కలెక్టరేట్లో ప్రత్యేక ఫిర్యాదుల సెల్ ఏర్పాటు చేశారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా 08455272527 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. సాగుకిచ్చిన తర్వాతే... వ్యవసాయానికి అవసరమైనంత విద్యుత్‌ను సరఫరా చేశాకే, పరిశ్రమలకు ఇవ్వాలని డాక్టర్ శరత్ ట్రాన్స్‌కో ఎస్ఈ రాములును ఆదేశించారు. సమగ్రమైన నిర్వాహణ పద్ధతులు, సమయ పాలన పాటించి విద్యుత్ సమస్య నుంచి గట్టెక్కాలని సూచించారు. ఇక మీదట ఫీడర్ల నుంచి రైతులకు వెళ్తున్న విద్యుత్ వివరాలను ఎప్పటికప్పుడు తనకు అందించాలని ఆయన ఆదేశించారు. -
లాఠీచార్జిపై మంత్రి సీరియస్
సంగారెడ్డి మున్సిపాలిటీ : చేగుంట మండలం నార్సింగ్ వద్ద రైతులపై జరిగిన లాఠీచార్జి ఘటనపై సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి హరీష్‌రావు తీవ్రంగా స్పందించారు. దీనిపై ఇన్చార్జి కలెక్టర్ శరత్‌ను విచారణ జరపాలని ఆదేశించారు. ఈ మేరకు మెదక్ ఆర్డీవో వనజాదేవి విచారణ జరిపి అందజేసిన నివేదిక ఆధారంగా చేగుంట విద్యుత్‌శాఖ సహాయ ఇంజనీర్ పెంట్యానాయక్‌ను సస్పెండ్‌చేస్తూ శరత్ ఉత్తర్వులు జారీ చేశారు. రామాయంపేట అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అధికారి శ్రీనివాస్‌రెడ్డిని బదిలీ చేయాలని ట్రాన్స్‌కో ఎస్ఈకి సిఫార్సు చేశారు. విద్యుత్ సరఫరాపై రైతులకు వాస్తవ పరిస్థితులు తెలియజేయడంలో ఏఈ విఫలమయ్యారని, రైతులకు అందుబాటులో లేరని ఆర్డీవో విచారణలో తేలిందని శరత్ తెలిపారు. ఏడీఈ సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలిపారు. ఆర్డీవో నివేదికఆధారంగా ఏఈని సస్పెండ్ చేసినట్టు చెప్పారు. జిల్లాలో విద్యుత్ శాఖ ఏఈలు, ఏడీఈలు విద్యుత్ సరఫరాను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి రైతులకు కనీసం 6 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. జిల్లాలో పారిశ్రామికరంగానికి విద్యుత్ కోతను విధించైనా రైతులకు మెరుగైన విద్యుత్‌సరఫరా చేయాలని ఆ శాఖ ఎస్ఈని ఇన్చార్జి కలెక్టర్ ఆదేశించారు. అంతకుముందు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు ఇన్చార్జి కలెక్టర్‌తో విద్యుత్ సరఫరాపై సమీక్షించినట్టు సమాచారం. -
రాజమణికే రాజదండం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఊహించినట్లుగానే జెడ్పీ చైర్మన్ పీఠాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. స్పష్టమైన మెజార్టీలేనప్పటికీ జిల్లా పరిషత్ చైర్పర్సన్, వెస్ చైర్మన్ పదవులతోపాటు రెండు కోఆప్షన్ పదవులను టీఆర్ఎస్ దక్కించుకుంది. ఊహించినట్లుగానే టీఆర్ఎస్ నర్సాపూర్ జెడ్పీటీసీ ఎర్రగొల్ల రాజమణి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఇన్చార్జి కలెక్టర్ శరత్ ఆధ్వర్యంలో శనివారం జెడ్పీ సమావేశమందిరంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైస్ చైర్మన్, కోఆప్షన్ సభ్యుల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సునీతాపాటిల్పై 12 ఓట్ల మెజార్టీతో రాజమణి జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా నంగునూరు జెడ్పీటీసీ రాగుల సారయ్య ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి సంగమేశ్వర్పై 12 ఓట్ల మెజార్టీతో సారయ్య వైస్ చైర్మన్‌గా గెలుపొందారు. కోఆప్షన్ సభ్యులుగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎం.డి.అమీనుద్దీన్, ఎస్.డి.మొయిజుద్దీన్‌లు ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్‌లో స్పష్టమైన మెజార్టీ లేనప్పటికీ కాంగ్రెస్, టీడీపీ జెడ్పీటీసీలు కూడా టీఆర్ఎస్కే మద్దతు తెలపడంతో అన్ని పదవులనూ అధికార పార్టీ సొంతం చేసుకుంది. మంత్రి హరీష్‌రావు వ్యూహాత్మక ఎత్తుగడల వల్లే ఎన్నిక ఏకపక్షంగా సాగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు, టీడీపీకి చెందిన నలుగురు జెడ్పీటీసీలను తమవైపు తిప్పుకోవటంలో హరీష్‌రావు సఫలీకృతులయ్యారు. దీనికితోడు కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేయకపోవటం, టీడీపీ కూడా చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఓటింగ్‌పై విప్ జారీ చేయకపోవడం టీఆర్ఎస్కు కలిసివచ్చింది. మొదట ప్రమాణస్వీకారం.. అనంతరం కోఆప్షన్ ఎన్నిక జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఎలాంటి ఉత్కంఠ లేకుండా అంతా ఏకపక్షంగా సాగింది. ఇన్చార్జి కలెక్టర్ శరత్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 1 గంటకు జెడ్పీలో పరోక్ష విధానంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మొదట టీఆర్ఎస్ జెడ్పీటీసీలు సమావేశమందిరంలోకి రాగా తర్వాత కాంగ్రెస్, టీడీపీ సభ్యులు ఇలా మొత్తం 46 మంది జెడ్పీటీసీలు హాజరయ్యారు. మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కిష్టారెడ్డి, గీతారెడ్డిలు సమావేశానికి వచ్చారు. తొలుత ఇన్చార్జి కలెక్టర్ శరత్ కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. ఆ తర్వాత కోఆప్షన్ సభ్యుల ఎన్నిక జరిగింది. కోఆప్షన్ సభ్యులుగా టీఆర్ఎస్ పార్టీ నుంచి కొండాపూర్ మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన ఎం.అమీనుద్దీన్, కోహీర్ మండలం కవేలి గ్రామానికి చెందిన ఎస్.డీ మొయిజుద్దీన్ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ముర్తుజా అలీ, ఎం.ఎ.రశీద్ పోటీలో నిలిచారు. కోఆప్షన్ పదవులకు ఎన్నికలు నిర్వహించగా టీఆర్ఎస్ అభ్యర్థులు అమనుద్దీన్, మొయిజుద్దీన్లకు మద్దతుగా 29 మంది జెడ్పీటీసీలు చేతులు ఎత్తారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థులు ముర్తుజాఅలీ, ఎం.ఎ.రషీద్‌లకు మద్దతుగా కేవలం 17 మంది జెడ్పీటీసీలు చేతులెత్తారు. దీంతో ఇన్చార్జి కలెక్టర్ శరత్ టీఆర్ఎస్ అభ్యర్థులు ఎం.డి అమీనుద్దీన్, ఎస్.డి.మొయిజుద్దీన్‌లు కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైనట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ కోఆప్షన్ అభ్యర్థులకు కాంగ్రెస్ నుంచి నలుగురు, టీడీపీ నుంచి నలుగురు జెడ్పీటీసీలు మద్దతు పలికారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ రెండు కోఆప్షన్ పదవులు కైవసం చేసుకుంది. ఏకపక్షంగా సాగిన ఎన్నిక జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎన్నిక ఏకపక్షంగా సాగింది. టీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ ఉండటంతో ఆ పార్టీకి చెందిన రాజమణి చైర్‌పర్సన్‌గా, సారయ్య వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించగా, టీఆర్ఎస్ నుంచి చైర్పర్సన్ అభ్యర్థిగా నర్సాపూర్ జెడ్పీటీసీ రాజమణి పేరును మెదక్ జెడ్పీటీసీ లావణ్య ప్రతిపాదించగా, చేగుంట జెడ్పీటీసీ శోభారాణి బలపర్చారు. కాంగ్రెస్ పార్టీ తరఫున జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా సునీతాపాటిల్ పేరును జహీరాబాద్ జెడ్పీటీసీ కిషన్‌రావు పవార్ ప్రతిపాదించగా, మునిపల్లి జెడ్పీటీసీ రజియుద్దీన్ బలపర్చారు. దీంతో అధికారులు చైర్పర్సన్ పదవికి ఎన్నిక నిర్వహించగా రాజమణికి మద్దతుగా 29 మంది జెడ్పీటీసీలు చేతులు పెకైత్తి మద్దతు పలికారు. టీఆర్ఎస్కు చెందిన 21 మంది జెడ్పీటీసీలతోపాటు కాంగ్రెస్‌కు చెందిన జెడ్పీటీసీలు చిట్టిమాధురి(కొండపాక), జి.సుమన(తూప్రాన్), స్వప్న(పాపన్నపేట), సత్తయ్య(ములుగు), టీడీపీ జెడ్పీటీసీలు రామచంద్రం(జగదేవ్‌పూర్), పోచయ్య(వర్గల్), వెంకటేశ్‌గౌడ్(గజ్వేల్), శ్రీకాంత్‌గౌడ్(పటాన్చెరు) రాజమణి అభ్యర్థిత్వానికి మద్దతుగా చేతులు పైకి ఎత్తారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి సునీతాపాటిల్కు కేవలం 17 మంది కాంగ్రెస్ జెడ్పీటీసీలు మాత్రమే చేతులు ఎత్తి మద్దతు పలికారు. దీంతో 12 ఓట్ల మెజార్టీతో రాజమణి జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఇక వైస్ చైర్మన్ పదవికి టీఆర్ఎస్ నుంచి నంగునూరు జెడ్పీటీసీ రాగుల సారయ్య, కాంగ్రెస్ నుంచి సదాశివపేట జెడ్పీటీసీ సంగమేశ్వర్ పోటీ పడ్డారు. సారయ్యకు 29 మంది మద్దతు తెలపగా, సంగమేశ్వర్‌ను 17 మంది జెడ్పీటీసీలు బలపర్చారు. దీంతో 12 ఓట్ల మెజార్టీతో రాగుల సారయ్య వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవులు దక్కటంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాబూమోహన్, చింతా ప్రభాకర్, మదన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డిలు చైర్పర్సన్ రాజమణి, వైస్ చైర్మన్ సారయ్యను అభినందించారు. చైర్పర్సన్ ఎన్నిక ముగిసిన వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గీతారెడ్డి, కిష్టారెడ్డి, జెడ్పీటీసీలు ప్రత్యేక సమావేశంలో పాల్గొనకుండా వెళ్లిపోయారు. -
దండుకుంటే దండనే
గజ్వేల్: విత్తనాలు, ఎరువుల విక్రయంలో ఎమ్మార్పీ కంటే ఒక్క పైసా వసూలు చేసినా సహించేది లేదని ఇన్చార్జి కలెక్టర్ శరత్ స్పష్టం చేశారు. రవాణా, హమాలీ చార్జీల పేరుతో దండుకోవాలనుకుంటే దండన తప్పదని ఆయన హెచ్చరించారు. శుక్రవారం గజ్వేల్‌లో వ్యవసాయశాఖ అధికారులు, ఫెర్టిలైజర్ దుకాణాల డీలర్లు, రెవెన్యూ అధికారులతో ఇన్చార్జి కలెక్టర్ శరత్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ , ఎరువులు, విత్తనాల అమ్మకాల్లో అక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈనెల 17 నుంచి తాను కూడా ఆకస్మిక తనిఖీలను నిర్వహించనున్నట్లు ఇన్చార్జి కలెక్టర్ శరత్ వెల్లడించారు. జిల్లాకు అవసరమైన మేర ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచుతామని, అయినా ఎవరైనా వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించాలనుకుంటే సహించేదిలేదన్నారు. కలెక్టరేట్లో రైతుల కోసం ప్రత్యేకంగా 08455-272525 నంబర్‌పై ఫిర్యాదు సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎలాంటి అక్రమాలు జరిగినా ముందుగా అధికారులను కూడా బాధ్యులను చేసి, వారిపైనా కూడా చర్యలు తీసుకుంటామన్నారు. డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే క్రిమినల్ చర్యలు తప్పవన్నారు. ఈ సందర్భంగా పలువురు డీలర్లు తాము ఎమ్మార్పీపై విక్రయాలు జరిపితే రవాణా చార్జీల భారం, హమాలీ భారం తమపైనే పడుతుందని, ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని రైతుల వద్ద ఆ డబ్బులు తీసుకునేలా అనుమతి ఇవ్వాలని చేసిన విజ్ఞప్తిపై ఇన్చార్జి కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మార్పీ కంటే ఒక్క పైసా ఎక్కువ వసూలు చేసినా సహించేదిలేదన్నారు. పకడ్బందీ పంపిణీకి సిద్ధం జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 5 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. ఇందులో భాగంగానే పత్తి 1.73 లక్షల హెక్టార్లు, వరి 90 వేల హెక్టార్లు, మొక్కజొన్న 1.50 లక్షల హెక్టార్లలో, మిగతా విస్తీర్ణంలో కూరగాయలు, ఇతర పంటలు సాగవుతాయని భావిస్తున్నారు. ఇందుకోసం అన్ని విత్తనాలు కలుపుకొని సుమారుగా 77 వేల క్వింటాళ్లు, సీజన్ ముగిసేసరికి కాంప్లెక్స్, యూరియా తదితర ఎరువులు కలుపుకొని 1.54 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని గుర్తించారు. అయితే ఈ అలాట్మెంట్ ఏటా పద్ధతి ప్రకారం సరఫరా కాకపోవడంతో ప్రతిఏటా రైతులకు సమస్యలెదురవుతున్నాయి. డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో రైతులు రోడ్లెక్కుతున్నారు. అందువల్లే ఈసారి పకడ్బందీగా విత్తనాలు, ఎరువులను పంపిణీ చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే గతేడాది మాదిరిగానే విత్తనాలు, ఎరువుల దుకాణాలపై నిఘా పెంచే క్రమంలో ఈసారి కూడా 3 నుంచి 6 దుకాణాలకు ఒక అధికారిని ఇన్చార్జిగా నియమించేందుకు ఇన్చార్జి కలెక్టర్ శరత్ నిర్ణయించారు. గజ్వేల్‌లో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఇన్చార్జి అధికారులు ఆయా దుకాణాల్లో నిత్యం క్రయవ్రియాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. నిబంధనలు పాటించని దుకాణదారునిపై మండల వ్యవసాయాధికారికి, లేదా ఏడీఏకు ఇన్చార్జి అధికారులు రిపోర్ట్ చేయగానే తక్షణ చర్యలు తీసుకునేలా ఆదేశాలిచ్చారు. అక్రమాలకు పాల్పడినట్లు తేలితే క్రిమినల్ చర్యలకు వెనకాడవద్దని నిర్ణయించారు. సమావేశంలో గజ్వేల్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేకాధికారి హన్మంతరావు, జేడీఏ హుక్యానాయక్, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
తూప్రాన్, న్యూస్‌లైన్: గజ్వేల్ నియోకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ఐకేపీ ద్వారా ఐదు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జేసీ శరత్ తెలిపారు. తూప్రాన్ మండలం యావపూర్‌లో గురువారం రాత్రి ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీఆర్డీఎ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని కేసీఆర్ అడిగినట్లు జేసీ తెలిపారు. అయితే గత ఏడాది గజ్వేల్ కొనుగోలు కేంద్రంలో సేకరించిన ధాన్యం విషయంలో కొంత గొడవ జరిగిన విషయాన్ని గుర్తుచేశారు. ఇందుకోసం ప్రస్తుత సీజన్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సమైక్య సంఘాల వారు ముందుకు రాని కారణంగా జాప్యం నెలకొందని తెలిపారు. వెంటనే నియోజకవర్గంలో ఐదు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు 94 కొనుగోలు కేంద్రాల ద్వారా 23 వేల మేట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యాన్ని నాణ్యమైనదిగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వల్ల మిల్లర్లకు చెక్ పెట్టడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రూ.1345 ధర కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు 72 గంటల్లో తమ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందన్నారు. అయితే బ్యాంకుల్లో జమ అయిన డబ్బులను బ్యాంకు అధికారులు రైతుల రుణాలకు మళ్లించినట్లయితే బ్యాంకు అధికారులపై తక్షణమే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐకేపీ మహిళలకు కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించినందుకు వందకు రూ.2.5 శాతం కమిషన్ వస్తోందన్నారు. ఇందుకోసం మహిళలు జాగ్రత్తగా ధాన్యాన్ని సేకరించాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ స్వామి, డిప్యూటీ తహశీల్దార్ కిషన్, ఐకేపీ ఏపీఎం యాదగిరి, ఆర్ఐలు సంతోష్‌కుమార్, నర్పింహారెడ్డి, సర్పంచ్ గోరీబీ, గ్రామ సమైక్య సంఘం మహిళలు నర్మద, రేణుక, తదితరులు పాల్గొన్నారు. -
ఓటు హక్కుపై అవగాహన కల్పించాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: త్వరలో నిర్వహించనున్న ఎన్నికల్లో యువ ఓటర్లతో పాటు ఓటు హక్కు వినియోగించుకోని ఓటర్లను సైతం ఓటింగ్‌లో పాల్గొనేలా చైతన్యం చేయడానికి జిల్లా వ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు జేసీ శరత్ పేర్కొన్నారు. ఓటర్లు పోలింగ్‌లో తప్పనిసరిగా పాల్గొనాలని కోరుతూ అవగాహన, భాగస్వామ్యం కార్యక్రమ నిర్వహణపై గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమంలో జేసీ శరత్ మాట్లాడుతూ ఓటర్లు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని గ్రామైక్య సంఘాలు, యువకులతో చైతన్య ర్యాలీలు నిర్వహించాలన్నారు. గతంలో ఏ పోలింగ్ బూత్‌లు లేదా గ్రామాల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదైందో గుర్తించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. గ్రామైక్య సంఘాల సమావేశాల్లోనూ ఓటు హక్కు వినియోగించుకొనే అంశం చర్చనీయాంశంగా ఉండాలని తెలిపారు. ఓటు హక్కు వినియోగం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఓటు హక్కు ప్రాధాన్యత, పాత్రపై కళాశాల స్థాయిలోను చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. మండల, నియోజకవర్గం, డివిజన్ స్థాయిలో యువతతో ర్యాలీలు నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఆర్వో దయానంద్, జెడ్పీ సీఈఓ ఆశీర్వాదం, డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, డీఐఓ శాంతికుమార్, తదితరులు పాల్గొన్నారు. సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించాలి కలెక్టరేట్: ఎన్నికల నిర్వహణ ప్రతి అధికారికి గౌరవనీయమైన బాధ్యతగా గుర్తించి సమర్థవంతంగా నిర్వహించాలని జేసీ శరత్ సూచించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై గురువారం కలెక్టరేట్లో ఎంపీడీఓలు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 17న ప్రాదేశిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. ప్రతి మండల రిటర్నింగ్ అధికారి సమర్థవంతంగా విధులు నిర్వహించాలని, ఎన్నికలు సజావుగా జరిగేలా బాధ్యతలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రూపొందించిన నిబంధనలను తూచ తప్పకుండా పాటించాలన్నారు. ఈనెల 17 నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, 21న నామినేషన్ల స్కూృటినీ ఉంటుందన్నారు. నామినేషన్ల ఉపసంహరణ 24న మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంటుందన్నారు. ఎంపీటీసీగా నామినేషన్ వేసే ఎస్సీ,ఎస్టీ,బీసీలకు రూ.1250, ఇతరులకు రూ. 2500 డిపాజిట్ చేయాలన్నారు. జెడ్పీటీసీ అభ్యర్థులకు ఎస్సీ,ఎస్టీ, బీసీలకు రూ.2500, ఇతరులకు రూ.5వేలు డిపాజిట్ చేయాలని సూచించారు. నామినేషన్, స్కూృటినీ, రిటర్నింగ్ అధికారులు మాత్రమే చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఉంటేనే నామినేషన్లు స్వీకరించాలన్నారు. స్కూృటినీ సమయంలో పాటించాల్సిన నిబంధనలు రిటర్నింగ్ అధికారులకు వివరించారు. ఎలాంటి నామినేషన్లను తిరస్కరించవచ్చో తెలిపారు. అర్హులైన అభ్యర్థుల పేర్లను నోటీసు బోర్డులో అతికించాలన్నారు. పోటీ చేసే అభ్యర్థుల పేర్లను తెలుగు వర్ణమాల క్రమంలో తయారు చేసి గుర్తులు కేటాయించాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించని, పార్టీలపై, పార్టీ అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఓటరు స్లిప్పులను పంపిణీ చేయాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఆశీర్వాదం, సంగారెడ్డి డివిజన్ పంచాయతీ అధికారి మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎస్ఆర్ నిధులు చెల్లించాల్సిందే..
కలెక్టరేట్, న్యూస్‌లైన్: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద నిధులు చెల్లించాల్సిందేనని పరిశ్రమల యాజమాన్యాలను కలెక్టర్ స్మితా సబర్వాల్ ఆదేశించారు. సీఎస్ఆర్ కింద వివిధ పరిశ్రమల నుంచి రూ.46 కోట్లకు గాను కేవలం రూ.90 లక్షలు మాత్రమే రావడంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధులు రాబట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ‘కార్పొరేట్ సామాజిక బాధ్యత’ నిధుల అంశంపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిశ్రమలు చెల్లించాల్సిన వాటిలో 50 శాతం నిధులను ఈ నెలాఖరులోగా జమ చేయాలని సూచించారు. డివిజన్ స్థాయిలో అధికారులు పరిశ్రమల యాజమాన్యాలతో చర్చించి సీఎస్ఆర్ నిధులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిశ్రమలు తమ ఇష్టానుసారంగా నిధులు ఖర్చు చేయరాదన్నారు. జిల్లా కమిటీ ఆమోదం మేరకే పనులను చేపట్టాలన్నారు. వారి బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వండి.. సీఎస్ఆర్ నిధులు చెల్లించేందుకు ఉత్సాహం చూపని పరిశ్రమల బ్యాంకు నిర్వహణ ఖాతాల వివరాలను తెలియజేయాల్సిందిగా లీడ్ బ్యాంకు మేనేజర్‌ను కలెక్టర్ ఆదేశించారు. నిధులు చెల్లించని ఆయా పరిశ్రమల బ్యాంకు ఖాతాలను సీజ్ చేసేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఆయా నిధులను వివిధ అభివృ ద్ధి సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తామన్నారు. అందుకు సంబంధించి పూర్తి వివరాలను జిల్లా వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామన్నారు. సమావేశంలో జేసీ శరత్, డీఐసీ జీఎం సురేశ్‌కుమార్, సీపీఓ గురుమూర్తి, లేబర్ కమిషనర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈలు పాల్గొన్నారు. -
‘స్మార్ట్’ ఏజెన్సీలపై కేసులు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉపాధి హామీ పథకంలో భాగంగా జిల్లాలో అమలవుతున్న కార్యక్రమాలను జాయింట్ కలెక్టర్ శరత్ ఇటీవల పూర్తి స్థాయిలో సమీక్షిస్తున్నారు. కలెక్టర్ స్మితా సభర్వాల్ ఆదేశాల మేరకు ఇందిర జల ప్రభ, ఇందిరమ్మ పచ్చతోరణం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పథకం తదితరాలను పట్టాలెక్కించే ప్ర యత్నాల్లో ఉన్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు సకాలంలో డబ్బులు అందేలా చర్యలు చేపడుతున్నట్లు జేసీ శరత్ వెల్లడించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) పీడీగా అదనపు బా ధ్యతలు నిర్వర్తిస్తున్న జేసీ శరత్ ఉపాధి హామీ పథకం అమలు పురోగతిని శనివారం ‘సాక్షి’కి వివరించారు. తొమ్మిది వేల ఎకరాలు సాగులోకి జిల్లాలో ఇందిర జలప్రభ కింద వేసిన 1,500కు పైగా బోరుబావులు విజయవంతమయ్యాయి. వీటిలో 694 బావులకు గతంలో విద్యుదీకరణ పూర్తయింది. గతంలో చాలా చోట్ల బోర్‌వెల్స్ తవ్వకం పూర్తయినా, కరెంటు కనెక్షన్లు, మోటార్లు లేకపోవడం వంటి కారణాలతో ఫలితం లేకుండా పోయింది. కేవలం 20 రోజుల వ్యవధిలో 970 బావులను విద్యుద్దీకరించగలిగాం. 1,073 పంపుసెట్లను ఠమొదటిపేజీ తరువాయి అమర్చగలిగాం. తొమ్మిది వేల ఎకరాలను బోరు బావుల కింద సాగులోకి తెచ్చేందుకు ప్ర యత్నాలు చేస్తున్నాం. ఇందిర జలప్రభ పథకం కింద ఎంపిక చేసిన భూముల్లో డ్రిప్ అమర్చడ ంతో పాటు పండ్ల తోటల పెంపకం కూడా చేపట్టాల్సి ఉంది. ఏపీఎంఐసీ, ఉద్యానవన శాఖ లను సమన్వయం చేస్తూ నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశాం. ఏడాదంతా ఆదాయం ఇందిరమ్మ పచ్చతోరణం పథకంలో భాగంగా జిల్లాలో 2.75 లక్షల మొక్కలు నాటాల్సి ఉంది. గతంలో 67 వేల గుంతలు తీయగా, ప్రస్తుతం 98 వేలకు పైగా పూర్తి చేశాం. 81 వేలకు మొక్కలు నాటేలా చూశాం. మొక్కల బాగోగులను చూసే లబ్ధిదారులకు డబ్బుల చెల్లింపు కూడా సకాలంలో జరిగేలా చూస్తున్నాం. ఈ నెల 31 కల్లా లక్ష్యం పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించాం. పచ్చతోరణంలో కేవలం మామిడి మొక్కల పెంపకానికే పరిమితం కాకుండా ఏడాదంతా లబ్ధిదారులకు ఆదాయం లభించేలా జామ, సపోటా వంటి మొక్కలను కూడా నాటాల్సిందిగా ప్రోత్సహిస్తున్నాం. తహశీల్దార్లను కూడా కార్యక్రమంలో అమలులో భాగస్వాములను చేశాం. మంజూరులో అలసత్వం నివారిస్తాం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పథకం కింద మంజూరు, నిర్మాణం త్వరితగతిన జరిగేలా చర్యలు చేపట్టాం. డిసెంబర్ ఆరంభంలో 63 వేల వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు కాగా, ప్రస్తుతం 83 వేలకు చేరింది. మరో 34 వేల నిర్మాణాలు పురోగతిలో ఉండగా, 11వేలకు పైగా పూర్తయ్యాయి. గతంలో మరుగుదొడ్లు నిర్మించుకున్న కూలీల డ బ్బులు చెల్లించడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయి. 2007 నుంచి పెండింగులో ఉన్న రూ.1.20 కోట్ల వేతన మొత్తం జనవరి రెండో తేదీలోగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేసేలా చర్యలు చేపట్టాం. వేతన చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్మార్ట్‌కార్డ్ ఏజెన్సీల ఇన్సెంటివ్ చెల్లింపును ఇప్పటికే నిలిపేశాం. వేతన చెల్లింపు సక్రమంగా చేయకుంటే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని నోటీసులు కూడా జారీ చేశాం. -
పనిచేసినా పైసలేవీ?
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పథకం(ఐహెచ్ఎస్ఎల్)లో పనిచేసిన కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా రూ.1.20 కోట్లు కూలీ డబ్బులు చెల్లించాలి. 2007 నుంచి ఇప్పటివరకు డబ్బుల చెల్లింపు సక్రమంగా జరగకపోవడంలో పనిచేసిన కూలీలు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ స్మార్ట్ కార్డ్ ఏజెన్సీలు కూడా ముఖం చాటేస్తున్నాయి. జనవరి రెండో తేదీలోగా చెల్లింపులు జరపని ఏజెన్సీలపై కేసులు నమోదు చేయనున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానిస్తూ నిర్మాణ పనిలో పాల్గొనే లబ్ధిదారు లేదా కూలీలకు డబ్బులు చెల్లించాలనే నిబంధన విధించారు. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణ వ్యయం రూ.9,100 కాగా, ఇందులో కూలీలకు రూ.2,235 చెల్లించాల్సి వుంటుంది. పని చేసిన 15 రోజుల్లో కూలీలకు డబ్బులు చెల్లించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. లేనిపక్షంలో కూలీలు అధికారులపై ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది. అయితే జిల్లాలో 2007 నుంచి ఇప్పటివరకు సుమారు రూ.1.20 కోట్ల మేర కూలీ డబ్బుల చెల్లింపు నిలిచిపోయింది. కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై కనీసం సమీక్ష జరిపిన నాథుడు కూడా లేకపోవడంతో ఏళ్ల తరబడి డబ్బుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. అనామతు ఖాతా(సస్పెండెడ్ అకౌంట్)లో ఉన్న డబ్బును కూలీలకు అందజేయాల్సిన ఈజీఎస్ అధికారులు సమస్య పరిష్కరించే దిశలో ప్రయత్నించిన దాఖలా లేదు. ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు జిల్లాలో ఫినో, జీరోమాస్, ఏపీ ఆన్లైన్ అనే స్మార్ట్‌కార్డ్ ఏజెన్సీల ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. కూలీల వివరాలను బయోమాస్ పద్ధతిలో నమోదు చేసి, వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరవాల్సి ఉంది. జిల్లాలో ఏడు వేలకు పైగా కూలీలకు సంబంధించిన డబ్బులు ప్రస్తుతం అనామిక ఖాతాలో వున్నాయి. వీరిని బయోమాస్ పద్ధతిలో నమోదు చేయాల్సిన ఏజెన్సీలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. వలసలు, మరణాలు తదితరాలను సాకుగా చూపుతూ ఏళ్ల తరబడి కూలీ డబ్బులు చెల్లించేందుకు చర్యలు తీసుకోవడం లేదు. కొరవడిన సమన్వయం ఈజీఎస్ అధికారులు, స్మార్ట్‌కార్డ్ ఏజెన్సీల నడుమ సమన్వయం కొర వడటంతో బయోమాస్ పద్ధతిలో వివరాలు నమోదు కావడం లేదు. జాయింట్ కలెక్టర్ శరత్ ఇటీవల జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీగా అదనపు బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితిలో కొంత మార్పు కనిపిస్తోంది. సుమారు 3,400 కూలీల వివరాలు నమోదు చేసి ఖాతాలు తెరిచినట్లు స్మార్ట్‌కార్డ్ ఏజెన్సీలు లెక్కలు చూపుతున్నాయి. జనవరి రెండో తేదీ లోగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పథకంలో పనిచేసిన కూలీలకు డబ్బులు చెల్లించాల్సిందిగా జేసీ శరత్ గడువు విధించారు. ఏపీ ఆన్లైన్ మినహా జీరోమాస్, ఫినో ఏజెన్సీలు మాత్రం ఇంకా బయోమాస్ పద్ధతిలో వివరాల నమోదు కూడా పూర్తి చేయలేదని సమాచారం. క్రిమినల్ కేసులు: నిర్దేశిత గడువులోగా కూలీలకు డబ్బు చెల్లించని ఏజెన్సీలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. మండల స్థాయిలో లబ్ధిదారులను గుర్తించి తక్షణమే చెల్లింపులు పూర్తి చేయాలి. ఈ నెల 31న చెల్లింపులపై పూర్తి స్థాయిలో సమీక్ష జరుపుతాం. భవిష్యత్తులో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పథకం కింద మంజూరయ్యే పనులకు తక్షణమే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. -జేసీ శరత్ -
రైతు ప్రయోజనాల మేరకే ‘మద్దతు’ నిర్ణయించాలి
సంగారెడ్డి టౌన్, న్యూస్‌లైన్: చెరుకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మద్దతు ధరను ప్రకటించాలని జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ చక్కెర కర్మాగారాల యాజమాన్యాలకు సూచించారు. చెరుకు మద్దతు ధర నిర్ణయించేందుకు కలెక్టర్ తన చాంబర్లో జిల్లాలోని చక్కెర కర్మాగారాల ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. చక్కెర ధర తక్కువగా ఉండడం వల్ల ఫ్యాక్టరీలు నష్టాల్లో ఉన్నాయని సమావేశంలో పాల్గొన్న ఆయా కంపెనీల ప్రతినిధులు కలెక్టర్‌కు వివరించారు. గత ఏడాది నిర్ణయించినట్లుగానే ఈ సారి కూడా క్వింటాలు చెరుకుకు రూ. 2,600 చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కంపెనీల ప్రతినిధులు తెలిపారు. దీంతో ఆగ్రహించిన రైతు సంఘాల నాయకులు కంపెనీలకు ఏ రోజు కూడా నష్టం రాలేదన్నారు. చెరకు క్రషింగ్ తర్వాత చక్కెర ధర పెరిగినప్పటికీ ఏ కంపెనీ యాజమమాన్యం కూడా రైతులకు అదనంగా ధర ఇవ్వలేదన్నారు. అలాంటప్పు డు ఇపుడు చక్కెర ధర తక్కువగా ఉందని చెరకుపంటకు తక్కువ ధర ఇవ్వడం సమంజ సంగా లేదన్నారు. ఇరు వర్గాల ప్రతిపాదనలు విన్న కలెక్టర్ స్పందిస్తూ, ఈ ఏడాది రైతులకు కూలీ, రవాణా, ముడిసరుకుల ధర అధికంగా పెరిగాయని వాటిని దృష్టిలో ఉంచుకుని ధర నిర్ణయించాలన్నారు. కనీస మద్దతు ధరగా రూ.2,720 పెంచుతూ నిర్ణయం తీసుకోవాలన్నారు. ఫ్యాక్టరీ ప్రతినిధులు వారి యాజమాన్యాలతో చర్చించి సోమవారమ ఉదయం వరకు సంబంధిత నివేదికను అందజేయాలన్నారు. లేని పక్షంలో కమిటీ వేసి ధరను తామే నిర్ణయించాల్సి వస్తుందన్నారు. ఆ కమిటీ నిర్ణయించిన ధరను ఫ్యాక్టరీ యాజమాన్యాలు, రైతులు స్వాగతించాల న్నారు. సమావేశంలో జేసీ శరత్, కేన్ అసిస్టెంట్ కమిషనర్ వెంకట రవి, మాగి సీడీసీ చైర్మన్ నర్సింహారెడ్డి, మంజీర రైతు సమాఖ్య జిల్లా అధ్యక్షుడు పృథ్విరాజ్, రైతు సంఘం నాయకులు నర్సింహరామ శర్మ, రవీందర్, జయరాజ్, యాదిగిరిరెడ్డిలతో పాటు ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
పేదలకు వరం రచ్చబండ
పుల్కల్, న్యూస్‌లైన్: రచ్చబండ కార్యక్రమం పేదలకు వరమని పుల్కల్ మాజీ జడ్పీటీసీ మల్లప్ప అన్నారు. పుల్కల్ ఎంపీడీఓ కార్యాలయ సమీపంలో మంగళవారం జరిగిన రచ్చ బండ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలన్నదే రచ్చబండ ముఖ్య ఉద్దేశమన్నారు. గ్రామస్థాయిలోని ప్రతి పేదవాని ఇంటికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. మండలానికి ఇప్పటికే సుమారు 9 వందల కోట్లను డిప్యూటీ సీఎం మంజూరు చేశారన్నారు. సింగూర్ కాలువకు 99కోట్లు, సుల్తాన్పూర్ జేఎన్టీయూకు 3 వందల కోట్లు, సింగూర్ బ్రిడ్జి , గ్రామీణ రోడ్లు, ప్రభూత్వ భవనాలు, మురికి కాల్వలు, అంతర్గత రోడ్ల నిర్మాణానికి డిప్యూటి సీఎం నిధులు మంజూరు చేయించారన్నారు. ప్రతి గ్రామంలో తాగు నీటి సమస్య లేకుండా ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. మండలంలోని 25 గ్రామ పంచాయితీలకు ప్రభుత్వ నిధులు అందుతున్నాయన్నారు. సీఎం ఫ్లెక్సీ తొలిగించాల్సిందే రచ్చ బండ కార్యక్రమం ప్రారంభంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ శరత్ మాట్లాడుతుండగా స్థానిక టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, తెలంగాణ వాదులు ఫ్లెక్సీపై ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చిత్రపటాన్ని తొలగించాలని పట్టుబట్టారు. దీంతో చేసేదిలేక జేసీ శరత్ తన ప్రసంగాన్ని పూర్తి చేయకుండానే స్టేజీ దిగి వెళ్లిపోయారు. రచ్చబండలో ఎస్సీ, ఎస్టీలకు లబ్ధి రచ్చబండ కార్యక్రమం వల్ల ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని మండల స్పెషలాఫీసర్ ఉషామార్తా పేర్కొన్నారు. మండలంలో 972 పింఛన్లు, 332 రేషన్ కార్డులు, 11 వందల 53 ఇండ్లు మంజూరయ్యాయని, ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ కింద విద్యుత్ వినియోగదారులకు రూ. కోటి 10 లక్షల53 వేలు లబ్ధి చేకూరిందన్నారు. కార్యక్రమంలో జిల్లా కో ఆపరేటివ్ డెరైక్టర్ రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.