![తోటి విద్యార్థులే వేటకొడవళ్లతో నరికి చంపారు](/styles/webp/s3/article_images/2017/09/3/81435516702_625x300.jpg.webp?itok=mClDK06G)
తోటి విద్యార్థులే వేటకొడవళ్లతో నరికి చంపారు
అనంతపురం జిల్లా: రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుతున్న తోటి విద్యార్థిని చూసి ఓర్వలేక పవన్‌కుమార్(18) అనే వ్యక్తిని తోటి విద్యార్థులే కిరాతకంగా హతమార్చారు. జిల్లాలోని సూర్యానగర్ కంటి ఆసుపత్రి వద్దపవన్‌ను వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు.
కొన ఊపిరితో ఉన్న పవన్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ మరణించాడు. జిల్లాలోని బోయవీధికి చెందిన తలారి నగేష్‌తో పాటు మరో ఆరుగురు ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.