smithasabarwal
-
నీటిపారుదల అదనపు బాధ్యతలపై స్మితాసబర్వాల్ అయిష్టత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతల్లో కొనసాగడం పట్ల ఐఏ ఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ప్రభుత్వం వద్ద అయిష్టత వ్యక్తం చేసినట్లు తెలిసింది. నీటిపారుదల శాఖపై నిర్వహిస్తున్న సమీక్షలకు ఆమె ఎందుకు రావడం లేదని ఇటీవల ఆ శాఖమంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించగా.. ఈ మేరకు అధికారులు వివరణ ఇచ్చినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కార్యదర్శిగా వ్యవహరించిన స్మితా సబర్వాల్ ప్రస్తుతం మిషన్ భగీరథ విభాగం కార్యదర్శిగా కొనసాగుతున్నారు. రజత్‌కుమార్ పదవీ విరమణ చేసిన సమయంలో స్మితా సబర్వాల్‌కు నీటిపారుదల శాఖ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగి స్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జా రీచేశారు. అయితే ఆమె ఆ బాధ్యతలు స్వీకరించలేదు. నీటిపారుదల శాఖ కార్య దర్శిగా పూర్తి బాధ్యతలు అప్పగిస్తే ఆ పోస్టులో కొనసాగుతానని స్మితా సబర్వాల్ పేర్కొన్నారని ఆశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఫైళ్లపై సంతకాలు చేయడానికి కూడా ఆమె అయిష్టత వ్యక్తంచేయడంతో రెండు వారాలుగా ముఖ్యమైన ఫైళ్లు పెండింగ్‌లో ఉండిపోయాయని వెల్లడించారు. -
నిహారిక..నేనున్నా..!
⇒ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగు.. ⇒ సర్కార్ తరపున సాయం అందించేందుకు కృషి.. ⇒ భరోసనిచ్చిన సీఎం వ్యక్తిగత కార్యదర్శి స్మితాసబర్వాల్ పెగడపల్లి : ‘నిహారిక బాధపడకు... త్వరలో నీవు సంపూర్ణ ఆరోగ్యం పొందుతావు... నీకు కావాల్సిన సాయాన్ని ప్రభుత్వం తరపునా అందేలా కృషిచేస్తా..’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తి గత కార్యద ర్శి స్మితాసబర్వాల్ డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్న నిహారికకు భరోసానిచ్చింది. పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన సిగిరి కళావతి కూతురు నిహారిక(17) ఇంటర్ చదివింది. ఏడేళ్లుగా డయాబెటీస్‌తో బాధపడుతోంది. వ్యాధి నివారణ కోసం డయాబెటీస్ హోమిక్స్ ఆఫ్ ఇండియా సంస్థ నుంచి చికిత్స పొందుతోంది. హైదరాబాద్‌లోని మేక్ ఏ విష్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో నిహారిక పాల్గొంది. స్మితాసబర్వాల్ అంటే తనకు ఇష్టమని, ఆమెతో మాట్లాడాలని ఉందని తన కోరికను వెల్లడించింది. దీంతో ఫౌండేషన్ చొరవతో మంగళవారం స్మితాసబర్వాల్ పెగడపల్లికి వచ్చారు. నిహారికను పరామర్శించి ఆమె కుటుంబసభ్యులతో మాట్లాడారు. సుమారు గంటపాటు వారితో గడిపారు. కుటుంబ నేపథ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మందులకు నెలకు రూ.5వేలు ఖర్చు అవుతున్నాయని, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని, తమను ఆదుకోవాలని నిహారిక తల్లి కళావతి వేడుకుంది. దీంతో స్మితాసబర్వాల్ ‘వ్యాధి ఉందని బాధపడకుండా ముందుకు సాగితే విజయం సాధిస్తావు’ అని నిహారికకు ఆత్మస్థయిర్యం నింపారు. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి సివిల్స్‌లో తర్ఫీదుపొంది మంచి ఉద్యోగం సాధించాలని ఆకాంక్షిచారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు తాను చేస్తానని భరోసానిచ్చారు. స్వయం ఉపాధి కోసం వృత్తివిద్యలో శిక్షణ పొందాలని, ఏదైనా తాత్కాలిక ఉద్యోగం ఇప్పిస్తానని తల్లి కళావతికి సూచించారు. ఆమె వెంట జగిత్యాల సబ్‌కలెక్టర్ కృష్ణభాస్కర్, మేక్ ఏ విష్ ఫౌండేషన్ డాక్టర్ పుష్పదేవి, జెడ్పీటీసీ సభ్యురాలు వసంత, ఎంపీపీ సత్తయ్య, సర్పంచి రాజు ఉన్నారు. -
కౌంటర్ దాఖలుకు టీ సర్కార్‌కు మరింత గడువు
హైదరాబాద్: 'ఔట్లుక్' మ్యాగజైన్ కథనం వివాదంలో ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్‌కు న్యాయపరమైన ఖర్చుల నిమిత్తం రూ.15 లక్షలు మంజూరు చేయడంపై కౌంటర్ దాఖలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును మరోసారి గడువు కోరింది. కౌంటర్ దాఖలుకు గడువు కోరడం ఇది రెండోసారని, మరోసారి గడువు కోరకుండా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది బి.మహేందర్‌రెడ్డికి హైకోర్టు స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలుకు మూడు వారాల గడువునిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. స్మితా సబర్వాల్ వ్యక్తిగత వ్యవహారంలో ఇలా ప్రజాధనాన్ని ఆమెకు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, అందువల్ల ఆ ఉత్తర్వులను కొట్టేయాలంటూ ఈ వ్యాజ్యాన్ని హైదరాబాద్‌కు చెందిన రచయిత, సామాజిక కార్యకర్త వత్సల విద్యాసాగర్, కె.ఈశ్వరరావు, ఔట్లుక్ మ్యాగజైన్ యాజమాన్యం వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే ఈ వ్యాజ్యాలపై పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది బి.మహేందర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ కౌంటర్ దాఖలుకు మరికొంత గడువునివ్వాలని కోరారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, కౌంటర్ దాఖలుకు గడువు కోరడం ఇది రెండోసారని, మరోసారి గడువు కోరకుండా చెప్పిన విధంగా కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలుకు మూడు వారాల గడువునిచ్చింది. ఈ సమయంలో పిటిషనర్ ఈశ్వరరావు తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి స్పందిస్తూ, స్మితా సబర్వాల్‌కు సైతం నోటీసులు జారీ చేసి, కౌంటర్ దాఖలుకు ఆదేశాలు జారీ చేయాలని ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు ధర్మాసనం తిరస్కరిస్తూ, ఎప్పుడు అవసరం అనిపిస్తుందో అప్పుడు తప్పక నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. -
ఇంకా ఆరుబయటకే..
సాక్షి, సంగారెడ్డి: వ్యక్తిగత మరుగుదొడ్లు నాగరికతకు చిహ్నాలు. అందుకు భిన్నంగా పల్లెల్లో 67 శాతం ఇళ్లల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు లేవు. గ్రామీణ నీటి యాజమాన్య, పారిశుద్ధ్య సంస్థ నిర్వహించిన సర్వే చెబుతున్న లెక్క ఇది. మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఓ ఉద్యమంలా అమలు చేస్తున్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పథకం(ఐహెచ్హెచ్ఎల్) సైతం చతికిలపడింది. వచ్చే మార్చిలోగా 80 వేల మరుగుదొడ్లను నిర్మించాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ లక్ష్యం నిర్దేశించగా ఇప్పటి వరకు కేవలం 18,710 మా త్రమే పూర్తయ్యాయి. గడిచిన 11 నెలల్లో 23 శాతం లక్ష్యాన్ని మాత్రమే పూర్తి చేయగలిగారు. పెరిగిన ఖర్చులు.. పెరిగిన నిర్మాణ సామాగ్రి ధరలు, లేబర్ చార్జీలు నిరుపేద లబ్ధిదారులకు భారంగా మారాయి. ఐహెచ్హెచ్ఎల్ కింద చెల్లిస్తున్న ప్రభుత్వ వాటా రూ.9,100లను గత నెల 18 నుంచి రూ.10 వేలకు పెంచినా లబ్ధిదారులకు ఊరట కలగలేదు. బిల్లుల చెల్లింపుల్లో సైతం జరుగుతున్న తీవ్ర జాప్యం కారణంగా పథకం అమలు నత్తనడకన సాగుతోంది. ఐహెచ్హెచ్ఎల్ పెరిగిన ప్రోత్సాహకాలు ఇవి.. ఉపాధి హామీ పథకం వాటా: రూ.5,400 నిర్మల్ భారత్ అభియాన్ వాటా: రూ.4,600 లబ్ధిదారుల వాటా : రూ.900 మొత్తం :10,900 -
‘స్మార్ట్’ ఏజెన్సీలపై కేసులు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉపాధి హామీ పథకంలో భాగంగా జిల్లాలో అమలవుతున్న కార్యక్రమాలను జాయింట్ కలెక్టర్ శరత్ ఇటీవల పూర్తి స్థాయిలో సమీక్షిస్తున్నారు. కలెక్టర్ స్మితా సభర్వాల్ ఆదేశాల మేరకు ఇందిర జల ప్రభ, ఇందిరమ్మ పచ్చతోరణం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పథకం తదితరాలను పట్టాలెక్కించే ప్ర యత్నాల్లో ఉన్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు సకాలంలో డబ్బులు అందేలా చర్యలు చేపడుతున్నట్లు జేసీ శరత్ వెల్లడించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) పీడీగా అదనపు బా ధ్యతలు నిర్వర్తిస్తున్న జేసీ శరత్ ఉపాధి హామీ పథకం అమలు పురోగతిని శనివారం ‘సాక్షి’కి వివరించారు. తొమ్మిది వేల ఎకరాలు సాగులోకి జిల్లాలో ఇందిర జలప్రభ కింద వేసిన 1,500కు పైగా బోరుబావులు విజయవంతమయ్యాయి. వీటిలో 694 బావులకు గతంలో విద్యుదీకరణ పూర్తయింది. గతంలో చాలా చోట్ల బోర్‌వెల్స్ తవ్వకం పూర్తయినా, కరెంటు కనెక్షన్లు, మోటార్లు లేకపోవడం వంటి కారణాలతో ఫలితం లేకుండా పోయింది. కేవలం 20 రోజుల వ్యవధిలో 970 బావులను విద్యుద్దీకరించగలిగాం. 1,073 పంపుసెట్లను ఠమొదటిపేజీ తరువాయి అమర్చగలిగాం. తొమ్మిది వేల ఎకరాలను బోరు బావుల కింద సాగులోకి తెచ్చేందుకు ప్ర యత్నాలు చేస్తున్నాం. ఇందిర జలప్రభ పథకం కింద ఎంపిక చేసిన భూముల్లో డ్రిప్ అమర్చడ ంతో పాటు పండ్ల తోటల పెంపకం కూడా చేపట్టాల్సి ఉంది. ఏపీఎంఐసీ, ఉద్యానవన శాఖ లను సమన్వయం చేస్తూ నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశాం. ఏడాదంతా ఆదాయం ఇందిరమ్మ పచ్చతోరణం పథకంలో భాగంగా జిల్లాలో 2.75 లక్షల మొక్కలు నాటాల్సి ఉంది. గతంలో 67 వేల గుంతలు తీయగా, ప్రస్తుతం 98 వేలకు పైగా పూర్తి చేశాం. 81 వేలకు మొక్కలు నాటేలా చూశాం. మొక్కల బాగోగులను చూసే లబ్ధిదారులకు డబ్బుల చెల్లింపు కూడా సకాలంలో జరిగేలా చూస్తున్నాం. ఈ నెల 31 కల్లా లక్ష్యం పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించాం. పచ్చతోరణంలో కేవలం మామిడి మొక్కల పెంపకానికే పరిమితం కాకుండా ఏడాదంతా లబ్ధిదారులకు ఆదాయం లభించేలా జామ, సపోటా వంటి మొక్కలను కూడా నాటాల్సిందిగా ప్రోత్సహిస్తున్నాం. తహశీల్దార్లను కూడా కార్యక్రమంలో అమలులో భాగస్వాములను చేశాం. మంజూరులో అలసత్వం నివారిస్తాం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పథకం కింద మంజూరు, నిర్మాణం త్వరితగతిన జరిగేలా చర్యలు చేపట్టాం. డిసెంబర్ ఆరంభంలో 63 వేల వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు కాగా, ప్రస్తుతం 83 వేలకు చేరింది. మరో 34 వేల నిర్మాణాలు పురోగతిలో ఉండగా, 11వేలకు పైగా పూర్తయ్యాయి. గతంలో మరుగుదొడ్లు నిర్మించుకున్న కూలీల డ బ్బులు చెల్లించడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయి. 2007 నుంచి పెండింగులో ఉన్న రూ.1.20 కోట్ల వేతన మొత్తం జనవరి రెండో తేదీలోగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేసేలా చర్యలు చేపట్టాం. వేతన చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్మార్ట్‌కార్డ్ ఏజెన్సీల ఇన్సెంటివ్ చెల్లింపును ఇప్పటికే నిలిపేశాం. వేతన చెల్లింపు సక్రమంగా చేయకుంటే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని నోటీసులు కూడా జారీ చేశాం. -
అధికారులపై ‘అంచనాల’ వ్యయం
సాక్షి, సంగారెడ్డి : భారీ వర్షాలు, వడగండ్ల వానలు, కరువు కాటకాలతో జరిగిన పంట నష్టంపై అంచనాల తయారీ భారం అధికారుల నెత్తిపై పడింది. నష్టపోయిన రైతులకు సంబంధించిన సమగ్ర సమాచారంతో కంప్యూటరైజ్డ్ జాబితాలు, నివేదికలు తయారీకి ఖర్చులు క్షేత్ర స్థాయి వ్యవసాయ అధికారులే భరిస్తున్నారు. గత నెలలో కురిసిన వర్షాలతో సంభవించిన పంట నష్టంపై జిల్లా వ్యాప్తంగా గణన జరుగుతోంది. దీనికయ్యే ఖర్చు విషయమై గత నెల 28న కలెక్టర్ స్మితాసబర్వాల్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలువురు తహశీల్దార్లు, వ్యవసాయ అధికారులు ఈ అంశాన్ని ప్రస్తావించారు కూడా. 2009-10 మధ్య కాలంలో తహశీల్దార్లు, మండల వ్యవసాయ అధికారు లు సంయుక్తంగా బాధితులకు చెక్కులు పంపిణీ చేసేవారు. ఆ తర్వాత కాలం నుంచి కంప్యూటరైజ్డ్ జాబితాల తయారీ (హార్డ్, సాఫ్ట్ కాపీలు) ప్రారంభమైంది. అదే విధంగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఇన్పుట్ సబ్సిడీని బదిలీ చేసే విధానం అమల్లోకి వచ్చింది. దీంతో అధికారులకు పని భారం పెరిగింది. రైతుల పేర్లు, నష్టపోయిన పంటలు, విస్తీర్ణం, ప్రతిపాదించిన పరిహారం, బ్యాంకు ఖాతా నంబర్లు, బ్రాంచ్ పేరు తదితర సమాచారంతో గ్రామాల వారీగా జాబితాలు రూపొందిస్తేనే ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేస్తున్నారు. వ్యవసాయ శాఖ జేడీ కార్యాలయానికి రెండు సెట్లు, జిల్లా ఖజానా కార్యాలయం, మండల వ్యవసాయ శాఖాధికారి కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయాలకు ఒక్కో సెట్ చొప్పున ఈ జాబితాల హార్డ్ కాపీలను సమర్పించాల్సి ఉంటుంది. దీంతో ఒక్కో గ్రామానికి సంబంధించి మొత్తం ఆరు సెట్ల జాబితాలు తయారీ చేయాల్సి వస్తోంది. కంప్యూటర్లో డాటా ఎంట్రీ, ఆ తర్వాత జాబితాల ప్రింటింగ్‌కు అయ్యే ఖర్చులను ఇప్పటి వరకు మండల వ్యవసాయ అధికారులే భరిస్తూ వస్తున్నారు. జాబితాల తయారీకి ఒక్కో రైతుపై రూ.3 నుంచి రూ.5 వరకు వ్యయం అవుతోందని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 2009 నుంచి 2012 వరకు తొమ్మిది పర్యాయాలు జరిపిన సర్వేలకు సంబంధించి మొత్తం రూ.36,55,134 ఖర్చు చేసినట్లు అధికారులు లెక్క కట్టారు. ప్రస్తుతం పంట నష్టంపై గణన జరుగుతున్న నేపథ్యంలో గతంలో ఖర్చు చేసిన ఈ నిధులను తక్షణమే విడుదల చేయాలని జేడీఏ కార్యాలయం ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసింది. వీడియో అ‘ధన’పు భారం ఇదిలా ఉండగా.. ఈ సారి గణనలో నష్టపోయిన పంటల వీడియోలు తీయాలనే నిబంధన అమల్లోకి తెచ్చారు. వీడియో రికార్డింగ్‌కు అయ్యే ఖర్చులపై సైతం క్షేత్ర స్థాయి అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ముందే గ్రామాలకు వెళ్లి పంట నష్టపోయినట్లు ధ్రువీకరించుకున్న తర్వాతే అక్కడికి ప్రైవేటు వీడియో గ్రాఫర్లను తీసుకెళ్తున్నారు. ఈ ఖర్చులపై సైతం క్షేత్ర స్థాయి అధికారులు జిల్లా వ్యవసాయ కార్యాలయానికి నిత్యం సంప్రదిస్తున్నారు. మరి ప్రభుత్వం చెల్లిస్తుందో లేదో చూడాలి.