సరోజనీదేవి కంటి ఆస్పత్రిలో వ్యక్తి వీరంగం
హైదరాబాద్ : సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో సోమవారం ఉదయం ఓ మతిస్థిమితం లేని వ్యక్తి వీరంగం సృష్టించారు. రామకృష్ణ అనే వ్యక్తి తోటి రోగులపై దాడికి యత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులపై కూడా రామకృష్ణ దాడికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు అతడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకుని హమయాన్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు.