దీపావళి పండుగ పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. సరదాగా టపాసులు కాల్చి సంబరాలు చేసుకుందామనుకున్న వారికి అవే టపాసులు తీవ్ర నిరుత్సాహానికి గురి చేశాయి. టపాసులు పేలడంతో పలు చోట్ల ఇళ్లు దగ్ధమవ్వగా, మరికొన్ని చోట్ల పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విజయనగరం జిల్లాలోని జొన్న పలసలో దీపావళి సందర్భంగా టపాసులు పడి నిప్పంటుకుని నాలుగు తాటాకు ఇళ్లు మంటలకు ఆహూతి అయ్యాయి.