సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉపాధి హామీ పథకంలో భాగంగా జిల్లాలో అమలవుతున్న కార్యక్రమాలను జాయింట్ కలెక్టర్ శరత్ ఇటీవల పూర్తి స్థాయిలో సమీక్షిస్తున్నారు. కలెక్టర్ స్మితా సభర్వాల్ ఆదేశాల మేరకు ఇందిర జల ప్రభ, ఇందిరమ్మ పచ్చతోరణం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పథకం తదితరాలను పట్టాలెక్కించే ప్ర యత్నాల్లో ఉన్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు సకాలంలో డబ్బులు అందేలా చర్యలు చేపడుతున్నట్లు జేసీ శరత్ వెల్లడించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) పీడీగా అదనపు బా ధ్యతలు నిర్వర్తిస్తున్న జేసీ శరత్ ఉపాధి హామీ పథకం అమలు పురోగతిని శనివారం ‘సాక్షి’కి వివరించారు.
తొమ్మిది వేల ఎకరాలు సాగులోకి
జిల్లాలో ఇందిర జలప్రభ కింద వేసిన 1,500కు పైగా బోరుబావులు విజయవంతమయ్యాయి. వీటిలో 694 బావులకు గతంలో విద్యుదీకరణ పూర్తయింది. గతంలో చాలా చోట్ల బోర్‌వెల్స్ తవ్వకం పూర్తయినా, కరెంటు కనెక్షన్లు, మోటార్లు లేకపోవడం వంటి కారణాలతో ఫలితం లేకుండా పోయింది. కేవలం 20 రోజుల వ్యవధిలో 970 బావులను విద్యుద్దీకరించగలిగాం. 1,073 పంపుసెట్లను ఠమొదటిపేజీ తరువాయి
అమర్చగలిగాం. తొమ్మిది వేల ఎకరాలను బోరు బావుల కింద సాగులోకి తెచ్చేందుకు ప్ర యత్నాలు చేస్తున్నాం. ఇందిర జలప్రభ పథకం కింద ఎంపిక చేసిన భూముల్లో డ్రిప్ అమర్చడ ంతో పాటు పండ్ల తోటల పెంపకం కూడా చేపట్టాల్సి ఉంది. ఏపీఎంఐసీ, ఉద్యానవన శాఖ లను సమన్వయం చేస్తూ నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశాం.
ఏడాదంతా ఆదాయం
ఇందిరమ్మ పచ్చతోరణం పథకంలో భాగంగా జిల్లాలో 2.75 లక్షల మొక్కలు నాటాల్సి ఉంది. గతంలో 67 వేల గుంతలు తీయగా, ప్రస్తుతం 98 వేలకు పైగా పూర్తి చేశాం. 81 వేలకు మొక్కలు నాటేలా చూశాం. మొక్కల బాగోగులను చూసే లబ్ధిదారులకు డబ్బుల చెల్లింపు కూడా సకాలంలో జరిగేలా చూస్తున్నాం. ఈ నెల 31 కల్లా లక్ష్యం పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించాం. పచ్చతోరణంలో కేవలం మామిడి మొక్కల పెంపకానికే పరిమితం కాకుండా ఏడాదంతా లబ్ధిదారులకు ఆదాయం లభించేలా జామ, సపోటా వంటి మొక్కలను కూడా నాటాల్సిందిగా ప్రోత్సహిస్తున్నాం. తహశీల్దార్లను కూడా కార్యక్రమంలో అమలులో భాగస్వాములను చేశాం.
మంజూరులో అలసత్వం నివారిస్తాం
వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పథకం కింద మంజూరు, నిర్మాణం త్వరితగతిన జరిగేలా చర్యలు చేపట్టాం. డిసెంబర్ ఆరంభంలో 63 వేల వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు కాగా, ప్రస్తుతం 83 వేలకు చేరింది. మరో 34 వేల నిర్మాణాలు పురోగతిలో ఉండగా, 11వేలకు పైగా పూర్తయ్యాయి. గతంలో మరుగుదొడ్లు నిర్మించుకున్న కూలీల డ బ్బులు చెల్లించడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయి. 2007 నుంచి పెండింగులో ఉన్న రూ.1.20 కోట్ల వేతన మొత్తం జనవరి రెండో తేదీలోగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేసేలా చర్యలు చేపట్టాం. వేతన చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్మార్ట్‌కార్డ్ ఏజెన్సీల ఇన్సెంటివ్ చెల్లింపును ఇప్పటికే నిలిపేశాం. వేతన చెల్లింపు సక్రమంగా చేయకుంటే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని నోటీసులు కూడా జారీ చేశాం.
‘స్మార్ట్’ ఏజెన్సీలపై కేసులు
Published Sun, Dec 29 2013 2:03 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement
Advertisement