టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ, దర్మక నిర్మాత కె.వాసు కన్నుమూశారు. టాలీవుడ్‌లో పలు చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అనారోగ్యానికి గురైన ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కాగా.. ప్రాణంఖరీదు, కోతలరాయుడు, ఇంట్లో శ్రీమతి-వీధిలో కుమారి లాంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
(ఇది చదవండి: సంతోషం దూరం.. అందుకే విడిపోయాం.. రెండో పెళ్లిపై నటుడి క్లారిటీ)
రేపు ఉదయం 6 గంటలకు ఫిల్మ్ నగర్‌లో ఆయన ఇంటికి పార్థివదేహాన్ని తరలించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా.. ఇటీవలే సీనియర్ నటుడు శరత్ బాబు కూడా అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే.
మెగాస్టార్‌ను వెండితెర పరిచయం
మెగాస్టార్ చిరంజీవిని దర్శకుడు కె.వాసునే వెండితెరకు పరిచయం చేశారు. చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదుకు దర్శకత్వం వహించారు. చిరు మొదటి సినిమా పునాది రాళ్లు అయినా.. మొదట రిలీజ్ అయ్యింది మాత్రం ప్రాణం ఖరీదు సినిమా అనే చెప్పాలి. కె.వాసు తండ్రి ప్రత్యగాత్మ, ఆయన సోదరుడు హేమాంబరధరరావు ఇద్దరూ దర్శకులే. తెలుగులో చిత్ర పరిశ్రమలో ఎన్నో మంచి సినిమాలను రూపొందించారు. వారి బాటలోనే నడిచిన వాసు కూడా చక్కని చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఆయన తీసిన భక్తి చిత్రం ‘శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం’ తెలుగు ప్రేక్షకులకే కాదు, ప్రతి సాయిబాబా భక్తుడి మదిలోనూ నిలిచిపోయింది.
(ఇది చదవండి: 'బిచ్చగాడు' హీరో.. రియల్ లైఫ్‌లో కూడా హీరోనే!)
22 ఏళ్లకే దర్శకత్వం
కాాగా.. కె. వాసు 1951, జనవరి 15 న జన్మించారు. చిన్నతనం నుంచి దర్శకత్వంపై మక్కువ పెంచుకున్న వాసు.. తన తండ్రి వద్దే ఆదర్శకుటుంబం, మనసు మాంగల్యం, పల్లెటూరి బావ సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తరువాత ఆడపిల్లల తండ్రి అనే సినిమాకు తొలిసారి దర్శకత్వం వహించారు. 22 ఏళ్లకే దర్శకత్వం వహించి అప్పట్లో సంచలనం సృష్టించాడు.
Comments
Please login to add a commentAdd a comment