సాక్షి , న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి వార్తల్లో నిలిచింది. పాక్ ప్రయోగించిన ఓ మిసైల్ విఫలమై సింధ్ జంషోర్ ప్రాంతంలో ఆకాశం నుంచి కింద పడిపోయినట్టు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.
వివరాల ప్రకారం.. కొద్ది రోజుల క్రితం భారత రక్షణ వ్యవస్థకు చెందిన ఓ క్షిపణి పొరపాటుగా పాక్ భూ భాగంలో పడిపోయింది. దీంతో మరోసారి రెండు దేశాల మధ్య వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో పాక్ క్షిపణి ప‍్రయోగానికి రెడీ అయ్యింది. దీంతో గురువారం ఉదయం 11 గంటలకు క్షిపణి ప్రయోగం చేపట్టాలని ప్లాన్ చేసింది. కానీ, సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రయోగం ఓ గంట ఆలస్యమైంది. కాగా, మధ్యాహ్నం 12 గంటలకు క్షిపణి ప్రయోగం జరిగింది. ఆకాశంలోకి దూసుకెళ్లిన క్షిపణి కొన్ని సెకన్ల వ్యవధిలోనే పొగలు కక్కుతూ కిందకు పడిపోయింది. ఇదంతా కొందరు వ్యక్తులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో వీడియో వైరల్‌గా మారింది.
ఇదిలా ఉండగా.. పాకిస్థాన్ భూభాగంలో భారత క్షిపణి పడిపోవడంతో పాక్ కూడా అదే తరహాలో పోటీపడి ఈ మిసైల్ను ప్రయోగించినట్టు తెలుస్తోంది. కానీ, టార్గెట్‌ను చేరేలోపే ఆ క్షిపణి కిందికి పడిపోవడంతో పాక్ ఇలా పరువు తీసుకుంది. మరోవైపు.. క్షిపణి ప్రయోగం విఫలమైందన్న వార్తలను స్థానిక అధికారిక వర్గాలు ఖండించాయి. అది మిసైల్ కాదని, సైన్యం ప్రయోగించే సాధారణ మోర్టార్ అని తెలిపాయి.
#Breaking: An unidentified object or SAM missile fallen from Sky in Jamshoro, Pakistan. #Jamshoro#Pakistan
— Wᵒˡᵛᵉʳᶤᶰᵉ Uᵖᵈᵃᵗᵉˢ𖤐 (@W0lverineupdate) March 17, 2022
pic.twitter.com/1y5ZhgoUMb
Comments
Please login to add a commentAdd a comment