
సాక్షి, వరంగల్ : అమెరికాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన తెలుగు విద్యార్థి కొప్పు శరత్ మృతదేహం స్వస్థలం వరంగల్ లోని కరీమాబాద్ కు చేరింది. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్ళిన శరత్ శవమై తిరిగి రావడంతో కన్నవారు కన్నీరుమున్నీరు గా విలపిస్తున్నారు. కడసారి చూపు కోసం బంధువులు, మిత్రులు పెద్ద సంఖ్యలో శరత్ ఇంటికి చేరి అశృనివాళులు అర్పించారు.
ప్రముఖుల నివాళులు : ఉన్నత విద్య కోసం వెళ్లి మృత్యువాత పడిన శరత్ కుటుంబాన్ని డిప్యూటీ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వరంగల్ రూరల్ కలెక్టర్ హరితలు పరామర్శించారు. అనంతరం శరత్ పార్థివ దేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. అంతకు ముందు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ శరత్ మృతదేహానికి నివాళులు అర్పించారు. హైదరాబాద్ వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన శరత్.. ఆ తర్వాత ఓ సాప్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. ముస్సోరి యూనివర్సిటీలో ఎంఎస్ సీటు రావటంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఆరు నెలల క్రితమే అమెరికా వెళ్లాడు.
Comments
Please login to add a commentAdd a comment