Sindh
-
లాభాలతో అదరగొట్టిన పంజాబ్ సింద్ బ్యాంక్
ముంబై: పీఎస్‌యూ సంస్థ పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్(పీఎస్బీ) గత ఆర్థిక సంవత్సరం(2022– 23) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 32 శాతం ఎగసి రూ. 457 కోట్లను తాకింది. మొండి రుణాలు తగ్గడం ఇందుకు సహకరించింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 346 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇదీ చదవండి: లాభాలు అదుర్స్! అదానీ కంపెనీల ఆదాయాలు వృద్ధి ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి బ్యాంక్ చరిత్రలోనే అత్యధిక లాభం సాధించింది. రూ. 1,313 కోట్లు ఆర్జించింది. 2021–22లో రూ. 1,039 కోట్ల లాభం మాత్రమే నమోదైంది. ఇది 26 శాతంపైగా వృద్ధికాగా.. క్యూ4లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 12.17 శాతం నుంచి 6.97 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు సైతం 2.74 శాతం నుంచి 1.84 శాతానికి తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో పీఎస్బీ షేరు బీఎస్ఈలో దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 37.35 వద్ద ముగిసింది. ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్‌ట్యాగ్ వసూళ్ల రికార్డు -
పాకిస్తాన్ వరద బాధితులుగా... 1.6 కోట్ల చిన్నారులు!
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో సంభవించిన భీకర వరదల ధాటికి 1.6 కోట్ల మంది చిన్నారులు బాధితులుగా మారారని, వీరిలో 34 లక్షల మందికి తక్షణమే సాయం అందించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. ఇప్పటికే పోషకాహార లేమిని ఎదుర్కొంటున్న బాలలు డయేరియా, డెంగ్యూ జ్వరం, చర్మ వ్యాధులతో పోరాడుతున్నారని తెలియజేసింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి(యునిసెఫ్) ప్రతినిధి అబ్దుల్లా ఫాదిల్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. పాకిస్తాన్లో సింధ్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన ఇటీవలే రెండు రోజులపాటు పర్యటించారు. పాకిస్తాన్లో వరదలు 528 మంది చిన్నారులను పొట్టనపెట్టుకున్నాయని చెప్పారు. ఇవన్నీ నివారించగలిగే మరణాలే అయినప్పటికీ ప్రభుత్వం ఆ పని చేయలేకపోయిందని ఆక్షేపించారు. ఆవాసం లేక చిన్నపిల్లలు కుటుంబాలతో కలిసి బహిరంగ ప్రదేశాల్లోనే ఉంటున్నారని, ఆహారం, నీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది భవనాలు, పాఠశాలలు, ఆసుపత్రులు కూలిపోయాయని అన్నారు. బాధితులను ఆదుకొనేందుకు అంతర్జాతీయ సమాజం తక్షణం ముందుకు రావాలని అబ్దుల్లా ఫాదిల్ విజ్ఞప్తి చేశారు. -
అమానుష ఘటన: గర్భిణిని కింద పడేసి, కాళ్లతో తన్ని...
కరాచి: పాకిస్తాన్ ఒక అమానుష ఘటన చోటు చేసుకుంది. గర్భిణి అన్న కనికరం లేకుండా కొట్టి కొందపడేసి బూట్లతో తన్ని దారుణంగా ప్రవర్తించాడు ఒక సెక్యూరిటి గార్డు. పోలీసులు తెలపిన కథనం ప్రకారం....పాకిస్తాన్‌లోని కరాచీలో నోమన్ గ్రాండ్ సిటీ అనే అపార్టమెంట్స్ గులిస్తాన్-ఎ-జౌహర్ బ్లాక్ 17లో ఉంది. సనా అనే ఒక ఐదు నెలల గర్భిణి ఆ ఆపార్టమెంట్స్ లోనే పనిమనిషిగా పనిచేస్తోంది. ఐతే ఆమె తన కొడుకు సోహిల్ తన కోసం ఆహారం తీసుకువచ్చాడని తనని లోపలికి అనుమతించాల్సిందిగా ఆ ఆపార్టమెంట్ సెక్యూరిటీ గార్డుని వేడుకుంది. ఐతే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అబ్దుల్ నాసిర్, అదిల్ ఖాన్, మహ్మద్ ఖలీల్ లోపలకి రావడాని అంగీకరించలేదు. దీంతో సదరు మహిళ అక్కడ ఉన్న ఒక సెక్యూరిటీ గార్డుతో వాగ్వాదానికి దిగింది. ఐతే ఆ సెక్యూరిటీ గార్డు కోపంతో ఆమెను చెంపదెబ్బ కొట్టాడు. దీంతో ఆమె ఒక్కసారిగా కింద పడిపోయింది. తిరిగి లేచేందుకు ప్రయత్నించే లోపే బూట్లతో ముఖం పై తన్ని అమానుషంగా ప్రవర్తించాడు. దీంతో ఆ మహిళ స్ప్రుహ కోల్పోయింది. ఈ సంఘటన సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడ్డంతో ఈ ఘటన వెలుగు చూసింది. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అంతేగాదు సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. పైగా ఆ గార్డు అంత క్రూరంగా ఎలా ప్రవర్తించాడంటూ మండిపడ్డారు. ఆ గార్డు పై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు కూడా. (చదవండి: కలెక్టర్ టీనా దాబికే షాకిచ్చాడు.. మాములు ఐడియా కాదుగా..) -
భారత్‌తో పాక్ పోటీ.. చివరకు ఇలా పరువు తీసుకుంది.. వీడియో వైరల్
సాక్షి , న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి వార్తల్లో నిలిచింది. పాక్ ప్రయోగించిన ఓ మిసైల్ విఫలమై సింధ్ జంషోర్ ప్రాంతంలో ఆకాశం నుంచి కింద పడిపోయినట్టు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. వివరాల ప్రకారం.. కొద్ది రోజుల క్రితం భారత రక్షణ వ్యవస్థకు చెందిన ఓ క్షిపణి పొరపాటుగా పాక్ భూ భాగంలో పడిపోయింది. దీంతో మరోసారి రెండు దేశాల మధ్య వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో పాక్ క్షిపణి ప్రయోగానికి రెడీ అయ్యింది. దీంతో గురువారం ఉదయం 11 గంటలకు క్షిపణి ప్రయోగం చేపట్టాలని ప్లాన్ చేసింది. కానీ, సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రయోగం ఓ గంట ఆలస్యమైంది. కాగా, మధ్యాహ్నం 12 గంటలకు క్షిపణి ప్రయోగం జరిగింది. ఆకాశంలోకి దూసుకెళ్లిన క్షిపణి కొన్ని సెకన్ల వ్యవధిలోనే పొగలు కక్కుతూ కిందకు పడిపోయింది. ఇదంతా కొందరు వ్యక్తులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో వీడియో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా.. పాకిస్థాన్ భూభాగంలో భారత క్షిపణి పడిపోవడంతో పాక్ కూడా అదే తరహాలో పోటీపడి ఈ మిసైల్‌ను ప్రయోగించినట్టు తెలుస్తోంది. కానీ, టార్గెట్‌ను చేరేలోపే ఆ క్షిపణి కిందికి పడిపోవడంతో పాక్ ఇలా పరువు తీసుకుంది. మరోవైపు.. క్షిపణి ప్రయోగం విఫలమైందన్న వార్తలను స్థానిక అధికారిక వర్గాలు ఖండించాయి. అది మిసైల్ కాదని, సైన్యం ప్రయోగించే సాధారణ మోర్టార్ అని తెలిపాయి. #Breaking: An unidentified object or SAM missile fallen from Sky in Jamshoro, Pakistan. #Jamshoro#Pakistan pic.twitter.com/1y5ZhgoUMb — Wᵒˡᵛᵉʳᶤᶰᵉ Uᵖᵈᵃᵗᵉˢ𖤐 (@W0lverineupdate) March 17, 2022 -
కొద్దిసేపట్లో పెళ్లి..వధువు కిడ్నాప్
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో హిందు మహిళలకు రక్షణ కరువైంది. పెళ్లి పందిట్లో నుంచి ఓ హిందూ వధువును అపహరించుకుని వెళ్లి, మత మార్పిడి చేసి, ముస్లిం యువకుడు పెళ్లి చేసుకున్న సంఘటన సంచలనం రేపుతోంది. పాకిస్థాన్‌లోని సింధ్ రాష్ట్రంలో జరిగిన ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం వీరిద్దరి వివాహ ధ్రువీకరణ పత్రాలతోపాటు ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. మాటియారి జిల్లాలోని హాలా పట్టణంలో 24 ఏళ్ల హిందు యువతి భారతి బాయ్‌ను ముస్లిం యువకుడు, కొందరు రౌడీలతో కలిసి పోలీసుల సహకారంతో పెళ్లి మండపం నుంచి ఎత్తికెళ్లాడు. అనంతరం ఆమెకు బలవంతంగా ఇస్లాం మతాన్ని స్వీకరింపచేసి పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటనపై భారతి తండ్రి కిషోర్ దాస్ మాట్లాడుతూ..తమ కుమార్తెకి మతియారా జిల్లా చెందిన వ్యక్తితో వివాహాన్ని నిశ్చయించామని..కానీ అంతలోనే తమ కూతురిని షారుఖ్ గుల్ అనే ముస్లిం యువకుడు పోలీసుల సహకారంతో కిడ్నాప్ చేసి వివాహం చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. భారతిని బుష్రాగా పేరు మార్చిన సర్టిఫికేట్‌ను ముఫ్తీ అబూబకర్ సయీద్ఉర్ రెహమాన్ అందజేసినట్లు తెలిసింది. కాగా జాతీయ గుర్తింపు కార్డులో భారతి హాలా నగరానికి చెందిన వ్యక్తిగా పేర్కొంటుండగా..కానీ తాత్కాలిక చిరునామాలో మాత్రం కరాచీ నగరం గుల్షాన్ ఇక్బాల్‌లో ఉంటున్నట్లు ఉంది. తమ కుమార్తెని నెల ముందే షారుక్ గుల్ మత మార్పిడి చేశాడని భారతి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కానీ షారుక్ గుల్ మాత్రం తనకు బుష్రాతో వివాహం అయిందని..హిందు వ్యక్తితో తన భార్య భారతికి ఆమె తల్లి దండ్రులు వివాహం జరిపిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సింధు ప్రావిన్స్‌లోని హలాలో మత మార్పిడులు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా హిందు మైనారిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాక్‌లో మైనారిటీలైన హిందువులకు రక్షణ కల్పిస్తానన్న ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
జాతీయ గీతంలో ఆ పదం తొలగించాలని తీర్మానం
-
జాతీయ గీతంలో ఆ పదం తొలగించాలని తీర్మానం
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ గీతంలో సింధ్ స్ధానంలో ఈశాన్యం అని చేర్చాలని ప్రతిపాదిస్తూ కాంగ్రెస్ ఎంపీ రిపున్ బోరా శుక్రవారం రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. భారత్‌లో ఈశాన్యం కీలక ప్రాంతమని, అయినా ఆ ప్రాంతానికి జాతీయ గీతంలో చోటుదక్కకపోవడం దురదృష్టకరమన్నారు. మరోవైపు ప్రత్యర్థి పాకిస్తాన్ భూభాగంలో ఉన్న సింధ్‌ను జాతీయ గీతంలో ప్రస్తావిస్తున్నారని ఎగువ సభలో ప్రైవేట్ సభ్యుడి తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం ఎంపీ బోరా అన్నారు. జాతీయగీతంలో సింధ్ అనే పదాన్ని తొలగించి, దాని స్ధానంలో ఈశాన్య భారతం అని చేర్చాలని ఈ సభ ప్రభుత్వాన్ని కోరుతోందని తీర్మానంలో పేర్కొన్నారు. గతంలో 2016లో జాతీయ గీతం జనగణమనలో సింధ్ అనే పదాన్ని తొలగించాలని, ఆ పేరుతో దేశంలో ఏ రాష్ట్రం లేదని సరైన పదంతో దాన్ని సవరించాలని శివసేన సభ్యుడు అరవింద్ సావంత్ లోక్‌సభలో ప్రస్తావించారు. జాతీయ గీతాన్ని నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ 1911లో రచించగా 1950లో పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. -
శ్రీకాంత్ శుభారంభం
►ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశం ►సింధు, సైనా, సమీర్ వర్మ కూడా టోక్యో: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్స్ కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, సమీర్ వర్మ... మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 21–15, 12–21, 21–11తో తియాన్ హువీ (చైనా)పై గెలుపొందాడు. హువీతో ఇప్పటివరకు ఎనిమిదిసార్లు ఆడిన శ్రీకాంత్ రెండోసారి మాత్రమే నెగ్గడం విశేషం. ఇతర మ్యాచ్‌ల్లో ప్రణయ్ 21–12, 21–14తో అంటోన్సెన్ (డెన్మార్క్)పై, సమీర్ వర్మ 21–12, 21–19తో ఖోసిత్ ఫెట్‌ప్రదాబ్ (థాయ్‌లాండ్)పై గెలిచారు. అయితే సాయిప్రణీత్ 23–21, 17–21, 14–21తో లీ డాంగ్ కెయున్ (కొరియా) చేతిలో, సౌరభ్ వర్మ 21–11, 15–21, 13–21తో లిన్ డాన్ (చైనా) చేతిలో ఓడిపోయారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 12–21, 21–15, 21–17తో మినత్సు మితాని (జపాన్)పై, సైనా 21–17, 21–9తో పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)పై నెగ్గారు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో సింధు; రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో సైనా; హు యున్ (హాంకాంగ్)తో శ్రీకాంత్; సు జెన్ హావో (చైనీస్ తైపీ)తో ప్రణయ్; షి యుకి (చైనా)తో సమీర్ వర్మ ఆడతారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప 21–17, 21–13తో ఇస్రియానెత్–పచారపున్ (థాయ్‌లాండ్)లపై గెలిచారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 25–27, 15–21తో గిడియోన్–కెవిన్ (ఇండోనేసియా) చేతిలో... సుమీత్ రెడ్డి–మనూ అత్రి 18–21, 15–21తో లీ జె–హుయ్–లీ యాంగ్ (కొరియా) చేతిలో... మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నçప్ప 17–21, 12–21తో చాంగ్ యె నా–లీ సో హీ (కొరియా) చేతిలో ఓడిపోయారు. -
పాక్ యాంటీటెర్రర్ గ్రూప్‌లో మహిళలు
కరాచీ: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావియెన్స్ ప్రభుత్వం.. ఉగ్రవాద వ్యతిరేక దళంలో తొలిసారిగా మహిళలకు చోటు కల్పించింది. 40 మంది యువతులు ఆ రాష్ట్ర కౌంటర్ టెర్రర్ డిపార్ట్మెంట్లో విధుల్లో చేరినట్లు స్థానిక అధికారులు తెలిపారు. అనేకరకాల దేహదారుఢ్య పరీక్షలతోపాటు మెడికల్ టెస్ట్‌లు, ఇంటర్వూ్యలు నిర్వహించిన తర్వాత వారిని ఎంపిక చేశామని, పాక్ ఆర్మీతో ఎంపికైన యువతులకు శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. ఆరునెలల ఎంపికైన నలభై మందిని ఆరునెలల శిక్షణ తర్వాత పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ హోదాతో సమానమైన పోస్టుల్లో నియమిస్తామని, పనితీరు ఆధారంగా రెగ్యులర్ కౌంటర్ టెర్రర్ డిపార్ట్మెంట్, ర్యాపిడ్ రెస్పాన్స్ ఫోర్స్‌లో చోటు కల్పిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల సంఖ్యను పెంచేందుకు ఇటీవల పాకిస్తాన్ ప్రభుత్వం చట్టాలను సవరించింది. దీంతో పోలీస్ విభాగంలో ఉద్యోగాల కోసంగాను నిర్వహించిన పరీక్షల్లో ఎంపికైనవారిలో మహిళల సంఖ్య 2శాతం కంటే తక్కువగా ఉండడం గమనార్హం. పాక్‌లో మొత్తం పోలీసుల సంఖ్య 3,91,364 కాగా అందులో 5,731 మంది మాత్రమే మహిళలున్నారు.