ఇంకా ఆరుబయటకే.. | no awareness on IHHL scheme | Sakshi
Sakshi News home page

ఇంకా ఆరుబయటకే..

Published Sun, Feb 16 2014 12:07 AM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM

no awareness on IHHL scheme

సాక్షి, సంగారెడ్డి: వ్యక్తిగత మరుగుదొడ్లు నాగరికతకు చిహ్నాలు. అందుకు భిన్నంగా పల్లెల్లో 67 శాతం ఇళ్లల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు లేవు. గ్రామీణ నీటి యాజమాన్య, పారిశుద్ధ్య సంస్థ నిర్వహించిన సర్వే చెబుతున్న లెక్క ఇది. మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఓ ఉద్యమంలా అమలు చేస్తున్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పథకం(ఐహెచ్‌హెచ్‌ఎల్) సైతం చతికిలపడింది.  వచ్చే మార్చిలోగా 80 వేల మరుగుదొడ్లను నిర్మించాలని   కలెక్టర్ స్మితా సబర్వాల్ లక్ష్యం నిర్దేశించగా ఇప్పటి వరకు కేవలం 18,710 మా త్రమే పూర్తయ్యాయి. గడిచిన 11 నెలల్లో 23 శాతం లక్ష్యాన్ని మాత్రమే పూర్తి చేయగలిగారు.

 పెరిగిన ఖర్చులు..
 పెరిగిన నిర్మాణ సామాగ్రి ధరలు, లేబర్ చార్జీలు నిరుపేద లబ్ధిదారులకు భారంగా మారాయి. ఐహెచ్‌హెచ్‌ఎల్ కింద చెల్లిస్తున్న ప్రభుత్వ వాటా రూ.9,100లను గత నెల 18 నుంచి రూ.10 వేలకు పెంచినా లబ్ధిదారులకు ఊరట కలగలేదు. బిల్లుల చెల్లింపుల్లో సైతం జరుగుతున్న తీవ్ర జాప్యం కారణంగా పథకం అమలు నత్తనడకన సాగుతోంది.

 ఐహెచ్‌హెచ్‌ఎల్ పెరిగిన ప్రోత్సాహకాలు ఇవి..
 ఉపాధి హామీ పథకం వాటా:    రూ.5,400
 నిర్మల్ భారత్ అభియాన్ వాటా:     రూ.4,600
 లబ్ధిదారుల వాటా    : రూ.900
 మొత్తం    :10,900
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement