
( ఫైల్ ఫోటో )
ప్రముఖ సీనియర్ దర్శకుడు శరత్ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. రేపు(శనివారం)మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 'డియర్' అనే నవల ఆధారంగా ‘చాదస్తపు మొగుడు’ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆయన తెలుగులో సుమారు 20 సినిమాలకు దర్శకత్వం వహించారు.
బాలకృష్ణ, సుమన్ తో భారీ విజయాలు అందుకున్న శరత్.. బాలకృష్ణతో `వంశాని కొక్కడు, పెద్దన్నయ్య, సుల్తాన్, వంశోద్ధారకుడు` సినిమాలు తీశాడు. సుమన్ తో `చాదస్తపు మొగుడు, పెద్దింటి అల్లుడు, బావ-బావమరిది, చిన్నల్లుడు` సినిమాలు తెరకెక్కించారు. కాగా శరత్ మరణంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన మరణవార్త తెలిసి పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.