‘అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ!’ శరత్‌పై దాడి | Attack on Ayyayyo Vaddamma Fame Sukhibhava Sharath | Sakshi
Sakshi News home page

Sukhibhava Sharath: అందుకే నన్ను కొట్టారు: ‘సుఖీభవ’ శరత్‌

Published Tue, Oct 19 2021 3:11 PM | Last Updated on Tue, Oct 19 2021 5:26 PM

Attack on Ayyayyo Vaddamma Fame Sukhibhava Sharath - Sakshi

‘అయ్యయ్యో వద్దమ్మ.. సుఖీభవ సుఖీభవ..’ అనే వీడియో ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వీడియోతో పాపులర్‌ అయిన నల్లగుట్ట శరత్‌పై తాజాగా దాడి జరిగింది. కొంతమంది యువకులు శరత్‌పై కర్రలు, రాడ్‌లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. దుండగుల దాడిలో శరత్‌ కన్ను వాచిపోయింది. శరత్‌ ముక్కు, నోట్లో నుంచి రక్తం కారుతున్న ఫోటోలు కొన్ని నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
చదవండి: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే మేనల్లుడు

కాగా సుఖీభవ యాడ్‌ను అనుకరిస్తూ హిజ్రాలను కించపరిచేలా మాట్లాడాడని, అందుకే హిజ్రాలు శరత్‌పై దాడి చేశారని తొలుత ప్రచారం జరిగింది. కానీ తనపై హిజ్రాలు దాడి చేశారని వస్తున్న వార్తలు అవాస్తవం అని శరత్‌ పేర్కొన్నాడు. ఈ మేరకు శరత్‌ స్పందిస్తూ.. తనపై దాడి చేసింది ప్రత్యర్థులేనని, గతంలో వాళ్లను ఎదిరించి జైలు శిక్షను కూడా అనుభవించానని వెల్లడించాడు.

గతంలో తన చెల్లిని వేధిస్తున్నారని సాయి, హరి అనే రెండు గ్రూపులపై దాడి చేశానని, ఈ కేసులో తాను జైలుకు కూడా వెళ్లిన్నట్లు పేర్కొన్నాడు. ఇటీవల జైలు నుంచి శరత్‌ బయటకు వచ్చిన అనంతరం సుఖీభవ.. సుఖీభవ వీడియో ద్వారా శరత్‌ సోషల్‌ మీడియాలో సెన్సెషన్‌గా మారాడు. తర్వాత సినిమా, ఒక యాడ్ ఆఫర్లు కూడా వచ్చింది. దీంతో తన సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అయ్యానని, సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని తెలిసి తనపై కక్షకట్టి ఓ వర్గం వారు దాడి చేశారని వెల్లడించాడు.
చదవండి: వైరల్‌: భర్త మరో మహిళతో జిమ్‌లో.. చెప్పులతో చితకబాదిన భార్య

ఇదిలా ఉండగా టీ పౌడర్‌ యాడ్‌ను కొద్దిగా రీ క్రియేట్‌ చేసి.. తనదైన స్టైల్‌ లో తీన్మార్‌ స్టెప్పులు వేయడంతో ఈ సుఖీభవ.. సుఖీభవ.. అనే వీడియో తె గట్రెండ్‌ అవుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ వీడియోనే దర్శనమిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement